Swami Vivekananda Jayanti
-
యువత బలమే దేశానికి కలిమి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మన యువత బలమే మన దేశాన్ని అగ్రగామిగా మారుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. యువతీ యువకుల శక్తి సామర్థ్యాలతో భారత్ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందడం ఖాయమని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమం’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్’ అనేది మన లక్ష్యమని గుర్తుచేశారు. ఆ లక్ష్యం సాధించడం కష్టం కావొచ్చేమో గానీ అసాధ్యం మాత్రం కాదని తేల్చిచెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన సత్తా మన యువతలో ఉందన్నారు. మనది యువదేశమని, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టంచేశారు. మనం వేసే ప్రతి అడుగులో, ప్రతి విధానంలో, ప్రతి నిర్ణయంలో వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో వేర్వేరు కీలక రంగాల్లో ఎన్నో విజయాలను మన దేశం సాధించబోతోందని మోదీ వెల్లడించారు. దేశం ముందుకు పరుగులు తీయాలంటే గొప్ప లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, మనం ఇప్పుడు అదే పనిలో నిమగ్నమై ఉన్నామని వివరించారు. ప్రభుత్వానికి యువత భుజం కలపాలి 2030 నాటికి పెట్రోల్‌లో 20 శాతం బ్లెండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వాస్తవానికి అంతకంటే ముందే అది సాధించబోతున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, యువత సైతం భుజం కలపాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్‌కు యువతే యజమానులని ఉద్ఘాటించారు. మన విధాన నిర్ణయాల్లో యువత ఆలోచనలు కూడా ఒక భాగమని చెప్పారు. వారి దిశానిర్దేశం దేశానికి అవసరమని అన్నారు. మనం అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరి సమ్మిళిత కృషి అవసరమన్నారు. 1930లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికా అగ్రదేశంగా ఎదిగిందని, ఒకప్పుడు ఎంతో వెనుకబడిన దేశమైన సింగపూర్ ప్రస్తుతం బలీయమైన ఆర్థిక శక్తిగా మారిందని మోదీ గుర్తుచేశారు. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమని ఉద్బోధించారు. రాబోయే 25 ఏళ్లు మనకు అమృతకాలమని వివరించారు. వికసిత్ భారత్ కలను యువత సాకారం చేస్తుందన్న విశ్వాసం తనకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో మన దేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేలా యువత సన్నద్ధం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చా కార్యక్రమానికి 3 వేల మందికిపైగా యువతీ యువకులు హాజరయ్యారు. -
స్వామి వివేకానంద జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. "లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి" అన్న స్వామి వివేకానంద గారి ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ యువతీ యువకులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచ్చిన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ.. మరిన్ని విశేషాలకు క్లిక్ చేయండి.. గమ్యం.. చేరే వరకూ..! -
Swami Vivekananda: గమ్యం.. చేరే వరకూ..!
‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకూ ఆగకండి..’ ప్రపంచంలోని యువతకు స్వామి వివేకానంద ఇచి్చన మహోన్నతమైన సందేశం ఇది. అనేక రకాల వైఫల్యాలు, వైకల్యాల నడుమ బందీ అయిన జీవితాన్ని సమున్నతమైన లక్ష్యం, ఆశయం దిశగా ముందుకు నడిపించేందుకు యువతకు ఆయన ఒకే ఒక ఆయుధాన్ని అందజేశాడు. అదే ధైర్యం.. సాహసం.. నిస్వార్థంగా.. నిర్భయంగా జీవించడం. భయపడకుండా బతకడమే దైవత్వమని చెప్పారు. తమను తాము తెలుసుకోవడం ద్వారా మాత్రమే ఆ దైవత్వాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది.‘గొర్రెల గుంపులో పెరిగితే సింహమైనా సరే తన సహజ లక్షణమైన ధీరత్వాన్ని కోల్పోతుంది. పిరికితనంతో బతుకుతుంది. తమ నిజస్వరూపాన్ని మరిచిపోతే యువత కూడా అలాగే భీరువులా బతకాల్సి వస్తుంది.’ అని వివేకానంద చెప్పిన మాటలను నేడు ఆయన జయంతి సందర్భంగా గుర్తుచేసుకుంటూ..మరిన్ని విశేషాలు.. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా పాటించనున్నారు. రామకృష్ణమఠంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. జాతి నిర్మాణంలో యువశక్తి ఎంతో కీలకమైందనే సందేశాన్నిస్తూ ట్యాంక్‌బండ్ నుంచి రామకృష్ణ మఠం వరకూ ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం జరిగే నేషనల్ యూత్ డే వేడుకల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గోనున్నారు. ‘ఛేంజింగ్ యూత్ పవర్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యువజన ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.. సృజన శక్తులన్నీ నీలోనే.. మనం బలహీనులం, అపవిత్రులం అని అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ బలవంతులు, శక్తిసంపన్నులే. అనంతశక్తి మీలోనే దాగివుంది. జీవితంలోని ప్రతి సందర్భంలో ఆ శక్తిని ఎలా అభివ్యక్తం చేయాలో వివేకానందుడు ప్రబోధించాడు. ‘మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి’ అన్నారు. నిద్రలో ఉన్న వ్యక్తి మేల్కొని స్వరూపజ్ఞానంతో కార్యాచరణ చేపట్టినప్పుడు గొప్ప శక్తి, తేజస్సు లభిస్తాయి. ఉత్కృష్టమైనదంతా అతన్ని వరిస్తుంది. ప్రతి ఒక్కరికీ వారి నిజస్వరూప జ్ఞానాన్ని తెలియజేయడమే ఔన్నత్యానికి మార్గం. పౌరుషాన్ని ప్రకటించడం అంటే దౌర్జన్యం, హింస వంటి వాటి కోసం శక్తియుక్తులను వినియోగించటం కాదు. సాధువర్తనం కలిగి ఉండడం. నిర్మాణాత్మకమైన, ఫలవంతమైన సర్వశక్తి స్వభావాన్ని కొనసాగించడం, అదే మనం చూపవలసిన నిజమైన పరాక్రమమని వివేకానంద బోధించారు. యువత తమలోని సృజనశక్తులను ఆవిష్కరించేందుకు ఆ బోధనలు ఎంతో స్ఫూర్తినిస్తాయని రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ‘విశ్వ’ భావన ఉండాలి.. ప్రతి ఒక్కరూ ‘విశ్వవ్యాపిత భావన’ను కలిగి ఉండాలి. ‘పరిమితమైన నేను’ ‘నేను ఫలానా’, ‘ఇది నాది’ వంటి అనేక స్వార్థబంధాల వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. ఈ ‘పరిమిత నేను’ నుండి విడివడి ‘విశ్వవ్యాపిత నేను’ అనే భావనతో తాదాత్మ్యం చెందితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషి ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాడు. ఇప్పుడు కావలసింది మనుషులు మాత్రమే అంటారు స్వామి వివేకానంద. బలవంతులు, చక్కటి నడవడిక కలిగినవాళ్లు, గొప్ప ఆత్మవిశ్వాసమున్న యువకులు కావాలని చెబుతారు. అలాంటివారు వంద మంది దొరికినా ప్రపంచం పూర్తిగా మారిపోతుందంటారు. అలాంటి యువత కావాలి ఇప్పుడు.నేషనల్ యూత్ డే..ఈ నెల 12న రామకృష్ణమఠంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సీ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలతో పాటు, జాతీయ యువజన దినోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమంలో స్వామి బోధమయానంద ‘ఛేంజింగ్ యూత్ ఫర్ నేషనల్ బిల్డింగ్’ పై తమ సందేశాన్ని ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు చెన్నైకి చెందిన తుగ్లక్ మేగజైన్ సంపాదకులు ఎస్.గురుమూర్తి, పలువురు ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ సందర్భంగా 18 అడుగుల ఎత్తైన స్వామి వివేకానంద మ్యూరల్‌ను ఆవిష్కరించనున్నారు.సహనమే సరైన లక్షణం..శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. దీంతో ఏదైనా సాధించగలమనే విశ్వాసం పెరిగింది. కానీ అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. అదే సహనం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు మారాయి. కానీ వ్యక్తిగత శక్తిసామర్థ్యాలు కాదు. అనుకున్నదే తడవుగా అన్నీ జరిగిపోవాలనుకుంటారు, కానీ ప్రతికూలత ఎదురు కాగానే కుదేలయిపోతున్నారు. ప్రతికూలత ఎదురైనపుడు సహనంతో, ఓర్పుతో దానిని ఎదుర్కొనే సామర్థ్యం అలవర్చుకోవాలి. బంగారాన్ని గీటురాయి పరీక్షిస్తుంది. అలాగే మనిషి మానసిక స్థైర్యాన్ని ప్రతికూలతలు పరీక్షిస్తాయి. అందుకే వేచివుండాల్సిన సమయంలో నిరాశ నిస్పృహలకు లోనవకుండా ఓర్పుతో నిరీక్షించటం ఎంతో అవసరం. ‘అసహనం ప్రకటించటం వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది’ అని చెప్పిన వివేకానందుడి మాటలను గుర్తుంచుకోండి. – స్వామి బోధమయానంద, రామకృష్ణమఠం అధ్యక్షులు -
స్వామి వివేకానంద బాటలో నడవాలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు. పొన్నంకు క్రిబ్కో చైర్మన్ సన్మానం.. ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. -
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలి
నాసిక్: దేశంలో వారసత్వ రాజకీయాల ప్రభావాన్ని తగ్గించాల్సిన బాధ్యత యువతరంపై ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం వారంతా వెంటనే ఓటర్లుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మన దేశపు 21వ శతాబ్దపు యువత అత్యంత అదృష్టవంతులని పేర్కొన్నారు. అమృత కాలంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అద్భుత అవకాశం వారికి లభించింది’’ అన్నారు. మహారాష్ట్రలో నాసిక్‌లోని తపోవన్ మైదానంలో శుక్రవారం 27వ ‘నేషనల్ యూత్ ఫెస్టివల్’ను మోదీ ప్రారంభించారు. స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ తల్లి జిజాబాయి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. మాదక ద్రవ్యాలకు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని యువతకు సూచించారు. యువతకు కర్తవ్య కాలం రాబోయే 25 ఏళ్ల అమృత కాలం యువతకు ‘కర్తవ్య కాలం’ అని మోదీ ఉద్ఘాటించారు. యువత ఓటు ద్వారా రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే దేశానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వారు ఎంతగా పాల్గొంటే దేశ భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుందన్నారు. వారసత్వ రాజకీయాల ప్రభావమూ అంతగా తగ్గిపోతుందన్నారు. అరబిందో, వివేకానంద గొప్పతనాన్ని, వారు అందించిన సేవలను ప్రస్తావించారు. నాసిక్ రామకుండ్‌లో పూజలు మోదీ శుక్రవారం మహారాష్ట్రలో నాసిక్‌లోని శ్రీ కాలారామ్ మందిరాన్ని దర్శించుకున్నారు. రామ్‌కుండ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అంతకముందు నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు. తర్వాత గోదావరి తీరంలోని రామ్‌కుండ్ వద్ద సంప్రదాయ తలపాగా ధరించి పూజలు చేశారు. జల పూజ, హారతిలో పాలుపంచుకున్నారు. అఖిల భారతీయ స్వామి సమర్థ్ గురుకుల పీఠం అధినేత అన్నాసాహెబ్ మోరే, కైలాస్ మఠాధిపతి స్వామి సంవిదానంద సరస్వతి, తుషార్ బోసలేను కలుసుకున్నారు. తర్వాత పంచవటిలోని ప్రఖ్యాత కాలారామ్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మోదీ శ్రమదానం చేశారు. చీపురు చేతపట్టి పరిసరాలను చెత్తాచెదారం ఊడ్చేశారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేస్తూ 1930 మార్చి 2న ఇదే మందిరంలో అంబేడ్కర్ తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం రూ.30,000 కోట్ల పై చిలుకు విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. ప్రధాని మోదీ 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట శుక్రవారం నుంచి 11 రోజుల అనుష్ఠానం ప్రారంభించినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘నాకు చాలా ఉద్వేగంగా ఉంది. జీవితంలో తొలిసారిగా ఇలాంటి భావాలు నా మదిలో వెల్లువెత్తుతున్నాయి. వాటిని అనుభూతి చెందగలను తప్ప మాటల్లో వ్యక్తీకరించలేను. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరికీ, రామ భక్తులకు పవిత్ర సందర్భం. గొప్ప వేడుక. ఈ అరుదైన సందర్భానికి ప్రత్యక్ష సాక్షిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. బాలరాముడి ప్రాణప్రతిష్టకు భారతీయులందరి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి భగవంతుడు నన్ను సాధనంగా ఎంచుకున్నాడు. నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా’’ అని పేర్కొన్నారు. అనుష్ఠానంలో భాగంగా మోదీ నిత్యం సూర్యోదయానికి ముందే మేల్కొంటారు. యోగా, ధ్యానం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాతి్వకాహారమే స్వీకరిస్తారు. ‘అటల్ సేతు’ ప్రారంభం ముంబై: 21.8 కిలోమీటర్లతో అత్యంత పొడవైన సముద్ర వారధి ‘అటల్ బిహారీ వాజ్‌పేయి సెవ్రీ–నవా షివా అటల్ సేతు’ను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ‘వికసిత్ భారత్’కు ఈ సేతు ఒక ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఈ ఆరు లేన్ల బ్రిడ్జి మహారాష్ట్రలో దక్షిణ ముంబై–నవీ ముంబైని అనుసంధానిస్తుంది. -
వికసిత భారత్ లక్ష్య సాధనకు యువతే కీలకం
స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను చోదక శక్తిగా ఆయన భావించారు. యువ తలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన శక్తిని ఉదాత్తమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకు రావచ్చని ఆయన నమ్మారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరం అని నొక్కి వక్కాణించారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనాన్ని పెంపొందించు కోవాలని ఆయన యువతను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతోపాటూ సామాజిక బాధ్య తనూ, స్వావలంబననూ పెంపొందించాలని వాదించారు. స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. నిర్భయులూ, నిస్వార్థపరులూ, మానవ సేవకు కట్టుబడి ఉండేవారుగా యువతరాన్ని స్వామి అభివర్ణించారు. నిర్భాగ్యులకు సేవ చేయడం అంటే దేవునికి నిజ మైన సేవ చేసినట్లని ఆయన బలంగా నమ్మారు. మాతృభూమికి, ప్రజానీకానికి సేవ చేసేందుకు దేశంలోని యువత దృఢ సంకల్ప శక్తిని కలిగి ఉండాలన్నారు. ‘మీరందరూ, ఎక్కడ ప్లేగు లేదా కరువు వ్యాప్తి చెందినా, లేదా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి, వారి బాధలను తగ్గించండి’ అని యువతకు పిలుపునిచ్చారు. స్వామి 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ‘వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్’(ప్రపంచ మతాల సమ్మేళనం)లో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోద రులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాద రమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతా లనూ నిజమైనవిగా అంగీకరిస్తాం... భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థు లకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు. ‘ఎరైజ్, ఎవేక్, అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పుకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవ సరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం... విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుత మైన సందేశాలు యువతకు అనుసరణీయాలు. యువత శారీరకంగానూ, మానసికంగానూ దారు ఢ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు స్వామి. వారు క్రీడా మైదానాలకు వెళ్లాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఆయన కోరుకున్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్ శతాబ్దం కావడానికి మోదీ కృషి చేస్తు న్నారు. ఐఎమ్ఎఫ్ అంచనా ప్రకారం భారత్ జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లు దాటినందున, మనది నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే 2027 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన అన్ని లక్షణాలతో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడా నికి సిద్ధంగా ఉంది. ఇలా ‘వికసిత్ భారత్’ సాకారం కావా లంటే యువత కీలక పాత్ర పోషించవలసి ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అనేక మైలు రాళ్లను చేరుకుంది. ‘చంద్రయాన్’ అంతరిక్ష రంగంలో సాధించిన ప్రగతికి ఒక ఉదాహరణ. డిజిటల్ ఆవిష్కరణ పట్ల దేశం నిబద్ధతను చాటిచెప్పే ఆధార్, యూపీఐ, ఏఏ స్టాక్, కొవిన్ ప్లాట్ ఫారమ్ వంటి వాటి వల్ల భారతదేశ డిజి టల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. మన సేవల రంగం, ముఖ్యంగా ఐటీ, ఐటీయేతర డొమైన్లలో ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంది. 300 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 100 యునికార్న్‌లను భారత్ కలిగి ఉండి, ప్రపంచంలోని మూడవ–అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యా వరణ వ్యవస్థగా నిలిచింది. ఈ ‘అమృత్ కాల్’ సందర్భంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ను రూపొందించడానికి స్వామి వివేకా నంద బోధనలను ఉపయోగించుకుందాం! - వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
విశిష్ట శ్రేణి.. వివేక వాణి
స్వామి వివేకానంద జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నాము. ఈ పావన భారత దేశంలో వృత్తి ఏదైనా ధార్మికతే అంతస్సూత్రం. ఈ గడ్డ మీద ఎందరో సాధు సంతులు,సన్న్యాసులు జన్మించి జాతికి మార్గదర్శకం చేస్తూ వచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ సర్వోత్కృష్టమైన అన్వేషణలో కపట వేషధారులు. కూడా, తులసి వనంలో గంజాయి మొక్కల్లా పుట్టుకు వస్తున్నారు. అలాంటి కపట వేషగాళ్ళను గురించి శ్రీ ఆది శంకరాచార్యుల. ప్రముఖ శిష్యుడు తోటకాచార్యులు ఇలాగన్నారు. జటిలో ముణ్డీ లుంచిత కేశః కాషాయంబర బహుకృత వేషః పశ్యనపి చ న పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః జడలు కట్టిన వెంట్రుకలతో నొకడు, నున్నగా గుండు కొట్టించు కున్నవాడు మరొకడు, కాషాయ వస్త్రాలు కట్టిన వాడు వేరొకడు పొట్ట కోసం వేషాలువేస్తూ అమాయ కులను దోచుకుంటున్నారు. "భగవన్మార్గంలో బూటకము ఎప్పటికీ మంచిది కాదు. బూటకపు వేషధారణ సరి కాదు. మనస్సు వేషానికి తగ్గట్లు లేనట్లయితే అది క్రమేణా పతనం చెందుతుంది" అంటారు శ్రీ రామకృష్ణ పరమహంస. సన్న్యాసుల్లో విశిష్టుడు, శ్రేష్టుడు అయిన పరివ్రాజకుడ్ని భారత మాత మనకు ప్రసాదిం చడం మన మహా భాగ్యం. ఒక పర్యాయం భారతీయ సంతు పురు షుడు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయం కళాశాల విద్యార్ధులకు భారతీయ సంస్కృ తిని ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలియ జెప్తున్నాడు. భారతీయ సంస్కృతి, ధర్మాలు వైజ్ఞానిక పరమైన సంబంధం ఉందని అతడు చెప్పాడు. అందువలనసంస్కృతిని,ఆధ్యాత్మ కతను విజ్ఞానంతో మేళవించి చూడటం భారత దేశంలో పరిపాటి అన్నాడు. అంతలో ఒక విద్యార్థి అసహనంగా లేచాడు. ఆ విద్యార్ధి వ్యంగ్యంగా ఇలా ప్రశ్నించాడు "మీరు వైజ్ఞానిక దృక్పథం తోనే మీ లక్షీదేవికి వాహ. నంగా గుడ్లగూబను సమకూర్చారా మహా శయా! గుడ్లగూబ పగలు చూడలేదుఅలాంటి పగలు అంధత్వం గల గుడ్లగూబ సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి వాహనం కావ డంలో ఏ విజ్ఞాన తర్కం దాగివుంది?"అది ఆ విద్యార్ధి ప్రశ్న. వెంటనే ఆ సత్పురుషుడు శాంతంగా ఇలా జవాబిచ్చాడు. "మా బారత దేశవాసులు మీ పశ్చిమ దేశవాసుల్లా ధనమే సర్వ సుఖాలకు మూలం అనుకోరు. అందు వలన ధనం వెంట పడ రాదని మా ఋషి మునులు మా జాతిని హెచ్చరించారు. సంపదలను కొదువ లేకుండా అధర్మంగా సంపాదిస్తే మనిషి గుడ్లగూబలా గుడ్డివాడు అవుతాడు. అంటే కళ్ళు ఉన్నా అతనికి చూపు లోపిస్తుంది.అతడ్నిధనగర్వం అనే అంధకారం ఆవహిస్తుంది. ఆ సంకేతాన్ని ఇవ్వడానికి వైజ్ఞానిక దృక్పదంతో సంపదల అధిదేవత అయిన మా లక్ష్మీ దేవికి గుడ్లగూబ ఉపయుక్తమైన వాహనం అని మా విజ్ఞులు అభిప్రాయ పడ్డారు." ఆ జవాబు విన్న సభా సదుల కరతాళ ధ్వనులతో సభమార్మ్రోగింది. ఆ తరువాత ఆ స్వామి ఇలా అన్నారు. "మా దేవి సరస్వతి జ్ఞాన విజ్ఞానాలకు ప్రతీక. మనుషుల్లో జ్ఞానాన్ని, విజ్నానాన్ని జాగృతం చేస్తుంది సరస్వతి. అందువల్ల సరస్వతీ దేవి వాహనంగా హంసను ఎన్ను కున్నారు. పాల నుంచి నీటిని వేరుచేయగల సామర్ధ్యం ఒక్క హంసకే ఉంది. ఇప్పుడు మీరు బాగా అర్ధం చేసుకుని ఉంటారు. మా సంస్కృతి, ధర్మం పూర్తిగా వైజ్ఞానిక పరమైనది" అతని తర్కయుక్తమైన సమాధానం వారి జిజ్ఞాసను శాంత పరిచింది. ఆ సత్పురుషుడు వేరెవరో కాదు స్వామి వివేకానంద. అతని గురించి తెలియని భారతీయుడు లేడు. అతని గురించి తెలియని విదేశీయులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ఒక మారు జాతిని ప్రభోధిస్తూ వివేకా నంద భావ ప్రచారమే మన కర్తవ్యం అన్నారు. ఆ సందేశాన్ని అతని మాటల్లోనేచెప్పుకోవాలి. "నేనొక నూతన ఆశయాన్ని ఇస్తున్నాను. దాన్ని సాధించగలిగితే మిమ్మల్ని ధీరులు గాను, సేవానిరతులుగాను గుర్తిస్తాను. ఒక సంఘటితమైన ప్రణాళికను తయారు చేయండి. నిరక్షరాస్యులు, నిరుపేదలెందరో ఉన్నారు. సాయంకాలమో, మధ్యాహ్నమో లేక మరి యే ఇతర సమయంలోనో వారి గుడిసె గుడిసకు వెళ్ళి వారికి ఖగోళశాస్త్రము, భూగోళశాస్త్రము మున్నగు వాటికి సంబంధి చిన చిత్రపటాలను చూపి ఆ తరువాత శ్రీ రామకృష్ణుల గురించి బోధించండి. వివిధ దేశాల్లో ఏం జరిగిందో లేక ఏమి జరుగుతోందో ఈ లోకం ఎలా ఉందో మొదలైన విషయాలను తెలిపి వారి కళ్ళు తెరిపించండి. ఈ పని మీరు చేయగలరా? రండి! కార్య సాధనకు కంకణం కట్టుకొండి. కబుర్లు చెప్తూ కార్యకలా పాలు ఆచరించే కాలం గతించింది. ప్రస్తుతం కార్యరంగం లోనికి దిగి పని చేయాలి. యువకులై, ఉత్సాహవంతులై, బుద్ధిమంతులై ధీరులై మృత్యుగహ్వరంలోనికి చొరపడడానికి, సముద్రాన్ని ఎదురీదడానికి సంసిద్ధులై సంచరించండి " జననం 1863 జనవరి 12 న కలకత్తాలో విశ్వనాథ దత్తు, భూవనేశ్వరి దంపతులకు ముద్దు బిడ్డగా నరేంద్రుడు జన్మించాడు. అతని సోదరుడైన భూపేంద్రనాథ్ దత్తు ధైర్య సాహసాలు, ఏకాగ్రత, మేథ, నిర్బయత్వం, వాదనాపటిమ వంటి సద్గుణాలను పుణికి పుచ్చుకున్నాడు.విదేశీ పాలకుల పాలనను ద్వేషించేవాడు. ఆంగ్లేయుల బానిస సంకెళ్ళ నుంచి భారత దేశాన్ని విముక్తి చేయాలని వారికి వ్యతిరేకంగా పోరాడే విప్లవ పోరాట యోధులతో చేతులు కలిపాడు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక దృక్పథం ఉంది. చిన్న తనంలో తల్లి నుంచి రామాయణ కథ విన్నాడు. మరి ఆ వంశంలోపుట్టిన నరేంద్రుడు వారిని తీసిపోతాడా? దేముడిని చూడాలన్న ఆకాంక్ష, జ్ఞానులు అజ్ఞానులు ఇలా సర్వులూ దేముడున్నాడు అని అంటారు. అసలు దేముడున్నాడా? ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలాగుంటాడు అనే ప్రశ్నలు అతని మస్తిష్కాన్ని దొలిచేవి. "మీరు దేముడ్ని చూసారా? పోని దేముడ్ని చూసిన వ్యక్తిని నాకు చూపగలరా?" అని ఎందరెందరినో అడిగాడు. దేముణ్ణి చూసిన వ్యక్తి ఆ బాలుడికి తారసపడలేదు. ఒక ప్రక్క ఆధ్యాత్మికత వేరొక వంక హేతువాదం. దేముడి ఉనికినే సందే హించేవాడు నరేంద్రుడు. సందేహ నివృత్తి.. 1881లో దక్షిణేశ్వరం కాళికాలయంలో అతను శ్రీ రామకృష్ణ పరమహంసను దర్శించి అతని వద్ద అదే ప్రశ్న వేసాడు. రామకృష్ణ పరమహంస జవాబు విని విస్మయం చెందాడు "మీరు దేముణ్ణి మీ కళ్ళతో స్వయంగా చూసారా!?" అని ఆశ్చర్యంగా, ఆనందంగా అడిగాడు. "చూసాను, చూస్తున్నాను. నేను నిన్ను ఇప్పుడే ఏ విధంగా చూస్తున్నానో అంతకు వంద రెట్లు స్పష్టంగా నేను జగన్మాతను చూస్తున్నాను" అని రామకృష్ణులు నరేంద్రతో అన్నారు. నీవు సాధన చేస్తే భగవతితో మాట్లాడగలవు అని విశ్వాసంగా చెప్పారు. శ్రీ రామకృష్ణుల శిష్యత్వాన్ని స్వీకరించాడు. నరేంద్రుడు. అతని శిక్షణలో అపార జ్ఞానాన్ని ఆర్జించాడు. ఒకనాడు శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఉపదేశం ఇచ్చారు." జీవుల యెడ దయ చూపడానికి నీ వెంతవాడవు? నీవు చేయ గలిగిన దల్లా ఈశ్వర భావంతో సమస్త జీవులను సేవించడమే! మాధవసేవ అంటూ ప్రత్యేకంగా ఏది లేదు మానవసేవయే మాధవ సేవ." అతని ఉపదేశం ఆదేశంగా తోచింది నరేంద్రునికి. వెనువెంటనే శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపించే పనిలో నిమగ్నుడయ్యాడు. అతనుపరివ్రాజకుడిగా 1892 లో దేశ సంచారం మొదలు పెట్టాడు. దేశంలో అల్లుకున్న క్షుద్ర మైన పరిస్థితులను నిశితంగా గమనించాడు. నరేంద్ర దత్తు వివేకానందుడైన తీరు.. పర్యటనలో ఒకనాడు ఖేత్రీ మహరాజును కలిసాడు. అతనే ఈ పేరు మార్పు కోరికను బయటపెట్టాడు. ఆనాటి నుంచి నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. విశ్వమతమహాసభ - వివేకవాణి చికాగో నగరంలో 11-9-1893 నాడు విశ్వమత మహాసభలు ప్రారంభమయ్యాయి. హిందూ ధర్మ ప్రతినిధిగా ఆ సభలో పాల్గొనే అవకాశం స్వామి వివేకానందకు కలిగింది. వేలాది మంది ఉద్దండులైన విద్యావంతుతో సభా ప్రాంగణం నిండిపోయింది. రోమన్ చర్చి అధ్యక్షులు కార్డినల్ గిబ్బల్స్ అధ్యక్షత వహించారు. చికాగో సభ అనంతరం నేను ఒక ప్రసిద్ధ వ్యక్తిని, వక్తను అయ్యాను అని వివేకానంద చెప్తూ పులకితులయ్యారు. ఆ సభలో ప్రవేశించటానికి ముందు ఆ తరువాత విషయాలు ఆయన ఇలా చెప్పేరు. ఆ. సమ యంలో అతనిమనస్సు ఎంతో డోలాయ మానం అయిందో అతని మాటల్లో ఇలా వ్యక్తమైంది. "విశ్వమతమహాసభ ప్రారంభోత్సవం నాడు ఉదయం కళామందిరంఅనే సమావేశ స్థలానికి తీసుకు వెళ్ళారు.అక్కడ ఆ సభల కోసం ఒక పెద్ద హాలు మరి కొన్ని చిన్న చిన్న హాలులను రూపొందించారు అన్నిదేశాలవారు అక్కడకు చేరుకున్నారు. భారతదేశం నుంచి బ్రహ్మసమాజానికి చెందిన మజుందారు, బొంబాయికి చెందిన నాగర్కరు, జైన మతం తరుఫున వీర్ చంద్ర గాంధీ, దివ్యజ్ఞాన సమాజం తరుఫున చక్రవర్తి వచ్చారు. వీరిలో మజుందార్‌తో పూర్వ పరిచయం ఉంది. మిగతా ముగ్గురు అపరిచితులు. చక్రవర్తితో బాటు శ్రీ మతి అనిబిసెంటు వచ్చింది. ప్రేక్షక గేలరీ కిక్కిరిసి నిండి పోయింది. అదొక జన మహా సముద్రం. ఏనాడు బహిరంగ సభలో ప్రసంగించని నేను మహానీయమైన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడమా! ఉర్రూతలూగించిన ప్రసంగం.. ఒక్కొక్కరు వేదిక మీద కొచ్చి తమ ప్రసంగాలను వినిపిస్తున్నారు. అప్పుడు నా హృదయం దడదడలాడింది. నా నోరు ఎండి పోయింది. ఉదయము సమావేశంలో ప్రసం గించ సాససించలేనంత అధైర్యం నన్ను ఆవహించింది. డాక్టర్ బారోసుగారు. నన్ను పరిచయం చేశారు.సరస్వతీదేవికి ముందుగా మొక్కేను. ఆ తరువాత గురువరేణ్యులు శ్రీ రామకృష్ణులకు మనస్సు లోనే ప్రణమిల్లి నేను క్లుప్తంగానే మాట్లాడేను. ఆ సభ నుద్దేశించి "అమెరికా సోదర సోదరీమణులారా!" అంటూ సంబో ధించాను. రెండు నిమిషాల పాటు హాలు దద్దరిల్లేలా, చెవులు గింగరుమనేలా కరతాళ ధ్వనులు చెలరేగాయి. ఆ తరువాత నేను చెప్పవలసినది ధైర్యంగా చెప్పాను. ఉపన్యా సం ముగిసే సరికి ఉద్వేగంగా, దాదాపు నిస్త్రాణలతో కూర్చుండి పోయాను. పలు వురు ప్రసంగాలు వ్రాసుకువచ్చి చదివేరు. నేను ముందుగా ఏమి వ్రాసి తెచ్చుకోక అశువుగా చెప్పాను.అందువల్ల చాలామంది విచలితులయ్యారు, విభ్రాంతులయ్యారు. మరునాడు అన్ని వార్తాపత్రికలు ఆనాటి ఉపన్యాసాలన్నింటి లోను నాదే అగ్రగణ్య మైనది అని ప్రకటించాయి.అందులోఒక పత్రిక ప్రచురించిన వార్తాంశం ఇలా ఉంది. 'స్త్రీలు పురుషులు ఎక్కడ చూసినా కిక్కిరిసి ఉన్నారు. వివేకానందుడి ఉపన్యాసం ఆసాంతం గంభీరంగా విన్నారు.' చివరకు మత దురభిమానం గల పత్రికలు కూడా "సుందర వదనుడైన అతడు ఆకర్షణీయమైన వైఖరితో అత్యంత వాగ్ధాటితో విశ్వమత మహాసభలో అందరి కన్న మిన్న అయిన వ్యక్తిగా విరాజిల్లేడు" అని వ్రాసి తమ అంగీ కరాన్ని వెల్లడి చేసాయి. వివేకానంద అమెరికా నుంచి స్వదేశం వస్తూనే సముద్రపు ఒడ్డున ఇసుకలో పొర్లాడి నేను భోగభూమి నుంచి మన కర్మ భూమి, పుణ్యభూమికి తిరిగి వచ్చాను. నా శరీరం మనస్సులలోని మలినాన్ని తొలగించుకుంటు న్నాను అన్నాడు. దేశంలో ప్రబలిన బలహీనతలను,మూఢా చారాలను, విదేశీ వ్యామోహాన్ని, కుల దురభి మానానలను వీడనాడాలని ప్రబోధించాడు. స్త్రీలను, పేదలను ఆదుకో వలసి ఉందని, నిరక్షరాస్యతను, పేదరికాన్ని రూపు మాపేందకు దేశవాసులకు పరిశ్రమించాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల వనిత మార్గరెట్ నోబెల్ ను స్వచ్ఛమైన భారతీయ యువతిగా మలచి సోదరి నివేదిత అన్న పేరునిచ్చాడు. వివేకానందుడి అడుగు జాడల్లో నడుస్తూ ఆమె స్త్రీలను విద్యావంతులుగా చేయటంలో బాగా కృషి చేసింది. అనాధ బాల బాలికల కోసం అనేక అనాధాశ్రమాలను నెలకొల్పింది. శ్రీ రామకృష్ణ సేవా సమాజాన్ని 1897 లో నెలకొల్పారు. మానవసేయే మాధవసేవగా ఆనాటి నుంచి నేటి వరకు ఆ సంస్థలు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. హైందవ సంస్కృతి పరంపరలను,ధర్మాన్ని కాపాడడంలోనూ వివేకానందునిది విశిష్టమైన శ్రేణి. అతని వాణి నలు దిక్కులా మ్రోగింది. నిరంతరం పరిశ్రమిచడంవలన అతని ఆరోగ్యం క్షీణించింది. ఆది శంకరాచార్యుల్లా అతను 39 సంవత్సరాల పిన్న వయసులోనే 1902 లో ఈ భౌతిక దేహాన్ని త్యాగించి పరమపధం చేరుకున్నాడు. అయితే వివేకానంద వాణి అమరవాణి.ఇప్పటికీ అది మన మధ్య నుండి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తోంది. అతను ఈ పవిత్ర భారత దేశంలో జన్మించిన మహోన్నతమైన వ్యక్తి. ఆ క్షితి అపూర్ణీయమైనది. అయితే అతని బాటలో నడుస్తూ అతని సందేశాన్ని ఔదల దాల్చి దరిద్రనారాయుణుల సేవలో నిమగ్నం కావడమే అతనికి మనమిచ్చే మహా నివాళి. ఆ విశిష్ట శ్రేణి ఆ వివేకానంద వాణి అహర్నిశాలు మన మనస్సులో జాగృతమై ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్దించడానికి ఇది తరుణం కాదా? - గుమ్మా ప్రసాద రావు -
ఎవరి పౌరసత్వమూ రద్దు కాదు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టిగా కొత్త చట్టాన్ని సమర్థించారు. సీఏఏ పట్ల పూర్తిగా అవగాహన ఉన్నప్పటికీ కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ చట్టం వివాదాస్పదం కావడం వల్లే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని, పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన హింస అన్ని దేశాలకు తెలిసి వచ్చిందన్నారు. పాకిస్తాన్ 70 ఏళ్లుగా తమ దేశం లో మైనార్టీలపై సాగిస్తున్న హింసాకాండకు ఆ దేశమే సమాధానమివ్వాలని అన్నారు. స్వామి వివే కానంద జయంతి సందర్భంగా ఆదివారం ఆయన కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయం బేళూరు మఠంలో ఏర్పాటు చేసిన యువజనదినోత్సవంలో మాట్లాడారు. సీఏఏ పౌరసత్వాన్ని ఇస్తుంది, రద్దు చేయదు సీఏఏపై విపక్షాలు ఒక వర్గం యువతను పక్కదారి పట్టిస్తున్నాయని మోదీ విమర్శించారు. ఈ చట్టం వల్ల భారత్‌లో ఎవరి పౌరసత్వం రద్దు కాదని ప్రధాని పునరుద్ఘాటించారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని తీసుకోదని, ఆ చట్టం పౌరసత్వాన్ని ఇస్తుందని అన్నారు. చట్టంతో నిమిత్తం లేకుండా దేశం పట్ల, రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉన్న వారు ఎవరైనా సరే, ఏ దేశంలో ఉన్నవారైనా సరే, ఏ మతానికి చెందినవారైనా సరే భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో ఎలాంటి సమస్యా ఉండదని ప్రధాని స్పష్టం చేశారు. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక తలదాచుకోవడానికి వచ్చిన శరణార్థుల్ని మీ చావు మీరు చావండని వెనక్కి పంపాలా? వారి పరిరక్షణ బాధ్యత మనది కాదా? అని ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య ప్రధాని చెప్పారు. కోల్‌కతా పోర్టు ట్రస్టుకి ముఖర్జీ పేరు కోల్‌కతా పోర్టు ట్రస్టు 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కోల్‌కతా పోర్టు ట్రస్ట్ పేరుని జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టుగా మారుస్తున్నట్టు ప్రకటించారు. మోదీ కార్యక్రమాలకు దీదీ దూరం మరోవైపు ప్రధాని ఆదివారం పాల్గొన్న అన్ని కార్యక్రమాలకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని.. మమత సర్కార్‌పై ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలేవీ మమతా సర్కార్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధాని రాకతో కోల్‌కతాలో సీఏఏ వ్యతిరేక నిరసనలు మరింత జోరుగా సాగాయి. బేళూరు మఠంలో నిద్ర కోల్‌కతాలో రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేళూరు మఠానికి రావడం, అక్కడ ఒక రాత్రి గడపడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తిరిగి తాను తన సొంత ఇంటికి వచ్చినట్టుందని అన్నారు. మఠంలో ఒక రాత్రి నిద్రించే అవకాశం ఇచ్చిన మతాధికారులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ‘‘బేళూరు మఠం ఒక యాత్రా స్థలం. కానీ నా వరకు ఇది సొంతిల్లులాంటిది. రామకృష్ణ మఠం అధ్యక్షుడు, ఇతరులు నాకు ఒక రాత్రి గడపడానికి అనుమతినివ్వడం నేను చేసుకున్న అదృష్టం. భద్రతా కారణాల రీత్యా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లలేను. అయినా ఆ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు’’అని మోదీ చెప్పారు. తెల్లని కుర్తా, ధోవతి , మెడ చుట్టూ ఉత్తరీయం ధరించిన మోదీ రామకృష్ణ మిషన్‌తో తనకున్న అనుబంధాన్ని అక్కడ యువకులతో పంచుకున్నారు. ‘‘ఈ నేల, ఈ గాలి, ఈ నీరు 130 కోట్ల మంది ప్రజానీకానికి నేను సేవ చేయాలన్న నా కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. బేళూరు మఠానికి వస్తే స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద సమక్షంలో ఉన్న అనుభూతి కలుగుతుంది’’అని అన్నారు. రామకృష్ణ మిషన్ మాజీ అధ్యక్షుడు, దివంగత ఆధ్యాత్మిక గురువు స్వామి అత్వస్థానందతో తనకి విడదీయలేని అనుబంధం ఉందని, ఆయన బోధనలు తన జీవన గమనాన్నే మార్చేశాయని అన్నారు. రామకృష్ణ మిషన్ ప్రధానకార్యదర్శి స్వామి సువిరానంద ఈ మఠంలో రాత్రి నిద్ర చేసిన తొలి ప్రధాని మోదీయేనని అన్నారు. తమ కొడుకే ఇంటికి వచ్చినంత సంబరంగా ఉందన్నారు. మోదీ రాక మఠానికే గర్వకారణమని చెప్పారు. మఠంలోనే మెడిటేషన్ రెండు రోజుల పర్యటన కోసం కోల్‌కతాకు వచ్చిన ప్రధాని శనివారం రాత్రి బేళూరు మఠంలో ఇచ్చిన ప్రసాదాలు గోధుమ పాయసం, కూరగాయలతో కడుపు నింపుకున్నారు. ప్రతీరోజూ మార్నింగ్ వాక్ చేసే ప్రధాని ఆదివారం కావడంతో దానికి విరామం ఇచ్చారు. ఉదయం షుగర్ ఫ్రీ టీ తాగారు. బ్రేక్ ఫాస్ట్‌గా ఉప్మా, దోసె తీసుకున్నారు. మఠంలో సాధువులతో సంభాషించారు. కాసేపు «ధ్యానముద్రలో గడిపారు. ఆ తర్వాత జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద రచించిన పుస్తకాలను మతాధికారులు ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. -
స్వామి వివేకానందకు సీఎం జగన్ నివాళి..
సాక్షి, తాడేపల్లి : స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘గొప్ప మేధావి, తత్వవేత్త స్వామి వివేకానందకు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.. అనే ఆ మహానీయుడి సూక్తిని యువత పాటించాలి’ అని సూచించారు. -
సత్యమే నా దైవం విశ్వమే నా దేశం
‘నీ ధర్మం ఏదైనా కావచ్చు. కాని దాని పట్ల సత్యవర్తనతో మెలుగు’ అని బోధించినవాడు వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింప చేయడంలో ఆయన దాదాపు ఒక ప్రవక్త వలే కృషి చేశాడు. ముఖ్యంగా యువశక్తిని చైతన్యపరచాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఆలోచన అవసరమన్నాడు. సంకుచితాల సరిహద్దులను, క్రతువులను నిరసించాడు. నేడు ఆయన జయంతి. భిన్న సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని... కష్టాలతోను, యాతనలతోను నిండిపోయిన జీవితం గుండా నేను ఈడ్వబడ్డాను. నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు దాదాపు పస్తులతో మరణించడం కళ్లారా చూశాను. నేను అవహేళనకు, విశ్వాస రాహిత్యానికి గురయ్యాను. నన్ను ఎవరు ఏవగించుకున్నారో, అపహాస్యం చేశారో వారి పట్ల సానుభూతి చూపినందున బాధలకు గురయ్యాను. నేను ముక్తినీ లేదా భక్తినీ ఖాతరు చేయను. నూరువేల నరకాలకైనా పోవడానిని నేను సిద్ధంగా వున్నాను. వసంతంలా నిశ్శబ్దంగా పరహితం ఆశిస్తాను. ఇదే నా మతం. జనం శ్రీరామకృష్ణుల పేరును అంగీకరించినా లేక అంగీకరించకపోయినా నేను పట్టించుకోను. కాని ఆయన బోధనలు, జీవితం సందేశం లోకమంతటా వ్యాప్తి చేయడానికి నా ప్రాణాలను అర్పించడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. అవును, ఒక మహాత్ముని ఉత్సాహ ప్రోత్సాహకాల వల్లనే నా జీవిత మార్గనిర్దేశనం జరిగింది. నాకు శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణ కల్పించారన్న నిజాన్ని నేను నమ్ముతున్నాను. అయితే నాకుగా నేను స్ఫూర్తిని పొందాను కూడా. నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. స్వదేశ స్వమత దురభిమానంతో నాకు సంబంధం లేదు. నేను భారత దేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతాను... ఏ దేశానికి నా మీద ప్రత్యేకమైన హక్కు ఉంది? ఏ దేశానికైనా నేను బానిసనా? మానవశక్తి కన్నా, దైవశక్తి కన్నా, అనురక్తి కన్నా మహత్తరమైన శక్తి నాకు అండగా ఉన్నట్లు ప్రత్యక్షంగా గోచరిస్తోంది. పిరికితనం అంటే నాకు పరమ రోత. సత్యమే నా దైవం. విశ్వమే నా దేశం. ఆశించడమే పరమ దుఃఖం, ఆశించకపోవడమే పరమ సుఖం. కోరికలు పూర్తిగా త్యజించి, నిశ్చింతగా ఉండాలి. మిత్రులు, శత్రువులు అనేవారు లేకుండా ఏకాకిగా జీవించాలి. ఆ విధంగా శత్రుమిత్రులు, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు లేకుండా, జీవాలను హింసించక ఏ జీవహింసకూ కారకులు కాకుండా, ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి భగవన్నామాన్ని ప్రబోధిస్తూ మనం పర్యటించాలి. సంపదలో దారిద్య్ర భయం ఉంది. జ్ఞానంలో అజ్ఞాన భయం ఉంది. సౌందర్యంలో వృద్ధాప్య భయం ఉంది. కీర్తిలో చాటునిందల భయం ఉంది. శరీర విషయంలో సైతం మృత్యు భయం ఉంది. లోకంలో సమస్తమూ భయంతో కూడుకొని ఉంది. వైరాగ్యం ఒక్కటే భయం లేనిది. నాలో ఎన్ని తప్పిదాలున్నా, కొంత సాహసం కూడా ఉందని భావిస్తాను. నాకు అవరోధాలు కల్పించడానికి, నా పురోగతిని వ్యతిరేకించానికి, వీలైతే నన్ను రూపుమాపడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భగవదనుగ్రహం వల్ల అన్నీ వ్యర్థమయ్యాయి. అటువంటి ప్రయత్నాలు వైఫల్యం చెందటం సహజమే. గడచిన మూడేళ్ల నుండి కొన్ని అపార్థాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. నేను విదేశాల్లో ఉన్నంత కాలం ఈ విషయంగా ఒక్క మాట కూడా పలుకక మౌనం పాటించాను. ఇప్పుడు నా మాతృభూమిపై నిలబడి కొంత వివరణ చెప్పగోరుతున్నాను. నా మాటల వల్ల మీలో ఎటువంటి స్పందన కలిగించగలనో అనే కౌతుకంతోనూ కాదు. నేను ఇటువంటి వాటిని లక్షించేవాణ్ని కాను.ఎందుకంటారా? నాలుగేళ్ల కిత్రం దండ కమండలాలను మాత్రం చేతబూని, మీ నగరంలో ప్రవేశించిన ఆనాటి సన్యాసినే ఇప్పుడూను..! నా భవిష్యత్తు ఆశంతా సౌశీల్యురైన యువకుల మీదనే ఉంది. వాళ్లు బుద్ధికుశలురు, సర్వస్వాన్ని ఇతరుల సేవకై పరిత్యజించే వ్యక్తులుగా ఉండాలి. నా భావాలనుకార్యరూపంలోకి తేవడానికి తమ జీవితాలను త్యాగం చేసి తద్వారా తమకూ, దేశానికీ సౌభాగ్యం చేకూర్చేది ఈ యువకులే. నచికేతుని వంటి శ్రద్ధావంతులైన పది పన్నెండు మంది యువకులు నాకు లభిస్తే ఈ దేశప్రజల ఆలోచనలను, కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కించగలను. నాకు భగవంతుని పట్ల విశ్వాసం ఉంది, మనిషి పట్ల విశ్వాసం ఉంది. దుఃఖపూరితుల పట్ల విశ్వాసం ఉంది. ఇతరులను ఉద్ధరించటానికి నరకానికి పోవడంలో విశ్వాసం ఉంది. ఒక మనిషికి నిజంగా సహాయం లభిస్తుందంటే నేను నేరం చేసి శాశ్వత నరకవాసం అనుభవించడానికి కూడా సంశయించను. మనిషి గురించి నేను ప్రేమలో పడడం వల్ల మళ్లీ జన్మించవలసి ఉంటుంది. వితంతువు కన్నీరు తుడిచివేయలేని, అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గాని మతం పట్ల గాని నాకు విశ్వాసం లేదు. ఎటువంటి కర్మకాండలతోగాని అంధ విశ్వాసంతో గాని నాకు సంబంధం లేదు. మతమే సమస్తమనీ, సమస్తంలోనూ మతమే ఉందని చూపించడమే నా లక్ష్యం. ఆలోచించడం మనిషి స్వభావం. ఇదే అతడికీ, జంతువులకూ ఉన్న తారతమ్యం. నేను యుక్తి (ట్ఛ్చటౌn)లోనే విశ్వాసం ఉంచి దానినే అనుసరిస్తున్నాను. మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పనిచేయడ మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి సర్వత్రా ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను. – సేకరణ: వైజయంతి పురాణపండ -
నిత్య నూతన స్ఫూర్తి ప్రదాత
భారత్ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటుతూ.. అది తన ప్రాచీన గౌరవాన్ని తిరిగి పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. ఇనుప కండలు, ఉక్కునరాలు నినాదంతో జాతిని జాగృతం చేసిన నిత్యచైతన్య దీప్తి ఆయన. వివేకానందుడి పేరు వినగానే ముందుగా జ్ఞాపకం వచ్చే వాక్యాలు.. ‘‘ఇనుప కండలు, ఉక్కు నరాలు, దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం’’. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ... ఇంకో క్షణంలో ప్రాణాలు పోతాయన్న వ్యక్తి సైతం ఈ మాటలతో మళ్లీ జీవం పోసుకుంటాడు. యావత్ యువతను నిత్యచైతన్య దీప్తులను చేసేందుకు వివేకానందుడు పలికిన ఈ స్ఫూర్తి వాక్యాల్లో అంతులేని కొండంత బలం ఉంది... ఎంతో ఆకర్షణ శక్తి ఉంది. యువతకు ఆయన ఇచ్చిన సందేశం దిశదశతో కూడిన మార్గదర్శిగా పనిచేస్తూనే ఉంది. ఎప్పటికీ అది పనిచేస్తూనే ఉంటుంది. 1863 జనవరి 12న జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తాలో జన్మించిన నరేంద్రనాథ్ దత్తా చిన్నప్పటి నుంచే ఎంతో చురుకైన, తెలివైనవాడు. నిత్య నూతన చైతన్య ఝరితో.. తన చుట్టూ ఉండే ఎంతో మందికి ప్రతిక్షణం జ్ఞాన సందేశాలు ఇస్తూనే.. అందరికీ ఆదర్శమూర్తిగా వెలుగొందే వాడు. ‘‘లెండి.. మేల్కొండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి’’ అంటూ తాను యువతకు ఇచ్చిన సందేశం ఒక బలమైన టానిక్ అనే చెప్పాలి. హిందూ యోగిగా వివేకానందుడు అనేక ప్రదేశాలను చుట్టివచ్చారు. రామకృష్ణ పరమహంస శిష్యుడిగా వేదాంత, యోగ తత్వ పారాయణంలో వివేకానందుడి ముద్ర అత్యంత క్రియాశీలం. గురువు రామకృష్ణ పరమహంస కోరిక మేరకు అమెరికాకు వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. భారత దేశ ఔన్నత్యాన్ని, భారత గడ్డ పవిత్రతను నలుమూలలా చాటుతూ.. మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని తిరిగి పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని ఉపన్యాసాలకు, సందేశాలకు అమెరికా ప్రజానీకం బ్రహ్మరథం పట్టి అనేక మంది అతనికి శిష్యులుగా మారారు. పాశ్చాత్య దేశాల్లోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి కూడా స్వామి వివేకానంద కావడం విశేషం. 1893లో తూర్పు దేశాల తత్వాన్ని చికాగోలో జరిగిన ప్రపంచ మత సదస్సులో ప్రవేశపెట్టడమే కాక, అనేకమంది అమెరికా వాసుల్ని తన మంత్రముగ్ధ వాక్పటిమతో ఆకర్షించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. హిందూమతం ప్రాశస్త్యాన్ని, భారత దేశ ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన స్వామి వివేకానంద సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని 1984 నుంచి జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతూ వస్తోంది. చికాగోలోని సర్వమత సమ్మేళనం గురించి ముఖ్య విషయం చెప్పుకోవాలి. చికాగోలో స్వామి వివేకానంద బోస్టన్ నగరానికి వెళ్లే మార్గమధ్యంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆయనతో కొద్ది సేపు మాట్లాడిన ఆమె అతని గొప్పదనం ఏంటో అర్థం చేసుకుంది. అతను ఎంతో గొప్ప వ్యక్తి అని గ్రహించి అయన్ను తన ఇంట్లో బస చేయమని కోరింది. ఈ క్రమంలో ఎక్కడ అవకాశం వచ్చినా భారత దేశ సంస్కృతి, హిందూ ధర్మం ప్రాముఖ్యత గురించి వివరించేవారు. స్వామి వివేకానందుడు ప్రపంచ ప్రజలందరినీ సోదరభావంతో చూసేవారు. అందుకు ఉదాహరణే చికాగో సభలో ఆయన మాట్లాడిన మాటలు. అమెరికా దేశపు సోదరులారా అంటూ ఆయన మాట్లాడటం మొదలు పెట్టగానే సభలో కరతాళ ధ్వనుల మోత మోగడంతో పాటు అప్పటి నుంచి చాలా మంది అతనికి ఆరాధ్యులయ్యారు. ఎక్కడికి వెళ్లినా వివేకానందుడు తన ప్రసంగంలో భారతదేశ విలువలను ప్రచారం చేసేవారు. చరిత్ర, సామాజిక శాస్త్రం, తత్వశాస్త్రం, సాహిత్యం ఇలా అన్నిఅంశాలపై పట్టు సాధించి.. ప్రతి అంశంపై ధారాళమైన ఉపన్యాసం ఇచ్చేవారు. స్వామి వివేకానందుడు అప్పటికీ ఇప్పటికీ.. ఎప్పటికీ యువతకు ఆదర్శనీయుడే. ఆయన చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకం. నేటి యువతలో గూడు కట్టుకుని పోయిన సోమరితనం, అలసత్వం, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వంటి దుర్గుణాలను తక్షణమే త్యజించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వివేకానందుడు ఏనాడో చెప్పిన లేవండి, మేల్కొండి, లక్ష్యాన్ని చేరేవరకూ విశ్రమించకండి అన్న మంచిమాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పటి యువతరం లక్ష్యసాధనలో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈనాటి యువతలో గూడుకట్టుకుని పోయిన నిరాశ, నిస్పృహలకు స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయక వాక్కులే దివ్యౌషధం కావాలి. నిరంతరం జ్వలించే నిప్పు కణంలా యువత సమస్యలపై సమరశంఖం పూరించి.. ఈ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ యువత ఆలోచన ఉండాలి. ఎక్కడ నిర్లక్ష్యం ఉంటుందో అక్కడ యువత చైతన్యం ఉండాలి. ఎవరూ బాధితులుగా మారకుండా.. యువత బాసటగా నిలవాలి. యువతకు స్ఫూర్తి ప్రదాత, నిరంతర చైతన్యశీలి స్వామి వివేకానందుడి సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ.. భవి ష్యత్ భారతావని మేలి రత్నాలుగా ఎవరికి వారు తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వివేకానందుడి బాటలో పయనించేందుకు ఈ క్షణాలే శుభతరుణంలా భావించి, నవభారత నిర్మాణానికి భావి భారత ముద్దుబిడ్డలందరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇదే స్వామి వివేకానందుడికి మనం ఇచ్చే సగౌరవం. (నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా) డాక్టర్ కే లక్ష్మణ్ వ్యాసకర్త బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఈ–మెయిల్: bjptsmedia@gmail.com -
పండ్లు కోసే కత్తి
నరేంద్రనాథ్ దత్త తొలిసారి విదేశీయానానికి సిద్ధం అవుతున్నాడు. తల్లికి బెంగ పట్టుకుంది. దేశం కాని దేశంలో ఎవరితో ఎలా ఉంటాడోనని! లోకం తెలియని యువకుడు లోకంతో నెగ్గుకు రాగలడా అని ఆమె చింత. రాత్రి భోజనం అయ్యాక.. పళ్లెంలో పండ్లు, వాటిని కోసుకోడానికి కత్తి పెట్టి కుమారుడికి అందించింది తల్లి. కొద్దిసేపటి తర్వాత వంటింట్లో ఉన్న తల్లికి కత్తి అవసరమై, ‘‘నరేంద్రా.. కొద్దిగా ఆ కత్తి తెచ్చివ్వు నాయనా’’ అని అడిగింది. ‘‘ఇదిగోనమ్మా..’’ అంటూ కత్తిని తెచ్చి ఇచ్చాడు నరేంద్ర. కుమారుడు తనకు కత్తిని ఇచ్చిన విధానం చూసి ఆ తల్లి ముఖంలో నిశ్చింత చోటు చేసుకుంది. కత్తి పదునుగా ఉండే వైపును తన చేతితో పట్టుకుని, కత్తిని పట్టుకోడానికి వీలుగా ఉండే భాగాన్ని తల్లి చేతికి అందించాడు నరేంద్ర. అది గమనించాక, తన కొడుకు ఎవరినీ నొప్పించే స్వభావంగల వాడు కాదని ఆమెకు అర్థమైంది! ఎవరినీ నొప్పించనివాడు ఎన్ని దేశాలనైనా నెగ్గుకు రాగలడు. ఆ నమ్మకంతోనే.. కొడుకు చికాగో బయల్దేరుతుంటే చిరునవ్వుతో వీడ్కోలు చెప్పగలిగింది ఆ తల్లి. ఆమె పేరు భువనేశ్వరీదేవి. ఆ కుమారుడే మనందరికీ తెలిసిన స్వామీ వివేకానంద. అతడి చిన్నప్పటి పేరే నరేంద్రనాథ్ దత్త. సాధారణంగా మనం పక్కవారి గురించి ఆలోచించం. మన సౌకర్యాన్నే చూసుకుంటాం. మనం హాయిగా కూర్చుంటే చాలు. పక్కవాళ్లు చోటు సరిపోక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోం. కొంచెం కూడా సర్దుకుని కూర్చోం. కొన్నిసార్లు వాళ్ల వాటాలోకి కూడా వెళ్లిపోయి, వాళ్ల చోటును కూడా ఆక్రమించుకుంటాం. నిత్య జీవితంలో ఇలా మనం ఎందరినో మన చేతలతో ఇబ్బంది పెడుతుంటాం. మన మాటలతో నొప్పిస్తుంటాం. ఇదంతా మనకు తెలియకుండానే చేస్తుండవచ్చు. కానీ మంచి పద్ధతి కాదు. పక్కవారి సౌకర్యం గురించి మొదట ఆలోచించాలి. తర్వాతే మన సౌకర్యం. అప్పుడే ఈ లోకానికి మనతో సఖ్యత కుదురుతుంది. (నేడు స్వామీ వివేకానంద జయంతి. జాతీయ యువజన దినోత్సవం కూడా). -
బిలాయ్‌లో నమోదైన 9 ప్రపంచ రికార్డులు
భిలాయ్(చత్తీస్‌గఢ్): స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ప్రాణాయామం కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆసనాలువేసి 9 కొత్తగోల్డెన్ బుక్ ప్రపంచరికార్డులు నెలకొల్పారు. బిలాయ్‌లోని 36ఎకరాల మైదానంలో దాదాపు లక్షమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యనమస్కారాలు, కపాల్భాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేసి 3 ప్రపంచరికార్డులు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం రమణ్ సింగ్, ఉన్నతవిద్య మంత్రి ప్రకాశ్ పాండే పాల్గొన్నారు. లక్షకుపైగా జనం ఒకేసారి యోగా నేర్చుకుని నాలుగో రికార్డును, ఒకేసారి నిమిషంలో 10 పుషప్స్ చేసి ఐదో రికార్డును నెలకొల్పారు. రాజస్తాన్‌కు చెందిన భాయ్ జైపాల్ అనే గురువు 141 నిమిషాలపాటు శీర్షాసనం వేసి ఆరో రికార్డును, భాయ్ రోతాస్ 19నిమిషాల 20సెకన్లలో 1000 పుషప్స్ చేసి ఏడో రికార్డు సృష్టించారు. 50,000 మంది ఒకేసారి సర్వాంగాసన, హలాసనాలు వేసి ఎనిమిదో, తొమ్మిదో రికార్డులను నమోదుచేశారు.