north
-
దక్షిణాదిన వానలు.. ఉత్తరాదిన ఎండలు
దేశంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిన ఎండలు మండిపోతుంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణుడు పలకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కాస్త చల్లబడింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. అయితే రుతుపవనాలు పలకరించాక, వాతావరణం మారింది. ఉత్తరాదిన భానుడి భగభగలు కొనసాగుతుంటే.. దక్షిణాదిన మాత్రం వర్షాలు పడుతున్నాయి. వేడి, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.మరో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇటు తెలంగాణలోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది ఐఎండీ.వర్షాలతో దక్షిణాది చల్లబడినా.. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వేడి వాతావరణం కొనసాగుతోంది. భానుడి భగభగలు సెగలు పుట్టిస్తున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్ దాటింది. రానున్న రోజుల్లో ఇది 47 డిగ్రీలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది.హీట్‌వేవ్, నీటి సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న దేశ రాజధానిపై మరో పిడుగు పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీగా విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది. ఉత్తర్‌ప్రదేశ్ మండోలాలోని పవర్ గ్రిడ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఢిల్లీ వాసులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ఈ గ్రిడ్ నుంచి 1500 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ సరఫరా అవుతుంది. మొత్తంగా ఉత్తరాది ప్రజలు ఇటు ఉష్ణోగ్రతలు, అటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
నార్త్‌లో ఎండలు.. సౌత్‌లో వర్షాలు
సాక్షి,ఢిల్లీ: దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదిన భానుడు భగభగలాడుతుండగా దక్షిణాదిన వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హీట్‌వేవ్ జూన్ 14వరకు కొనసాగుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటవచ్చని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల ధాటికి ఢిల్లీలో జనం బయటికి రావాలంటేనే జడుస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్ ఉవ్విళ్లూరుతున్నారు.అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్‌లపై పోటీకి దిగారు.తన సోషల్ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు. -
ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?
‘మంత్రాలకు, శాపాలకు ఏదైనాసరే.. రాయిగా మారిపోతుంది’ అనే మాటను పురాణగాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఈ బావిలోని నీళ్లు దేన్నైనాసరే నిలువునా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇంగ్లండ్‌లోని ‘పెట్రిఫైయింగ్ వెల్’ చరిత్ర ఓ మిస్టరీ. దీన్నే ‘మదర్ షిప్టన్ కేవ్’ అని కూడా పిలుస్తారు.నార్త్ యార్క్‌షైర్‌లోని అందమైన ప్రాంతాల్లో నేజ్బ్ర ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఆ నుయ్యి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా.. మరికొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీ కప్పులు, టెడ్డీబేర్ ఇలా ప్రతిదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతాకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులను ఇలా, ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియమ్స్‌లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్నినెలల పాటు ఉంచిన సైకిల్ రాయిగా మారిపోవడం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది.నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ్ల చాలవు. నిడ్ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం..1630 నుంచి పర్యాటకేంద్రంగా వాసికెక్కింది. అప్పటి నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రావెర్టైన్ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్ షిప్టన్ గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తుంది.ఆ గుహలోనే.. 1488లో అగాథ సూత్టేల్ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ బిడ్డ పేరు ‘ఉర్సులా సౌథైల్’ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్దపెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానిక కథనం. అంతేకాదు ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట.హెన్రీ Vఐఐఐ (1547) మరణం, గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ (1666) వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలామంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు ‘మదర్ షిప్టన్ ’గా మారింది.ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరంపెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితో ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించినవారంతా ఆ నుయ్యి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలుపెట్టారు.ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంలా ఉందనే ప్రచారమూ సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది.. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా! అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనేదానిపై స్పష్టత లేదు.మదర్ షిప్టన్ చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలామంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారమూ ఊపందుకుంది.ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నింబధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అసలు ఈ నీరు ఎప్పటి నుంచి అలా మారింది? ఉర్సులా సౌథైల్ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలూ ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికీ ఈ గుహ వెనకున్న కథ మిస్టరీనే మిగిలిపోయింది. — సంహిత నిమ్మనఇవి చదవండి: మధిర టు తిరుపతి.. 'సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!' -
మిస్టరీ: అక్కడికి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా?
ప్రపంచాన్ని వణికించే ప్రదేశాల్లో ‘దార్గాస్’ ఒకటి. రష్యాలోని ‘నార్త్ ఒసీషియా– అలానియా’ రిపబ్లిక్లో గిజెల్డన్ నది సమీపంలో ఉన్న ఓ చిన్న పర్వతం మీద ఉన్న దార్గాస్ గ్రామాన్ని ‘సిటీ ఆఫ్ ది డెడ్’ అని పిలుస్తారు. దీన్ని గ్రామం అనే కంటే శ్మశానాల దిబ్బ అనడమే కరెక్ట్. అక్కడి స్థానికులు పగటి పూట కూడా ఆ పర్వతం మీదకు ఒంటరిగా వెళ్లరు. ఆ దరిదాపుల్లో ఒంటరిగా తిరగరు. రాత్రి అయితే ఆ పర్వతం వైపు చూడను కూడా చూడరు. ‘నార్త్ ఒసీషియా–అలానియా’లో అత్యధికంగా నివసించే ఒసీషియన్ గిరిజన తెగకు చెందిన చరిత్రను చెబుతుంది ఈ ప్రాంతం. మధ్యయుగం నాటి ఒసీషియన్స్.. మరణించిన తమ కుటుంబసభ్యుల మృతదేహాలను ఇక్కడ పాతిపెట్టేవారట! ఇక్కడి శిథిల నిర్మాణాలు ఇంకెన్నో భయపెట్టే కథనాలతో బెదరగొడతాయి. దార్గాస్లో 99 సమాధులు చిన్నచిన్న ఇళ్ల మాదిరి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని దగ్గరదగ్గరగా.. ఇంకొన్ని దూరం దూరంగా.. మరికొన్ని ఒకదాని వెనుక ఒకటిగా.. కనిపిస్తాయి. వాటికి ఒకవైపు సుమారు నాలుగు అంతస్తుల ఎత్తులో ఒక పొడవాటి స్థూపం కూడా ఆకట్టుకుంటుంది. దాని లోపలికి దిగడానికి పెద్దపెద్ద నిచ్చెనలు ఏటవాలుగా ఉంటాయి. ఈ నిర్మాణాలన్నీ రాళ్లతో కట్టినవే! అక్కడ సుమారు 10 వేలకుపైనే అస్థిపంజరాలు ఉన్నాయని అంచనా వేశారు పరిశోధకులు. అయితే అక్కడున్న శవపేటికలు పడవ ఆకారంలో ఉన్నాయట. చనిపోయిన వారి ఆత్మ.. నదులను దాటుకుని స్వర్గానికి వెళ్లడానికి పడవ అవసరమని అక్కడి స్థానిక పురాణాలు చెబుతాయి. ఆ సమాధుల్లో వాళ్లకు ఇష్టమైన దుస్తులు, వస్తువులను కూడా ఉంచేవారు. అయితే దార్గాస్ పర్వతం మీదకు వెళ్లినవారు తిరిగిరారనే ప్రచారం కూడా ఉంది. కొందరు సాహసవంతులు ఆ పర్వతం మీదకెక్కి, అక్కడి సమాధుల మధ్యకు వెళ్లి, ఇక తిరిగి రాలేదట! దార్గాస్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెబుతుంటారు. నిజానికి అక్కడ కేవలం 99 సమాధులే ఉన్నా, పదివేలకు పైగా అస్థిపంజరాలు ఎలా వచ్చాయి? అనే ప్రశ్నకు బదులుగా ఒక విషాదగాథ వినిపిస్తుంది. 18వ శతాబ్దంలో ఒసీషియాలో ప్లేగు వ్యాపించింది. ఆ సమయంలో ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం.. ఈ పర్వత సమాధుల మీదున్న నిర్మాణాలను పునరుద్ధరించి.. అక్కడ ప్లేగు వ్యాధిగ్రస్తులను ఉంచేవారట. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని.. వారికి కావాల్సిన ఆహారాన్ని, వస్తువులను అందించేవారట. వ్యాధి సోకిన వారు తిరిగి ఊళ్లోకి రావడానికి లేకుండా ఎన్నో ఆంక్షలు ఉండేవట. దాంతో ఆ పర్వతం మీదే ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వారి మృతదేహాలు కనీసం ఖననానికి కూడా నోచుకోకపోవడంతో మిగిలిన వ్యాధిగ్రస్తులు కుళ్లిన మృతదేహాల పక్కనే జీవిస్తూ నరకం అనుభవించారని చరిత్ర చెబుతోంది. వరుస మరణాలతో నాటి పరిస్థితి చాలా ఘోరంగా గడిచిందట. నిజానికి దార్గాస్ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవు. ఒక పక్క నది.. మరో పక్క ఎత్తయిన కొండలు, కొన్నిసార్లు నేలమీద దట్టంగా పేరుకున్న మంచు, మంచు కరిగినప్పుడు బయటపడే ఆకుపచ్చని గడ్డి నేల.. ఇలా కాలానికి తగ్గట్టుగా మారే దార్గాస్ ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి అందరూ సాహసించరు. కొందరు సాహసికులు మాత్రమే ఇక్కడికి Ðð ళ్లి.. ఫొటోలు, వీడియోలు తీసుకుని.. సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాత్రిపూట దార్గాస్ కొండల మీదకు వెళ్లేందుకు అనుమతి లేదు. మరి నిజంగానే అక్కడకి ఒంటరిగా వెళ్తే తిరిగిరారా? ప్రాణాలనే కోల్పోతారా? అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
