ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో మంత్రులు జూపల్లి, పొన్నం తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తి బాటలో నేటి యువతరం నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌లు వివేకానంద చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద చిన్నతనంలోనే అనేక విషయాలపై పట్టు సాధించిన వ్యక్తి అని అన్నారు.
పొన్నంకు క్రిబ్‌కో చైర్మన్ సన్మానం..
ఢిల్లీ వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిబ్‌కో చైర్మన్ చంద్రపాల్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో సత్కరించారు. తెలంగాణలో సహకార రంగం అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రపాల్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment