న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించడంతో శుక్రవారం జైలు నుంచి విడుదల అయిన విషయం తెలిసిందే. ఆప్ ముఖ్య నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని సీఎంకు ఘన స్వాగతం పలికారు.
కాగా సీఎం విడుదలపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నార్త్ ఢిల్లీలోని సివిల్స్ లైన్స్‌లో సీఎం ఇంటి వద్ద పెద్ద ఎత్తున టపాలు కాల్చి కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీఎం నివాసం వెలుపల బాణాసంచా పేల్చడంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాణసంచా వినియోగంపై ఢిల్లీలో నిషేధం ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 223 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అధికారి తెలిపారు.
ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లోని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక స్వాగతం పలికేందుకు ఆయన నివాసం వెలుపల పటాకులు పేల్చడంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.
చదవండి: దంచికొట్టిన వానలు.. మెరుగుపడిన ఢిల్లీ గాలి నాణ్యత
కాగా లిక్కర్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని.. కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment