Self Confidence
-
మనం ధరించే డ్రెస్‌కి ఇంత పవర్ ఉంటుందా..?
‘పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు డ్రెస్సింగ్ కూడా ఉపయోగపడుతుంది’ అంటారు హైదరాబాద్ వాసి, ఫౌంటెడ్ హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ కాలేజీ నిర్వాహకురాలు, టీచర్ మేఘన ముసునూరి. గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత అయిన మేఘన ముసునూరి వార్డ్ రోబ్ గురించి చెప్పిన విషయాలు..‘‘ప్రైమరీ స్కూల్ పిల్లలకు క్లాస్ తీసుకునేటప్పుడు కలర్ఫుల్గా డ్రెస్ చేసుకుంటాను. చిన్నపిల్లలకు బ్రైట్ కలర్స్ అంటే ఇష్టం. మనం చెప్పినవి చక్కగా వినడానికి ఈ రంగులు దోహదం చేస్తాయి. పిల్లలు డ్రెస్ ఒకటే చూడరు. చెవులకు, చేతులకు, మెడలో ఏం వేసుకున్నారు.. అని కూడా చూస్తారు. వాళ్లకి ఆసక్తి కలిగించేది ఏదైనా ఉంటే, ఇదేమిటి? నేనెప్పుడూ చూడలేదు... అని కూడా అడుగుతారు. అలా ఒకరోజు నా దగ్గర వడ్లు, మినుములు... మొదలైన గింజలతో తయారు చేసిన బ్రేస్‌లెట్‌ని వేసుకెళ్లాను. ఆ రోజు దాని గురించి వారు ఎన్నోప్రశ్నలు వేశారు. అంటే, ఆ బ్రేస్లెట్ వారిలో ఎంతో ఆసక్తిని కలిగించిందనేగా! నైటీతో కనిపించనుఎదుటివారిని చూడగానే 6 నుంచి 12 సెకన్లలో ఆæవ్యక్తిని మనం సీరియస్‌గా తీసుకోవచ్చా లేదా అనేది బ్రెయిన్ ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకుంటుంది. నాకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లు నా మాట వినని సందర్భాలు దాదాపుగా లేవు. ఎందుకంటే, వాళ్లు నన్ను నైటీలో ఎప్పుడూ చూడరు. సౌకర్యం కోసం రాత్రి సమయంలో వేసుకునే నైటీలోనే స్కూల్లో పిల్లలను దింపడానికి వచ్చే తల్లులు ఉన్నారు. చాలా మంది తల్లులు నా దగ్గర ‘తమ పిల్లలు మాట వినడం లేదు’ అని చెబుతుంటారు. అప్పుడు వాళ్లతో ‘ఎప్పుడైనా టీచర్ని మీరు నైట్డ్రెస్లో చూశారా’ అని అడుగుతాను. అంతేకాదు ‘మన డ్రెస్ వల్ల కూడా పిల్లలు మన మాట వింటారు’ అని చెబుతాను. ఒకప్పుడు మా ఇంటికి టీచర్ వస్తున్నారంటే మా తాతగారు తప్పనిసరిగా భుజంపైన కండువా వేసుకొని, బయటకు వచ్చేవారు. గౌరవం అంటే నమస్కారం ఒక్కటే కాదు. మన డ్రెస్సింగ్ కూడా. నా సొంత డిజైన్స్బైక్ రైడ్‌కి వెళ్లేటప్పుడు జీన్స్ వేసుకుంటాను. మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు చీరలు కట్టుకుంటాను. 2–3 రోజుల మీటింగ్స్ అయితే బ్లేజర్స్, ఫ్రాక్స్ కూడా వేసుకుంటాను. చీర అయితే, బ్లౌజ్ ట్రెండీగా ఉండేలా ఎంచుకుంటాను. వెస్ట్రన్ టాప్ వేసుకొని చీర కట్టుకుంటాను. కొన్నిసార్లు టాప్ టు బాటమ్ ఒకే కలర్, కొన్నిసార్లు కాంట్రాస్ట్ వేసుకుంటాను. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి. అలాంటప్పుడు డైనమిజాన్ని చూపేలా డ్రెస్ చేసుకుంటాను. జ్ఞాపకాలు బాగుండాలంటే...జ్ఞాపకాలలో మన డ్రెస్సింగ్ కూడా బాగుండాలి. ఒకప్పుడు ఆకులు పచ్చగానే ఉన్నట్టు డ్రాయింగ్‌లో చూపేవారు. కానీ, ప్రకృతిలో ఆకులు చాలా రంగుల్లో ఉన్నాయి. అందుకని, మనం వేసుకునే డ్రెస్, జ్యువెలరీ కూడా కలర్ఫుల్గా ఉండాలి. బంగారు ఆభరణాలే వేసుకోవాలని అనుకోను. తక్కువ ఖర్చుతో లభించే క్రియేటివ్ జ్యువెలరీ ఏదైనా ఎంపిక చేసుకుంటాను. టీచర్ అంటే సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేదు. పిల్లల్లో ఇంట్రెస్ట్, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసేలా ఉండాలి. నేను రకరకాల బ్రోచెస్ పెట్టుకుంటాను. మా స్కూల్లో ఒక పిల్లవాడు వాళ్ల అమ్మకు ఒక బ్రోచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడంట. ‘ఎందుకు?’ అని అడిగితే ‘మా టీచర్ పెట్టుకుంటుంది, చాలా బాగుంటుంది’ అని చెప్పాడంట. పిల్లల నుంచి ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలు నాకున్నాయి. ఇదే ఫ్యాషన్ అని, ఎవరి లాగానో ఉండాలని కాకుండా సమాజంలో మనదైన ఒక గుర్తింపు డ్రెస్సింగ్ ద్వారా చూడాలి. పవర్ డ్రెస్సింగ్ వల్ల ఎదుటివారు మనతో ప్రవర్తించే తీరులో కూడా మార్పు వస్తుంది. (చదవండి: అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!) -
మీకు తెలుసా..! మీ ఆరోగ్యం మీ ఆలోచనలతోనేనని..
'సాటివారిపట్ల ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత వంటి గుణాలు కలిగున్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడని మనస్తత్వ శాస్త్రవేత్తలతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. అలాగే.. సానుకూలమైన అనుభూతులతో ఉన్న మనిషిలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెంది, వ్యాధికారక క్రిముల పెరగకుండా నిరోధిస్తాయి. తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కోపం, ద్వేషం, దుఃఖం, విచారం, అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనిషిని మానసికంగా ఒత్తిళ్లు, ఆందోళనలకు గురిచేసి తెల్ల రక్తకణాలను తగ్గిస్తాయి. ఫలితంగా మనిషి అనారోగ్యానికి గురవుతాడు. అందుకే మంచి ఆలోచనలు ఉంటే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.' ఒంటరితనం వద్దు ఒంటరిగా ఉన్న మనిషిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువ. ఫలితంగా మనిషిలో తెల్ల రక్త కణాలు తక్కువవుతుంటాయి. ఎన్నో శారీరక సమస్యలు మొదలవుతాయి. ఆహార విహారాలపై అవగాహన లోపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. మనసు ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఆ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతూ అల్జీమర్స్ వంటి ఆరోగ్య సమస్యలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒంటరిగా ఉన్నవారు ఏదో ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మెదడు నిర్మాణాత్మకంగా పనిచేస్తూ, సానుకూల ఆలోచనలకు తెరలేపుతుందన్నది చికాగోలోని రష్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్ శాస్త్రజ్ఞుల సూచన. సానుకూల ఆలోచనల కోసం మెదడుకు తగు తర్ఫీదు ఇవ్వాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దాలు మాత్రమే ఉపయోగించే అలవాటు చేసుకోవాలి.. ఎవరికి వారు సానుకూల స్వయం సలహాలు ఇచ్చుకుంటుండాలి. ఆత్మవిశ్వాసంతో కూడిన మాటలు, చేతలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలి. ఇతరుల పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. తప్పులు జరిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఫల్యాలు ఎదురైనప్పుడు కృంగిసోకుండా గతంలో సాధించిన విజయాలను గుర్తుచేసుకుని, ప్రస్తుతం జరిగిన వాటిని విశ్లేషించుకోవాలి. విజయాల బాటలో నడిచిన వారిని చూసి అసూయ చెందకుండా వారి నుంచి ప్రేరణ పొందడం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు.. వాటిని సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. పెదవుల మీద చిరునవ్వు చెదరనీయకూడదు. మంచి జరగబోతోందని ఊహించుకోవాలి. ఉట్టిపుణ్యానికి బద్ధకంతో పనులు వాయిదా వేసే అలవాటు మానుకోవాలి. సెల్ఫ్ రిలాక్సేషన్ పద్ధతి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులతో ప్రేమగా వ్యవహరించడం.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండడం వల్ల ఎంత పెద్ద జబ్బునైనా నయంచేసుకోవచ్చన్న నిపుణుల సలహాను పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకునే ఆహారంతోనే ఆలోచనా విధానం ముడిపడి ఉందని అంటున్నారు నిపుణులు. తాజా పండ్లను, కూరగాయలను తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవడం అన్ని విధాలా మంచిది. ప్రతికూల ఆలోచనలు వద్దు నెగెటివ్ ఆలోచనల వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఎదుటివాళ్లకి మనమీద నమ్మకం లేకుండా చేస్తాయి. ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఓ పుస్తకంలో రాసుకోవాలి. అవి మనం తీసుకొనే నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోవాలి. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయో కనుక్కోవాలి. వాటినుంచి బయట పడాలనే బలమైన తపన ఉండాలి. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ఫలితం ఉండదు. భవిష్యత్తు గురించి అసలు ఆలోచన చేయకుండా ఉండటం ఎంత తప్పో, భవిష్యత్తులో అలా జరుగుతుందేమో.. ఇలా జరుగుతుందేమో అని అతిగా ఆలోచించడ కూడా అంతే తప్పు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల అంతా మంచే జరుగుతుందనే ఆలోచన మంచిది. ఎప్పుడైతే మనమీద మనకు నమ్మకం లేదో అప్పుడు ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి అయేలా చేస్తాయి. అందువల్ల మనమీద మనకు ఇష్టం, గౌరవం, నమ్మకం ఉండేలా చూసుకోవడం అత్యవసరం. గతంలో సంభవించిన అపజయాలు, ఎదురైన చేదు అనుభవాల వల్ల ప్రతికూల ఆలోచనలు రావడం సహజం. అలాంటప్పుడు గతాన్ని మర్చిపోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనం ఏడాదంతా కాదు.. ఎప్పటికీ ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాం. ఇవి చదవండి: ఎవరీమె? ఆమె స్పీచ్‌కి..పార్లమెంటే దద్దరిల్లింది! -
Mann ki Baat: ఆత్మనిర్భర్ వికసిత్ స్ఫూర్తి.. 2024లోనూ కొనసాగాలి
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సృజనాత్మకతను పంచుకోండి ‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు. అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్భజన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా. ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’ ఎన్నెన్నో ఘనతలు ‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’. ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్ సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్‌నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. -
ఆమె ధైర్యం ముందు నిరాశ నిలబడలేకపోయింది!
పెల్లెట్ గన్‌లో నుంచి పెల్లెట్స్ గంటకి 1100 కి.మీ వేగంతో ఇన్షా రెండు కళ్లలోకి దూసుకెళ్లాయి. అప్పుడా అమ్మాయి 9 చదువుతోంది. 2016లో కశ్మీర్లో గుంపును అదుపు చేయడానికివాడిన పెల్లెట్ గన్స్ అమాయకులకు కూడా శాపంగా మారాయి. ఇన్షా ఓడిపోలేదు. నిరాశ పడలేదు. అంచెలంచెలుగా శ్రమ చేసి చదువుకుంది.మొన్న సీనియర్ ఇంటర్ పరీక్షలలో 500కి 315 మార్కులు సాధించింది. ‘నేను ఐ.ఏ.ఎస్ అవుతాను. అంధులకు ఆత్మవిశ్వాసం ఇస్తాను’ అంటోంది. అంధులేంటి.. ఓటమి భయంతో ఉన్నవారందరూ ఆత్మవిశ్వాసం పొందగలరు ఇన్షాను చూస్తే. దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ ప్రాంతంలో సెదౌ అనే చిన్న పల్లె. వేసవి కాలం. అల్లర్లు చెలరేగాయి. భద్రతా దళాలు వారిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో మొదటి అంతస్తు కిటికీలో నుంచి ఏం జరుగుతున్నదో చూద్దామని 16 ఏళ్ల ఇన్షా ముష్టాక్ కిటికీ తెరిచింది. ఆ తర్వాత ఏమైంది అర్థం కాలేదు. క్షణపాటులో ఆమె రెండు కళ్ల నుంచి రక్తం దౌడు తీసింది. విపరీతమైన నొప్పితో ఇన్సా ఆర్తనాదాలు చేసింది. 2016, 2017... రెండు సంవత్సరాల పాటు భద్రతాదళాలు కశ్మీర్లో ప్రయోగించిన పెల్లెట్ గన్స్ వల్ల శాశ్వతంగా అంధులైన వారు 139 మంది. వారిలో ఇన్షా ఒకమ్మాయి. విఫలమైన డాక్టర్లు పెల్లెట్లు కళ్లల్లోకి దూసుకెళ్లగానే ఇన్షా చూపు పోయింది. కాని మానవీయ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్షా చికిత్స కోసం ముందుకు వచ్చింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్లు కూడా ప్రయత్నించి ఆమెకు ఎప్పటికీ చూపు రాదని తేల్చారు. పెల్లెట్లు జీవితాంతం శరీరంలో ఉండిపోతాయి. అవి చాలా ప్రమాదం. ‘అయితే అంతకన్నా ప్రమాదం నిరాశలో కూరుకుపోవడం అని నాకు తెలుసు. నేను చదువుకోవాలనుకున్నాను. నా కంటే ముందు మా అమ్మ అఫ్రోజా, డ్రైవర్‌గా జీవితం గడిపే మా నాన్న ముష్టాక్ అహ్మద్ లోన్ నేను చదువుకోవాలని భావించారు. మరో రెండేళ్ల తర్వాత ఒక లేఖకుని సహాయంతో నేను టెన్త్ పాసయ్యాను’ అని తెలిపింది ఇన్హా. బ్రెయిలీ నేర్చుకుని... అయితే ఇంటర్ మాత్రం బ్రెయిలీ నేర్చుకుని పరీక్షలు రాసి పాసవ్వాలని నిశ్చయించుకుంది ఇన్షా. ఇందుకోసం శ్రీనగర్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయ్యింది. ఇంటర్‌తో పాటు కంప్యూటర్ కోర్సు, ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. బ్రెయిలీ ద్వారా పాఠాలు నేర్చుకుని పరీక్షలు రాయడం చాలా కష్టమయ్యేది. అయినా సరే ఇన్షా ఆగలేదు. 2011లో ఫస్ట్ ఇయర్ ఇంటర్ పూర్తి చేసింది. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఇంటర్ ఏ గ్రేడ్‌లో పాసయ్యింది. ‘చదువు ఒక్కటే నాకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇవ్వగలదు. అది నాకు తెలుసు. ఐ.ఏ.ఏస్ చేయాలనుకుంటున్నాను. అంధులకు మన దేశంలో తగినన్ని ప్రత్యేకమైన స్కూల్స్ లేవు. ఆ విషయంలో నేను కృషి చేస్తాను’ అని తెలిపింది ఇన్షా. సానుభూతి ఇష్టపడదు ఇంటర్ పాసయ్యిందని తెలిశాక ఆమె తల్లిదండ్రులు ఉద్వేగంతో కన్నీరు కార్చారు. తండ్రి, తల్లి తమ కూతురి పట్టుదలకు గర్వపడ్డారు. ఇన్షా కూడా తన విజయంతో సంతోషంగా ఉంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోమ్ మినిస్ట్రీ అధికారులు ఆమెను మెచ్చుకున్నారు. మంచి కాలేజ్‌లో చదువు కొనసాగడానికి హామీలు దొరికాయి. ఉత్సాహపరిచే వాళ్లను తప్ప సానుభూతి చూపించేవాళ్లను ఇన్షా ఇష్టపడదు. ‘నేను అందరితో సమానంగా జీవించగలను. నాకు సానుభూతి చూపకండి. వీలైతే నా ప్రయాణంలో తోడు నిలవండి’ అంటోందామె. (చదవండి: ప్రాణం నిలిపే రక్తపు బొట్టు ) -
రెండు చేతులు లేవు.. కుంగిపోలేదు.. ఆత్మవిశ్వాసంతో..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. శరీరంలోని అన్ని అవయవాలు బాగున్నా కొందరు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రెండు చేతుల్లేవు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. తనకు జీవితం లేదని భావించలేదు. కష్టపడి పనిచేస్తూ తల్లిని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీకి చెందిన పందిళ్లపల్లి శేషయ్య, రమణమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పిల్లలు. రెండో సంతానమైన మల్లికార్జున రెండు చేతులు లేకుండా జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఎలా బతుకుతాడో?, ఎలాంటి అవమానాలను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. మల్లికార్జున చిన్నతనంలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతను ఎవరికీ భారం కాకుండా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చదువుకు స్వస్తి పలికి పనులు చేయడం ప్రారంభించాడు. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ అందజేస్తోంది. వీటితో తల్లి రమణమ్మను పోషిస్తున్నాడు. మల్లికార్జున తన పనులు తానే చేసుకుంటాడు. కష్టమైన పనులకు మాత్రం తల్లి సాయం తీసుకుంటాడు. తల్లి రమణమ్మతో మల్లికార్జున.. సాయం చేస్తే అంగడి పెట్టుకుంటా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి విక్రయిస్తుంటా. అలాగే నాకు, మా అమ్మకు వచ్చే పింఛన్‌తో జీవిస్తున్నాం. జీవనభృతి కోసం శాశ్వతంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి భావిస్తున్నా. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే చిల్లర దుకాణాన్ని ప్రారంభించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుంటా. – పందిళ్లపల్లి మల్లికార్జున, దివ్యాంగుడు -
పిల్లల కథ: ఆనందమాత
శంకర్ మంచి బొమ్మలు చేసే కళాకారుడు. ఎన్ని బొమ్మలు చేసినా అతని ఆదాయం అంతంత మాత్రమే! అతను చెక్కతో, మట్టితో, లోహంతో బొమ్మలు చేయగలడు. ఒకరోజు ఇంటి ఖర్చుల కోసం డబ్బు అప్పు అడగటానికి తన స్నేహితుడు మహీపతి దగ్గరకు వెళ్లాడు. ‘ఎందుకు అలా డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నావు? నీ చేతిలో కళ ఉంది. తెలివిగా ఉపయోగిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది కదా’ అన్నాడు మహీపతి. ‘కళ అయితే ఉంది అయినా దానిని ఆదరించే వారెవరు? నా బొమ్మలు ఎవరూ కొనడంలేదు’ దిగులుగా చెప్పాడు శంకర్. ‘ప్రస్తుతానికి నీ అవసరానికి డబ్బు ఇస్తానులే. అయితే ఓ రోజు మాపిల్య చెట్టు కొమ్మతో నువ్వు ఓ బొమ్మను తయారు చేయడం చూశాను. మాపిల్య చెట్టు కొంత అరుదైన చెట్టే. శ్రద్ధ తీసుకుని పెంచితే మన భూముల్లోనూ చక్కగా పెరుగుతుంది. నీ బాగు కోరే వాడిగా నేను నా ఎకరం పొలంలో మాపిల్య చెట్లు పెడతాను. అవి రెండేళ్ళలోనే పూర్తిగా పెరుగుతాయి. ఈలోపల అడవిలో దొరికే మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు తయారు చెయ్యి. ఎలాంటి బొమ్మలు చేయాలో, ఆ బొమ్మల్ని ఎలా అమ్ముకోవాలో నేను చెబుతాను’ అని సలహా ఇచ్చాడు మహీపతి. ‘ఏమిటో మహీపతి నువ్వు చెప్పేదంతా నాకు విచిత్రంగా కనబడుతోంది. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ చిరునవ్వుతో చెప్పాడు శంకర్. రెండురోజుల తరువాత మహీపతి.. మాపిల్య చెట్టు కొమ్మతో తన సృజనాత్మకతను ఉపయోగించి ఓ కొత్త దేవత బొమ్మను తయారు చేయమని శంకర్‌కు చెప్పాడు. మహీపతి చెప్పినట్టుగానే తన సృజనను ఉపయోగించి చక్కని కొత్త దేవత ప్రతిమను చెక్కాడు. చూసి అబ్బురపడ్డాడు మహీపతి. ఆ బొమ్మకు ‘ఆనంద మాత’ అని పేరు పెట్టాడు. శంకర్ ఆశ్చర్య పోయి ‘ఈ బొమ్మను ఏంచేస్తావు?’ అని అడిగాడు. ‘అచ్చం ఇటువంటివే పది బొమ్మలు మాపిల్య చెట్టు కొమ్మతో తయారు చేయి. ఏం చేయాలో చెబుతా’ అన్నాడు. మహీపతి చెప్పినట్టే అటువంటి పది బొమ్మలను తయారు చేశాడు శంకర్. ఆ బొమ్మలను మహీపతి తీసుకెళ్ళి తన అంగట్లో, తనకు తెలిసిన వాళ్ళ అంగళ్ళలో పెట్టి ‘ఈ దేవత ఆనంద దేవత.. ఈ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వారికి అన్నీ కలసి వస్తాయి’ అని చెప్పసాగాడు. అంతే ఆ విషయం ఊరంతా పాకింది. ప్రతి వ్యాపారస్తుడు, కొందరు గృహస్తులు ఆ బొమ్మలను కొనాలని ఎక్కడ దొరుకుతాయో అడగసాగారు. ఆవిధంగా శంకర్‌కు చేతినిండా పని, తద్వారా డబ్బూ లభించసాగాయి. కేవలం శంకర్ బాగుపడటమే కాక, చాలామంది రైతులూ లాభపడ్డం మొదలెట్టారు.. పొలం గట్ల మీద మాపిల్య చెట్లు పెంచి వాటి కొమ్మలను అమ్ముతూ. మహీపతి తెలివైన ఆలోచన స్నేహితుడు శంకర్‌ను బాగుపరచడమే కాకుండా రైతులకూ మేలు చేసింది! మరి కొంతమంది మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు చేయడం నేర్చుకోడానికి శంకర్ వద్ద శిష్యులుగా చేరారు. నిజానికి ఆ బొమ్మతో ఏ మేలు జరగక పోయినా ఆ బొమ్మ పెట్టుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం పెరిగి సమర్థవంతంగా వారి వ్యాపారాలు, పనులు నిర్వహించుకోసాగారు. (క్లిక్: మాష్టారి పాఠం.. పదును పెట్టకపోతే వృథా పోవలసిందే) -
లక్ష్యసాధనకు స్వీయ నియంత్రణ
నేటితరంలో యువతను సునిశితంగా పరికిస్తే, కొందరిలో ఒక రకమైన నిరుత్సాహ ధోరణి కనబడుతుంది. ‘‘నేను పెద్ద చదువులు చదువుదామని అనుకున్నా, కానీ అది నాకు సాధ్యం కాని పని కదా’’, ‘‘నేను సివిల్ సర్వీస్ అంటే విపరీతంగా అభిమానిస్తా.. కానీ నాకది సాధ్యం కాదు సుమా..’’ వంటి సంభాషణలు తరచు వింటూ ఉంటాం. కానీ, ఆ ధోరణిలో మాట్లాడే యువతీ యువకుల మాటలను విని వదిలేయడం కాకుండా, వీలున్నంత వరకు వారిని సంస్కరించడానికి యత్నించాలి. మానవుడు సాధించలేనిది ఏముంది? మహితమైన, జగతికి హితమైన ఎన్నో కార్యాలను మన తోటి మానవులే సాధించారు. వారికి, సామాన్యమైన రీతిలో సాగేవారికి తేడా ఏమిటి? కారణాలు ఎన్నైనా, ప్రధాన సూత్రం ఒక్కటే..!! వారు తమపై తమకు అపురూపమైన రీతిలో నమ్మకాన్ని కలిగి ఉండడమే గాకుండా, తగిన రీతిలో పరిశ్రమించడమనేదే, వారు కోరుకున్నది సాధించగలగడానికి సహకరించిన విశేషమైన అంశం. వ్యక్తి అస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించే వాటిలో మొదటిది వారికి తమపై తమకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నతస్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆ విధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధిగా నిస్సందేహంగా చెప్పవచ్చు. విద్యలోనూ, విషయ గ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, వారికున్న మానసిక బలం, శారీరక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించవలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడగలగడమూ కష్టమేమీ కాదు. తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతి వ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతి వ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్న వ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిస కాకుండా ఉండడమూ స్వీయ నియంత్రణలో అంతర్భాగమే..!! తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు ఇవ్వకూడదు. సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణిని సూచించే ఒక చిన్న ఉదంతాన్ని ప్రస్తావించుకుందాం. ఒకచోట ఒక వక్త చక్కని ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని ఇస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ ఉపన్యాసాన్ని వినగోరి అక్కడకు వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని కొనసాగిస్తుంటే, ఆయన మెడలో ఉన్న గులాబీ దండలోని రేకులు ఒక్కటొక్కటిగా రాలి పడుతున్నాయి. మిత్రుల్లో ఒకడు రెండోవాడితో ‘‘చూశావా.. ఆయన వేసుకున్న దండలోని గులాబీరేకులు ఎలా రాలి పడుతున్నాయో..!! కాసేపటికి రేకులన్నీ రాలిపోగా చివరికి లోపలున్న దారం ఒక్కటీ ఆయన మెడలో మిగులుతుంది’’ అంటూ ఎకసెక్కపు ధోరణిలో నవ్వాడు. రెండోవ్యక్తి అతని మాటలకు ప్రతిస్పందిస్తూ, ‘‘నువ్వు ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తు్తన్నావు మిత్రమా.. ఆయన అమృతమయ వాక్కులకు పరవశించి, ఆ గులాబీ రేకులు పూజిస్తున్న చందాన, పవిత్రమైన ఆయన పాదాలను తాకుతున్నాయని భావించవచ్చు కదా’’ అన్నాడట. మనిషిలోని సానుకూల, ప్రతికూల ఆలోచనా ధోరణులకు ఈ మిత్రుల మాటలే అద్దం పడతాయి. సమస్త శక్తీ మనలోనే నిబిడీకృతమై ఉంది. మనసారా పరిశ్రమిస్తే, తలపెట్టిన ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేయగలడు. అద్వితీయమైన తన చేతలతోనే దైవత్వాన్నీ ప్రదర్శించగలడు. నిద్రావస్థను వదిలి జాగ్రదావస్థలోకి రాగలిగితే మానవమేధ దారిలోఎదురయ్యే అన్ని అవరోధాలను తొలగిస్తుంది... అన్ని అవసరాలనూ తీర్చగల, అన్ని ఆకాంక్షలనూ ఈడేర్చగల అపూర్వమైన శక్తి మనిషిలో దాగి ఉంది. అయితే, ఆ శక్తి తనలో ఉందని గ్రహించగలగడమే వివేకవంతుడు చేయగలిగిన పని. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే కారణం. జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను అందుకోవడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు పాటించే స్వీయ నియంత్రణ లేదా క్రమశిక్షణ అని చెప్పవచ్చు. ప్రతి మనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతలద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తిమంతమవుతుంది. –వ్యాఖ్యాన విశారద+ .++000000000 వెంకట్ గరికపాటి -
ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!
న్యూఢిల్లీ: ఇండియాలో ఆగస్టు లేదా సెప్టెంబర్ కంటే ముందే అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ శనివారం చెప్పారు. మే 25వ తేదీ నుంచి దేశీయ విమానాల సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో విమానాల రాకపోకలకు ఇప్పట్లో అనుమతి ఇవ్వొద్దని కోరుతున్నాయి. విమానాల్లో ప్రయాణించేవారు మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ కలిగి ఉండడం తప్పనిసరి కాదని హర్దీప్సింగ్ పురీ చెప్పారు. దాని బదులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, తమకు ఈ వైరస్ సోకలేదంటూ సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం ఇస్తే సరిపోతుందని వెల్లడించారు. దేశీయ విమానాల్లో వచ్చేవారి ఆరోగ్యసేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ చూపిస్తే వారిని క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని చెప్పారు. వందే భారత్ మిషన్ కింద ఈ నెలాఖరు నాటికి విదేశాల నుంచి 50 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. మే 7 నుంచి మే 21వ తేదీ మధ్య 23 వేల మందిని ప్రత్యేక విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు. -
ఆత్మీయులిచ్చిన ధైర్యం ఆత్మవిశ్వాసం..
