ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మవిశ్వాసంతోనే ల క్ష్యం సాధ్యమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై స్వామి వివేకనందుడి చిత్రపటానికి పూలమాల లు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుగమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే వరకు నిర్వారామం గా కృషి చేయాలని అన్నారు.
వివేకానందుని ఆశయాల సాధనకు పాటుడాలన్నారు. వందమంది యువకులతో దేశ రూ పులేఖలే మార్చవర్చన్న వివేకానందుడి మాటలను విస్మరిం చవద్దని కోరారు. యువత నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం సరైందికాదన్నారు. ఉద్యోగమే జీవి తం కాదని, చదువు అన్ని రకాలుగా మేధస్సును పెంచుతుం దన్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నాయని పేర్కొన్నారు. డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత అన్నింటిలోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మహనీయులు కలలుగన్న గ్రామస్వరాజ్యం యువ తతోనే సాధ్యమన్నారు.
కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న, సామాజిక కార్యకర్త డాక్టర్ కళ్యాణ్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి కన్నం మోహన్‌బాబు, నలంద కళాశాల ప్రిన్సిపాల్ పున్నారావు, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ రవిచరణ్‌దాస్, వేద పండితుడు చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రీ సిద్ధాంతి, యువజన సంఘాల నాయకుడు నర్సింగ్‌రావు, యూత్ కో ఆర్టినేటర్ మసూద్, న్యాయనిర్ణేతలు కభీర్‌దాస్, కవిత, సతీష్‌దేశ్‌పాండే, శైలజ దేశ్‌పాండే, మురళీధర్,రాజారాం తదితరుల పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు ప్రదానం..
జిలా యువజనోత్సవాల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులకు ఎమ్మెల్యే జోగురామన్న, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి బహుమతులు అందించారు. వన్‌యాక్ట్ ప్లేలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయస్థానం సాధించిన నటరాజ్ డాన్స్ ఇన్‌స్టిట్యూట్ కళాకారులకు ప్రశంసపత్రాలు, మెమొంటో అందజేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైన ఉషాకిరణ్ బృందానికి, తబల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించిన సాయినాథ్‌కు, హార్మోనియంలో ప్రతిభ కనబర్చిన గౌతమ్‌కు, ఫోక్ గానంలో పవర్‌మోహన్‌నాయక్ బృందాలకు ప్రశంసపత్రాలు, మెమొం టోలు అందించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలకు వ్యవహరిం చిన వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ కళారూపాలతో కళాప్రదర్శనలు ఆహూతులను అలరించారు. నటరాజ్ డాన్స్ ఇన్సిస్టిట్యూట్ విద్యార్థు లు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు శ్రీష్మ, రవమిరెడ్డి శాస్త్రీయ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. భగత్‌రావు థింసా నృత్యం, తలమడుగు మందగూడకుచెం దిన శ్రీనివాస్ గుస్సాడి బృందం చేసిన ప్రదర్శనలు అలరించాయి. మిట్టురవి కళా బృందం గీతాలతో అలరించారు.
ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధ్యం..
Published Mon, Jan 13 2014 6:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement