అందంగా ఉండటమంటే వయ్యారాలు పోవడం అని విమర్శించేరోజులు పోయాయి. అందంగా ఉండటం అంటే ఆత్మవిశ్వాసంగా ఉండటం అనే రోజులివి. ఆ దిశగా సాగిపోవాలి. మన పిల్లల కోసం సంపాదించేవి ఆస్తులు, మన కోసం సంపాదించుకునేవి జ్ఞాపకాలు. మన సంతోషంగా ఉండేందుకు కాపాడుకునేది ఆరోగ్యం. అన్నం తినడానికి, ఉద్యోగం చేయడానికి, నిద్ర పోవడానికి టైం లేదు అని చెబుతామా? మరి మన గురించి మనతో పాటు చివరి వరకు ఉండే దేహం గురించి శ్రద్ధ తీసుకోమంటే మాత్రం టైం లేదని ఎందుకంటారు? అది కూడా అత్యవసర దినచర్యే. మనం బతికున్న చివరి రోజు వరకు మన మీద మనం ఆధారపడాలి గాని వేరేవారి మీద ఆధారపడకూడదు. అందుకు ఆరోగ్యంగా, హాయిగా జీవించడమే ఓ మార్గం. దానికోసం మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి.
ఫిట్‌గా ఉండండి
వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయండి
ఎనిమిది గంటల ఉద్యోగంలో కూర్చునే పద్ధతిపై శ్రద్ధ పెట్టండి.
ఒత్తిడి తగ్గడానికి ఉన్న అవకాశాలన్నీ పాటించండి.
తయారవ్వండి
కొత్త ట్రెండును పట్టించుకోండి.
డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తూ ఉండండి
జుట్టు, చర్మం, ఫ్యాట్... వీటి గురించి శ్రద్ధ పెట్టండి.
ఆరోగ్యంగా ఉండండి
సరైన నిద్ర, సరైన నీరు, సరైన ఆహారం.. అందానికి నిజమైన కాస్మొటిక్స్.
అసూయ ద్వేషాలు అదుపులో ఉండాలి. ఆలోచనలు హాయిగా సాగాలి.
నవ్వుతూ సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి.
స్త్రీల కోసం పాప్-అప్ జీన్స్!
ఇంతవరకు బ్రాసరీలకే పరిమితమైన టెక్నాలజీనీ స్త్రీ వినియోదారుల మార్కెట్‌ను, వారి సమస్యలు దృష్టిలో ఉంచుకుని జీన్స్‌కు కూడా తీసుకొచ్చింది యూరప్‌కు చెందిన ఇటలీ కంపెనీ ‘గ్యాస్ జీన్స్’. శరీర సౌష్టవంలో లోపాలను సరిచేసి చూపడం ద్వారా ఇవి స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నది ఆ కంపెనీ ఉద్దేశం. బ్రాసరీలలో లాగే ఈ జీన్స్‌లో కూడా బ్యాక్ పాకెట్స్ లోపల స్పెషల్ కప్స్ ఏర్పాటుచేయడం వల్ల కోరుకున్న సౌష్టవాన్ని పొందవచ్చట. ఫ్యాంట్ నడుము సైజును బట్టి ఈ కప్స్ సైజు మారుతూ ఉంటుంది. వీటివల్ల ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకుండా బాడీని అందంగా కనిపించేలా చేసుకోవచ్చన్నమాట. దీనికి ఫ్యాషన్ ప్రియులు ‘కర్వ్స్ ఆన్ బి-సైడ్ (curves on b-side) అని పిలుస్తున్నారు. ఇవి హైదరాబాదులో దొరుకుతాయి.
ఉత్తరం: మీ కోసం మీరు...!
Published Sun, Sep 15 2013 2:35 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement