National Youth Day
-
వికసిత భారత్ లక్ష్య సాధనకు యువతే కీలకం
స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను చోదక శక్తిగా ఆయన భావించారు. యువ తలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన శక్తిని ఉదాత్తమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకు రావచ్చని ఆయన నమ్మారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరం అని నొక్కి వక్కాణించారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనాన్ని పెంపొందించు కోవాలని ఆయన యువతను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతోపాటూ సామాజిక బాధ్య తనూ, స్వావలంబననూ పెంపొందించాలని వాదించారు. స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. నిర్భయులూ, నిస్వార్థపరులూ, మానవ సేవకు కట్టుబడి ఉండేవారుగా యువతరాన్ని స్వామి అభివర్ణించారు. నిర్భాగ్యులకు సేవ చేయడం అంటే దేవునికి నిజ మైన సేవ చేసినట్లని ఆయన బలంగా నమ్మారు. మాతృభూమికి, ప్రజానీకానికి సేవ చేసేందుకు దేశంలోని యువత దృఢ సంకల్ప శక్తిని కలిగి ఉండాలన్నారు. ‘మీరందరూ, ఎక్కడ ప్లేగు లేదా కరువు వ్యాప్తి చెందినా, లేదా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి, వారి బాధలను తగ్గించండి’ అని యువతకు పిలుపునిచ్చారు. స్వామి 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ‘వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్’(ప్రపంచ మతాల సమ్మేళనం)లో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోద రులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాద రమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతా లనూ నిజమైనవిగా అంగీకరిస్తాం... భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థు లకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు. ‘ఎరైజ్, ఎవేక్, అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పుకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవ సరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం... విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుత మైన సందేశాలు యువతకు అనుసరణీయాలు. యువత శారీరకంగానూ, మానసికంగానూ దారు ఢ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు స్వామి. వారు క్రీడా మైదానాలకు వెళ్లాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఆయన కోరుకున్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్ శతాబ్దం కావడానికి మోదీ కృషి చేస్తు న్నారు. ఐఎమ్ఎఫ్ అంచనా ప్రకారం భారత్ జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లు దాటినందున, మనది నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే 2027 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన అన్ని లక్షణాలతో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడా నికి సిద్ధంగా ఉంది. ఇలా ‘వికసిత్ భారత్’ సాకారం కావా లంటే యువత కీలక పాత్ర పోషించవలసి ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అనేక మైలు రాళ్లను చేరుకుంది. ‘చంద్రయాన్’ అంతరిక్ష రంగంలో సాధించిన ప్రగతికి ఒక ఉదాహరణ. డిజిటల్ ఆవిష్కరణ పట్ల దేశం నిబద్ధతను చాటిచెప్పే ఆధార్, యూపీఐ, ఏఏ స్టాక్, కొవిన్ ప్లాట్ ఫారమ్ వంటి వాటి వల్ల భారతదేశ డిజి టల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. మన సేవల రంగం, ముఖ్యంగా ఐటీ, ఐటీయేతర డొమైన్లలో ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంది. 300 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 100 యునికార్న్‌లను భారత్ కలిగి ఉండి, ప్రపంచంలోని మూడవ–అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యా వరణ వ్యవస్థగా నిలిచింది. ఈ ‘అమృత్ కాల్’ సందర్భంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ను రూపొందించడానికి స్వామి వివేకా నంద బోధనలను ఉపయోగించుకుందాం! - వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
హైదరాబాద్ లో మొదటి సారి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరుగుతుంది
-
‘స్వామి వివేకానంద తొలి శంఖారావం హైదరాబాద్‌లోనే’
హైదరాబాద్: స్వామి వివేకానంద తొలి శంఖారావం మన భాగ్యనగరంలోనేనని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. స్వామి వివేకానంద తన జీవితంలో ఓ బహిరంగసభను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించింది భాగ్యనగరంలోనే అని కొద్దిమందికి మాత్రమే తెలుసని చెప్పారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ లో జరిగిన 'వివేకానంద డే' కార్యక్రమంలో భాగంగా యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించిన స్వామి వివేకానంద ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారని స్వామి బోధమయానంద చెప్పారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరయ్యారని ఆయన చెప్పారు. ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ నాడు సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారని చెప్పారు. హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి స్వామి వివేకానంద వివరించారని తెలిపారు. భారత దేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారని, భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు వివేకానంద స్పష్టం చేశారని బోధయమానంద తెలిపారు. అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారని ఆయన గుర్తుచేశారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం, భాష కోరల్లో చిక్కుకోవద్దని రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద యువతను హెచ్చరించారు. వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ లాంగ్వేజెస్, డైరెక్టర్ స్వామి శితికంఠానంద మాట్లాడుతూ స్వామి వివేకానంద సూక్తులు ఆంగ్ల భాషా మంత్రాలని అభివర్ణించారు. యువత వివేకానందుడి బోధనలతో స్ఫూర్తి పొందాలని సూచించారు. రామకృష్ణ ప్రభ సంపాదకులు స్వామి పరిజ్ఞేయానంద మాట్లాడుతూ ఫిబ్రవరి 13 'వివేకానంద డే' ప్రాధాన్యత గురించి సమాజంలో మరింత అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత మీడియాదేనని చెప్పారు. మహబూబ్ కాలేజీ అధ్యక్షులు పి. ఎల్ . శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి 'వివేకానంద డే' వేడుకల్లో వేలాదిమంది పాల్గొనేలా చేస్తానన్నారు. కార్యక్రమంలో మహబూబ్ కాలేజీ ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, కార్యదర్శి భగవత్ వారణాసి, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అధ్యాపకులు, వాలంటీర్లు, పాల్గొన్నారు. కార్యక్రమానికి వాలంటీర్ నారాయణ రావు సమన్వయకర్తగా వ్యవహరించారు. -
ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దం: ప్రధాని మోదీ
