ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజీవాల్ బెయిల్ పిటిషన్‌తో పాటు సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరిపింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటున్న సమయంలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది.
విచారణ సందర్భంగా వాదనలు మళ్లీ ప్రారంభించాలని కేజ్రీవాల్ పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పట్టుపట్టారు. జీవించే హక్కు, స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇలా మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన చాకచక్యంగా ఈ రోజుల్లో ట్రంప్ అనే పదం చాలా ప్రమాదకరంగా మారిందని చమత్కరించారు. ట్రంప్ అనే పదంపై సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యతో ఒక్కసారిగా కోర్టు హాలులో ఉన్న న్యాయవాదులు నవ్వారు.
ఇక.. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల నుంచి సుధీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేజ్రీవాల బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 10న తీర్పు వెల్లడించనుంది.
Comments
Please login to add a commentAdd a comment