భిలాయ్(చత్తీస్‌గఢ్): స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా, ప్రాణాయామం కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆసనాలువేసి 9 కొత్తగోల్డెన్ బుక్ ప్రపంచరికార్డులు నెలకొల్పారు. బిలాయ్‌లోని 36ఎకరాల మైదానంలో దాదాపు లక్షమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యనమస్కారాలు, కపాల్‌భాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేసి 3 ప్రపంచరికార్డులు సృష్టించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం రమణ్ సింగ్, ఉన్నతవిద్య మంత్రి ప్రకాశ్ పాండే పాల్గొన్నారు. లక్షకుపైగా జనం ఒకేసారి యోగా నేర్చుకుని నాలుగో రికార్డును, ఒకేసారి నిమిషంలో 10 పుషప్స్ చేసి ఐదో రికార్డును నెలకొల్పారు. రాజస్తాన్‌కు చెందిన భాయ్ జైపాల్ అనే గురువు 141 నిమిషాలపాటు శీర్షాసనం వేసి ఆరో రికార్డును, భాయ్ రోతాస్ 19నిమిషాల 20సెకన్లలో 1000 పుషప్స్ చేసి ఏడో రికార్డు సృష్టించారు. 50,000 మంది ఒకేసారి సర్వాంగాసన, హలాసనాలు వేసి ఎనిమిదో, తొమ్మిదో రికార్డులను నమోదుచేశారు.
బిలాయ్‌లో నమోదైన 9 ప్రపంచ రికార్డులు
Published Sat, Jan 14 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
Advertisement
Advertisement