సాక్షి, హైదరాబాద్: కరోనా.. కరోనా.. అంతటా దీని గురించే చర్చ.. ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ వైరస్ తీవ్రత ఇప్పుడు మన దగ్గర రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. లాక్డౌన్ సడలింపులతో జనజీవన సందడి పెరిగిన వేళ వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని, బయటికెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, ఇంట్లోకి రాగానే శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ నిర్మూలనకు ప్రత్యేకించి మం దులు, వ్యాక్సిన్ లేనందున దానితో సహజీవనం చేయక తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఈ వైరస్ మనలోకి ప్రవేశిస్తే ఎలా? అనే సందేహం అందరికీ వచ్చేదే. సైదాబాద్ సమీపంలో మాదన్నపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఏకంగా 60శాతం మందికిపైగా కరోనా వైరస్ బారినపడడం కలకలం రేపింది. ప్రస్తుతం వీరంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ పేషెంట్ అనుభవాలు ఆయన మాటల్లోనే.. ‘‘తొలుత మా అపార్ట్మెంట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు మా అపార్ట్మెంట్ వాసులందరినీ సరోజినీదేవి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించగా దాదాపు సగం మందికిపైగా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజల్ట్ చెప్పిన వెంటనే ఊపిరి ఆగినంత పనైంది. మా ఇంట్లో ముగ్గురికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగించింది. కానీ నాలో ఆత్మవిశ్వాసం సడలలేదు. ఇద్దరికీ ధైర్యం చెప్పా. జాగ్రత్తగా ఉండాలని సూచించా. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత ముగురినీ మూడు వార్డుల్లో ఉంచారు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు నాకు దగ్గు, జ్వరం మొదలైంది. వైద్యలు వెంటనే ఐసీయూకి తరలించి పారాసిటమాల్‌తో పాటు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, యాంటిబయాటిక్ మాత్రలు ఇచ్చారు. మూడు రోజుల్లో కోలుకున్నా. రెండ్రోజులుగా నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో మూడు రోజులు ఇదే స్థాయిలో ఉంటే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతాననిపిస్తోంది. కానీ నాకు కరోనా పాజిటివ్ రావడంతో మా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు సైతం కలత చెందారు. ఒకరితర్వాత ఒకరు వరుసగా ఫోన్లు చేయడం, సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యం చెప్పడంతో నాలో కొత్త ఉత్సాహం వచ్చింది. వాట్సాప్‌లో దాదాపు రెండువేల మెసేజ్‌లు వచ్చాయి. నా కోసం ఇంతమంది ఆలోచిస్తున్నారా.. అనే భావన నన్ను మరింత దృఢంగా చేసింది. మనకు కష్టం వచ్చినప్పుడు మన వెనక ఎవరుంటారనే సందేహం రావడం సహజం. కానీ నాకు ఇంతమంది ధైర్యాన్నివ్వడంతో చాలా త్వరగా కోలుకున్నా. ఈ వైరస్ వస్తే చనిపోతామనే అపోహ వద్దు. సకాలంలో గుర్తించి వైద్యుల సలహాలు పాటిస్తే చాలా ఈజీగా నమయవుతుంది. వసతులు బాగున్నాయి.. గాంధీ ఆస్పత్రిలో సేవలు చాలా బాగున్నాయి. సౌకర్యాలతో పాటు వాష్‌రూమ్‌లు, ఐసీయూలు, వార్డులన్నీ కార్పొరేట్ ఆస్పత్రి కంటే బాగున్నాయి. తొలుత తీసుకెళ్లిన సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు చూసి చాలా ఆందోళన చెందా. కరోనా పాజిటివ్ రావడంతో బతుకుతానా? లేదా? అనే సందేహం వచ్చింది. కానీ గాంధీలో చేరాక ఆ ఆలోచన పోయింది. సరోజినీదేవి ఆస్పత్రిలో వసతులు మరింత మెరుగుపర్చాలి’’. -
అనితరసాధ్యం
నడవడానికి కాళ్లు కావాలేమో కానీ, జీవితంలో ఎదగడానికి కాళ్లతో పనేముందన్నట్లు అనిత దూసుకెళుతున్న విధానం చూస్తుంటే.. మరెవరికీ ఇది సాధ్యం కాదని (అనితరసాధ్యం) అనిపిస్తుంది. అయితే ‘‘లైఫ్‌లో నేను పరుగులు తీయడమే కాదు, నాలాంటి వాళ్లనూ ఉత్సాహంగా పరుగులు తీయిస్తాను’’ అని అనిత ఆత్మవిశ్వాసంతో అంటున్నారు. అనిత అందరిలాగే పుట్టింది. చలాకీగా అడుగులు వేసింది, పరుగులు తీసింది, ఆడింది, పాడింది. ఇంతలోనే ఊహించని విధంగా ఆమె ఆరో ఏట అకస్మాత్తుగా నడవలేక కూర్చుండిపోయింది. ఆమె నడకను పోలియో ఎత్తుకుపోయింది. రెండు కాళ్లు కదపలే కపోయింది అనిత. ఆమెది జైపూర్. నడక కోసం అనిత కర్ర కాళ్ల మీద ఆధారపడవలసి వచ్చింది. అయితే ఆ కర్రకాళ్లు ఆమె విజయాలకు ఎన్నడూ అడ్డంకి కాలేదు. చిన్నతనంలోనే అనిత సపోర్ట్ వీల్స్‌తో బైక్ నడిపింది. పెద్దయ్యాక మారుతి ఆల్టో కారు కొనుక్కుంది. యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్‌లను చేతితో వాడే విధంగా మార్పులు చేయించుకుంది. తనకు కావలసిన వేగాన్ని మార్చుకునేందుకు అనువుగా డాష్ బోర్డు మీద ఒక లీవర్ని ఏర్పాటు చేయించుకుంది. జైపూర్‌లోని రాజేశ్ శర్మ అనే ఒక మెకానిక్ ఈ విధంగా కారులో మార్పులు చేశాడు. ఈ కస్టమైజ్డ్ మార్పుల విద్యను ‘జుగాడ్’ అంటారు. ‘‘ఈ కారు వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు, ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండగలుగుతున్నాను’’ అంటున్నారు అనిత. రాజేశ్ ఇప్పటికి ఈ విధంగా మూడు వేల కార్లు తయారుచేశాడు. శరీరంలో కాళ్ల భాగం అస్సలు పనిచేయనివారికి అనువుగా మరికొన్ని మార్పులు చేస్తున్నాడు రాజేశ్‌శర్మ. అంతేకాదు ఎవరికి అవసరమో వాళ్ల ఇంటి దగ్గరకు వచ్చి మరీ కారుకి సంబంధించిన పనులు చేస్తాడు రాజేశ్. గేర్ బాక్సుని ఏ మాత్రం కదపకుండా, స్టీరింగ్ చక్రానికి కిందిగా లీవర్లు ఉంచుతాడు. బైక్‌కి ఉన్నట్లుగానే యాక్సిలరేటర్‌ను తేలికగా ఉపయోగించుకునేలా చేస్తాడు. ఈ కారే వెన్ను తట్టింది! అనిత ఉన్నత చదువులు చదవడానికి ఈ కారే ప్రోత్సహించింది. ‘డిజెబిలిటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ అనే అంశం మీద ఐఐఎం ఇండోర్‌లో పి.హెచ్డి. చేయడానికి ఆమెకు ఈ కారే సహకరించింది. ఇప్పుడు తనలాంటి వారికి ఆమె కార్ డ్రైవింగ్ నేర్పించడం కూడా ఈ కారు కారణంగానే! అనిత పిహెచ్డి చేసే సమయంలో నవీన్ గులియా అనే సాహస బాలుడిని కలవడం తటస్థించింది. అతడు సాహసాలలో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించాడు. అతనికి మెడ నుంచి కింది వరకు శరీరం నిర్జీవం అయిపోయింది. అతడితో కార్ డ్రైవింగ్ గురించి మాట్లాడుతూ ఉండగానే, ఒక అమ్మాయి తన దగ్గరకు వచ్చి, అనిత తయారు చేయించుకున్న కారులో ఎలా డ్రైవింగ్ చేయొచ్చో నేర్పించమంది. ఆ అమ్మాయి సరదాగానే అడిగింది కానీ, అనిత డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించడానికి అదే పునాది అయ్యింది. ఆ తరవాత అనిత, దివ్యాంగుల డ్రైవింగ్ స్కూల్స్ గురించి ఎంక్వయిరీ చేశారు. ఎవ్వరికీ లైసెన్సు లేదు. ఇటువంటివారికి ట్రయినింగ్ ఇవ్వాలంటే లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో భారతదేశంలో 2013లో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ మొదలైంది. అప్పటికే అనిత తన కారులో కొందరికి డ్రైవింగ్ నేర్పారు. తానూ ప్రొఫెషనల్‌గా మారాలనుకున్నారు. ‘‘డ్రైవింగు నేర్చుకునేవారికి మొదటి అడ్డంకి మనోబలం లేకపోవడమే. వారి మీద వారికి నమ్మకం లేకపోవడం మరో కారణం’’ అంటారు అనిత. అనిత కూడా లైసెన్సు తీసుకుని, స్వయంగా డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టారు. ఆమె విద్యార్థులలో ఒకరికి ఎడమ చేయి లేదు. కుడి చేత్తోనే స్టీరింగ్ తిప్పుతూ, గేర్లు మార్చుతూ కారు నడుపుతున్నారు. గేర్లు మార్చేటప్పుడు ఏ మాత్రం తడబాటు ఉండేలా ధైర్యాన్ని అలవరుస్తున్నారు అనిత. ప్రారంభించిన ఎనిమిది నెలలకే 16 మందికి డ్రైవింగ్ నేర్పారు అనిత. ఒకసారి ఒక్కరిని మాత్రమే ఎంచుకుంటున్నారు ఆమె ఇప్పుడు 17వ స్టూడెంట్‌కి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. ఆరు వేల రూపాయల ఫీజు తీసుకుంటూ డ్రైవింగ్ నేర్పిస్తున్న అనిత, ఈ ఫీజులో అధికభాగం వీల్చెయిర్లకే కేటాయిస్తున్నారు. అందుకే అందరి కంటె కొద్దిగా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. శరీర బలం కాదు, మనోబలం చాలు కార్యసాధనకు అని నిరూపించారు అనిత. – వైజయంతి -
శభాష్... శివలాల్
సాక్షి, హైదరాబాద్: అతని ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. కష్టపడేతత్వం ఉండాలే గానీ... ఎన్ని సమస్యలొచ్చినా ఎదురీదొచ్చని నిరూపించాడు అతడు. రాష్ట్రంలో 300 మంది మరుగుజ్జులు ఉండగా, వారిలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిగా ఘనత సాధించారు గట్టిపల్లి శివలాల్(35). జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన శివలాల్ బీకామ్ పూర్తిచేసి, పీజీడీసీఏ చేశాడు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లోని డెక్కన్ ట్రయల్స్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన శివలాల్... తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో నగరానికొచ్చి ఉద్యోగంలో చేరాడు. సంస్థ ఎండీ ప్రోత్సాహం, సహోద్యోగుల సహకారంతో ఆయన 12 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నాడు. శివలాల్.. చిన్మయి అనే మరుగుజ్జు అమ్మాయినే వివాహమాడాడు. వీరికి ఒక బాబు ఉన్నాడు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న శివలాల్‌కు సొంతిల్లు కూడా లేదు. బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.11లోని ఉదయ్‌నగర్‌లో అద్దె ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు. తమలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ఏదైనా ఉపాధి కల్పించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని శివలాల్ వేడుకుంటున్నాడు. నడుచుకుంటూ ఆఫీస్‌కు.. ఇంటికి సమీపంలోనే కార్యాలయం ఉండటంతో శివలాల్ రోజూ నడుచుకుంటూనే వెళ్తుంటాడు. దారి పొడవునా తనను చాలా మంది వింతగా చూస్తుంటారని, అవేమీ తాను పట్టించుకోనన్నారు. అయితే ఆఫీస్‌లో సహోద్యోగులంతా తనకెంతో ధైర్యాన్ని ఇస్తారన్నాడు. టైప్ నేర్చుకునేప్పుడు పొట్టివేళ్లు పనికిరావని తిట్టిన నిర్వాహకులకు నిమిషానికి 80–100 పదాలు కొట్టి సవాల్ విసిరాడు. గుండె ధైర్యంతో అన్నింటినీ జయిస్తున్న శివలాల్ ఎక్కడా సిగ్గుపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. -
ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారా?
సెల్ఫ్‌చెక్ చిన్నప్పుడే ఒంటరితనం అంటే ఏమిటో తెలుస్తుంది. చిన్న పిల్లలకు అమ్మ కనిపింకపోతే తల్లడిల్లిపోతారు. పదిమంది ఒకచోటకు చేరే సందర్భాల్లో కలవరు. సంఘంలో చిన్నచూపుకు గురవటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మొదౖలన కారణాలు లోన్లీనెస్‌ను ప్రేరేపిస్తాయి. అయితే ఒంటరిగా ఉండటం వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్రియేటివిటీకి లోన్లీనెస్ చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీనికి హద్దు ఉండాలి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారా? 1. ఎవరితోనైనా మాట్లాడటానికి, కలిసి తిరగటానికి ఇష్టపడరు. ఎ. అవును బి. కాదు 2. మీ చుట్టూ ఉన్నవారు మీలా ఉండరని మీకు నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు కనిపించలేదని బాధ పడుతుంటారు. ఎ. అవును బి. కాదు 3. ఉద్వేగాలను అణుచుకోవటం కోసం ఒంటరి తనాన్ని కోరుకుంటారు. ఎ. అవును బి. కాదు 4. చెడ్డ అలవాట్ల (మద్యపానం లాంటివి) వల్ల ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఎ. అవును బి. కాదు 5. ఎవరితో కలవకుండా మీలో మీరే కుమిలిపోతుంటారు. చెడు ఆలోచనలను అదుపు చేయటం మీవల్ల కాదు. ఎ. అవును బి. కాదు 6. జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఉంటారు. దీనివల్ల అభత్రతాభావం మీలో ఉంటుంది. ఎ. అవును బి. కాదు 7. ఏమీ సాధించలే మని, నేనెందుకూ పనికిరానని అనుకుంటుంటారు. ఎ. అవును బి. కాదు 8. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవిం చరు. మీకు నచ్చినదే కరెక్ట్ అని వాదిస్తారు. ఎ. అవును బి. కాదు 9. ఎప్పుడూ పనిమీదే ధ్యాస. ఇతర విషయాలను పట్టించుకోరు. పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. ఎ. అవును బి. కాదు 10. ఎప్పుడూ పరధ్యానంలో ఉంటారు. మనోనిబ్బరం లేకుండా ఉంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు ఏడు దాటితే మీరు ఒంటరితనాన్ని ఇష్టపడతారు. న్యూనతాభావంతో ఉంటారు. నిరాశావాదంలో ఉండకండి. మీ సమస్యలు, సంతోషం ఇతరులతో పంచుకుంటేనే మనసు తేలిక పడుతుంది. అనవసర భయాందోళనకు దూరంగా ఉండండి. -
రైతులకు మనోధైర్యం కల్పించాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ పంథిని (వర్ధన్నపేట) : భారీ వర్షాలతో పంట నష్టపోయి రైతులకు పరిహారం చెల్లించి వారికి మనోధైర్యాన్ని కల్పించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంథిని గ్రామంలో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న పంటలను వైఎస్సార్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడారు. భారీ వర్షాలకు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగిందన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నప్పటికీ అధికార పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలు పంటనష్టాన్ని పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. స్వర్ణయుగం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు రైతులు గుర్తుచేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకోవాలని పార్టీ నా యకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జి పసునూరి ప్రభాకర్, మండలాధ్యక్షుడు దొంతి సురేందర్‌రెడ్డి, నాయకులు బూర సుమన్, నిమ్మనబోయిన రమేష్, తూళ్ల రాజేష్, సమ్మెట రాజు, బండారి సతీష్, తదితరులు పాల్గొన్నారు. రైతులను పట్టించుకోవడం లేదు పర్వతగిరి : అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు రైతులను పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన మొక్కజొన్నను పరిశీలించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజులుగా కురిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఎంపీలు, ఎమ్మెల్యేలు పరామర్శించకపోవడం దారుణమన్నారు. మం డల పార్టీ అధ్యక్షుడు దండంపల్లి సైదులు, జంగ మురళి, జంగ వీరమల్లు, ముడిదెన దేవేం దర్, వడ్లకొండ వీరభద్రయ్య, అక్కల అనిల్, సుధాకర్ ఉన్నారు. -
చింపాంజీలకు తప్పొప్పులు తెలుసు
న్యూయార్క్: మనుషులు తాము చేసే పని సరైనదే అయినప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మనుషుల్లాగే చింపాంజీలు కూడా తాము చేసే పని సరైనదైనప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. చింపాంజీలను మనుషులకు పూర్వ జీవులుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఒక విషయాన్ని నేర్చుకోవడంలో, తెలుసుకొని అర్థం చేసుకోవడంలో అవి మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే గుణం కూడా చింపాజీలకు ఉంది. ఏదైనా పరిస్థితుల్లో మనకు ఆ విషయం గురించి అవగాహన ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ప్రవర్తిస్తాం. మనకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో స్పందిస్తాం. మనకు ఎంత తెలుసు అనేదాన్ని బట్టే మన ఆత్మవిశ్వాసం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితే జంతువుల్లో కూడా ఉంటుందా అనే అంశంపై జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం సాగించారు. చింపాంజీలపై వీరు సాగించిన అధ్యయనంలో అవి కూడా మనుషుల్లాగే స్పందిస్తాయని రుజువైంది. ఈ అధ్యయనంలో చింపాంజీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో సమాధానం ఇవ్వగానే వాటికి ఆహారాన్ని వేరే చోట ఏర్పాటు చేసినట్లు కంప్యూటర్లో తెలిపేవారు. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు మాత్రమే వాటికి అక్కడ ఆహారాన్ని అందించేవారు. సమాధానం చెప్పిన వెంటనే చింపాంజీలు ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లేవి. కానీ సరైన సమాధానం చెప్పినప్పుడు ఆహారాన్ని తీసుకునేందుకు త్వరగా వెళ్లగా, సమాధానం తప్పుగా చెప్పినప్పుడు మెల్లగా వెళ్లేవి. సమాధానం సరైనదని అనిపించినప్పుడు అవి పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించాయి. దీన్ని బట్టి అవి కూడా మనుషుల్లాగే తాము చేసేది సరైనదైతే ఆత్మవిశ్వాసంతో ఉంటాయని రుజువైంది. -
8 పాయింట్స్
నందనా సేన్ నమ్మకం మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎవరికి మాత్రం ఉంటుంది? అందుకే ఏ పని చేయాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. చెప్పొచ్చేదేమిటంటే నమ్మకం అనేది పదం కాదు...విజయానికి అవసరమైన పెట్టుబడి. కాలం ‘నా కెరీర్లో నిండా కూరుకుపోయాను’ అంటుంటారు. ఇది మంచిదా కాదా అనే విషయం పక్కనపెడితే ఎప్పుడూ ఒకే దిక్కు కాకుండా ఇతర దిక్కులపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే సమాజానికి ఉపయోగపడే స్వచ్ఛందసేవా కార్యక్రమాలు చేయగలము. ఎజెండా అమలుపరిచే విధానం, సాధనం కంటే ‘ఎజెండా’ ముఖ్యమైనది. నాన్నగారు (అమర్త్యసేన్) తన భావాలను పంచుకోవడానికి ఆర్థికశాస్త్రం ఉకరణంగా ఉన్నట్లే, నా భావాలను పంచుకోవడానికి ‘కళ’ అనేది ఉపకరణం. పరిమితి మనకు మనమే పరిమితులు విధించుకుంటాం. బాంబేలో ‘బ్లాక్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ‘మీరు హార్వర్డ్ టాపర్ కదా! సినిమాల్లో నటించడమేమిటి?’ అని ఆశ్చర్యంగా అడిగేవారు. నేను రచయితను, యాక్టివిస్ట్‌ను కూడా. ‘మీరు నటి కదా రాయడం ఎందుకు?’ అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే... ఒక ప్రతిభ మరో ప్రతిభను నియంత్రించకూడదు అనుకుంటాను. సహజం ‘నా ప్రతిభను గట్టిగా చాటుకోవాలి’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకుంటే ప్రతిభ మాట ఎలా ఉన్నా ఒత్తిడి అనేది రెక్కలు విరుచుకుంటుంది. ఏదైనా సహజంగానే జరగాలి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా ప్రతిభ చూపగలుగుతాము. సంతృప్తి పిల్లల హక్కుల కోసం పనిచేయడం, పిల్లల్ని వినోదపరచడం కోసం రచనలు చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే పని. ‘లవ్ బుక్’ అనే పిల్లల పుస్తకం ఒకటి రాశాను. వ్యూహం ‘నా కెరీర్ ఇలా ఉండాలి అలా ఉండాలి’ అని ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్ట్రాటజీ ఏర్పర్చుకోలేదు. మూసదారిలో వెళ్లిపోకుండా కొత్తదనం కోసం ప్రయత్నించడమే నా నిజమైన స్ట్రాటజీ. హ్యాపీలైఫ్ నా దృష్టిలో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం అంటే... నమ్ముకున్న విలువల కోసం నచ్చినట్లు బతకడం, సమాజం కోసం మనవంతుగా ఏదో ఒకటి చేయడం. -
ఆమె అడవిని జయించింది..
నగర మహిళలు మోడరనే కాదు... ఫియర్లెస్ కూడా. ఎత్తై గుట్టల్ని అవలీలగా ఎక్కేస్తూ.. ఎంతటి కష్టమైనా సరే ఈజీగా విజయాన్ని చేజిక్కించుకోగలమని చాటుతున్నారు. నదీ జలాల్ని సునాయాసంగా దాటేస్తూ... జీవితాన్నే ఎదురీదుతున్న తమకు ఇదో లెక్కకాదని నిరూపిస్తున్నారు. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, రాక్ క్లైంబింగ్... సాహసంగానో, ప్రత్యేక గుర్తింపు కోసమో కాదు కేవలం అభిరుచిగా మాత్రమే చేస్తున్నారు. ఆటవిడుపు కోసం అడవులను ఎంచుకుని, ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తున్న కొందరు మహిళల గురించి... వాంకె శ్రీనివాస్ ఒకప్పుడు మహిళ ఆసక్తులంటే... సంగీతం, నృత్యం, పుస్తక పఠనం, కుట్లు, అల్లికలు, రకరకాల వంటల తయారీ. అతి కొద్ది మంది మాత్రమే వీటికి భిన్నంగా నడిచేవారు. జనరేషన్ మారింది. ఇప్పుడలా కాదు. చిన్నతనం నుంచే ప్రత్యేకంగా ఉండే హాబీలను ఎంచుకునే వారు కొందరైతే... ఉద్యోగం, కుటుంబ బాధ్యతల నుంచి విశ్రాంతి పొందేందుకు వినూత్న ప్రయోగాలు చేయాలనుకునేవారు మరికొందరు. ఈ ఆలోచనలే ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, రాఫ్టింగ్ వంటి సాహసాలవైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయంటున్నారు ఈ తరం మహిళలు. సెల్ప్ కాన్ఫిడెన్స్... కొత్త ప్రదేశాలు చుట్టిరావడమంటే కొత్త విషయాలు నేర్చుకోవడమే. ఆసక్తి ఉండాలే కానీ సాహస యాత్రలను మించిన అభిరుచి లేదంటారు ఐకామ్ టెలీ లిమిటెడ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రజనీ పోతినేని. ‘మా స్వస్థలం విజయవాడ. పదిహేనేళ్ల కిందట హైదరాబాద్‌కు మారాం. విజయవాడలో చదువుతున్నప్పుడు మా కళాశాలలో స్పోర్ట్స్ ఈవెంట్లలో చలాకీగా ఉండేదాన్ని. సిటీలోనూ జరిగే వివిధ రన్స్‌లో పాల్గొంటుండేదాన్ని. అలా నాకు నాలుగేళ్ల కిందట గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ (జీహెచ్ఏసీ) గురించి తెలిసింది. వెంటనే అందులో సభ్యత్వం తీసుకున్నా. అప్పటి నుంచి ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ల్లో చురుగ్గా పాల్గొంటున్నా’ అని సంతోషంగా చెబుతున్నారామె. ‘ఈ సాహసయాత్రల కోసం ఎక్కువ దూరాలు వెళ్లాల్సిన పనిలేదు. నగరానికి చుట్టూనే ఎన్నో మంచి ప్రాంతాలున్నాయి. భువనగిరి ఫోర్ట్, శేషాచలం కొండలే అందుకు ఉదహరణ. వాటిపైకి ఎక్కడం, అందరితో కలిసి చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని వంటచేసుకొని తినడం. అదో అద్భుతమైన అనుభూతి. అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని కొత్త ప్రదేశాలు... అడవుల్లో పర్యటించినప్పుడు కలిగే ఆనందం, సొంతమయ్యే ఆత్మస్థైర్యం అంతా ఇంతా కాదు’ అంటూ రజనీ అనుభూతులను నెమరువేసుకున్నారు. జాగ్రత్తలు అవసరం... మహిళలు ఒంటరిగా సాహసయాత్రలు చేయగలరా? ఇంటి గడప దాటని వారు... నదులు దాటగలరా? ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు, అనుమానాలు. కానీ అలాంటి సందేహాలకు తమ సాహసాలతో సమాధానం చెబుతున్నారీ మహిళలు. ‘ఏటవాలుగా ఉన్న కొండలు ఎక్కుతుంటే జారిపోతున్నట్లుంటుంది. కాస్త కష్టమే అయినా అదో ఆనందం. తాడు సాయంతో నది దాటడం, రాత్రిళ్లు ఆడవుల్లో తిరగడం లాంటివాటికి చాలా మంది భయపడతారు. కానీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంది. సాహసయాత్రలు చేయాలనుకున్నవారు ఒకేసారి సుదూరాలు వెళ్లాలనుకోకూడదు. మొదట స్థానికంగా ఉన్న వాటిపై దృష్టి పెట్టాలి. అప్పుడే అవగాహన వస్తుంది. ఆసక్తి ఉండాలి. మానసికంగా మనల్ని మనం సిద్ధం చేసుకోగలగాలి. సాహసాలకు అవసరమైన నైపుణ్యాలను ఒంటబట్టించుకోవాలి. జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. స్థానిక ప్రాంతాలే కాదు... మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ఆడవుల్లోనూ మేం ప్రయాణించాం’ అని చెప్పుకొచ్చింది ఇన్నోమైండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న సిరి అప్పినేని. లైఫ్‌కి అన్వయించుకోవచ్చు... మంచి అభిరుచి ఎంచుకోవడమే కాదు. దాన్ని జీవితానికి అన్వయించుకోవడం తెలిసుండాలి. అదే అసలైన ఆనందం అంటున్న హైదరాబాదీ యువతి ఫరీదా సుల్తాన్. ఈమె ఫ్రిలాన్స్ కన్సల్టెంట్. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా ట్రెక్కింగ్, ఆడవుల్లో పర్యటించడం, పర్వతాలు ఎక్కడం.. అంటే ఎంతో ఆసక్తి. ఆమె ఆసక్తికి కుటుంబ ప్రోత్సాహం తోడయ్యింది. ఇంకేముంది... వారాంతం వస్తే చాలు... సాహసాలకే సమయం కేటాయిస్తుంది. హైదరాబాద్‌లోని మౌలాలి, శామీర్‌పేట్, ఖాజాగూడ, అమ్మగూడలోని గుట్టలే కాదు... మహారాష్ట్రలోని పుణేను చుట్టి వచ్చిందీమే. ‘పుణేలోని ఎత్తై ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ కొండల్లో రాత్రంగా ఉండడం, నిశీధిని జాగ్రత్తగా గమనించడం, వంట చేసుకోవడం, అదో మధురానుభూతి. ఈ యాత్రల వల్ల నేను చాలా నేర్చుకున్నా. ట్రక్కింగ్కి వెళ్లేటప్పుడు అవసరమైన సామగ్రిని మాత్రమే తీసుకెళతామంటోంది ఫరీదా. మానసిక దృఢత్వం, దేన్నయినా సాధించగలమనే ఆత్మవిశ్వాసం... ఎందుకు చేయలేమనే పట్టుదల... వంటివన్నీ సాహసయాత్రలతోనే అలవాడతాయి. పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి పొందడానికి ఇలాంటి సాహసాలకు మించిన రిఫ్రెష్మెంట్ లేదంటోంది ఫరీదా. -
గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?!
కార్యాలయంలో ఒక బృందానికి నాయకత్వం వహించడం సులభం కాదు. విజయవంతమైన నాయకుడిగా సహచరులను ముందుకు నడిపిస్తే అనుకున్న ఫలితాలను సాధించొచ్చు. ఒక టీమ్‌లో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వారు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు! అనేది నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. లీడర్ సమర్థుడైతే అనుచరులు కూడా అంతే సమర్థంగా పనిచేస్తారు. ఒక వ్యక్తి సక్సెస్‌పుల్ లీడర్‌గా గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. సహచరులను గౌరవించండి ఆఫీస్‌లో మీరు టీమ్‌లీడర్ అయితే.. మీతో కలిసి పనిచేసేవారిని గౌరవించండి. చేస్తున్న పనిపై వారి అభిప్రాయాలను తెలుసుకోండి. సూచనలు తీసుకోండి. పనిలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారానికి సహచరుల సహకారం పొందండి. తమ పనికి గుర్తింపు లభిస్తోందని, తాము ముఖ్యమైన వ్యక్తులమనే భావన వారిలో కలిగేలా వ్యవహరించండి. వారి కృషిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వారి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆరోగ్యవంతమైన అనుబంధాన్ని కొనసాగించండి. ప్రేరణ కలిగించండి సహచరులకు సవాళ్లతో కూడిన పనులను అప్పగిస్తూ వారిలో ప్రేరణ నింపండి. స్ఫూర్తిని కలిగించండి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే బహుమతులు ప్రదానం చేయండి. తగురీతిలో సత్కరించండి. కార్యాలయంలో మీ పనితీరు, సత్ప్రవర్తనతో జూనియర్లకు ఒక రోల్‌మోడల్‌గా మారండి. వారు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేలా వ్యవహరించండి. మీరు ఎలాంటి నాయకుడనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది. అర్థమయ్యేలా వివరించండి మీరు రూపొందించిన ప్రణాళిక విజయవంతం కావాలంటే.. అది బృంద సభ్యులకు సరిగ్గా అర్థం కావాలి. దానితో వారు అనుసంధానమవ్వాలి. కాబట్టి మీ ఆలోచనలను అర్థమయ్యేలా వివరించండి. లక్ష్యాలను చేరడానికి దారి చూపండి. టీమ్ నుంచి మంచి ఔట్పుట్ రావాలంటే లీడర్ నైపుణ్యాలు మెరుగవ్వాలి. జవాబుదారీతనం సహచరులకు కొత్త బాధ్యతలను, విధులను అప్పగించడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచండి. విధుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకొని, ఫలితాలను సాధించేలా వారిని ప్రోత్సహించండి. దీంతో వారిపై వారికి నమ్మకం పెరిగి భవిష్యత్తులో మంచి ఉద్యోగులుగా రాటుతేలుతారు. జూనియర్లను విశ్వసించండి భవిష్యత్ లక్ష్యాలను జూనియర్లతో పంచుకోండి. చేపట్టాల్సిన బాధ్యతలను వారికి పంచండి. లక్ష్యాలు సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను వారి సహకారంతో రూపొందించండి. అందులో వారిని భాగస్వాములను చేయండి. సహచరులను సంపూర్ణంగా విశ్వసించండి. నాయకుడు ఎల్లప్పుడూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. -
ఇంటర్వ్యూలో గెలుపునకు.. సన్నద్ధత, ఆత్మవిశ్వాసం!
జాబ్ ఇంటర్వ్యూ అనగానే అభ్యర్థుల్లో ఏదో తెలియని బెరుకు మొదలవుతుంది. అదో భయపెట్టే భూతంలాగా భావిస్తుంటారు. కానీ, ముందుగా సన్నద్ధమై, ఆత్మవిశ్వాసం పెంచుకుంటే మౌఖిక పరీక్షను ఎదుర్కోవడం సులభమే. ఇంటర్వ్యూలో ఉభయపక్షాల భాగస్వామ్యం ఉంటుంది. ఈ పరీక్ష మీకే కాదు కంపెనీకీ కూడా అవసరమే. మీకు ఉద్యోగం కావాలి, సంస్థకు మంచి ఉద్యోగి కావాలి. కాబట్టి మీరు భయపడడం అన వసరం. ముందస్తు సన్నద్ధత, ఆత్మవిశ్వాసం.. ఈ రెండింటితో ఎలాంటి ఇంటర్వ్యూలోనైనా జయకేతనం ఎగరేయొచ్చు. కామన్ ప్రశ్నలు: ఇంటర్వ్యూలో అడగబోయే అన్ని ప్రశ్నలను ఎవరూ ఊహించలేరు. కానీ, సాధారణంగా అన్ని మౌఖిక పరీక్షల్లో అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఉంటాయి. వాటికి సరైన సమాధా నాలను సిద్ధం చేసుకుంటే యుద్ధంలో సగం గెలుపు ఖాయమైనట్లే. తెలిసిన విషయాలను ఇంటర్వ్యూ లో పూర్తిఆత్మవిశ్వాసంతో చెబితే సానుకూలమైన ఫలితం కచ్చితంగా ఉంటుంది. కరిక్యులమ్ విటే (సీవీ)లో రాసిన అన్ని అంశాలపై మీకు పట్టు ఉండాలి. సీవీని ఎక్కువసార్లు చదువుకోవాలి. అందులో ప్రస్తావించిన అంశాలపై ఇంటర్వ్యూలో ప్రశ్నలను సంధిస్తారు. విద్యాభ్యాసం, పాత యాజ మాన్యం గురించి అడుగుతారు. సీవీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా బదులిచ్చేలా ఉండాలి. కనీసం నటించండి: మీలో ఆత్మవిశ్వాసం తగుపాళ్లలో లేకపోవచ్చు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఇంటర్వ్యూలో నటించండి. మీ శరీరభాష దానికి తగ్గట్లుగా ఉండాలి. దీనివల్ల రిక్రూటర్పై సానుకూల ప్రభావం కలిగించొచ్చు. వంగిపోయినట్లుగా కాకుండా కుర్చీలో నిటారుగా కూర్చోండి. రిక్రూటర్ కళ్లలోకి నేరుగా చూస్తూ ధైర్యంగా మాట్లాడండి. ‘ఈ ఇంటర్వ్యూలో విఫలమైతే నాకు నష్టమేం లేదు’ అనే మైండ్‌సెట్‌ను అలవర్చుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కంటినిండా నిద్ర: ఉదయాన్నే శరీరం, మనసు తాజాగా ఉండాలంటే రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఇంటర్వ్యూ కోసం ఆఖరి క్షణంలో ప్రిపరేషన్ ప్రారంభిస్తే కంగారు తప్పదు. విశ్రాంతి కూడా దొరకదు. కాబట్టి ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసుకొని ఇంటర్వ్యూ ముందురోజు రాత్రి హాయిగా నిద్రించండి. ఆలస్యంగా భోజనం చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంటర్వ్యూలో ధరించాల్సిన దుస్తులు, బూట్లను ముందురోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి. మహిళలైతే తమ గోళ్ల రంగు(నెయిల్ పెయింట్)ను, ఎబ్బెట్టుగా ఉండే అలంకరణను తొలగించుకోవాలి. సమయానికి చేరుకొనేలా: కారణాలు ఏవైనా కానివ్వండి.. మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరుకావడం ఎంతమాత్రం సరికాదు. ఇంటి నుంచి ఇంటర్వ్యూ కార్యాలయం వరకు ప్రయాణించడం ప్రయాసతో కూడుకున్నదే. దూర ప్రయాణమైతే అలసిపోతారు. ఇంటి నుంచి కార్యాలయం ఎంత దూరంలో ఉంది? అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పుడు బయల్దేరాలి? వంటి విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. వీలైతే ఒకసారి అక్కడికి వెళ్లిరావడం మంచిది. దాని ప్రకారం ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆఖరి నిమిషంలో హడావుడిగా పరుగులు పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఉదయం వేళ మేలు:ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీ వంతు కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడు ఒక గ్లాస్ నీరు తాగండి. బిగ్గరగా ఊపిరి పీల్చుకోండి. విశ్రాంతి స్థితిలోకి రండి. గొంతులో గరగర లేకుండా చూసుకోండి. ఇంటర్వ్యూలో చెప్పబోయే సమాధానాలను మనసులో ఒకసారి మననం చేసుకోండి. మీ గురించి మీరు మనసులో చెప్పుకోండి. దీనివల్ల ఒత్తిడి మాయమవుతుంది. ఇంటర్వ్యూ ఏ సమయంలో నిర్వహించాలనేది కంపెనీ నిర్ణయమే. ఒక్కోసారి ఈ అవకాశం అభ్యర్థికే ఇస్తుంటారు. అలాంటప్పుడు ఉదయం వేళనే ఎంచుకోండి. ఎందుకంటే అప్పుడు వాతావరణం నిర్మలంగా ఉంటుంది. శరీరం, మనసు రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ సమయంలో విజయావకాశాలు అధికం. ఒకవేళ మధ్యాహ్నం లేదా సాయంత్రమైతే అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. -
చీకటికి చురక
మెరిసే తారల రూపం.. కురిసే వెన్నెల దీపం.. ఆ కళ్లకు శూన్యం. చిరుదివ్వెల్లా వెలగాల్సిన ఆ కనులకు తిమిరంతో సమరం తప్ప మరొకటి తెలియుదు. ఊహల్లోనూ చీకటితో సావాసం చేసే సాహసగాళ్లు వాళ్లు. ఉదయించు భాను బింబాన్ని చూడలేకున్నా.. ఆ లేత కిరణాలు వారి హృదయూలను తాకుతాయి. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంతను చూడలేకపోయినా.. అందాలు అలుముకున్న అవని సొగసులకు ఆ మనసులు స్పందిస్తాయి. అంతేనా చుట్టుపక్కల చూడలేని ఈ చిన్నవాళ్లు.. సవూజంలో కొట్టే కుళ్లు కంపు పసిగడతారు. ఆ కుళ్లును కడిగేసే శక్తి వూకుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చీకటి ముసురుకున్న ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. వారి మనోనేత్రం మాత్రం బంగారు కలలు కంటున్నాయి. అంధకారం అలుముకున్న సమాజంలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. దేవుడిచ్చిన చీకట్లలో మగ్గిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటున్న చీకటి దివ్వెలను స్టార్ రిపోర్టర్‌గా సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పలకరించారు. వారి మనసులోని భావాలను మన ముందుంచారు.. ఆర్పీ పట్నాయక్: హలో.. హాయ్ ఐయామ్ ఆర్పీ పట్నాయక్ చిన్నారులు: హాయ్...సార్! థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆర్పీ: నేను వచ్చింది మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి మాత్రమే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. అవినాష్: వావ్.. థ్యాంక్యు వెరీ మచ్ సార్ ఆర్పీ: ఒకే.. మీకు స్కూల్లో ఏం నచ్చుతుంది? చేతన: ఎడ్యుకేషన్ మల్లికార్జున్: కంప్యూటర్ ల్యాబ్ జయ: ఫ్రీడమ్.. ముఖ్యంగా మాకేసి జాలిగా చూడకుండా మామూలు పిల్లల్ని చూసినట్టే చూస్తారు. ఆర్పీ: మీరు మామూలు పిల్లలు కాదని ఎవరన్నారు? సరస్వతి: ఎవరూ అనరు సార్. ఇంటికెవరైనా బంధువులొస్తే ముందు మా గురించే అడుగుతారు? మమ్మల్నే పలకరిస్తారు. వాళ్లున్నంత సేపు టాపిక్ మేమే. గాయత్రి: మా గురించి జాలిగా మాట్లాడుకోవడం.. లేదంటే తక్కువగా చూడ్డం వంటి సందర్భాల్లో చాలా బాధేస్తుంది. ఆర్పీ: అంటే వారి ఉద్దేశం.. కళ్లున్నవారే జీవితంలో ఎదగడం, సెటిలవ్వడం కష్టమనుకునే రోజులు కదా. అంధులంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని! శివారెడ్డి : అలాగనుకుంటే కళ్లు లేనివారి గురించి కాదు జాలి పడాల్సింది. ఆసరా లేనివారి గురించి. నిరుపేద పిల్లల గురించి ఆలోచించమనండి. చేతనైతే వారికి సాయం చేయమని చెప్పండి. విష్ణు: సార్ పట్టుదల, ఆత్మవిశ్వాసం లేనివారి గురించి కూడా జాలి చూమమని చెప్పండి. ఆర్పీ: మీరు చెప్పింది నిజం. సరే.. ఆ టాపిక్ వదిలేయండి. మీరన్నట్టు లక్ష్యం, పట్టుదల ఉన్నవాడికి అవయవలోపం చాలా చిన్న విషయం. నెక్ట్స్.. మీ చదువంతా బ్రెయిలీ లిపితోనేనా? చేతన: దాంతోపాటు మాకు ‘స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్’ ఉంది. దాన్నే ఎక్కువగా వాడతాం. ఆర్పీ: ఓహ్.. కంప్యూటర్ని ఎక్కువగా ఉపయోగిస్తారా? గాయత్రి: అవును సార్! మేం టైప్ చేస్తుంటే అది స్పెల్లింగ్ పలుకుతుంది. తరగతి గదిలో సౌండ్రీడింగ్ బుక్స్ ఉంటాయి. ఉమాశంకర్: వియ్ హ్యావ్ ఐపాడ్స్. అందులో ప్రతి బుక్ నాలుగైదు వాల్యూమ్స్‌లో ఉంటుంది. ఆర్పీ: ఇంతకీ మీరు ఎందుకు చదువుకుంటున్నారు? అవినాష్: అదేం ప్రశ్న సార్.. ఓకే! సమాధానం చెప్పాలి కదా.. ఓ మంచి పౌరుడిగా తయారవ్వాలని. గాయత్రి: జ్ఞానం సంపాదించడానికి కళ్లు అవసరం లేదు సార్. కానీ నలుగురిలో గొప్పగా బతకాలంటే తప్పనిసరిగా చదువు కావాలి కదా సార్. ఇక మా అందరికీ మా సీనియర్సే ఆదర్శం. వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. ముఖ్యంగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న రాజశేఖరన్నయ్యలాంటివారన్నమాట. ఆర్పీ: వెరీ గుడ్.. ఇక మీ హాబీస్ ఏంటి? ఉమాశంకర్: పాటలు వింటాం సార్. నేనొక్కడ్నే కాదు, మా అందరికీ పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: ఎలాంటి పాటల్ని ఇష్టపడతారు? చేతన: మెలొడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. గాయిత్రి: ఎమోషనల్ సాంగ్స్.. ముఖ్యంగా రిలేషన్షిప్స్ని తెలిపే లిరిక్స్‌ని ఎక్కువగా ఇష్టడతాం. ఆర్పీ: ఓ.. మీకు సినిమా నాలెడ్జ్ చాలా ఉంది. నచ్చిన సినిమా ఏంటి? శివారెడ్డి: ప్రేమించు.. సినిమా సార్. చాలా సినిమాలు చూశాం. కానీ ఆ సినిమా మాటలు వింటుంటే.. అంధురాలిగా ఓ యువతి సాధించిన విజయం మా గుండెల్లో బోలెడంత బలాన్ని నింపింది. జయ: మీరు ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలా అంధుడిగా నటించినపుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆర్పీ: మీ లైఫ్‌ని చాలా దగ్గరగా చూశాను. కళ్లు కనిపించకుండా అర నిమిషం కూడా ఉండలేని మామూలువారికి మీరు నిత్యం ఆదర్శవంతులే అనిపించింది. శివారెడ్డి: ఆ సినిమాలోని వానా...వానా పాట మీ నోట వినాలనుంది సార్. ఆర్పీ(పాట పాడాక): బావుందా? చేతన: చాలా బాగుంది సార్. థాంక్యూ సో మచ్. ఆర్పీ: ఇంకా ఏమంటే మీకిష్టం. నవనీత: నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మల్లికార్జున్: అవును సార్. నాక్కూడా.. టూవీలర్‌పై షికారు కొట్టడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: అవునా.. మరి యాక్సిడెంట్స్ అయిపోతాయి కదా! మల్లికార్జున్: కళ్లున్నవారు మాత్రం వాటిని ఉపయోగిస్తున్నారా సార్. మొన్నీమధ్య మెదక్ జిల్లా వూసారుుపేటలో యాక్సిడెంట్ జరిగిన స్కూల్ బస్ డ్రైవర్‌కి కళ్లు ఉన్నట్టా! లేనట్టా! ఉమాశంకర్: యస్.. అతను సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశారని పిల్లలు చెప్పారు. ఎంత అన్యాయం సార్. చాలామంది సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఆ క్షణాన అంధులతో సమానమే కదా సార్. అవినాష్: అంధులకు డ్రైవింగ్ నేర్పడానికి విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సంస్థలున్నాయి. వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే మేం కూడా ధైర్యంగా బండి ఎక్కొచ్చు. ఆర్పీ: తప్పకుండా.. కొన్ని రకాల టెక్నాలజీలు కళ్లున్నవారిని అంధుల్ని చేస్తుంటే, మరికొన్ని మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంతకూ మీ ఇంట్లోవారు మిమ్మల్నెలా ట్రీట్ చేస్తారు? శివారెడ్డి: మా పేరెంట్స్ మాకు ఏ విషయంలోనూ తక్కువ చేయరు. దానికితోడు మా దేవ్నార్ స్కూల్ టీచర్ల గెడైన్స్ సాయంతో మమ్మల్ని అన్నిరంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. సుశాంత్: అవును సార్. మేం ఆటలు, పాటలతో పాటు అప్పుడప్పుడు నాటికలు వేస్తుంటాం. నాటకాలప్పుడు మా శివారెడ్డి పెద్ద పెద్ద డైలాగ్స్‌తో అదరగొట్టేస్తాడు. ఆర్పీ: ఓకే లాస్ట్ క్వశ్చన్. మీ గోల్స్ ఏంటి? ఉమాశంకర్: ఐఏఎస్ అవ్వాలని ఉంది మల్లికార్జున్: నాక్కూడా.... ఆర్పీ: ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? చేతన: సమాజం చాలా మారాలి సార్. వారికి అవసరమైతే అయ్యో.. అంధులంటూ జాలి చూపిస్తుంది. లేదంటే గుడ్డివాడికి కూడా.. అంటూ చిన్న చూపు చూస్తుంది. వేదికలెక్కి మా గురించి గొప్పగా మాట్లాడతారు. వీధుల్లోకి వస్తే రోడ్డు దాటించడానికి కూడా సాయపడరు. ఆర్పీ: నా మాట కూడా అదేనమ్మా! అంధులపై జాలి చూపనక్కర్లేదు. మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు.. అద్భుతాలు చేసి చూపెట్టగలరు. చాలా విషయాల్లో మా ‘కళ్లు’ తెరిపించగలరు. విష్ యు ఆల్ ది బెస్ట్! ఆర్పీ: మంచి పొజిషన్‌కు చేరాక ఏం చేస్తారు? ఉమాశంకర్: అంధుల పట్ల, అనాథల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నవారి కళ్లు తెరిపిస్తాం. ఆర్పీ: ఓ.. మీరు చెప్పేది కాకినాడలో జరిగిన సంఘటన గురించా.కొట్టినవారు కూడా అంధులే కదా మల్లికార్జున్: అందుకే మాకు కోపం వచ్చింది సార్. కళ్లున్నవాడు కొడితే.. అంధుడి బాధ వాడికేం తెలుస్తుందని క్షమించేస్తాం. అంధులు పడే బాధ తెలిసి కూడా పశువుల్లా ప్రవర్తించారు కదా సార్. ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: సృజన్ -
కెరీర్లో విసుగెత్తిపోయారా?
జాబ్ స్కిల్స్: మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా ఉందా? కొలువు నిర్జీవంగా, అనాసక్తిగా మారిందా? దీన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తోందా? రొటీన్ లైఫ్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తున్నారా?... జీవితంలో చాలామందికి ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. కెరీర్లో విసుగు రావడానికి, ఉద్యోగ జీవితం చప్పగా మారడానికి చాలా కారణాలుంటా యని నిపుణులు చెబుతున్నారు. నిజాయతీ గా ప్రయత్నిస్తే.. జీవితంలో పునరుత్తేజం పొందొచ్చని, హ్యాపీగా ఉద్యోగం చేసుకో వచ్చని పేర్కొంటున్నారు. జాబ్ ఇష్టం లేకపోతే మరో రంగంలో అడుగుపెట్టి సక్సెస్ కావొచ్చని సూచిస్తున్నారు. మీరే స్థితిలో ఉన్నారు? జాబ్పట్ల విముఖత తలెత్తడానికి ప్రధానంగా చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. ఆఫీస్‌లో పై అధికారి, సహోద్యోగుల వైఖరి నచ్చక చాలామంది ఉద్యోగం వదిలేయాలని అనుకుంటారు. తమ కెరీర్లో డెడ్ ఎండ్‌కు వచ్చేసినట్లు భావిస్తుంటారు. ఆఫీస్‌లో ఎక్కువ సేపు పనిచేయడం, అదనపు బాధ్యతలను మోయాల్సి రావడం, విధి నిర్వహణలో తరచుగా ప్రయాణాలు, సేల్స్ టార్గెట్లు వంటివి ఉద్యోగులను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తాయి. కొందరు వీటిని భరించలేరు. కెరీర్లో ఎదుగుదల లేకపోయినా నీరసానికి గురవుతారు. తమకు ఆనందం కలిగించని కొలువులో ఇంకా ఎందుకు ఉండాలని ఆవేశపడుతుంటారు. తమపై బాస్‌ల పెత్తనం భరించలేని వారు కూడా కొలువుకు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ, మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇష్టంలేకపోయినా బలవంతంగా సర్దుకుపోతుంటారు. కొందరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆఫీస్‌లో ఎలాంటి విధులు నిర్వర్తించారో.. ఐదేళ్ల తర్వాత కూడా అవే పనులు చేస్తుంటారు. కొత్త బాధ్యతలను చేపట్టి, కొత్త విషయాలను నేర్చుకొనేందుకు అవకాశం ఉండదు. తమ నైపుణ్యాలు వృథా అవుతున్నాయని వీరు బాధపడుతుంటారు. ఇంకొందరి పరిస్థితి మరోలా ఉంటుంది. ఆఫీస్‌లో చేద్దామంటే చేతినిండా పని ఉండదు. ఖాళీగా కూర్చోవడం వీరికి నచ్చదు. కొత్తకొత్త సవాళ్లను ఎదుర్కోవడం అంటే వీరికి చాలా ఇష్టం. కానీ, చేయడానికి పని లేకపోవడం వల్ల కెరీర్ పట్ల ఆసక్తిని కోల్పోతుంటారు. జాబ్‌లో అసంతృప్తి, అయిష్టం మరోరకం ఉద్యోగులు కూడా ఉంటారు. వీరికి తెల్లారుతుందంటేనే భయం. ఆఫీస్కెళ్లాలంటే బెంబేలెత్తిపోతుంటారు. కుర్చీలో కూర్చోగానే వీరి బుర్ర పనిచేయడం మానేస్తుంది. తాము మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారినట్లు భావిస్తుంటారు. రోజు ఎలా గడుస్తుందా? అని క్షణక్షణం ఎదురుచూస్తుంటారు. వీకెండ్ కోసం చకోర పక్షుల్లా నిరీక్షిస్తుంటారు. జాబ్‌లో సంతృప్తి లేకపోవడం, వస్తున్న జీతం సరిపోకపోవడం, ఎన్నాళ్లు పనిచేసినా వేతనం పెరగకపోవడం వంటి కారణాలతోనూ కెరీర్ పట్ల అయిష్టాన్ని చూపేవారు కూడా ఉంటారు. స్వీయ సమీక్ష తప్పనిసరి కెరీర్‌ను, జీవితాన్ని ప్రేమించాలంటే మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. ఉద్యోగం పట్ల విసుగెత్తిపోయి నప్పుడు ఇలాంటి సమీక్ష తప్పని సరి. మీకున్న అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలు, మీ ఆర్థిక పరిస్థితి తదితర విషయాలను అంచనా వేసు కోండి. మీ లక్ష్యాలేంటి? వాటిని చేరుకొ నేందుకు ఏం చేయాలి? మీరేం చేయాలను కుంటున్నారు? మీరు ఏ విషయంలో నిష్ణాతులు? మీకున్న నైపుణ్యాలకు నిజంగా ఎంత వేతనం వస్తుంది? బయట జాబ్ మార్కెట్ ఎలా ఉంది? ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లేదా? అనే విషయాలను తెలుసుకొనేందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించు కోండి. మీ ప్రస్తుత స్థితిని స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేయండి. పరిస్థితిని మీరు అతిగా ఊహించుకొని భయపడకుండా, వాస్తవాన్ని మీకు తెలిసేలా చేయడంలో వారు సహకరిస్తారు. ఆఫీస్‌లో సహచరులతోనూ మాట్లాడండి. చుట్టూ నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోండి. పరిస్థితిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే వారు సరిచేస్తారు. ఇతర రంగాల్లోని వారిని కూడా సంప్రదించండి. జాబ్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోండి లైఫ్ రొటీన్‌గా మారినప్పుడు స్వయంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ఉదయం యోగా చేయండి. దీనివల్ల మనసు, శరీరం రిలాక్స్ అవుతాయి. మీ రంగానికి సంబంధం లేని మరో ఆఫీస్‌ను సందర్శించండి. దీనివల్ల మీ పరిస్థితిని మరో కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. వీకెండ్లో కొత్తగా ఏదైనా చేయండి. వీలుంటే డ్యాన్స్ క్లాస్‌లో చేరండి. లాంగ్ డ్రైవ్‌కు కూడా వెళ్లొచ్చు. కొత్త ప్రదేశాన్ని దర్శించండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి అప్పటిదాకా పరిచయం లేని కొత్త పనిచేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆఫీస్ పనుల్లోనూ మార్పులు చేసుకోండి. మరో టీమ్‌తో కలిసి పనిచేయండి. కొత్త బాధ్యతలను స్వీకరించండి. వేతనం సరిపోకపోతే ఆ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లండి. కొలువు మారాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే.. మీ అర్హతలను పెంచుకోండి. -
ఐ లైక్ పాజిటివ్ మైండ్స్ : ఝాన్సీ
బుల్లితెర బాట చూపినా... వెండి తెర వెలుగునిచ్చినా.. జీవితంలో ఎత్తుపల్లాలు ఎదురైనా.. తనను మున్ముందుకు నడిపిస్తోంది.. ఆశావాహ దృక్పథమే అని అంటున్నారు యాంకర్ ఝాన్సీ. ఆమెను కదిలిస్తే జీవితంలోని భిన్నమైన కోణాలు కన్పిస్తాయి. చిన్నప్పటి నుంచి గూడుకట్టుకున్న ఎన్నెన్నో అనుభూతులు పలుకరిస్తాయి. సిటీప్లస్‌తో ఝాన్సీ పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే.. ‘ఆత్మ విశ్వాసం మనిషిని నడిపిస్తుంది. పరిస్థితులు పాఠాలు నేర్పిస్తాయి. ప్రతి మలుపులో రెండు దారులుంటాయి. ఒకటి నెగెటివ్.. మరొకటి పాజిటివ్. బట్ ఐ ఆల్వేస్ లైక్ పాజిటివ్ వే. అలాంటి మనస్తత్వమే.. నన్ను నడిపిస్తోంది. ఏఎన్నార్.. తనికెళ్ల.. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ పాజిటివ్ అనుభవాలే చెబుతారు. ఆయన జీవితంలో నెగెటివ్ లేదా..? తనికెళ్ళ భరణిగారు ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. అవ న్నీ జనానికి నచ్చుతాయో లేదోనని ఆలోచించరా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వెదికాను. వారి ఆలోచనా విధానమే కరెక్టని తెలుసుకున్నాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఎంటరయ్యాక ప్రతి ఆదివారం తనికెళ్ల భరణి గారింటికి వెళ్లడం ఆనవాయితీగా మారింది. అక్కడికి వెళ్తే ఏదో ఒక ైవె విధ్యమైన ఆలోచన మొదలవుతుంది. స్వామి వివేకానందుడి బోధనలు కూడా నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆశావాదపథం వైపు నడిపించాయి. అల్లరిపిల్లని.. చిన్నతనం నుంచి అల్లరిగానే ఉండేదాన్ని. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ వరకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అప్పుడు మూడో తరగతి అనుకుంటా. చేతిలో కేరియర్.. భుజానికి స్కూల్ బ్యాగ్.. బ్యాగ్ జేబులో రూట్ పాస్. హయత్‌నగర్‌లో బస్సెక్కి మలక్‌పేటలోని వికాస భారతి స్కూల్‌కు వచ్చేదాన్ని. ‘ మా చిట్టితల్లి ఎంత కష్టపడుతోందో’ అని అమ్మ మురిసిపోవడం నాకు ఇన్స్పిరేషన్. స్కూల్‌కు డుమ్మా కొడదామనిపించినా అమ్మ ఆనందం నన్ను వెనక్కి లాగేది. ఆ జారుడు బండల్లో... గచ్చిబౌలి వెళ్లినప్పుడల్లా ఆ బండరాళ్లు పలకరిస్తుంటాయి. పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో చెరువు.. ఫ్రెండ్స్‌తో కలసి ఆడుకున్న క్షణాలు.. అన్నీ మనోయవనికపై అలా కదలిపోతుంటాయి. అమ్మది ఆకాశవాణిలో ఉద్యోగం.. నాన్న కాంట్రాక్టరు. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నా. కొన్నేళ్లు గచ్చిబౌలీలోని గవర్నమెంట్ క్వార్టర్స్‌లో ఉన్నాం. స్కూల్ మధ్యాహ్నం మూడున్నరకే అయిపోయేది. అమ్మానాన్నలు వచ్చే సరికి సాయంత్రం ఆరు దాటేది. ఏడ్చేశాను.. గచ్చిబౌలి క్వార్టర్స్‌కు వెళ్లాలంటే ఒకే ఒక బస్సు ఉండేది. ఆదివారాలు అమీర్‌పేటలోని మా బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. అక్కడి నుంచే షాపింగ్‌కో.. సినిమాకో.. ఇంకెక్కడికైనా వెళ్లే వాళ్లం. శనివారం ఆకాశవాణి ప్రోగ్రాం అయిపోగానే అమ్మ నన్ను ఒక్కదాన్నే బస్సెక్కి అమీర్‌పేట వెళ్లమంది. నాకేం భయం! 9 నంబర్ కదా.. నాకు తెలుసు అన్నట్టు బస్సెక్కాను. పావలా ఇచ్చి అమీర్‌పేటకు టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ హాస్పిటల్ ఉన్న చోట అప్పట్లో చెరువు ఉండేది. అదే అమీర్పేటని ధీమాగా ఉన్నాను. కిటీకీ లోంచే చూస్తూ కూచున్నా.. ఎంతకూ చెరువు రాదే..! చెరువు దాటేశామా ? అసలీ బస్సు అమీర్‌పేట వెళ్తుందా ? కండక్టర్‌ను అడిగితే.. ఛా... నాకు తెలియదా ఏంటీ? అయినా డౌట్.. కండక్టర్ ఇది వయా ఎటు వైపు అని.. ఈగోతోనే అడిగాను. అమీర్‌పేట నుంచే అన్నాడు. ఇంతలో లాస్ట్ స్టాప్ సనత్‌నగర్ వచ్చేసింది. అదేంటని కండక్టర్‌ను అడిగా.. అమీర్‌పేట్ ఎప్పుడో వెళ్లిపోయిందని ఆయన అనగానే.. నాకూ ఏడుపొచ్చేసింది. వెనక్కు వెళ్లడానికి డబ్బుల్లేవు. ఇంతలో ఓ పెద్దావిడ డబ్బులిచ్చింది. అమీర్‌పేటలో దించమని కండక్టర్‌కు చెప్పింది. ఇంకేం.. క్వార్టర్స్‌లోని ఆడపిల్లలమంతా కలసి.. సైకిళ్లు వేృుకుని.. దర్గా దాటి ఆ చెరువు దగ్గరకు వచ్చేసేవాళ్లం. అక్కడ జారుడు బండగా ఉండే ఓ పెద్ద రాయిని మౌంట్ ఎవరెస్ట్ అని పిలిచేవాళ్ళం. సాయంత్రానికి డ్రెస్ మొత్తం మాసిపోయేది. అమ్మవాళ్లు వచ్చేసరికి ఇంటికెళ్లి బుద్ధిగా డ్రెస్ మార్చుకునేదాన్ని. బాలానందంతో నిఘంటువు నాంపల్లి అసెంబ్లీ ఏరియాతో అనుబంధం విడదీయలేనిది. నాన్న అసెంబ్లీ వద్ద కాంట్రాక్టు పనులు చేసేవారు. నేను బాలానందంలో ప్రోగ్రాం ఇవ్వడానికి ప్రతి శనివారం వెళ్లేదాన్ని. సరదాగా చేసినా.. ఈ ప్రోగ్రామ్స్‌తో వచ్చిన డబ్బుతో.. ఒక నిఘంటువు కొనుక్కున్నాను. ఇప్పటికీ అది పదిలంగా దాచుకున్నాను. బాలానందం ప్రోగ్రాం అయిపోగానే అమ్మ ఆ పక్కనే ఉన్న జామ్జామ్ హోటల్‌కు తీసుకెళ్లేది. ఇప్పటికీ అక్కడే ఉంది. అక్కడ చాయ్, మస్కాబన్ ఇప్పించేది. ఇప్పటికీ ఆ రుచి మరచిపోలేదు. అట్నుంచి రోడ్డు దాటి అసెంబ్లీకి వెళ్లేదాన్ని. అక్కడ హోటల్లో కోల్డ్ కాఫీ స్పెషల్. నేను రావడమే ఆలస్యం.. నాన్న కోల్డ్ కాఫీ ఆర్డరిచ్చేవాడు. అసెంబ్లీ పక్కనే ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లో బాలభవన్ ఉండేది. అక్కడే పెయింటింగ్, డాల్మేకింగ్, మ్యూజిక్ నేర్చుకున్నాను. జాగ్రఫీ చాలా ఇష్టం ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ. మా క్లాస్‌లో 20 మందిమే ఉండేవాళ్లం. బుద్ధిమంతుల్లా కనిపించినా.. అల్లరి చేయడంలో ఎవరికి వారే సాటి. జాగ్రఫీ క్లాసంటే బాగా ఇష్టం. ఆ టైంలో ఎవరు అల్లరి చేసినా కోపం వచ్చేది. క్లిక్ క్లిక్.. నో ఫియర్! ఆకాశవాణీలో ఎప్పుడో బ్యాంకు అధికారి నన్ను చూశారట. స్టేట్‌బ్యాంకు యాడ్‌లో నన్ను తీసుకోవాలనుకున్నారు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. ఆకాశవాణిలో షూట్ చేశారు. కొత్త కదా. ఇలా... అలా అంటూ సలహాలి చ్చారు. తర్వాత వాళ్లే.. ఏంటీ జంకూ బొంకూ లేకుండా అదరగొట్టేశావ్ అన్నారు. ఈ కలివిడితనం సిటీలైఫే నేర్పింది. అదే నా కెరీర్‌కు ప్లస్ అయింది. ఆ తర్వాత హెయిర్ ఆయిల్ యాడ్.. ఇంకెన్నో యాడ్స్‌లో నటించే అవకాశం. విజేత సీరియల్ మరో అవకాశం. అందులోని ఏడుపు సీన్.. గ్లిజరిన్‌తో లాగించేయమన్నారు. కానీ సహజసిద్ధమైన యాక్టింగ్ కోసం సీటీలో డిఫరెంట్ ట్రెండ్స్ అధ్యయనం చేశాను. కనుపాపల్లో నీళ్లూరించే గాధలు విన్నాను. ఆనందం పంచే అనుభవాలు తెలుసుకున్నాను. అవర్‌ప్లేస్ అంటే ఇష్టం.. సిటీ టేస్ట్ విషయానికి వస్తే.. బిర్యానీ అంటే ప్రాణం. రుచి కోసం ఒకసారి 12 హోటళ్లకు వెళ్ళాను. అన్నమైనా మానేస్తాను కానీ.. బిర్యానీ ఎంతైనా తినేస్తాను. బంజారాహిల్స్‌లోని అవర్‌ప్లేస్ నాకు బాగా సూట్ అయింది. ఎంతగా అంటే.. అక్కడొకామె నాకోసం ఎదురుచూస్తుండేంది. ఈ రోజు ఇంకా ఝాన్సీ రాలేదేంటి? అని ఆరా తీస్తుంది. ప్యారడైజ్ బిర్యానీ లైక్ చేస్తాను. కరాచీ బేకరీలో బిస్కెట్లు... మొజాంజాహీ మార్కెట్లోని ఓ షాపులోని ఐస్ క్రీం చాలా చాలా ఇష్టం. అబిడ్స్‌లో డ్రెస్సులు కొనడం చిన్నప్పటి నుంచి ఇష్టం. గోల్కొండ పైదాకా వెళ్ళడం.. అక్కడి నుంచి ‘కెవ్వు...’ మంటూ కేకేయడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు. కోటలో ఉండే దర్వాజాలు మరీ ఇష్టం. పెద్ద పెద్ద రాళ్లన్నా ఇష్టమే. రాళ్లను పగుల గొట్టకుండా ఇళ్లుకడితే.. ఆ ఇంటికి వెళ్లి చూడాలనిపిస్తుంది. గ్రేట్ కల్చర్ భాగ్యనగరం అంటే భిన్నమైన జీవనశైలి. విభిన్నమైన వ్యక్తుల కలయిక. నగరంలో ఒక్కో ప్రాంతం ఒక్కో శైలికి ప్రతీక. అందులో పాతబస్తీ మరీ ప్రత్యేకం. తీరికలేని జీవితంలో.. సాంస్కృతిక ఆనవాళ్లు చెదిరిపోకుండా సిటీ తన గొప్పదనాన్ని చాటుకుంటుంది. కొందరు కావాలనో.. నోరు తిరగకో.. హైదరాబాడ్ అంటుంటారు. అలా ఎవరైనా అంటే.. సరిగ్గా ఉచ్ఛరించమని చెబుతాను. - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు : ఎస్.ఎస్.ఠాకూర్ -
నాన్న మెచ్చిన కూతురు!
అనంతరం: ప్రపంచమంతా తెలిసిన ప్రముఖ నటుడి ఇంటి తొలి సంతానంగా జన్మించింది క్యాథరీన్. తండ్రి చేయి పట్టుకుని అడుగులు వేయడం నేర్చుకుంది. తండ్రి ఒడిలో కూచునే ప్రపంచాన్ని తెలుసుకుంది. కానీ తండ్రి దారిలో నడవడానికి మాత్రం ఇష్టపడలేదు. నటన కంటే వాస్తవాల మీద ఆసక్తి చూపించింది. రచయిత్రి అయ్యింది. ఇంతకీ క్యాథరీన్ ఎవరో తెలుసా... ఆర్నాల్డ్ ష్వార్జ నెగ్గర్ ముద్దులపట్టి! క్యాథరీన్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్నాల్డ్ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయడం కాస్త కష్టమే. కూతురి గురించి గుక్క తిప్పుకోకుండా చెబుతారాయన. తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నప్పుడు ఆర్నాల్డ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. ‘‘నేనెప్పుడూ ఇది చెయ్యి అని క్యాథీకి చెప్పలేదు. ఏం చేయాలో తనే నిర్ణయించుకుంది. తానేం చేసినా నేను ప్రోత్సహిస్తానని తనకు తెలుసు. తాను ఏం చేసినా నాకు పేరు తెచ్చే పనే చేస్తుందని నాకూ తెలుసు. అందుకే పెద్దగా కల్పించుకోను’’ అంటారు మురిసిపోతూ. హాలీవుడ్ హీరోల పేరు చెప్పమని మన వాళ్లెవరినైనా అడిగితే వెంటనే నోటికొచ్చే పేర్లలో ఒకటి... ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్! టెర్మినేటర్, ప్రిడేటర్ వంటి సినిమాలతో భారతీయుల మనసులను అంతగా దోచారాయన. రాజకీయ నాయకుడిగా, ఇన్వెస్టర్‌గా కూడా ప్రపంచమంతటికీ చిరపరిచితుడైన ఆర్నాల్డ్‌కి నలుగురు పిల్లలు. ఆ నలుగురిలో పెద్దమ్మాయి... క్యాథరీన్. పిల్లలందరూ సమానమే అయినా... తండ్రి అయిన సంతోషాన్ని తొలిసారి రుచి చూపిన క్యాథరీన్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఆర్నాల్డ్‌కి. సాధారణంగా కొడుకు తన అడుగు జాడల్లో నడవాలని తండ్రి కోరుకుంటాడు. అయితే ఆర్నాల్డ్‌కి కొడుకులు ప్యాట్రిక్, క్రిస్టఫర్ల మీద కంటే... పెద్ద కూతురు క్యాథరీన్ మీదే నమ్మకం ఎక్కువ. తన ఆలోచనలను, ఆశయాలను నిలబెట్టే సత్తా ఆమెకి ఉందని ఆయన విశ్వాసం. అది నిజమే. క్యాథరీన్ చాలా తెలివైన అమ్మాయి. తండ్రికి మంచి పేరు తీసుకురావాలని తపిస్తుంది. కానీ ఆయన అడుగు జాడల్లో నడవాలన్న ఆలోచన మాత్రం ఆమెకు లేదు. క్యాథరీన్ తరువాత పుట్టిన ప్యాట్రిక్ మోడల్ అయ్యాడు. ఆ తరువాత నటుడు కూడా అయ్యాడు. కానీ క్యాథరీన్ మాత్రం నటన వైపు మొగ్గు చూపలేదు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే... ఆమె కచ్చితంగా నటి అవుతుందనే అనుకున్నారంతా. తండ్రే లోకంగా భావించే ఆమె తండ్రి బాటలోనే సాగుతుందని భావించారు. ఆమె అద్భుత సౌందర్యరాశి కావడం, నటి కాదగ్గ అన్ని లక్షణాలూ ఉండటం కూడా అలా అనుకునేలా చేశాయి. కానీ అందరి అంచనాలనూ తల్లకిందులు చేసింది క్యాథరీన్. తండ్రిని అమితంగా గౌరవించినా, కెరీర్ విషయంలో మాత్రం తన తల్లిని అనుసరించింది. ఆర్నాల్డ్ భార్య, క్యాథరీన్ తల్లి మారియా ష్రివర్కి జర్నలిస్టుగా, రచయిత్రిగా మంచి పేరుంది. ఎందుకోగానీ... తండ్రి ఆలోచనల కంటే తల్లి భావాలే క్యాథరీన్నే ఎక్కువ ప్రభావితం చేశాయి. అందుకే మాస్ కమ్యునికేషన్స్ చదివింది. కెమెరా ముందుకు రానంటూ కలం పట్టుకు కూచుంది. 2010లో ‘రాక్ వాట్ యు హ్యావ్ గాట్’ అనే పుస్తకం కూడా రాసింది. మహిళలు ఎవరి మీదా ఆధారపడకూడదని, తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవాలని, ఆత్మవిశ్వాసంతో అడుగేయాలని చెబుతూ ఆమె రాసిన ఆ పుస్తకం విమర్శకుల ప్రశంసలు పొందింది. కూతురిలో అంత మంచి రచయిత్రి ఉందని ఊహించని ఆర్నాల్డ్ ఆశ్చర్యపోయారు. తన కూతురి అభిరుచిని మెచ్చుకున్నారు. ఆమె ఎంచుకున్న బాటలో తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. నిజానికి క్యాథరీన్‌కి పుట్టుకతోనే కొద్దిపాటి శారీరక, మానసిక రుగ్మతలు ఏర్పడ్డాయి. ఏడో తరగతి అయ్యేవరకూ చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత కొద్దికొద్దిగా నిలదొక్కుకుంది. ఇదంతా కూడా ఆమె పట్టుదలతో సాధించింది అంటారు ఆమె గురించి తెలిసినవాళ్లంతా. ఏదైనా కూడా ఎందుకు సాధ్యం కాదు అన్న ప్రశ్న వేస్తుందామె. అనుకోవాలేగానీ చేయలేనిదేమీ లేదు అంటుంది దృఢంగా. అది తల్లి ఇచ్చిన ప్రోత్సాహం. అంతకంటే ముఖ్యంగా తండ్రి ఇచ్చిన ధైర్యం. తన తండ్రి గురించి చెప్పమంటే ఇలా చెబుతుంది క్యాథరీన్. ‘‘నాన్న పెద్ద సెలెబ్రిటీ. ఆయన ఇమేజ్ నన్ను చాలా ఆనందింపజేస్తుంది. కానీ ఆయన ఇమేజ్‌తో నేను ఎదగాలనుకోను. నాకు నేను సంపాదించుకున్న మంచిపేరుతో ఆయన ఇమేజ్‌ని మరింత పెంచాలనుకుంటాను.’’ ఈ ఆత్మవిశ్వాసం క్యాథరీన్ కళ్లలో, బాడీ లాంగ్వేజ్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు ఆమె తండ్రి కళ్లలో గర్వం తొంగిచూస్తుంది! -
వివరం: ఆత్మన్యూనత Vs ఆధిక్య భావన
ఆత్మన్యూనతా భావం ఎంతగా కుంగదీస్తుందో... ఆధిక్యభావన మనిషిని అంతగా ఎత్తి, కుదేస్తుంది! వ్యక్తిత్వం రూపుదిద్దుకునే క్రమంలో మనల్ని అనేక అనుభవాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిల్లోంచి ఏర్పడే భావన... అది న్యూనత అయినా, అతి విశ్వాసంతో కూడిన ఆధిక్యభావన అయినా రెండూ నష్టం కలిగించేవే! తీవ్రమైన పరిణామాలకు దారి తీసేవే. ‘‘ఆ... మేం మీ అంత గొప్పవాళ్లం కాదు లెండి.’’ ‘‘మీ అంత చదువుకున్న వాళ్లం కాదులెండి.’’ ‘‘మీ అంత డబ్బున్నవాళ్లం కాదులెండి.’’ ఇలాంటి మాటలెప్పుడైనా మీరు విన్నారా? విన్నప్పుడు అందులో అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఆ మాటలంటున్న భావం ధ్వనిస్తే... ఆ వ్యక్తి కొద్దిపాటి ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నారన్నమాటే. అదే భావం మితిమీరిపోతే... అది మరింత అసమర్థతకు, ఒక్కోసారి ప్రమాదకరమైన డిప్రెషన్‌కూ దారితీయవచ్చు. అసలేంటీ ఆత్మన్యూనతా భావం? దాని స్వరూప స్వభావాలు ఏంటి? మనిషి స్వభావం, ప్రవర్తన, విలువలు, భావాలు, లక్ష్య సాధన యత్నాలు, ఇంకా అనేకానేక అంశాలు ఆ వ్యక్తికి తనపై తనకున్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటాయి. ఓ వ్యక్తి జీవితాన్ని అతడి / ఆమె ఆత్మవిశ్వాసం కంటే మరేదీ ప్రభావితం చేయలేదంటే అది అతిశయోక్తి కాదు. అందుకే ఒక వ్యక్తికి తనపైనా, తన తెలివితేటలపైనా, తన శక్తిసామర్థ్యాల పైనా నమ్మకం ఉండటం ఎంతైనా అవసరం. ఆ నమ్మకాన్నే ‘ఆత్మవిశ్వాసం’ అంటాం. తనను తాను విశ్వసించని, తన సామర్థ్యాలపై నమ్మకం లేని, తనను తాను గౌరవించుకోలేని వ్యక్తి సమాజాన్ని నమ్మలేడు. సమాజం నమ్మకాన్నీ చూరగొనలేడు. దాంతో సమాజమూ అతడిని పెద్దగా పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ప్రతి వ్యక్తికీ ఆత్మవిశ్వాసం ఉండటం అవసరం. ఈ ఆత్మవిశ్వాసం అనే భావనను కొందరిలో అధికంగానూ, మరికొందరిలో కాస్త తక్కువగానూ ఉండటం మనం చూస్తుంటాం. మన ప్రవర్తన, స్వభావం, భావోద్వేగాలూ... ఇవన్నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే అవన్నీ మళ్లీ ఆత్మవిశ్వాసంతో ప్రభావితం అవుతుంటాయి. ఆత్మన్యూనత నుంచి బయటపడటం ఎలా? ఓటమికి బీజం ఆత్మన్యూనత నుంచే పడుతుంది. అందుకే మనకు మనం విలువ ఇచ్చుకోవడం ఎంతైనా అవసరం. కొందరు తమను మరింత వినయంగా చూపుకోడానికి కాస్త తక్కువ చేసుకుంటుంటారు. ఇది మంచి గుణం అనుకుంటారు. నిజానికి ఎదుటివారిలో లోపాలను ఎత్తిచూపే వారిలోనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే అది ఎదుటివారిని కించపరిచే స్థాయిలో లేకుండా అలాంటి వారు నిత్యం సరిచూసుకుంటూ ఉండాలి. అలాగే మనలో ఆత్మన్యూనతను అధిగమించాలనుకున్నప్పుడు ముందుగా మన గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ లోపాలతో పాటు ప్రత్యేకతలూ ఏవో ఉంటాయని ముందుగా ప్రతి ఒక్కరూ నమ్మాలి. అప్పుడు చిన్న చిన్న విజయాలను లక్ష్యంగా చేసుకుంటూ తమ ప్రత్యేకతల ఆసరాతో వాటిని సాధిస్తూ పోవాలి. ఆ విజయాలను ప్రోత్సాహంగా తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రశంసలను స్వీకరించడం తప్పని అనుకోకూడదు. అయితే వాటిని మన పనితీరును మెరుగుపరచుకునేలా స్వీకరించడం మేలు. అవి ఆత్మతృప్తికి దారితీసి ప్రోత్సాహకరంగా మారతాయి. అయితే వాటిని స్వీకరించి, ఆ మత్తులో నైపుణ్యాలను మెరుగుపరచుకోలేకపోవడం సరికాదని గ్రహించాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం ఎలా? ఆత్మవిశ్వాసానికి బీజం పసితనంలోనే పడుతుంది. అప్పటి సంఘటనలు, చుట్టూ ఉండే సమాజం... ఇవన్నీ ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తాయి. పిల్లలను మలచడంలో తల్లిదండ్రుల పాత్ర అందరికంటే ఎక్కువ. ఆ తర్వాతి భూమిక గురువు, తోడబుట్టినవారు, బంధువులు, స్నేహితులు. వీళ్లందరి సంయుక్త ప్రభావం పసివారిపై పడుతుంది. పసితనంలో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఇతరులపై ఆధారపడి ఉంటారు. ఆ దశలో వారికి ప్రేమ, భద్రత, సాన్నిహిత్యం వంటి వాటిని అందివ్వడం పైన పేర్కొన్న అందరి బాధ్యత. వారందరి నుంచి లభించే సానుకూల (పాజిటివ్) ప్రభావం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒక పని చేసినప్పుడు, ఒక దాన్ని స్వతంత్రంగా సాధించినప్పుడు లభించే చిన్నపాటి ప్రశంసను ఆ పిల్లవాడు తనకు తెలియకుండానే తనలో పాదుకొల్పుకోడానికి, దాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తనకు ఏ విషయంలో ప్రశంస లభించిందో దాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే పిల్లలతో వ్యవహరించే సమయంలో మనం ఇచ్చే ప్రశంసగాని, ప్రోత్సాహంగాని, మాటలు గాని పాజిటివ్‌గా ఉండేలా చూడాలి. దాంతోపాటు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమ, ఉల్లాసభరిత వాతావరణం ఉండేలా చూడాలి. ఇలాంటి వాతావరణంలో పిల్లల వయసుతో పాటు వారి జీవితానుభవాలూ పెరుగుతాయి. ఈ అనుభవాలతో వారి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనల్లో మార్పులు కలుగుతాయి. ఇవి సానుకూలంగా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా సానుకూలంగానే ప్రతిస్పందిస్తుంటారు. ఇలాంటి స్పందన, ప్రతిస్పందనలే పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంటాయి. ఈ స్పందన, ప్రతిస్పందనల్లో పాజిటివ్ అంశాలు ఎంత ఎక్కువగా ఉంటుంటే... పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం అంత ఎక్కువ. అందుకే ఈ విషయాన్ని గుర్తెరిగి తల్లిదండ్రులు ప్రవర్తించడం ఎంతో ముఖ్యం. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల్లో ప్రతిబింబించే తీరు - తల్లిదండ్రుల ఓర్పు పిల్లలకు క్షమాగుణం,సహనం నేర్పుతాయి. - తల్లిదండ్రుల ప్రశంస పిల్లలకు తమలోని ప్రత్యేకతలను గుర్తించేందుకు దోహదపడుతుంది. - తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే భద్రత వారికి తమపైనా, సమాజంపైనా నమ్మకం కలిగించేలా చేస్తాయి. - పిల్లలకు తల్లిదండ్రులందించే స్నేహం, ప్రేమించే తత్వం... వారికి ఇతరులను ప్రేమించే గుణాన్నీ, హాని చేయకూడదన్న విచక్షణను అలవరుస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే మనం పిల్లల పట్ల ఏం చేస్తామో, పిల్లలకు ఏం అందిస్తామో మళ్లీ అదే మనం పిల్లలనుంచి తిరిగి పొందుతాం. అంటే పిల్లల ప్రవర్తనలో మనల్ని మనం ప్రతిబింబించుకుంటున్నామన్నమాట. ఆధునిక జీవనశైలి కూడా ఒక కారణం ఇటీవల ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక టెన్షన్, ఏవో చిరాకులు పరాకులూ ఉండనే ఉంటున్నాయి. ఆధునిక జీవనశైలిలోని ఒత్తిడులు, పోటీ తత్వం వంటి అంశాలు పెద్దలను ప్రభావితం చేస్తున్నాయి. దాంతో వాటిని పెద్దలు ఏదో ఒక దశలో పిల్లలపై ప్రదర్శిస్తుంటారు. ఫలితంగా పిల్లలు అయోమయానికి గురవుతుంటారు. వారి కోరికలను, అవసరాలను పెద్దల వద్ద వ్యక్తీకరించలేక ఒక రకమైన అసందిగ్ధతకు లోనవుతుంటారు. ఈ పరిస్థితుల్లో తాము భద్రమైన చోట లేమనీ, తమ శత్రువుల మధ్య ఉన్నామనే భావన వీళ్లలో కలుగుతుంది. తల్లిదండ్రుల ప్రవర్తనలో ప్రేమ కనిపించక, భద్రమైన భావన కనిపించక... తాము ప్రేమకు అనర్హులమనీ, చేతకానివారమనే భావనలు పెరుగుతాయి. అవి తమకు ఓటమి తప్పదనే భావనకు బదిలీ అవుతున్న కొద్దీ... అది ఆత్మన్యూనతకు దారితీస్తుంది. అందుకే ఆ దశ రాకుండానే పిల్లల పెంపకం సాగాలి. అతి ఎప్పుడూ ప్రమాదమే... అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం చాలా ప్రమాదమని గ్రహించాలి. తనను తాను ఇష్టపడటం, తనను తాను గౌరవించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం అవసరం. అది సెల్ఫ్ ఎస్టీమ్. అది మితిమీరిన ఆత్మవిశ్వాసంగా మారితే ప్రమాదం. తనను తాను అతిగా ప్రేమించుకునే ధోరణిని నార్సిజం అంటారు. గ్రీకు పురాణాల్లో నార్సిసస్ అనే ఒక అందమైన వ్యక్తి నీటిలోని తన అందమైన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, పరవశించిపోతూ దాన్ని కౌగిలించుకోవాలని ప్రయత్నిస్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోతాడు. ఈ వ్యక్తి పేరు నుంచి వచ్చిన పారిభాషికపదమే నార్సిజం. ఇలా తనను తాను ఎక్కువగా ప్రేమించుకుని, గొప్పగా ఊహించుకోవడం, తనకు తెలివితేటలు, అందం, వ్యక్తిత్వం వంటివి అన్నీ ఎక్కువని అతిగా ఊహించుకోవడం ప్రమాదం. ఇలాంటివారు క్రమంగా అహం, గర్వం, పొగరును పెంచుకుని ఇతరులను చులకన భావంతో చూడటం మొదలుపెడతారు. ఆత్మన్యూనతను తొలగింపజేసుకోడానికి చేయాల్సిన పని సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవడమే. ఆత్మవిశ్వాసం ఉండే వ్యక్తుల్లో కనిపించే లక్షణాలు: - నిజాయితీ, సడలని పట్టుదల, విలువలకు కట్టుబడి ఉండే గుణం. - తాము తీసుకున్న నిర్ణయాలకు తామే బాధ్యత వహించే తత్వం. - తమ అభిప్రాయాలను ఇతరులు వ్యతిరేకిస్తారేమోనన్న భయం, జంకు లేకపోవడం. - {పతి వ్యక్తిలోనూ కొన్ని లోపాలు సహజమనే విషయం తెలిసి ఉండటం. - ఓటమినీ, వ్యతిరేకతలనూ జీవితంలో ఒక భాగంగా చూడగలిగే తత్వం. దాంతో వాటికి వెరవకపోవడం. అలాంటి అనుభవాలతో కొత్త పాఠాలు నేర్చుకుని ముందుకుసాగే తత్వం. - సంతోషంతో పాటు, మానవ సహజ స్వభావాలైన కోపం, దుఃఖం మొదలైన భావోద్వేగాలనూ వ్యక్తీకరించగలగడం. దాంతో ఎప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండటం. ఒక వ్యక్తి విజయానికి వెనక ఉన్న రహస్యం ఈ ఆత్మవిశ్వాసమే. ఇది పసితనంలోనే అలవడుతుంది. ఇక పైన పేర్కొన్న అంశాలకు వ్యతిరేకమైనదే ‘ఆత్మన్యూనతాభావం’. అంటే... తమ పైనా, తాము చేసే పనుల ఫలితంపైనా తమకు నమ్మకం లేకపోవడం, తమను తాము ప్రేమించుకోలేకపోవడం. ఇలాంటివారు తాము అసమర్థులమని భావిస్తుంటారు. ఇతరుల ప్రేమకు అర్హుడిని / అర్హురాలిని కానంటూ భావిస్తుంటారు. ఆత్మన్యూనతకు గురయ్యేవారు ఓటమిని తమ చేతగానితనంగా అన్వయించుకుంటూ ఉంటారు. దాంతో ఎప్పుడూ ప్రతికూల ధోరణి (నెగెటివ్ నేచర్)తో ఉంటారు. ఏ పనినైనా మొదలుపెట్టే సమయంలో ఓటమి తప్పదనే భావనతో అసలు మొదలే పెట్టరు. ఒకవేళ సాహసించి మొదలుపెట్టినా ఓటమి భయం నిత్యం వెంటాడుతూ ఉండటం వల్ల దానిపై ధ్యాస నిలపలేరు. ఫలితంగా ఎక్కువ తప్పులకు ఆస్కారం ఉంటుంది. దాంతో తమ ప్రతికూల ఆలోచనా ధోరణిని మరింత బలపరచుకుంటూ ఉంటారు. ఆత్మన్యూనతాభావం ఉన్న కొందరిలో కనిపించే అతి ఆత్మవిశ్వాస లక్షణాలు: ఎదుటివారి ధోరణిని విమర్శించడం... ఎదుటి వారు తమ లోపాన్ని కనుగొనకముందే రక్షణాత్మక చర్యగా వారిపై విమర్శలకు పాల్పడుతుంటారు. తాము అధికులమనే భావనను చూపడానికి ఖరీదైన దుస్తులను, తమ తాహతుకు మించిన వస్తువు లను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రదర్శనా ధోరణి (ఆస్టేం టేషియస్ బిహేవియర్) ద్వారా తమలోని లోపాలను తేలిగ్గా బయట పడేసుకుంటుంటారు. తమకు తెలియని పదాలను తప్పుడు అర్థంలో ప్రయోగిస్తుంటారు. దీన్నే పదడాంబికంగా చెప్పుకో వచ్చు. దీనిద్వారా తమ డొల్లదనాన్ని చెప్పకనే చెబుతుం టారు. తమ పిల్లల గొప్పదనాన్ని తరచూ చెబుతుం టారు. సందర్భం లేకపోయినా... ఇలాంటి గొప్పలు చెప్పడానికి సందర్భాన్ని తామే కల్పిస్తుంటారు. అప్పులతోనైనా ఇంట్లో విలాస వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. నిత్యం ఆర్థిక సమస్యలకు లోనైనా ఈ ధోరణి వీడరు. ఫలితంగా ఒక్కోసారి అవమానకరమైన పరిస్థి తులను ఎదుర్కొంటుంటారు. ప్రవర్తనాపరంగా పెంచుకోవాల్సినవి... ఆనందించడం ఆనందాలను ఇతరులతో కలిసి పంచుకోవడం ఇతరులను ప్రేమించడం, గౌరవించడం బాధ్యతగా ప్రవర్తించడం నిజాయితి నమ్మకాన్ని చూరగొనేలా వ్యవహరించే గుణం (ఇంటిగ్రిటీ) బ్యాలెన్స్ తప్పకుండా, పొల్లుమాటలు లేకుండా మాట్లాడటం పొగడ్తలనూ, విమర్శలనూ ఒకేలా స్వీకరించగలగడం. స్వభావపరంగా అలవరచుకోవాల్సినవి... ఇతరుల సమర్థత పట్ల నమ్మకం ఉంచుకోవడం, అలాగే... తన సమర్థత మీద కూడా నమ్మకం ఉంచుకోవడాన్ని నేర్చుకోవడం. ఒకవేళ పొరబాట్లు దొర్లినా తొలిదశలో అవి మామూలే అని ఓదార్చుకునే స్వభావాన్ని అలవరచుకోవడం. పొరబాట్లనుంచి నేర్చుకోవడం, ఎదగడం. నలుగురిలోకి చొచ్చుకుపోవడం, నలుగురితో సంబంధాలు పెంచుకోవడం. తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించడం. అనుకున్నది చేయడం. భావనపరంగా వ్యక్తీకరించాల్సినవి... తన భావనలను స్వతంత్రంగా వ్యక్తపరచడం. భావనల వ్యక్తీకరణలో నిజాయితీగా ఉండటం. ఇతరులను భావాలను గౌరవించడం. ఈ గుణాలను క్రమంగా అలవాటు చేసుకుంటూ ఉంటే క్రమంగా ఆత్మన్యూనతను అధిగమించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. అయితే ప్రయత్నపూర్వకంగా అలా చేయలేని సమయాల్లో సైకియాట్రిస్ట్ వంటి నిపుణులు/ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ -
ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధ్యం..
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మవిశ్వాసంతోనే ల క్ష్యం సాధ్యమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై స్వామి వివేకనందుడి చిత్రపటానికి పూలమాల లు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుగమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే వరకు నిర్వారామం గా కృషి చేయాలని అన్నారు. వివేకానందుని ఆశయాల సాధనకు పాటుడాలన్నారు. వందమంది యువకులతో దేశ రూ పులేఖలే మార్చవర్చన్న వివేకానందుడి మాటలను విస్మరిం చవద్దని కోరారు. యువత నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం సరైందికాదన్నారు. ఉద్యోగమే జీవి తం కాదని, చదువు అన్ని రకాలుగా మేధస్సును పెంచుతుం దన్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నాయని పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత అన్నింటిలోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మహనీయులు కలలుగన్న గ్రామస్వరాజ్యం యువ తతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న, సామాజిక కార్యకర్త డాక్టర్ కళ్యాణ్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా ఇన్చార్జి కన్నం మోహన్‌బాబు, నలంద కళాశాల ప్రిన్సిపాల్ పున్నారావు, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ రవిచరణ్దాస్, వేద పండితుడు చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రీ సిద్ధాంతి, యువజన సంఘాల నాయకుడు నర్సింగ్‌రావు, యూత్ కో ఆర్టినేటర్ మసూద్, న్యాయనిర్ణేతలు కభీర్దాస్, కవిత, సతీష్దేశ్పాండే, శైలజ దేశ్‌పాండే, మురళీధర్,రాజారాం తదితరుల పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం.. జిలా యువజనోత్సవాల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులకు ఎమ్మెల్యే జోగురామన్న, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి బహుమతులు అందించారు. వన్యాక్ట్ ప్లేలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయస్థానం సాధించిన నటరాజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కళాకారులకు ప్రశంసపత్రాలు, మెమొంటో అందజేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైన ఉషాకిరణ్ బృందానికి, తబల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించిన సాయినాథ్కు, హార్మోనియంలో ప్రతిభ కనబర్చిన గౌతమ్‌కు, ఫోక్ గానంలో పవర్మోహన్నాయక్ బృందాలకు ప్రశంసపత్రాలు, మెమొం టోలు అందించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలకు వ్యవహరిం చిన వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ కళారూపాలతో కళాప్రదర్శనలు ఆహూతులను అలరించారు. నటరాజ్ డాన్స్ ఇన్సిస్టిట్యూట్ విద్యార్థు లు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు శ్రీష్మ, రవమిరెడ్డి శాస్త్రీయ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. భగత్రావు థింసా నృత్యం, తలమడుగు మందగూడకుచెం దిన శ్రీనివాస్ గుస్సాడి బృందం చేసిన ప్రదర్శనలు అలరించాయి. మిట్టురవి కళా బృందం గీతాలతో అలరించారు. -
మూఢ నమ్మకాలను నమ్మొద్దు
కేశంపేట, న్యూస్‌లైన్: ఆధునిక యుగంలో ప్రజలు మూఢ నమ్మకాలను నమ్మవద్దని, తాగుడుకు బానిసైన వారికే దెయ్యాల ధ్యాస ఉంటుందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ పేర్కొన్నారు. కేశంపేట మండలంలోని కాకునూరులో కొన్ని రోజులుగా దెయ్యం పుకార్లు రావడంతో, జనానికి అవగాహన కల్పించేందుకు సోమవారం రాత్రి జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో జన చైతన్య సభను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రపంచంలో దెయ్యాలంటూ ఏమీ లేవన్నారు. మనిషిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లితే శరీరంలో వణుకు పుట్టడంతో పాటు దెయ్యాలు, భూతాలు ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. తాగుడుకు బానిసైన వారికి ఒక్క పూట మందు లేకపోతే లేనిపోని ఆలోచనలు వస్తాయని, అలాంటి ఆలోచనల్లో పుట్టినదే దెయ్యం, భూతమన్నారు. అనంతరం అరచేతిలో మంటను మండించడం, ఇనుపచువ్వలను నాలుకకు కుచ్చుకోవడం, నూనెలో బజ్జీలు వేసి చేతితో తీయడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, సర్పంచ్ లక్ష్మమ్మ, ఉపసర్పంచ్ జంగారెడ్డి, ఎస్ఐ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.