హుబ్బళ్లి: మన దేశాన్ని ముందుకు నడిపించే చోదక శక్తి యువశక్తేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక ప్రగతి యువతరానికి ఎన్నో గొప్ప అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గురువారం కర్ణాటకలోని హుబ్బళ్లిలో రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్ నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బొమ్మల తయారీ నుంచి పర్యాటకం దాకా, రక్షణ నుంచి డిజిటల్ దాకా ఎన్నో అంశాల్లో మనదేశం ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తోందని, వార్తల్లో నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దమని ప్రపంచమంతా ముక్తకంఠంతో అంగీకరిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇది మన శతాబ్దం, భారతదేశ యువతకు చెందిన శతాబ్దమని పేర్కొన్నారు. చరిత్రలో ఇదొక ప్రత్యేక సందర్భమని అన్నారు. ఇప్పటి యువతరం ప్రత్యేక తరమని తెలిపారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాల్సిన బాధ్యత యువతపై ఉందని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్‌ను అత్యంత ప్రభావవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి యువతరం నడుం బిగించాలని సూచించారు. మోదీ రోడ్డు షో ప్రధాని మోదీ గురువారం హుబ్బళ్లిలో రోడ్డు షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి ఆయనకు అభివాదం చేశారు. మోదీ, మోదీ.. భారత్‌మాతా కీ జై అంటూ బిగ్గరగా నినదించారు. మోదీ వాహన శ్రేణిపై పూలు చల్లుతూ తమ అభిమానం చాటుకున్నారు. మోదీ సైతం చేతులు ఊపుతూ ఉత్సాహంగా ప్రజలకు అభివాదం చేశారు. మోదీ రోడ్డు షోలో యువకుడి కలకలం -
‘ఆయన రచనలు చదవడంతో.. వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’
‘ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న వివేకానంద అనే ఆ మహ నీయుని చిత్తరువు ఎప్పటికీ చెరిగిపోదు’ అన్నారు ఓ రష్యన్ చింతనాశీలి. జీవితంలో సమస్యలనేవి ప్రతీ వ్యక్తికీ ఉండేవే. ఆ వ్యక్తి విద్యార్థి కావచ్చు, కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, గృహిణి కావచ్చు, మరెవరైనా కావచ్చు. సమస్యలనేవి సర్వసాధారణమైతే, సమ స్యను అవగాహన చేసుకొనే ప్రయత్నం చేయడానికి కావలసిన సామర్థ్యం పెంచుకుంటే సమస్యలు పరిష్కరించడం పెద్ద విశేషం కాదని వివేకానందుడు అన్న మాటలు సదా స్మరణీయం. ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి చెప్పిన వాక్యాలు విన్నా ఆలోచింపజేస్తాయి. కాని స్వామి వివేకానందుడు చెప్పిన అమృత వాక్యాలు మాత్రం యువతను ప్రేరేపించి, ఆచరింపజేస్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల ఆదర్శాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాని ఆ ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యక్తి ఆదర్శాన్ని స్వీకరించి గొప్ప నేతలుగా ఎదగవచ్చనేది మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్‌లు నిరూపించారు. ఆ ఒక్క వ్యక్తి వివేకానందుడే నని వేరే చెప్పనవసరం లేదు. గాంధీజీ, బోస్బాబులు విభిన్న వ్యక్తిత్వాలు, భిన్న ఆదర్శాలు కలిగి ఉన్నవారని చరిత్రకారుల వాదనల సారాంశం. ‘నేను స్వామి వివేకానందుడి రచనలు చదవడం ద్వారా నాలో వెయ్యి రెట్లు దేశ భక్తి పెరిగింది’ అని గాంధీజీ అంటే... సుభాష్ చంద్రబోస్ ‘స్వామి వివేకానందుని రచనలు చదువుతుంటే నా ఒంట్లో రక్తం ఉప్పొంగుతుంది కదా! ఆయనను విన్నవారు ఇంక ఎంత అనుభూతిని పొంది ఉంటారో? ఆయన బ్రతికి ఉన్నట్లయితే పాదాల చెంత కూర్చొని ఆయన ఏమి చెబితే అది చేసేవాణ్ణి’ అన్నారు. ఈ మహానేతలు వివేకానందుని మాటలకు ఎంతగా ప్రభావితులు అయ్యారో ఈ మాటలే తెలియజేస్తాయి. ఇవ్వాళ దేశానికి కావలసింది ఇలాంటి ప్రభావ వంతమైన స్ఫూర్తి ప్రదాతలే. విద్య పట్ల వివేకానందుని అభిప్రాయాలు అత్యున్నతమైనవి. విద్యా వ్యవస్థను ఆయన భావాలకు అనుగుణంగా రూపొందించగలిగితే కాబోయే భారత పౌరులందరూ జాతి రత్నాలుగానే భాసిస్తారు. అప్పుడు తాము పుట్టిన ఊరినే కాదు, దేశాన్నీ, ప్రపంచాన్నీ ఉద్దరించగల మహానుభావులు ప్రపంచానికి అందుతారు. (క్లిక్ చేయండి: ఆదివాసుల హృదయ దీపాలు) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనవరి 12 వివేకానందుని జయంతి, జాతీయ యువజన దినోత్సవం) -
క్లాస్‌రూమ్‌లో ఆనంద్ మహీంద్రా.. అదీ వెనుక బెంచీలో.. కారణం ఏంటంటే ?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పౌర సమాజంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. అనేక అంశాలపై ప్రజలతో చర్చిస్తుంటారు. తాజాగా జాతీయ యువజన దినోత్సం సందర్భంగా ఆయన చేసిన పోస్ట్.. క్లాస్రూమ్ బాతఖానికి వేదికైంది. స్వామి వివేకనంద జయంతి రోజైన జనవరి 12న క్లాస్‌రూమ్‌లో వెనుక బెంచిలో కూర్చుని ఉన్న ఫోటోను ఆనంద్మహీంద్రా షేర్ చేశారు. ఎప్పుడైన తనకు ఎనర్జీ లెవల్స్ తగ్గినప్పుడు రీఛార్జ్ కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్తుంటానంటూ ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో ఆనంద్ మహీంద్రాని చూసిన నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. Backbenchers always have the widest possible view of the class—and the Universe! 😊 https://t.co/u7uPBbwi38 — anand mahindra (@anandmahindra) January 12, 2022 క్లాస్‌లో మీరు బ్యాక్‌బెంచీ స్టూడెంటా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా బ్యాక్ బెంచీలో కూర్చుంటే క్లాస్రూమ్ మొత్తాన్ని చూసే వీలుంటుంది. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా అంటూ చమత్కారంగా బదులిచ్చారు ఆనంద్మహీంద్రా. హిస్టరీ తనకు ఇష్టమైన సబ్జెక్టని పాత అనుభవాల నుంచే కొత్తగా అడుగులు వేయోచ్చంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. History. And for those who will retort that they don’t like living in the past, I say that you can’t invent the future without learning lessons from the past… https://t.co/NJ1gvAzama — anand mahindra (@anandmahindra) January 12, 2022 -
వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం జగన్ యువతకు శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం.#NationalYouthDay — YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2022 -
నారీ యువ శక్తి గెలుస్తుంది
‘లే.. మేలుకో... లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించకు’ అన్నారు స్వామి వివేకానంద. ‘వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం’ అన్నాడాయన. మన దేశంలో 15–25 ఏళ్ల మధ్య యువత 20 కోట్లు. వీరిలో 10 కోట్ల మంది యువతులు. ఇంటర్ వయసు నుంచి ఉద్యోగ వయసు మీదుగా వివాహ వయసు వరకు అమ్మాయిలకు ఎన్నో సవాళ్లు. వివక్షలు. ప్రతికూలతలు. కాని నారీ యువశక్తి వీటిని ఛేదించి ముందుకు సాగుతోంది. జనవరి 12– స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే ‘జాతీయ యువజన దినోత్సవం’ యువతులకు స్ఫూర్తినివ్వాలి. మార్గం చూపాలి. అంతరిక్షాన్ని చుంబించాలనుకున్న ఒక తెలుగు యువతి ఆ ఘనతను సాధించడం చూశాం. ఇంటి నుంచి బస్టాప్ వరకూ వెళ్లి కాలేజీ బస్సెక్కడానికి పోకిరీల బెడదను ఎదుర్కొంటున్న యువతి నిస్సహాయతను కూడా చూస్తున్నాం. ఇద్దరూ యువతులే. ఒకరు సాధిస్తున్నారు. మరొకరు సాధించడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు బిందువుల మధ్యే భారతీయ టీనేజ్ అమ్మాయిలు, యువతులు తమ గమనాన్ని కొనసాగిస్తున్నారు. ‘కెరటం నాకు ఆదర్శం లేచినా పడినందుకు కాదు... పడినా లేచినందుకు’ అంటారు స్వామి వివేకానంద. గత మూడు నాలుగు దశాబ్దాలలో భారతీయ యువతులు పడినా లేచే ఈ సంకల్పాన్నే ప్రదర్శిస్తున్నారు. బాల్య వివాహాలను నిరాకరిస్తున్నారు. చదువు వైపు మొగ్గుతున్నారు. ఆ తర్వాత ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితి మధ్యతరగతి, ఆ పై తరగతుల్లో ఎక్కువగా ఉంటే దిగువ, పేద వర్గాలలో సంఘర్షణ కొనసాగించాల్సి వస్తోంది. దేశంలో ఇంకా చాలాచోట్ల సరైన టాయిలెట్లు లేని బడులు, సురక్షితం కాని రహదారులు, శానిటరీ నాప్కిన్లు అందుబాటులో లేని పరిస్థితులు ఆడపిల్లలను స్కూల్ విద్యకు దూరం చేస్తున్నాయి. కాలేజీ వయసులోకి రాగానే తల్లిదండ్రులు తమ అమ్మాయి ‘ఎటువంటి ప్రభావాలకు లోనవుతుందో’ అనే భయంతో పెళ్లి చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాని నేటి యువతులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసైనా సరే ముందు మేము నిలదొక్కుకోవాలి... తర్వాతే వివాహం వైపు రావాలి అని చాలాచోట్ల గట్టిగా గొంతు విప్పగలుగుతున్నారు. ‘నీ వెనుక ఏముంది... ముందు ఏముంది నీకనవసరం... నీలో ఏముంది అనేది ముఖ్యం’ అన్నారు వివేకానంద. ఇవాళ యంగ్ అడల్ట్స్లోగాని, యువతులలోగాని ఉండాల్సింది ఈ భావనే. ముందు తమను తాము తెలుసుకోవాలి. ఆ సంగతి తల్లిదండ్రులకు తెలియచేయాలి. ఆ తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. దానిని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాని నేటి సమస్య ఏమిటంటే యువతులకు తాము ఏమిటో తెలిసినా తల్లిదండ్రుల ఆకాంక్షలకు తల వొంచాల్సి వస్తోంది. మరోవైపు వారి మీద అటెన్షన్, నిఘా, వేయి కళ్ల కాపలా... ఇవన్నీ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ‘అదొద్దు ఇది చెయ్’ అని అమ్మాయికి చెప్పినంత సులువుగా అబ్బాయికి చెప్పలేని పరిస్థితి నేటికీ ఉందన్నది వాస్తవం. దాంతో పాటు తల్లిదండ్రులు, చుట్టాలు, సమాజం ఆడపిల్లల విషయంలో వారు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉండాలన్న అంచనా వారిని బాధిస్తోంది. కాని వారికి ఇంట్లో, విద్యాలయాల్లో సరైన దిశ దొరికితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. ఇవాళ టెక్నికల్ విద్యలో, మెడిసిన్‌లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఎంచుకుని మరీ ర్యాంకులు సాధిస్తున్నారు. మరోవైపు మేనేజ్మెంట్ రంగాల్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యువతులు రాణిస్తున్నారు. కళారంగాలను ఎంచుకుంటున్నారు. సినిమా రంగ దర్శకత్వ శాఖలో గతంలో యువతులు కనిపించేవారు కాదు. ఇవాళ చాలామంది పని చేస్తున్నారు. విదేశాలకు వెళ్లి చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి వారి దగ్గర పుష్కలంగా ప్రతిభ ఉంది. మనం చేయవలసిందల్లా వారు కనుగొన్న మార్గంలో వారిని వెళ్లనివ్వడమే. ‘జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే విజేత అవుతావు. ఓడితే ఆ అనుభవంతో దారి చూపగలుగుతావు’ అన్నారు వివేకానంద. ‘ఆడపిల్ల... రిస్క్ ఎందుకు’ అనే మాట గతంలో ఉండేది. ఇవాళ కూడా ఉంది కాని ఎందరో యువతులు ఇవాళ పోలీస్, రక్షణ దళాలలో పని చేస్తున్నారు. విమానాలు, హెలికాప్టర్లు ఎగరేస్తున్నారు. యుద్ధ ఓడలు నడుపుతున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగుతూ ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాల్సి ఉంది. పర్వతారోహకులుగా, సోలో ట్రావెలర్సుగా, హెవీ వెహికిల్స్ డ్రైవర్లుగా, ప్రమాదకరమైన అసైన్మెంట్లు చేసే జర్నలిస్టులుగా ఇలా నేటి యువతులు అద్భుతాలు సాధిస్తున్నారు. యుద్ధ ట్యాంకర్లు మోగుతున్న చోట నిలబడి వారు రిపోర్టింగ్ చేసే సన్నివేశాలు స్ఫూర్తినిస్తున్నాయి. స్వామి వివేకానంద ఆశించిన యువత ఇదే. ఇలాంటి యువతకు సమాజం, కుటుంబం దన్నుగా నిలవడమే చేయాల్సింది. ‘మనం ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు’ అన్నారు వివేకానంద. స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణం కుటుంబ నిర్మాణం అవుతుంది. తద్వారా సమాజ నిర్మాణం అవుతుంది. ఆపై దేశ నిర్మాణం అవుతుంది. నేటి యువతులు కేవలం విద్య, ఉపాధి రంగాలలో రాణించడం కాకుండా ప్రపంచ పరిజ్ఞానం కలిగి, సామాజిక పరిణామాలు గమనిస్తూ, పాటించవలసిన విలువలను సాధన చేస్తూ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. నాయకత్వం వహించడానికి ముందుకు రావాలి. చట్ట సభలలో కూచునే శక్తి సామర్థ్యాలు పుణికి పుచ్చుకోవాలి. యువశక్తి దేశాన్ని నడిపించాలి. కాని నేటి సోషల్ మీడియా వారిని విపరీతంగా కాలహరణం చేయిస్తోంది. ‘హ్యాపెనింగ్’గా ఉండమని ఛోటోమోటా సరదాలకు ఆకర్షిస్తోంది. మిగిలినవారిని ఇమిటేట్ చేయమంటోంది. అలా ఉండాలేమోనని కొంతమంది యువతులు డిప్రెషన్లోకి వెళ్లాల్సి వస్తోంది. ‘మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులుగా భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు’ అన్నారు వివేకానంద. నేటి యువ మహిళా శక్తి ఈ మాటను తప్పక గుర్తు పెట్టుకుని ముందుకు సాగాలి. మరిన్ని విజయాలు సాధించాలి. మొదటి అడుగులోనే... సక్సెస్ అయ్యాక సొసైటీ నుంచి పొగడ్తలు వస్తాయి. అదే, ముందే ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. నేను, నా బిజినెస్ పార్టనర్ శ్రుతి బీటెక్‌లో స్నేహితులం. ఇద్దరం కలిసి ‘మాయాబజార్’ అని ఫొటోషూట్ స్టూడియోను ప్రారంభించాం. మేం ప్రారంభించినప్పుడు ఈ బిజినెస్‌లో పెద్దగా పోటీ లేదు. ఇప్పుడు మేం సక్సెస్ అయ్యాం. అందరూ వచ్చి అమ్మాయిలు ఇంత బాగా చేశారు. ఎంత కష్టపడ్డారు... అని అంటుంటారు. కానీ, దీని ప్రారంభంలో మేం పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మా ఇద్దరి అమ్మానాన్నలు నమ్మారు. డబ్బుల విషయం ఒక్కటే కాదు. అమ్మాయిలు సొంతంగా ఏదైనా పని చేయాలనుకుంటే అందుకు చుట్టుపక్కల అంతా మంచి మద్దతు లభించాలి. మా టెక్నిషియన్స్, వర్కర్స్.. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ, మొదట్లో లేదు.‘వీళ్లు అమ్మాయిలు కదా ఏం చేస్తారు?’ అనే ఆలోచన ఉంది. మమ్మల్నే నేరుగా అనేవారు. డబ్బులు పెట్టినా సరే, దాదాపు పదిమందిని అడిగితే ఒకరు ముందుకు వచ్చేవారు. హార్డ్‌వర్క్ చేయడానికి అమ్మాయిలు ముందుకు వచ్చినప్పుడు సమాజం నుంచి ‘మీరు అమ్మాయిలు కదా! ఎందుకు మీకు కష్టం..’ అనే అభిప్రాయం వస్తుంది. మొదటి వ్యక్తి నుంచే సరైన రెస్పాన్స్ వస్తే.. అమ్మాయిలు సొంతంగా ఎదగడానికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. – అనూష, శ్రుతి ‘అమ్మాయి కదా’ అని... అమ్మాయిలు వర్కర్స్‌తో పనిచేయించాలన్నా, ఆర్డర్స్ తీసుకునేటప్పుడు, పేమెంట్ తిరిగి రాబట్టుకోవడానికి.. అన్ని విధాల రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘అమ్మాయి కదా, ఏం కాదులే! అని తేలికగా తీసుకుంటారు. సింగిల్‌గా ఎదగాలంటే అబ్బాయిలకు ఉన్నంత సపోర్ట్ ఈ సొసైటీలో అమ్మాయిలకు లేదు. అందుకే ప్రతిభ ఆధారంగానే నా పనితనాన్ని చూపుతాను. మార్కెట్‌ను బట్టి 3–4 ఛాయిస్‌లు వినియోగదారులకు ఇస్తాను. ఇంటీరియర్‌లో అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ ఏ వస్తువును ఎలా సర్దుకోవాలో అమ్మాయిలకే బాగా తెలుసు. ఆ విధంగా కూడా నా వర్క్‌ను చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో మా కుటుంబం నుంచి సపోర్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్వైజర్ ద్వారా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో ‘నేను అమ్మాయిని’ కాదు, నా పనిని ఒక వృత్తిగా భావించండి అని చెప్పుకోవాల్సి రావడం బాధగా ఉంటుంది.ఈ విధానంలో మార్పు అవసరం. – కాత్యాయని, ఇంటీరియర్ డిజైనర్ -
యువత చేతుల్లో దేశ భవిష్యత్: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని భారతదేశ యువత శాసిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన విశాఖ నగరంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, కేకే రాజు, మళ్ల విజయ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని ఎప్పుడో వివేకానంద చెప్పారన్నారు. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ) (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) -
మలిసంధ్యలో జీవనసమరం
ఆటుపోట్లు తట్టుకుని.. ఎదురుదెబ్బలు కాచుకుని ముదిమిలోనూ జీవన సమరం.నలుగురికీ ఆదర్శంగా శ్రమైక జీవనం.. నేటికీ నవ యువకుల్లా పనుల్లో నిమగ్నం. నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మలిసంధ్యలో ఉదయరాగాలు పంచుతున్న అవిశ్రాంత శ్రామికుల జీవన పరిచయం.. నేటి యువత కోసం.. టైలర్ రామయ్య కుట్టుమిషన్‌ను టకటకలాడిస్తూ బట్టలు కుడుతున్న ఈయన పేరు సంగ నర్సింహరాములు (80). వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో శ్రీరామ్ టైలర్స్ అంటే ఒకప్పుడు చాలా ఫేమస్. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి తదితరులు ఈయనకు రెగ్యులర్ కస్టమర్స్. కొందరు ప్రముఖులు ఈయనను హైదరాబాద్ తీసుకెళ్లి ఈయన ద్వారానే మంచి బట్టలు కొని మరీ కుట్టించుకునేవారు. ఈ వృత్తి మీదనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేశాడు. పదహారేళ్లకే కుట్టుమిషన్ ఎక్కిన ఈయన భార్య మృతితో కొంతకాలం వృత్తికి దూరమయ్యాడు. కొడుకుల వద్ద ఉన్నా.. కూర్చుని తినడానికి మనసొప్పలేదు. అదిగో.. అప్పట్నుంచీ ఇలా.. ఓ డబ్బా పెట్టుకుని వృత్తిని కొనసాగిస్తూ చేతనైనంత సంపాదిస్తున్నాడు. ఇప్పటోళ్లు ఫారం కోళ్ల లెక్కుండ్రు చేతికి ఊతకర్ర.. భుజాన సంచితో కూరగాయలు అమ్మడానికి ఉదయం ఐదు గంటలకే నూట ఐదేళ్ల (105) కంచం బాలవ్వ బయల్దేరింది. తాను కొని తెచ్చుకున్న కూరగాయలను దుబ్బాక పట్టణంలో దాదాపు మూడు గంటల పాటు ఇంటింటికీ తిరిగి అమ్మింది. దారిలో ఎదురుపడిన ఓ పరిచయస్తురాలు ‘ఏం అవ్వా.. ఇంట్లో కూసోరాదే..’ అంటే.. ‘పాలపండ్లొచ్చినయ్ సూడు.. నేను పెద్దదాన్నెట్లయిత?’ అంటూ హాస్యమాడింది. ఆమెను పలకరిస్తే.. ‘ముగ్గురు బిడ్డలు, కొడుకు. ఎవరి పని వారిది. ఖాళీగా ఉండబట్టలేక ఈ పనిసేత్తున్న.. నా ఖర్చులు పోను బిడ్డలకూ ఇంత ఇస్తా..’ అని ఉత్సాహంగా చెప్పింది. బాలవ్వ శనివారం మాత్రం అంగడి వేస్తుంది. మీరు చూస్తున్న పై చిత్రం అదే. ‘దుబ్బాకలో అందరికంటే పెద్దదాన్ని నేనే. ఇప్పటోళ్లు మెత్తటి మనుషులు. ఫారం కోళ్ల లెక్కుండ్రు’ అంటున్న బాలవ్వలో అలుపనేదే లేదు. అప్పు తీర్చేందుకని.. 80 ఏళ్ల ఉప్పలమ్మ వరంగల్ అర్బన్ జిల్లా ఉర్సు, కరీమాబాద్‌లోని వాడవాడలా అడుగులో అడుగేసి తిరుగుతూ నిత్యం చీపురుకట్టలు అమ్ముతుంటుంది. భర్త, కుమారుడు చిన్న వయసులోనే చనిపోగా, ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసింది. పక్షవాతం రాగా, బిడ్డలకు భారం కాకూడదని రూ.25 వేలు అప్పుచేసి వైద్యం చేయించుకుంది. ఆ అప్పు తీర్చేందుకు ఇలా చీపుర్లు అమ్ముతోంది. అడిగితే అమ్మానాన్న డబ్బులివ్వలేదని, చిన్న అప్పుకే ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో ఉప్పలమ్మను చూస్తే ఎలా నిలబడాలో తెలుస్తుంది కదా!. మగ్గం ముంగిట ‘ముత్యం’ ఉత్సాహంగా మగ్గం నేస్తున్న ఈయన పేరు భోగ ముత్యాలు. ఐదో తరగతిలోనే చదువు మానేశాడు. పదమూడేళ్లప్పుడు పట్టుకున్న మగ్గాన్ని నేటికీ వదల్లేదు. ఇప్పుడు వయసు 86. రేడియోలో పాత పాటలింటూ ఇప్పటికీ రోజూ 7 –8 గంటలు పనిచేస్తాడు. 2 నెలల్లో వార్పు (8 చీరలు) నేసి పదివేలు సంపాదిస్తాడు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా.. ‘ఎవరిపై ఆధారపడటం ఇష్టంలేదు. ఒంట్లో సత్తువుంది. వచ్చిన పని చేసుకుంటున్న. నేను సంపాదించేది నాకు, నా ఇంటావిడకు సరిపోతుంది’ అని చెప్పాడు. ‘సాగు’నంత కాలం చేస్తా.. పొలం పనుల్లో ఉన్న ఈ రైతు పేరు కట్కూరి మల్లారెడ్డి. కరీంనగర్ జిల్లా రామంచకు చెందిన ఈ యన వయసు డెబ్బై పైమాటే. పదేళ్లకే అరకపట్టాడు. పిల్లలు పెళ్లయి వేర్వేరుచోట్ల ఉం టున్నారు. ఈయన మాత్రం సొంతూరి ని, సేద్యాన్ని వీడలేదు. ఏ పనైనా తానే చేసుకుంటాడు. ఇంటి పక్కనే ఎకరన్నర, 2 కి.మీ.దూరంలో రెండెకరాలు ఉన్నాయి. అక్కడికీ ఇక్కడి కీ కాలినడకన రోజుకు రెండు మూడుసార్లు తిరుగుతాడు. ‘ఇష్టమైన పని సా గినంత కాలం చేస్తా’ అన్నాడు. మట్టిమనిషి మల్లవ్వ పారపట్టి గట్లు చదునుచేస్తున్న ఈ అవ్వ పేరు సిరివెల్ల మల్లవ్వ. 80 ఏళ్ల వయసులోనూ రెక్కల కష్టం చేస్తున్న ఈమెకు ముగ్గురు కుమారులు. భర్త, ఇద్దరు కుమారులు చనిపోయారు. మిగిలిన ఒక్క కొడుకు మంచానపడ్డాడు. దీంతో అన్నీతానై తన 20 గుంటల పొలంలో సేద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఈమె ‘భర్త పోయినంక అంతా తలకిందులయ్యె. కొడుకు కోసం తప్ప దు కదా’ అంటూ పనిలో నిమగ్నమైంది. ఎనిమిది పదుల యువకుడు మొక్కలకు పాదులు తీస్తున్న ఈ యన బుర్ర పెద్దనర్సింహ. వయ సు 83. యాదాద్రి జిల్లా కక్కిరేణికి చెందిన ఈయన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి.. కొడుకులకు మూడెకరాలను రాసిచ్చేశాడు. భార్య దుర్గమ్మతో కలిసి వేరుగా ఉంటూ.. శ్రమతో జీవితాన్నినెట్టుకొస్తున్నాడు. ఎందుకింత కష్టమని అడిగితే,‘పదేళ్లప్ప టి నుంచే ఆసాముల దగ్గర జీతాలుండి గంజి, గటుక తిని బతికా. పని చేసే సత్తువుంది. ఖాళీగా కూర్చుంటే ఎలా..’ అన్నాడు. బందెల్లి చాయ్.. సూపర్ భాయ్ చాయ్ తయారీలో నిమగ్నమైన ఈ యన పేరు పక్కిరి బందెల్లి (79). సంగారెడ్డి జిల్లా తాటిపల్లిలో 50 ఏళ్లుగా టీ దుకాణం నడుపుతున్నాడు. ఆరుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు. వీరితోపాటు ఇద్ద రు మనవలు, ఇద్దరు మనవరాళ్ల్ల పెళ్లి ళ్లు సైతం చాయ్ దుకాణంపై వచ్చిన డబ్బులతోనే చేశాడు. వారి పిల్లలనూ తానే చదివిస్తున్నాడు. మొదట్లో ఏడు పైసలకు చాయ్ అమ్మేవాడు. తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 9 వరకు దుకాణం నడుపుతాడు. భార్య, చిన్న కుమారుడు ఇస్మాయిల్ చేదోడువాదోడుగా ఉంటున్నారు. ‘అప్పట్ల ఏడు పైసలంటేనే గొప్ప.. పదేండ్ల నుంచి పట్నపోల్లు వచ్చి రకరకాల చాయ్‌లు అడుగుతున్నరు.. వాటిని చేసిస్తున్నా.. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పనిచేస్తా’ అని బందెల్లి అంటున్నాడు. ‘తాడి’ని తలదన్నుతా.. ఆకాశాన్నంటినట్టున్న తాడిచెట్టును అవలీలగా ఎక్కేస్తున్న ఈయన పేరు రాములు. వయసు 78. ‘ముదిమి మీదపడింది కదాని ముడుచుకుని కూచుంటామా?. కొడుకులు వద్దంటరు. కానీ ఉత్తగా కూసుని తినలేక నాకొచ్చిన పని చేత్తున్న. పిల్లలందరికీ పెళ్లిళ్లయినయి. మనవలు, మనవరాళ్లున్నరు. కులవృత్తిపై మమకారంతోనే ఇదంతా..ఇప్పటికీ నా సంతానంపై ఆధారపడి లేను. కల్లు అమ్మితే రోజుకు రూ.300 వస్తాయి. అవి చాలు’ అని చెప్పాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్మలాపురానికి చెందిన ఈయన. ‘రాములు ఏ కాలంలోనైనా, అదీ చాలా ఎత్తున్న తాడిచెట్లనైనా ఇట్టే ఎక్కేస్తాడ’ని అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు చెప్పారు. -
నైపుణ్యం అన్నది ప్రత్యేకమైనది
-
యువతకు రోల్ మోడల్ ఆయన..
-
యువతకు రోల్ మోడల్ ఆయన..
భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన మొఖం , గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశ భక్తికి నిలువెత్తు రూపం ..ఆయనే స్వామి వివేకానంద .కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. యువతకు రోల్ మోడల్. స్పూర్తి సందేశాలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త. కేవలం ముప్పై తొమ్మిది సంవత్పరాలు మాత్రమే ఈ భూమ్మీద నడయాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా, స్పూర్తిప్రదాతగా వెలుగొందుతున్నారు. అందుకే ఆయన పుట్టినరోజైన జనవరి 12 ను నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. -
సత్యమే నా దైవం విశ్వమే నా దేశం
‘నీ ధర్మం ఏదైనా కావచ్చు. కాని దాని పట్ల సత్యవర్తనతో మెలుగు’ అని బోధించినవాడు వివేకానంద. భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింప చేయడంలో ఆయన దాదాపు ఒక ప్రవక్త వలే కృషి చేశాడు. ముఖ్యంగా యువశక్తిని చైతన్యపరచాలని కోరుకున్నాడు. ప్రతి ఒక్కరికీ ఆలోచన అవసరమన్నాడు. సంకుచితాల సరిహద్దులను, క్రతువులను నిరసించాడు. నేడు ఆయన జయంతి. భిన్న సందర్భాలలో ఆయన మాట్లాడిన మాటలు కొన్ని... కష్టాలతోను, యాతనలతోను నిండిపోయిన జీవితం గుండా నేను ఈడ్వబడ్డాను. నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు దాదాపు పస్తులతో మరణించడం కళ్లారా చూశాను. నేను అవహేళనకు, విశ్వాస రాహిత్యానికి గురయ్యాను. నన్ను ఎవరు ఏవగించుకున్నారో, అపహాస్యం చేశారో వారి పట్ల సానుభూతి చూపినందున బాధలకు గురయ్యాను. నేను ముక్తినీ లేదా భక్తినీ ఖాతరు చేయను. నూరువేల నరకాలకైనా పోవడానిని నేను సిద్ధంగా వున్నాను. వసంతంలా నిశ్శబ్దంగా పరహితం ఆశిస్తాను. ఇదే నా మతం. జనం శ్రీరామకృష్ణుల పేరును అంగీకరించినా లేక అంగీకరించకపోయినా నేను పట్టించుకోను. కాని ఆయన బోధనలు, జీవితం సందేశం లోకమంతటా వ్యాప్తి చేయడానికి నా ప్రాణాలను అర్పించడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను. అవును, ఒక మహాత్ముని ఉత్సాహ ప్రోత్సాహకాల వల్లనే నా జీవిత మార్గనిర్దేశనం జరిగింది. నాకు శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణ కల్పించారన్న నిజాన్ని నేను నమ్ముతున్నాను. అయితే నాకుగా నేను స్ఫూర్తిని పొందాను కూడా. నా జీవిత లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. స్వదేశ స్వమత దురభిమానంతో నాకు సంబంధం లేదు. నేను భారత దేశానికి ఎంత చెందుతానో, ప్రపంచానికి కూడా అంతే చెందుతాను... ఏ దేశానికి నా మీద ప్రత్యేకమైన హక్కు ఉంది? ఏ దేశానికైనా నేను బానిసనా? మానవశక్తి కన్నా, దైవశక్తి కన్నా, అనురక్తి కన్నా మహత్తరమైన శక్తి నాకు అండగా ఉన్నట్లు ప్రత్యక్షంగా గోచరిస్తోంది. పిరికితనం అంటే నాకు పరమ రోత. సత్యమే నా దైవం. విశ్వమే నా దేశం. ఆశించడమే పరమ దుఃఖం, ఆశించకపోవడమే పరమ సుఖం. కోరికలు పూర్తిగా త్యజించి, నిశ్చింతగా ఉండాలి. మిత్రులు, శత్రువులు అనేవారు లేకుండా ఏకాకిగా జీవించాలి. ఆ విధంగా శత్రుమిత్రులు, సుఖదుఃఖాలు, రాగద్వేషాలు లేకుండా, జీవాలను హింసించక ఏ జీవహింసకూ కారకులు కాకుండా, ఒక పర్వతం నుండి మరొక పర్వతానికి, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి భగవన్నామాన్ని ప్రబోధిస్తూ మనం పర్యటించాలి. సంపదలో దారిద్య్ర భయం ఉంది. జ్ఞానంలో అజ్ఞాన భయం ఉంది. సౌందర్యంలో వృద్ధాప్య భయం ఉంది. కీర్తిలో చాటునిందల భయం ఉంది. శరీర విషయంలో సైతం మృత్యు భయం ఉంది. లోకంలో సమస్తమూ భయంతో కూడుకొని ఉంది. వైరాగ్యం ఒక్కటే భయం లేనిది. నాలో ఎన్ని తప్పిదాలున్నా, కొంత సాహసం కూడా ఉందని భావిస్తాను. నాకు అవరోధాలు కల్పించడానికి, నా పురోగతిని వ్యతిరేకించానికి, వీలైతే నన్ను రూపుమాపడానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. భగవదనుగ్రహం వల్ల అన్నీ వ్యర్థమయ్యాయి. అటువంటి ప్రయత్నాలు వైఫల్యం చెందటం సహజమే. గడచిన మూడేళ్ల నుండి కొన్ని అపార్థాలు చోటుచేసుకుంటూ వచ్చాయి. నేను విదేశాల్లో ఉన్నంత కాలం ఈ విషయంగా ఒక్క మాట కూడా పలుకక మౌనం పాటించాను. ఇప్పుడు నా మాతృభూమిపై నిలబడి కొంత వివరణ చెప్పగోరుతున్నాను. నా మాటల వల్ల మీలో ఎటువంటి స్పందన కలిగించగలనో అనే కౌతుకంతోనూ కాదు. నేను ఇటువంటి వాటిని లక్షించేవాణ్ని కాను.ఎందుకంటారా? నాలుగేళ్ల కిత్రం దండ కమండలాలను మాత్రం చేతబూని, మీ నగరంలో ప్రవేశించిన ఆనాటి సన్యాసినే ఇప్పుడూను..! నా భవిష్యత్తు ఆశంతా సౌశీల్యురైన యువకుల మీదనే ఉంది. వాళ్లు బుద్ధికుశలురు, సర్వస్వాన్ని ఇతరుల సేవకై పరిత్యజించే వ్యక్తులుగా ఉండాలి. నా భావాలనుకార్యరూపంలోకి తేవడానికి తమ జీవితాలను త్యాగం చేసి తద్వారా తమకూ, దేశానికీ సౌభాగ్యం చేకూర్చేది ఈ యువకులే. నచికేతుని వంటి శ్రద్ధావంతులైన పది పన్నెండు మంది యువకులు నాకు లభిస్తే ఈ దేశప్రజల ఆలోచనలను, కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కించగలను. నాకు భగవంతుని పట్ల విశ్వాసం ఉంది, మనిషి పట్ల విశ్వాసం ఉంది. దుఃఖపూరితుల పట్ల విశ్వాసం ఉంది. ఇతరులను ఉద్ధరించటానికి నరకానికి పోవడంలో విశ్వాసం ఉంది. ఒక మనిషికి నిజంగా సహాయం లభిస్తుందంటే నేను నేరం చేసి శాశ్వత నరకవాసం అనుభవించడానికి కూడా సంశయించను. మనిషి గురించి నేను ప్రేమలో పడడం వల్ల మళ్లీ జన్మించవలసి ఉంటుంది. వితంతువు కన్నీరు తుడిచివేయలేని, అనాధ నోటికి పట్టెడన్నం అందించలేని భగవంతుని పట్ల గాని మతం పట్ల గాని నాకు విశ్వాసం లేదు. ఎటువంటి కర్మకాండలతోగాని అంధ విశ్వాసంతో గాని నాకు సంబంధం లేదు. మతమే సమస్తమనీ, సమస్తంలోనూ మతమే ఉందని చూపించడమే నా లక్ష్యం. ఆలోచించడం మనిషి స్వభావం. ఇదే అతడికీ, జంతువులకూ ఉన్న తారతమ్యం. నేను యుక్తి (ట్ఛ్చటౌn)లోనే విశ్వాసం ఉంచి దానినే అనుసరిస్తున్నాను. మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పనిచేయడ మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి సర్వత్రా ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను. – సేకరణ: వైజయంతి పురాణపండ -
ప్రశ్నను చిదిమే పన్నాగం!
ఈ దేశ యువత సామాజిక స్పృహతో మళ్లీ చైతన్యమౌతోందా? ఒకింత ఆశ కలుగు తోంది. రాజకీయ శక్తుల చేతుల్లో పావుగా మారి జారిపోతోందా? కాస్త భయం కలు గుతోంది. రెండు పార్శా్వల నడుమ ఏదో సంఘర్షణ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు నెలకొన్న వివాద పరి స్థితుల్లో యువతరం, ముఖ్యంగా విద్యార్థి లోకం నడక భిన్న వైఖరుల్ని వెల్లడి చేస్తోంది. ఏవో శక్తులు దూరం చేస్తున్న తమ భవిష్యత్తును, వెనక్కి లాక్కో వాలనే స్పృహ యువతలో కనిపిస్తోంది. ఈ మొగ్గు నిజంగా ప్రజా స్వామ్య పరిరక్షణ వైపు సాగితే, దేశ భవిష్యత్తు ఆశావహంగా ఉండటం ఖాయం! మరో రెండు రోజుల్లో జాతీయ యువజన దినో త్సవ (స్వామీ వివేకానంద జయంతి) వేడుకలకు అంతటా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘యువత రోజుకై నినాదం’ అన్నది ఈ యేటి (2020) అంశంగా నిర్ణయించారు. మరో పక్క దేశం వివిధ ప్రాంతాల్లో నిరసనోద్యమాలు, అసమ్మతి ప్రదర్శనల్లో యువత కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యువతకు నెలవైన పలు విశ్వవిద్యాలయాలు నిప్పురవ్వలై రగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) ప్రాంగణంలో చిందిన నెత్తుటి తడి ఇంకా ఆరనే లేదు. దాడి చేసిన ముష్కర మూకల ఆనవాళ్లున్నా దోషుల జోలికెవరూ వెళ్లటం లేదు! వెంటనే చర్యలు తీసుకోవాలనే ఆందోళనలు ఆగటం లేదు. సినీనటి దీపికా పడుకొనే ఈ దేశపు యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తారో లేదో గానీ, ఆమె ఆలోచనలు నేటి యువత మారుతున్న భావజాలానికి సంకేతం కాకుండా పోవు. జేఎన్‌యూలో విద్యార్థులు –టీచర్లపై దాడిని నిరసిస్తూ ఆమె సరాసరి విశ్వవిద్యాలయానికి వెళ్లి వారిని పరామర్శించడం దేశ వ్యాప్త చర్చకు తెరలేపింది. సగానికి పైగా జనాభా యువతరంతో నిండిన అతి పెద్ద దేశంగా ప్రపంచ పటంలో పతాకం ఎగురుతున్న కీర్తి మనది. వచ్చే ఒకటి, రెండు దశాబ్దాల్లో విశ్వవ్యాప్తంగా అత్యధిక పనివాళ్లున్న దేశంగా పీఠం మనకే దక్కనుంది. ఈ పరిస్థితుల్లో మన యువత ప్రస్తుత ఆలోచనా ధోరణి నిస్సందేహంగా భవిష్యత్తును శాసించేదే! అందుకే, ఈ దేశపు మేధావి వర్గమంతా యువత అడుగుల్ని, నడకని, గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తుకు భరోసా వెతు క్కుంటున్నారు. కొత్తగాలి దేనికి సంకేతం? పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ), జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఆందో ళనల విస్తృతి వారి ఆలోచనా దోరణిని ప్రతిబింబిస్తోంది. విశ్వవిద్యా లయాల్లోని సామాజిక శాస్త్రాల వారే కాక న్యాయ, వైద్య, ఇంజ నీరింగ్, ఎంబీయే వంటి వృత్తి కోర్సుల విద్యార్థులూ వీధుల్లోకొ చ్చారు. తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటూ కూడా స్పష్టమైన వైఖరినే వెల్లడిస్తున్నారు. రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూ, జామియా వంటి చైతన్యస్రవంతి సంగతి సరేసరి! అహ్మదాబాద్‌లోని ఐఐఎమ్ విద్యా ర్థులు చేతుల్లో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని సామూహికంగా ‘రాజ్యాంగ పీఠిక’ బహిరంగ పఠనకు సిద్ధమయ్యారు. మరో రోజు, పోలీసు లాఠీలనెదుర్కొంటూ కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేశారు. పుణే లోని ఫిల్మ్–టెలివిజన్ సంస్థ, బరోడా సాయాజీరావ్ విశ్వవిద్యా లయ లలితకళల విభాగం, ఢిల్లీ అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఎయిమ్స్)ల విద్యార్థులు ప్రస్తుత ఉద్యమాలకు దూరంగా లేరు. దూసుకొని వెళ్తూ స్పష్టమైన తమ వైఖరి, వ్యక్తీకరణతోనే ఉన్నారు. స్వతహాగా నిరసన గళాలు వినిపించే మార్గాలు వెతుక్కుంటున్నారు తప్ప, రాజకీయ పార్టీలు చూపే దారుల్లో నడిచేందుకు వారు సిద్ధంగా లేరు. లక్నోలో ఒక విద్యార్థిని జాతీయ టీవీ మీడియాతో మాట్లా డుతూ, ‘మేం చెప్పే లౌకిక వాదమంటే, ఏదో.. ఫలానా... రాజకీయ పార్టీ వల్లించే కుహనా లౌకికవాదం కాదు, మహాత్మాగాంధీ ఆశించి నట్టు, భిన్నమతాల వారు కలిసి సాగించే సయోధ్య–సహజీవన వాదం...’ అని పలికిన స్వరం గంభీరంగానే కాదు, నిజాయితీగానూ ఉంది. ఇంతటి సంక్లిష్ట సమయంలో గాంధీ ప్రస్తావన ఓ సాను కూలాంశం. అస్సాంలో కొత్త జవజీవాలు నింపుకున్న అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఆసు) నిరసన భయానికి ప్రధాన మంత్రి పర్యటన రద్దయినట్టు ప్రకటన వెలువడింది. ప్రస్తుత విద్యార్థి లోకం చేస్తున్న వ్యక్తీకరణలు ఏ విద్యాసంస్థలకో, పార్టీ సిద్ధాంతాలకో, మత–కుల వర్గ సమూహాలకో పరిమితమైన భావజాలంలా లేవు. దేశ చారిత్రక నేపథ్యాన్ని, రాజ్యాంగం అక్షరబద్ధం చేసిన ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, నిజమైన లౌకకవాదపు పునాదుల్నీ ప్రతిబింబించేవిగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం! కొత్తగా తెస్తున్న చట్టాల కన్నా, పాత చట్టాలకు చేస్తున్న మార్పుల కన్నా ప్రభుత్వాల నియంతృత్వ ధోరణుల్ని తప్పుబడు తున్నారు. ప్రజల నిరసన సహించని అసహనాన్ని వారెక్కువగా వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి గళాల్ని తొక్కేసే పాలకుల ధోరణిని నిశితంగా నిరసిస్తున్నారు. ‘ఎందుకిలా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లోని లజపతినగర్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నపుడు ఒక అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి బ్యానర్‌తో నిరసన ప్రదర్శన, నినాదాలు చేసిన యువతి సాహసం ఇందుకొక ఉదాహరణ! ఇంటి యజమానిని అడ్డుపెట్టి, 24 గంటల్లో ఆమె ఉంటున్న అద్దె ఇల్లు ఖాళీ చేయించడం పాలకుల దమననీతికి పరాకాష్ట! ఆధిపత్యం కోసం అరాచకం జేఎన్‌యూలో విద్యార్థి వివాదాలు, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణలు కొత్త కాదు. సాంస్కృతిక, రాజకీయ, సామాజికార్థికాంశాలపై లోతైన చర్చలు, వాదోపవాదాలు ఇక్కడ నిత్యకృత్యం. పాలకుల విధానాలపై ఓ ఆరోగ్యవంతమైన చర్చకు వేదికై, దేశమంతటికీ లోతైన భావాలు వ్యాప్తి చేసే కేంద్రమై అర్ధ శతాబ్ద కాలంగా విరాజిల్లుతోంది. కానీ, అక్కడ గత ఆదివారం జరిగింది ఓ దుర్మార్గమైన చర్య. ఒక విద్యార్థి సంఘం వారు బయటి గూండాలను ముసుగులతో తీసుకువచ్చి, పాలకుల విధానాల్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తున్న విద్యార్థులు–బోధకు లపై హాకీ స్టిక్స్, క్రికెట్ బ్యాట్లు, ఇనుప రాడ్లతో జరిపిన పాశవిక దాడి దారుణం. విశ్వవిద్యాలయ భద్రతా సిబ్బంది కనిపించకుండా పోతే, పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర వహించారు. ఈ దుర్నీతిని ప్రజా స్వామ్య వాదులంతా ఖండించారు. ముసుగుల వెనుక ముఖాలు దాచుకున్న ముష్కర మూకకు జేఎన్‌యూ ఔన్నత్యమేమి తెలుసు? వివాద సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ, భారతావనికి ప్రత్యామ్నాయ ఆలోచనాధారను అవి రళంగా అందించిన జ్ఞాన కేంద్రం జేఎన్‌యూ అని తెలుసా? మూకలే కిరాయివా? వారిని తీసుకువచ్చిన విద్యార్థి విభాగాలూ భావపరమైన రాజకీయ దాస్యంలో మగ్గుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమౌతు న్నాయి. ప్రత్యర్థులూ మరో రాజకీయ పక్షానికి ప్రతినిధులనే ప్రత్యా రోపణలూ ఉన్నాయి. ఆ సందేహాలే, చిగుళ్లు తొడుగుతున్న సరికొత్త ఆశలను చిదుముతున్నట్టనిపిస్తోంది. ఆయా విద్యార్థి సంఘాలను రాజకీయ పక్షాలు వెనుకేసుకొస్తున్న ధోరణి అనుమానాలకు తావి స్తోంది. ప్రశ్నించే తత్వం విస్తరించి, చైతన్యం వెల్లివిరిసే వేళ విద్యార్థి లోకాన్ని రాజకీయ శక్తులు మళ్లీ తమ గుప్పిట్లోకి లాక్కుంటు న్నాయా? అనే భయ–సందేహాలు కలుగుతున్నాయి. రాజకీయాల కతీతంగా అక్కడక్కడ పెల్లుబికే స్వేచ్ఛా–స్వతంత్ర వాదనలు ఆశలు రేపుతున్నాయి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి వన్నె! చైతన్య దీపికలుగా వెలగాల్సిన విశ్వవిద్యాలయాలను ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు గుడ్డి దీపాలు చేస్తున్నాయి. అణుమాత్రం వ్యతి రేకతనూ అంగీకరించే స్థితిలో లేవు. అందుకే, విద్యా విషయంగా, నిర్వహణ రీత్యా, ప్రవేశాల పరంగా... అన్ని విధాలా వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా సరళి, స్వేచ్ఛా భావధారను మొగ్గలోనే చిదిమేస్తున్నాయి. సమాజంలో సంఘర్షణను ఎదుర్కొనే, ప్రశ్నించే సామాజిక వర్గాలకు అక్కడ తావులేని స్థితి కల్పిస్తున్నాయి. మేలిమైన ఉన్నత విద్యకు వారిని క్రమంగా దూరం చేస్తున్నాయి. రిజర్వేషన్ల కోత విధించి, రమారమి ఫీజులు పెంచి, సంఘర్షణతో ఆధిపత్యం సాధించి అల్పాదాయ, మధ్య తరగతిని అక్కడికి రానీకుండా చేస్తున్నాయి. ప్రశ్నించకుండా అన్నిటికీ ఊ కొట్టే, కడుపు నిండిన ఉన్నత–సంపన్న వర్గాల వారికే అవి అందుబాటులో ఉండేట్టు చేస్తున్నాయి. ఈ ప్రక్రియలన్నింటి వెనుక కుట్ర దాగుందని మేధావివర్గం భావిస్తోంది. ఇప్పుడు జెఎన్యూలో తాజా వివాదం కూడా అక్కడే మొదలయింది. విద్యార్థి లోకం, ఇతరేతర యువతరం ఈ గుంజా టన నుంచి బయటపడాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రశ్నించే తత్వానికి మరింత సానపెట్టాలి. నిరసన తప్పు కాదు. ప్రజాస్వామ్య పరిధిలో అసమ్మతి వ్యక్తీకరణ నేరమూ కాదు. మానవేతిహాసం మొదలైన్నుంచీ నిరసన, అసమ్మతికి తావుంది. వేద కాలం, పురాణ–ఇతిహాస కాలంలోనూ తప్పలేదు. భిన్నాభిప్రా యాలకు తావుంది కనుకే... విభీషణ విభేదమైనా, రామాంజనేయ– కృష్ణార్జున యుద్ధాలెనా జరిగిందందుకే! ‘నేనేదైనా చేయగలను!’ అనుకోవాలి. ‘పట్టుదలతో నిరాకరిస్తే, పాము విషం కూడా పని చేయకుండా పోతుంది’ అన్న స్వామీ వివేకానందుడి మాటలే నేటి యువతకు స్ఫూర్తి కావాలి! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఉద్యోగ సృష్టికర్తలుగా మారండి
న్యూఢిల్లీ/గ్రేటర్ నోయిడా: దేశంలోని యువత ఉద్యోగాల సృష్టికర్తలుగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన 22వ జాతీయ యువజనోత్సవంలో పాల్గొన్న యువతను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. ‘ఏ ఆందోళనా వద్దు. ముందుకు వెళ్లండి. మొదటి అడుగు వేయండి. మా ప్రభుత్వం మీతో ఉంటుంది’అని స్టార్టప్‌లను ప్రారంభించాలనుకుంటున్న యువతకు ఆయన సూచించారు. బ్యాంకు గ్యారంటీ, రుణాలు, భారీ పేపర్ వర్క్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ సహాయం ప్రభుత్వం తరఫున అందుతుందని హామీ ఇచ్చారు. చేయూతనిస్తామని, ఆ తర్వాత స్వశక్తితో తమంతట తామే వారు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా జీవితంలో ఒక భాగంగా గుర్తించాలని ప్రధాని మోదీ సూచించారు. -
దిక్సూచి కొరవడిన దివ్యశక్తి
♦ సమకాలీనం ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ‘‘ఇప్పటి యువకుల మీద, వారి ఆధునికత పైన నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. వారి నుండే నాకవసరమైన కార్యకర్తలు లభిస్తారు. వారు సమస్యల్ని సింహబలులై ఎదుర్కొంటారు’’ అని స్వామీ వివేకానందుడు విశ్వాసం ప్రకటించి నూటపాతిక సంవత్సరాలయింది. ఆ తర్వాత అనేక మార్పులొచ్చాయి. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. భారతదేశం స్వాతంత్య్రం పొందింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్కృతీ పరంగా ఇంటా బయటా ఎన్నెన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. శాస్త్ర–సాంకేతికత ప్రగతికి బాటలు పరిచాయి. ముఖ్యంగా యువతకు అపారమైన అవకాశాలు అందివస్తున్నాయి. ఇప్పటికీ యువతే ఏ దేశ భవిష్యత్తునైనా నిర్దేశించే స్థితిలో ఉంది. భారతదేశం అత్యధిక యువతరం కలిగిన దేశంగా లెక్కలకెక్కుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా విశ్వవ్యాప్తమై లభిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని ఒడిసిపడుతూ మనవాళ్లు ముందుకు సాగుతున్నారు. దేశీ యంగానూ ఉన్నంతలో అవకాశాల్ని అందిపుచ్చుకునే యత్నం మన యువత నిర్విరామంగా సాగిస్తోంది. కానీ, వివేకానందుని ఆలోచనా ధోరణికి, తాత్విక చింతనకు, ఆశావహ దృక్పథానికి విరుద్ధమైన భావజాలం, ఆలోచన, కార్యాచరణ అత్యధికుల్లో ఇప్పుడు రాజ్యమేలుతోంది. సరైన గమ్యం, దిశానిర్దేశం లేని పంథాలో వారు సాగుతున్నారు. జాతిని జాగృత పరచి, అనుపమానమైన యువశక్తిని ఏకీకృతం చేసి సరైన మార్గాన నడిపే ఆత్మ దేశంలో కొరవడింది. ఆదర్శ మార్గదర్శకత్వం లేకుండా పోయింది. సరైన దిక్సూచి లేక యువశక్తి... కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, భావజాలాల వారీగా విడిపోయి సంకుచిత మార్గాల్లో సాగుతోంది. విలువలు పతనమైన ఫక్తు వ్యాపార విద్యావిధానం వల్ల వారిలో పరిమిత యోచన, హ్రస్వ దృష్టి పెరిగి ఆలోచనా పరిధి విస్తరించడం లేదు. జీవనశైలి సంక్లిష్టమౌతోంది. నిర్హేతుకమైన హింస, విధ్వంసాలకు తెగించే పెడధోరణులు యువతలో పెచ్చరిల్లుతున్నాయి. 1984లో ఉత్తర కర్ణాటకకు చెందిన గుల్బర్గా నగరంలోని న్యాయ కళాశాల వార్షికోత్సవ సదస్సు జరి గింది. న్యాయ కోవిదుడు రామ్‌జెఠ్మలానీని ఆహ్వానించి ‘‘భారతదేశానికిపుడు రాజకీయ నాయకుల కన్నా నైతికనేతల అవసరం ఎక్కువుంది’’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మూడున్నర దశాబ్దాల తర్వాత... ఇప్పటికీ పరిస్థితిలో ఏం మార్పు లేదు! ఒక పిలుపుతో అత్యధికుల్ని ఒక్కతాటిపై నడిపే నిబద్ధత కలిగిన నైతిక, ధార్మిక నేతృత్వపు నేటి అవసరాన్ని వివేకానందుడు గుర్తుచేస్తున్నారు. విత్తొకటి వేస్తే చెట్టొకటి వస్తుందా? దారితప్పిన మన విద్యావిధానం ప్రస్తుత పెడధోరణులకు ప్రధాన కారణం. ప్రభుత్వ నిర్వహణ నుంచి విద్య క్రమంగా ప్రయివేటు వైపు మళ్లుతున్న క్రమంలోనే ప్రతి అంశంలోనూ ఫక్తు వ్యాపార ధోరణి పెచ్చు మీరింది. లాభాపేక్షతో విద్యాబోధన జరిపించే ‘పరిశ్రమ’లు వెలిశాయి. ఫలితంగా విలువలు అడుగంటుతున్నాయి. విద్యార్థులు–యువతరం ఆలోచనా ధోరణి వికటిస్తోంది. ప్రపంచీకరణలో అన్నీ వినియోగ వస్తు దృక్పథంతో చూడటం అలవాటయ్యాక త్యాగ భావనే కొరవడుతోంది. చదువులో, ఉద్యోగాలు పొందడంలో అనారోగ్యకర పోటీ పెరిగి వారిలో స్వార్థం కట్టలు తెంచుకుంటోంది. దాని చుట్టే జీవనశైలి రూపుదిద్దుకుంటోంది. ఇది విద్యావిధానమే కాదనేది వివేకానందుడి భావన. ‘మెదడును అసంఖ్యాకమైన వైజ్ఞానిక విషయాలతో నింపటం విద్య కాదు. మనస్సు సమగ్ర ఉత్తీర్ణతను సాధించాలి. దానిపై సాధికారతను, నియంత్రణను సమకూర్చడమే విద్య లక్ష్యమై ఉండాలి’ అంటారాయన. విద్య ఎలా ఉండకూడదో చెబుతూ, ‘గంధపు చెక్కలు మోసే గాడిదకు వాటి బరువు తప్ప విలువ తెలియదు, ఎంత సమాచారం మెదడులో నింపామన్నది మన విద్యాజ్ఞానం కొలమానమే కాదంటారు. ‘సమాచార సేకరణ, విషయ గ్రహణమే విద్య అయితే, మన గ్రంథాలయాలు తాపసులౌతాయి, మన విజ్ఞానసర్వస్వాలు మహర్షులుగా వెలుగొందుతాయ’ని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తారు. ‘జీవితానికి, ప్రవర్తనకు అక్కరకొచ్చే అయిదు ఆలోచనల్ని మనస్సుకు పట్టించుకుంటే చాలంటారు. ‘విద్యవల్ల సత్ప్రవర్తన అలవడాలి, మనో దారుఢ్యం పెరగాలి, వ్యక్తిత్వ వికాసం–వివేక విస్తరణ జరగాలి. చివరగా, మన కాళ్లమీద మనం నిలబడగలగాలి అంతే!’ అంటారు స్వామీజీ. తప్పు తెలిస్తే, దిద్దుకోవడం తేలిక! భారతదేశంలో రెండు దుష్కర్మలు సాగుతున్నాయని వివేకానందుడనేవారు. ఒకటి స్త్రీ జాతి అణచివేత, రెండోది బీదల పట్ల వివక్ష, ముఖ్యంగా కుల వివక్షతో చూపే నిర్దాక్షిణ్య వైఖరి అని ఆయన అభిప్రాయం. అవి ఇంకా కొనసాగడం దురదృష్టకరం! మహిళల పట్ల ఇప్పటికీ జరుగుతున్న దాష్టీకాలు చూస్తుంటే, లింగపరంగా సరైన దృక్పథం అలవడకపోవడమే వాటికి కారణం అనిపిస్తుంది. ఈ విషయంలో స్వామీజీకి ఉదాత్తమైన భావాలుం డేవి. ‘స్త్రీ పురుష భేదాన్ని విస్మరించి, మానవులంతా సమానులే అన్న భావన రానంతవరకు, స్త్రీ జనోద్ధరణకు అవకాశమే ఉండదు’ అని బలంగా అభిప్రాయపడ్డారు. ‘మానవ జాతి ఒక్కటే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు. అందరూ సర్వసమానతా భావాన్ని ప్రోత్సహిస్తూ ఒకరి సాహచర్యాన్ని మరొకరు అభిలషిస్తూ స్త్రీ–పురుషులు పరస్పర సహకారంతో సంచరిస్తేనే జీవతం ఆనందమయమౌతుంది’అనేవారు. ‘ప్రపంచ శ్రేయస్సును సంరక్షించుకోవాలంటే స్త్రీ పరిస్థితి మెరుగుపడాలి. పక్షి ఎన్నడూ ఒక రెక్క సహాయంతో ఎగురలేదు’ అన్నారాయన. తరాల తరబడి కొన్ని అట్టడుగు వర్గాల ప్రజలు మోసగించబడ్డారని, వాటికి చారిత్రక సాక్ష్యాధారాలున్నాయని వివేకానందుడు పేర్కొనేవారు. ‘మనదేశంలో బీదలను, అట్టడుగు వర్గాల వారిని ఆదుకునేందుకు స్నేహితులుండరు. వారు ఎంత కష్టించినా వారొక స్థాయి నుండి పైకి రాలేరు. రోజులు గడిచిన కొద్దీ ఇంకా తక్కువ స్థాయికి దిగజారుతున్నారు. సమాజం నిర్దయగా వారిని చెప్పుదెబ్బలు కొడుతూనే ఉంది. ఆ దెబ్బలు ఏ సమయంలో ఎలా వచ్చి తాకుతాయో కూడ ఆ నిస్సహాయ ప్రజలకు తెలియదు’ అన్నారు. 1894లో చికాగో నుంచి ‘అలి సింగ’కు రాసిన ఉత్తరంలో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘...లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో అలమటిస్తున్నపుడు, వారందరి శ్రమనుంచి విద్యార్జన చేసి, వారికేమాత్రం సహకారం అందించని వారిని నేను ద్రోహులుగానే పరిగణిస్తాను. నిర్భాగ్యులను అణచి, దోచి, బాధించి పొందిన సొమ్ముతో తమ ఆడంబరాల్లో బందీలుగా ఉంటూ, ఆ బాధితులకు ఏ రూపంలోనూ ఉపయోగపడని వారూ నా దృష్టిలో ఆకలిగొన్న క్రూర మృగాలే! నిజానికి అటువంటి వారమంతా దరిద్రులం, చివరకు ఏమీ కాకుండా పోతాం!’ అని రాస్తూ, అలా కాకుండా నడుచుకుందామని హితబోధ చేస్తారు. ముందు మేల్కొనండి... యువత పట్ల వివేకానందుడికి అపారమైన ఆశ, నమ్మకం ఉండేవి. మీలో ఎంతో శక్తి ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉండండి, అప్రమత్తం కండి, అంతే చాలు, మిగతావన్నీ వాటంతట అవే జరిగిపోతాయని యువతరానికి సందేశం ఇచ్చేవారు. సమాజంలో కొనసాగుతున్న అరిష్టాల్ని ఎదుర్కొనేందుకు యువత సన్నద్దం కావాలని పిలుపునిచ్చేది. 1896 జూన్ 7న లండన్ నుంచి మిస్ మార్గరెట్ నోబెల్‌కు ఉత్తరం రాస్తూ వివేకానందుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ‘... ప్రపంచం దుఃఖంతో జ్వలిస్తోంది. మీరు నిద్రించగలరా? మనం బిగ్గరగా అరవాలి... ఎంతలా అంటే, మనలో విశ్రమిస్తున్న దేవత నిద్రలేవాలి, ఆ పిలుపులకు ప్రతిస్పందించాలి’ అని రాశారు. యువత ఎక్కువగా ఉన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ, ‘సాహసికులైన యువకులారా! మీకు కావలసినవి మూడే విషయాలు: అవి ప్రేమ, నిజాయితీ, సహనం. జీవితమంటే ప్రేమ. ప్రేమమయమే జీవితం. ఇదే జీవిత పరమార్థం. స్వార్థపరత్వమే మరణం! ఇది ఇప్పటికే కాదు ఎప్పటికీ సత్యమే. మనకు భావి లేదనుకున్నా, ఇతరులకు మంచి చేయడమే జీవితం. హాని సల్పటం మరణం. నీకు కనిపించే పశుప్రవృత్తి కలిగిన మానవుల్లో నూటికి తొంబై మంది మృతులే!’ అన్నారు. జీవితంపైనే సరైన దృక్పథం లేని నేటి యువకులు కొందరు, ఉన్మాదంతో ఎదుటివారి జీవితాల్ని హరిస్తున్నారు. వివేకానందుడు చెప్పిన ప్రేమ, నిజాయితీ, సహనం మూడూ లేని ముష్కరులు తయారవుతున్నారు. చిన్న వయసులో తాగి తందనాలాడుతున్నారు. నేర ప్రవృత్తిలోకి దిగుతున్నారు. విలువలు నశించినా ఆడంబరాలకు అతుక్కుపోతున్నారు. అందరి పూనికతోనే మార్పు... యువతరం భారత్‌కు ఓ గొప్ప శక్తి! 35 ఏళ్ల లోపు వయస్కులైన 65 శాతం జనాభాతో ప్రపంచంలోనే అగ్రగామి ‘యువ’దేశంగా మనకు కీర్తి లభిస్తోంది. 15–29 మధ్య వయస్కుల జనాభా 27.5 శాతంగా మానవవనరుల సహాయ మంత్రి డా. సత్యపాల్‌సింగ్ వారం కింద లోకసభకు తెలిపారు. తగిన విద్య, శిక్షణ, నైపుణ్యాల వృద్ధి చేస్తూ వారిని శ్రమశక్తి వనరుగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రమాణాల ప్రకారం పనిచేసే–చేయని మానవ వనరుల నిష్పత్తి, రాగల ఒకటిన్నర దశాబ్దాల్లో (2016–30) చైనా, కొరియా, బ్రెజల్ కంటే భారత్‌లోనే మెరుగ్గా ఉంటుందని కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వార్ తెలిపారు. భారత యువజనాభివృద్ధి సూచిక 0.569 సగటుతో ఆశావహంగానే ఉందని యువజన వ్యవహారాలు–క్రీడల సహాయ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వివరించారు. 2014 యువ విధాన పత్రం ప్రకారం, అభివృద్ది ఫలాల గ్రహీతలుగా మాత్రమే కాకుండా యువతను చోదకశక్తులుగా, క్రియాశీలంగా ఉంచే కార్యక్రమాలు రచించి, అమలు చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి విజయ్‌గోయల్ సభలో వెల్లడించారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగులు తమ ఉద్యోగ–ఉపాధి అవకాశాల కోసం నిత్య పోరాటం చేస్తున్నారు. మరో వంక మూడు ప్రభుత్వాలు తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ప్రకటనలు చేస్తున్నాయి. ప్రభుత్వ లెక్కలు, కథలు, కథనాలెలా ఉన్నా... నేటి యువతరం ప్రవర్తన, ఆలోచనా ధోరణి, దృక్పథాలను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఫేస్బుక్ అధినేత జుకెర్‌బర్గ్, ఐటీ దిగ్గజాలు అజీమ్ ప్రేమ్‌జీ, నందన్ నీలేకనీ వంటి వారి మాటలకు అక్కడక్కడ యువతరం ఎంతో కొంత ప్రభావితమవుతున్నారు, స్పందిస్తున్నారు. కానీ, యువతను దారిన పెట్టే ప్రభావశీలురు, వైతాళికులు లేకుండా పోయారు. కుంచించుకుపోతున్న యువత ఆలోచనా ధోరణి విస్తరించాలి. విశాల దృక్పథం అలవడాలి. ఇందుకు, తల్లిదండ్రులు క్రియాశీల పాత్ర పోషించాలి. ఆదర్శమూర్తుల దారిన నడిచేలా తమ పిలల్ని చిన్నప్పట్నుంచే ప్రభావితుల్ని చేయాలి. నరేంద్రుడు వివేకానందుడిగా మారేంత ప్రభావితం చేసిన భువనేశ్వరీ దేవి అందరికీ ఆదర్శం కావాలి. ఒకనాడు తల్లి తనకు చెప్పినట్టు వివేకానందుడే స్వయంగా తన పుస్తకంలో రాసుకున్న మాటలతో ముగిస్తా. ‘‘పవిత్రంగా ఉండు. స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు. ఆత్మగౌరవాన్ని సంరక్షిం చుకో. ఇతరులను గౌరవంగా చూడు. సరళ స్వభావుడవై నిరాడంబరంగా మెలుగు. కానీ, అవసరమైనచోట దృఢత్వాన్ని ప్రదర్శించడానికి వెనుకాడకు’’ (నేడు వివేకానంద జయంతి) దిలీప్ రెడ్డి వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
నేడైనా నల్లధనం వెలికితీతకు మోదీ ఉపక్రమిస్తారా!
న్యూఢిల్లీ: దేశ యువతను జాగృతం చేయడంతోపాటు హైందవ ధర్మాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన స్వామి వివేకానంద 153వ జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా మంగళవారం జాతి ఆయనకు ఘన నివాళి అర్పించింది. 'మహోన్నతుడైన వివేకానందుడికి సలాం' అంటూ స్వామీజీని తలుచుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. యోగా గురు రామ్ దేవ్ బాబా హరిద్వార్ లోని తన ఆశ్రమంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నల్లధనంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'విదేశాల్లో భారత ఖ్యాతిని పెంచిన మహోన్నతుడు వివేకానందుడు. ఆయన జయంతి సందర్భంగానైనా నేడు నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాచరణ ప్రకటిస్తారనుకుంటున్నా' అని రామ్ దేవ్ అన్నారు. ఎన్నికల వాగ్ధానంలో ప్రధానమైనదైన నల్లధనం వెలికితీతకు బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేసినప్పటికీ, దాని ఫలాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ మేరకు చర్యల్ని వేగవంతం చేసేలా ప్రధాని నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు యోగా గురు పేర్కొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధ్యం..
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మవిశ్వాసంతోనే ల క్ష్యం సాధ్యమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై స్వామి వివేకనందుడి చిత్రపటానికి పూలమాల లు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుగమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే వరకు నిర్వారామం గా కృషి చేయాలని అన్నారు. వివేకానందుని ఆశయాల సాధనకు పాటుడాలన్నారు. వందమంది యువకులతో దేశ రూ పులేఖలే మార్చవర్చన్న వివేకానందుడి మాటలను విస్మరిం చవద్దని కోరారు. యువత నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం సరైందికాదన్నారు. ఉద్యోగమే జీవి తం కాదని, చదువు అన్ని రకాలుగా మేధస్సును పెంచుతుం దన్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నాయని పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత అన్నింటిలోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మహనీయులు కలలుగన్న గ్రామస్వరాజ్యం యువ తతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న, సామాజిక కార్యకర్త డాక్టర్ కళ్యాణ్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా ఇన్చార్జి కన్నం మోహన్‌బాబు, నలంద కళాశాల ప్రిన్సిపాల్ పున్నారావు, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ రవిచరణ్దాస్, వేద పండితుడు చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రీ సిద్ధాంతి, యువజన సంఘాల నాయకుడు నర్సింగ్‌రావు, యూత్ కో ఆర్టినేటర్ మసూద్, న్యాయనిర్ణేతలు కభీర్దాస్, కవిత, సతీష్దేశ్పాండే, శైలజ దేశ్‌పాండే, మురళీధర్,రాజారాం తదితరుల పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం.. జిలా యువజనోత్సవాల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులకు ఎమ్మెల్యే జోగురామన్న, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి బహుమతులు అందించారు. వన్యాక్ట్ ప్లేలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయస్థానం సాధించిన నటరాజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కళాకారులకు ప్రశంసపత్రాలు, మెమొంటో అందజేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైన ఉషాకిరణ్ బృందానికి, తబల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించిన సాయినాథ్కు, హార్మోనియంలో ప్రతిభ కనబర్చిన గౌతమ్‌కు, ఫోక్ గానంలో పవర్మోహన్నాయక్ బృందాలకు ప్రశంసపత్రాలు, మెమొం టోలు అందించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలకు వ్యవహరిం చిన వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ కళారూపాలతో కళాప్రదర్శనలు ఆహూతులను అలరించారు. నటరాజ్ డాన్స్ ఇన్సిస్టిట్యూట్ విద్యార్థు లు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు శ్రీష్మ, రవమిరెడ్డి శాస్త్రీయ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. భగత్రావు థింసా నృత్యం, తలమడుగు మందగూడకుచెం దిన శ్రీనివాస్ గుస్సాడి బృందం చేసిన ప్రదర్శనలు అలరించాయి. మిట్టురవి కళా బృందం గీతాలతో అలరించారు.