డిస్కమ్‌ల డైరెక్టర్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లోని డైరెక్టర్లను ప్రభుత్వం తొలగించింది. వారి తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ రిజ్వీ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు 2012లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిస్కమ్‌ల సీఎండీలను ఆయన ఆదేశించారు. దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 11 డైరెక్టర్లు కొనసాగుతున్నారు. ఈ 11 మందిలో కేవలం ఇద్దరు డైరెక్టర్లు టి.శ్రీనివాస్ (డైరెక్టర్, ప్రాజెక్ట్స్), టీఎస్ఎన్పీడీసీఎల్ వెంకటేశ్వరరావు (డైరెక్టర్ హెచ్ఆర్) మాత్రమే 2013లో నిబంధనలకు అనుగుణంగా డైరెక్టర్లుగా నియామకమయ్యారని పేర్కొన్నారు. మిగిలిన తొమ్మిదిమంది డైరెక్టర్లు ఆరేళ్ల క్రితం ఎలాంటి నిబంధనలు పాటించకుండా నియామకమయ్యారని ఆ ఉత్తర్వుల్లో రిజ్వీ స్పష్టం చేశారు. తొలగించిన ఆ 11మంది ఎవరెవరంటే.. సోమవారం తొలగించిన 11 మంది డైరెక్టర్లలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలోని జె, శ్రీనివాస్‌రెడ్డి(ఆపరేషన్స్), శ్రీనివాస్(ప్రాజెక్ట్స్), కె.రాములు(కమర్షియల్, ఎనర్జీ ఆడిట్), జీ. పార్వతం(హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు(ప్రణాళిక, నిర్వహణ), ఎస్,స్వామిరెడ్డి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ), గంపా గోపాల్(ఎనర్జీ ఆడిట్).. కాగా ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో బి. వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి. సంధ్యారాణి (కమర్షియల్), పి. గణపతి(ఐపీసీ అండ్ ఆర్ఏసీ) ఉన్నారు. కొత్త డైరెక్టర్ల కోసం దరఖాస్తుల స్వీకరణ.. ఇంటర్వ్యూలు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త డైరెక్టర్లను నియమించనున్నట్లు సమాచారం, ఇప్పటికే జెన్కో, ట్రాన్స్‌కోలో డైరెక్టర్లకు ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం విదితమే. ఇప్పుడు పంపిణీ సంస్థల డైరెక్టర్లకు కూడా ఉద్వాసన పలకడం ద్వారా విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేసినట్లయింది. ఏళ్ల తరబడి డైరెక్టర్లుగా వాళ్లే కొనసాగడం వల్ల విద్యుత్ సంస్థల్లో పురోగతి లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నప్పటికీ.. నష్టాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై వాళ్లు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా రూ.వేల కోట్లలో నష్టాలు పేరుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయన్న వాదనలున్నాయి, కాగా, వచ్చేనెలలో ఈ డైరెక్టర్ల పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
అక్కడో రీతి.. ఇక్కడో తీరు
సాక్షి, హైదరాబాద్: విద్యావిధానంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణుల నేపథ్యంలో ఆ రెండు ప్రాంతాల మానవ వనరుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు పాఠ్య ప్రణాళికలు అవసరమని ఉన్నత విద్యా మండలి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ భావిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో భిన్న కోర్సులను రూపొందించేందుకు కసరత్తు చేపట్టాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలతో కలిసి మానవ వనరుల అభివృద్ధికి కార్యాచరణను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక్కడ టెక్‌లు, సాఫ్ట్వేర్లు.. అక్కడ సివిల్స్ టార్గెట్ వయా డిగ్రీలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. సగానికి పైగా ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాదికే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి దేశవ్యాప్తంగా 3,39,405 సీట్లు ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, ఆరేళ్లలో అవి 5.3 శాతం మాత్రమే పెరిగాయని మండలి గుర్తించింది. స్కిల్.. పాలన నైపుణ్యంపై దృష్టి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న పాలనాపరమైన మార్పులు, ప్రైవేటు రంగంలో వస్తున్న సరికొత్త డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠ్యాంశాలు రూపొందించాలని ఏఐసీటీఈ, యూజీసీ భావిస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యం పెంచడంపై దృష్టి పెట్టాలని గుర్తించింది. పారిశ్రామిక భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ విద్యను ముందుకు తీసుకెళ్ళే ఆలోచనలపై ఫోకస్ చేయాలని భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై త్వరలో విధివి«దానాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉత్తర ద్వారం తెరిచిన ‘బీజేపీ’.. మార్పు కలిసొచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా, అదే రోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసి గతంలో ఉపయోగించిన ఉత్తరం వైపు తలుపును తెరిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తే పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు రావొచ్చునని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వాస్తు మార్పు చేసి, ఉత్తరం వైపు ద్వారాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాక తూర్పువైపు ప్రధాన ద్వారాన్నే చాలా కాలం ఉపయోగించారు. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని వాస్తుపరమైన మార్పులు చేశారు. ఇందులో భాగంగా తూర్పువైపు ద్వారం మూసేసి, ఉత్తరం వైపు తలుపులు తెరిచి రాకపోకలకు ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే సందర్భంగా వాస్తుపరంగా ఉత్తర ద్వారాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం. పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ సరళిని బట్టి చూస్తే సానుకూల పరిణామాలే కనిపించాయని, గతం కంటే ఎక్కువ ఓటింగ్శాతమే నమోదు అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మరి నిజంగానే ప్రధాన ద్వారం మార్పు అనేది పార్టీ అధిక సీట్లను గెలిపిస్తుందా అనేది తేలాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే మరి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్–ఒడిశా తీరాలకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కి.మీల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గురువారంకి పశ్చిమ, వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుంచి ప్రస్తుత అల్పపీడన ప్రాంతం వరకు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా వెళ్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఉత్తర కోస్తాలో బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. -
వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు!
ప్రపంచంలో రహస్యాలతో కూడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటికి కొన్ని రహస్యమైనవే కాదు.. ప్రమాదభరితమైనవి కూడా. అలాంటి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. అది ఏమి ద్వీపమో ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంతో సంబంధం లేకుండా.. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల సమూహంలోని ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిలో మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటినలీస్ తెగ వారు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. వారు ఇప్పటి వరకు వారు ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు. ఈ మనుషుల తక్కువ ఎత్తు కలిగివుంటారు. కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు.. నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు. ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, హత్య చేస్తారని చెబుతుంటారు. 2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు. ఇది కూడా చదవండి: భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త! -
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఉత్తర భారతదేశంలోని టాప్ 10 పర్యాటక ప్రదేశాలు
-
విశాఖ నార్త్ లో పోటీకి టీడీపీలో ఎవరూ ముందుకు రాని స్థితి
-
విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలకు సీఎం జగన్ దిశా నిర్దేశం
-
ఉత్తరాయణం మహా పుణ్యకాలం
మకర సంక్రాంతి పర్వదినంతో ఉత్తరాయణం మొదలయింది. మొన్నటివరకూ మనం సంకల్పంలో దక్షిణాయనే అని చెప్పుకున్నాం. సంక్రాంతినుంచి ఉత్తరాయణం అని చెప్పుకుంటున్నాం. ఉత్తరాయణానికి పుణ్యకాలం అని పేరు. అలా ఎందుకంటారో, ఈ పుణ్యకాలంలో మనం ఆచరించవలసిన విధులేమిటో తెలుసుకుందాం.. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. దక్షిణాయణానికి ఉండే ప్రత్యేకత వేరు. ఈ రెండు ఆయనాల మధ్య ఈ వైరుధ్య వైవిధ్యాలేమిటో తెలుసుకునేముందు ఆయనం అంటే ఏమిటో అవలోకిద్దాం. ఆయనం అంటే పయనించడం అని, ఉత్తర ఆయనం అంటే ఉత్తర వైపుకి పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నించి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు పయనించే దిక్కుని బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నపుడు దక్షిణాయణం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. అయితే, సూర్యుడు సంవత్సరంలో ఆర్నెలలు దక్షిణం వైపు, మరో ఆరు నెలలు ఉత్తరదిశగానూ పయనిస్తూ ఉంటాడు. సాధారణంగా ఉత్తరాయణం జనవరి 14 లేదా 15 నుండి జూలై 17 వరకు వుంటుంది. దక్షిణాయణం జూలై 17 నుండి జనవరి 14 వరకు వుంటుంది. (ఒక రోజు అటూ ఇటూ కావచ్చు) ఉత్తరాయణంలో పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుండడం వలన పుణ్య క్షేత్ర సందర్శనలు, తీర్థయాత్రలకు అనువుగా వుంటుంది... మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం వల్ల, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్ల, శరీరంలో ఉత్తర భాగాన్ని విశిష్టమైనదిగా భావించడం వల్ల, మన భారతీయ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్ల, అన్ని భాషలకూ అమ్మగా, రాజభాషగా, దేవభాషగా చెప్పుకునే సంస్కృతం ఉత్తరాదిన పుట్టడం వల్ల, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస స్థానాలు కావటం వల్ల, ముఖ్యంగా సూర్యభగవానుడు ఉత్తర ప«థ చలనం చేయడం వల్ల... ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావించి గౌరవించారు పెద్దలు. అంతేగాక, కురుక్షేత్ర యుద్ధంలో అంపశయ్యపై ఒరిగిన భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తరువాతనే ప్రాణాలు వదిలారు. ఈ ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్ళు తొడిగి, పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలు అందిస్తాయి. ఈ కాలంలోనే పసిపాపలు ఎక్కువగా జన్మిస్తారనీ, ఎక్కువగా ఈ కాలంలోనే కుమారీమణులు పుష్పవతులు అవుతారని, స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అనీ విజ్ఞానశాస్త్రం కూడా చెబుతోంది. బహుశా ఇందుకేనేమో ఉత్తరాయణ కాలం పుణ్య కాలం అయింది.భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రింబగళ్లు ఉంటాయి. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగలను జరపడం మొదలు పెట్టారు. ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి మూడడగుల నేలను దానం చేశాడని, ఆ మూడడుగులతో ముల్లోకాలకూ వ్యాపించి బ్రహ్మాండమంతా తన రెండడుగులతోనే కొలిచి, మూడవపాదాన్ని బలి శిరస్సున మోపి పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలంలోనేనని గరుడపురాణం పేర్కొంటోంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసే ఏ దానమైనా శ్రేష్టమైనదే. ఈ దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుందని విశ్వాసం. -
సౌత్ టూ నార్త్..వయా వరంగల్
-
చీలిపోయిన ఏపీ ఐఏఎస్ అధికారులు
-
నార్త్‌జోన్ కబడ్డీ పోటీల విజేత పూడిమడక జట్టు
కాకినాడ క్రై ం : కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్ర స్థాయి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మీట్–2లో భాగంగా జిల్లా క్రీడా మైదానంలో కబడ్డీ పోటీలను కోస్టల్ సెక్యూరిటీస్ పోలీస్ నార్త్ జోన్ డీఎస్పీ ఎం.రాజారావు బుధవారం ప్రారంభించారు. తొలుత ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటూ శారీరక దృఢత్వాన్ని కలుగజేస్తాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మెరైన్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటి వరకూ షెటిల్, సైక్లింగ్, వాలీబాల్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో విశాఖ జిల్లా పూడిమడక జట్టు విన్నర్ కాగా, శ్రీకాకుళం జిల్లా బారువా జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు డీఎస్పీ రాజారావు మెమెంటోలు బహూకరించారు. ఈ రెండు జట్లు ఈ నెలలో విశాఖలో జరిగే సెమీఫైనల్లో సౌత్ జోన్ విన్నర్, రన్నర్ జట్లతో తలపడతాయన్నారు. ఈ పోటీల్లో నార్త్‌జోన్ డివిజన్‌కు చెందిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 11 మెరైన్ పోలీస్స్టేషన్లకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. పోటీలకు రిఫరీలుగా కాకినాడ సిటీకి చెందిన ఆరుగురు పీఈటీలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ, ఓడలరేవు మెరైన్ సీఐలు బి.రాజారావు, శ్రీనివాస్‌లతో పాటు నాలుగు జిల్లాల నుంచి సుమారు 150 మంది మెరైన్ పోలీస్‌లు పాల్గొన్నారు. -
ఆఫ్ఘన్లో భూకంపం
-
ఉత్తరం దక్షిణం.. ఉల్టా పల్టా!
భూమి ఓ పెద్ద బంతిలాంటి అయస్కాంతం. చుట్టూ రక్షణకవచంలా వేల మైళ్లకొద్దీ అయస్కాంత క్షేత్రం ఉంది. కానీ ఇప్పుడా క్షేత్రం బలహీనమవుతోంది. తలకిందులుగా తిరగబడేందుకు సిద్ధమవుతోంది! మరి ఉత్తర, దక్షిణాలు ఉల్టాపల్టా అయితే... ఏమవుతుంది? ఎందుకు? ఏమిటి? ఎలా!? మన సౌరకుటుంబంలో ఒక్క భూమిపై మాత్రమే జీవుల మనుగడకు తోడ్పడే వాతావరణం ఎందుకు ఉందో తెలుసా? భూమి అంతర్భాగం నుంచి చుట్టూ వేల మైళ్ల వరకూ బలమైన అయస్కాంత క్షేత్రం ఆవరించి ఉండటం వల్లే. ఆ అయస్కాంత క్షేత్రమే లేకపోతే అసలు భూమిపై ఓజోన్ పొర, ఇప్పుడున్న వాతావరణమే ఉండేవి కావు. సూర్యుడి నుంచి దూసుకొచ్చే సౌరగాలులు, ప్లాస్మాకణాలు, అంతరిక్షం నుంచి వచ్చే కాస్మిక్ రేడియేషన్ ఓజోన్ పొరను తూట్లు పొడిచేవి. వాతావరణాన్ని దాదాపుగా ఊడ్చుకుపోయేవి! ఫలితంగా అతినీలలోహిత కిరణాలు, రేడియేషన్ తాకిడికి భూమి కూడా ఇతర గ్రహాల్లా వట్టి మట్టిముద్దగా మిగిలిపోయేది!! అయితే భూమికి ఇంత ముఖ్య రక్షణకవచమైన అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా ఓ పక్క బలహీనం అవుతోంది. అదేసమయంలో మరోపక్క బలోపేతం అవుతోంది. భూ అయస్కాంత క్షేత్రానికి అసలు ఏం జరుగుతోంది? అది బలహీనం అయితే ముప్పు ఏర్పడుతుందా? మున్ముందు ఏం జరగబోతోంది? శాస్త్రవేత్తలు చెబుతున్న ఆసక్తికర సంగతులు ఇవీ.. గుట్టువిప్పిన ఉపగ్రహాలు... భూమికి భౌగోళికంగా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉన్నట్టే.. అయస్కాంత క్షేత్రానికి కూడా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయి. ప్రస్తుతం అయస్కాంత ధ్రువాలు భౌగోళిక ధ్రువాలకు దగ్గరగానే ఉన్నాయి. అయితే.. పశ్చిమార్ధగోళంపై అయస్కాంత క్షేత్రం గత ఆరు నెలలుగా క్రమంగా బలహీనం అవుతోందని, అదేసమయంలో దక్షిణ హిందూ మహాసముద్రం వైపు బలోపేతం అవుతోందని ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన మూడు ‘స్వార్మ్’ ఉపగ్రహాల పరిశీలనలో తేలింది. స్వార్మ్ ఉపగ్రహాల సమాచారాన్ని నిశితంగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఇది 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి జరిగే సహజ ప్రక్రియలో భాగంగానే జరుగుతోందని గుర్తించారు. ఇప్పుడు మరోసారి భూమి అయస్కాంత క్షేత్రం తారుమారు అయ్యే సమయం వచ్చేసిందని, 2, 3 వందల ఏళ్లలో దాని ఉత్తర ధ్రువం దక్షిణానికు, దక్షిణ ధ్రువం ఉత్తరానికి మారిపోనున్నాయని, ఇప్పుడు కనిపిస్తున్నది ఆ ప్రక్రియకు ముందస్తు సంకేతమేనని వారు తేల్చారు. ఎందుకీ తకరారు? అయస్కాంత క్షేత్రం తలకిందులు ఎందుకవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా అది ఎలా ఏర్పడుతోందో తెలుసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే... కడుపులో భారీ ఇనుప బంతి, దాని చుట్టూ ద్రవరూపంలో ఉన్న ఇనుము, నికెల్ లోహాల మిశ్రమం తిరగడం వ ల్ల భూమి అనేది ఒక ఎలక్ట్రిక్ డైనమో(విద్యుచ్చాలక యంత్రం)లా పనిచేస్తుంది. దాంతో భూమి చుట్టూ భారీ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం.. భూకేంద్రమైన ఇన్నర్ కోర్ భాగంలో ఘనరూపంలోని ఇనుము 10,300 డిగ్రీ ఫారిన్హీట్ల వరకూ ఉంటుందట. దాని చుట్టూ ఇనుము, నికెల్, ఇతర లోహాలు ద్రవరూపంలో ఉండే ఔటర్ కోర్ పొర ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ఉష్ణోగ్రతలు, పీడనం, సంఘటనం వంటివాటి ఆధారంగా ఉష్ణప్రసరణం జరుగుతుంది. అదేవిధంగా ఈ లోహాల ప్రవాహం ఎలక్ట్రిక్ కరెంట్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా అవి అయస్కాంత క్షేత్రాలుగా మారతాయి. ఈ లోపలి చిన్నచిన్న అయస్కాంత క్షేత్రాలన్నీ కలిసి భూమి చుట్టూ ఓ పెద్ద అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. అయితే కోర్ ఉష్ణోగ్రతల్లో మార్పులు, భూ భ్రమణాన్ని బట్టి ద్రవలోహాలు తిరుగుతాయి. ఈ ద్రవలోహాల ప్రవాహం, వేడి తగ్గినచోట అయస్కాంత క్షేత్రం ఉపరితలంలో బలహీనం అవుతుందన్నమాట. ఉదాహరణకు.. అమెరికాపై అయస్కాంత క్షేత్రం బలహీనం అవడం అంటే.. అమెరికా కింద ఔటర్ కోర్లో ప్రవాహం మందగించింద ని అర్థం చేసుకోవచ్చు. వేల ఏళ్ల నుంచి వందల ఏళ్లకు... భౌగోళిక ధ్రువాల మాదిరిగా అయస్కాంత ధ్రువాలు స్థిరంగా ఉండవు. నిరంతరం కదులుతూ ఉంటాయి. ప్రస్తుతం ఉత్తర అయస్కాంత ధ్రువం సైబీరియా (రష్యా) వైపుగా సంవత్సరానికి 25 మైళ్ల చొప్పున కదులుతోందట. అయితే అయస్కాంత ధ్రువాలు 2, 3 లక్షల ఏళ్లకు ఓసారి తిరగబడతాయని, ఆ తిరగబడే ప్రక్రియ 2 వేల ఏళ్లపాటు జరుగుతుందని ఇంతవరకూ భావించేవారు. అయస్కాంత క్షేత్రం బలహీనం అయ్యే ప్రక్రియ వందేళ్లకు ఐదు శాతం జరుగుతుందనీ అనుకునేవారు. కానీ స్వార్మ్ ఉపగ్రహాల సమాచారంపై అధ్యయనం తర్వాత.. దశాబ్దానికే ఐదు శాతం ప్రక్రియ జరుగుతోందని అంచనా వేశారు. దీంతో రెండు, మూడు వందల ఏళ్లలోనే అయస్కాంత ధ్రువాలు మారతాయని భావిస్తున్నారు. అరుదైనదే కానీ.. హానికరం కాదు.. భూమి అయస్కాంత క్షేత్రం ఓ పక్క బలహీనం అయినా.. వాతావరణాన్ని సౌరగాలులు, రేడియేషన్ తూట్లు పొడిచేంతగా క్షీణించిపోదట. అయస్కాంత క్షేత్రం బలహీనమైనా.. లేదా తారుమారు అయినా.. కాస్మిక్ రేడియేషన్‌ను అది అడ్డుకోవడాన్ని ఆపదని, అదువల్ల భూగోళానికి ఏ హానీ ఉండదని, అన్నీ సక్రమంగానే జరుగుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి చుట్టూ అయస్కాంతక్షేత్రం పూర్తిగా మాయమవ్వదని, కాస్త బలహీనం మాత్ర మే అవుతుందని వారు భరోసా ఇస్తున్నారు. - హన్మిరెడ్డి యెద్దుల పుడమికి అసలైనరక్షణ కవచం అంతరిక్షంలో సెకనుకు 200 నుంచి 1000 కి.మీ. వేగంతో దూసుకొచ్చే సౌరగాలులు, విద్యుదావేశ ప్లాస్మా కణాల ధాటికి సాధారణంగా అయితే భూమి వాతావరణం తుడిచిపెట్టుకుపోవాలి. కానీ.. వాటిని అడ్డుకుని దారి మళ్లించడం ద్వారా భూగోళాన్ని అయస్కాంత క్షేత్రం నిరంతరం రక్షిస్తోంది. భూమి చుట్టూ అదృశ్యరూపంలో గాలిబుడగలా ఉన్న ఈ అయస్కాంత క్షేత్రం సూర్యుడి వైపుగా సుమారు 63 వేల కి.మీ.లు, వెనక వైపుగా 12 లక్షల కి.మీ. వరకూ భూమిని ఆవరించి ఉంటుంది. అయితే సౌరగాలుల ఒత్తిడిని బట్టి ఇది ఒక్కోచోట ఎక్కువ, ఒక్కోచోట తక్కువ సైజులోకి మారుతుంటుంది. -
ఉత్తరం: మీ కోసం మీరు...!
అందంగా ఉండటమంటే వయ్యారాలు పోవడం అని విమర్శించేరోజులు పోయాయి. అందంగా ఉండటం అంటే ఆత్మవిశ్వాసంగా ఉండటం అనే రోజులివి. ఆ దిశగా సాగిపోవాలి. మన పిల్లల కోసం సంపాదించేవి ఆస్తులు, మన కోసం సంపాదించుకునేవి జ్ఞాపకాలు. మన సంతోషంగా ఉండేందుకు కాపాడుకునేది ఆరోగ్యం. అన్నం తినడానికి, ఉద్యోగం చేయడానికి, నిద్ర పోవడానికి టైం లేదు అని చెబుతామా? మరి మన గురించి మనతో పాటు చివరి వరకు ఉండే దేహం గురించి శ్రద్ధ తీసుకోమంటే మాత్రం టైం లేదని ఎందుకంటారు? అది కూడా అత్యవసర దినచర్యే. మనం బతికున్న చివరి రోజు వరకు మన మీద మనం ఆధారపడాలి గాని వేరేవారి మీద ఆధారపడకూడదు. అందుకు ఆరోగ్యంగా, హాయిగా జీవించడమే ఓ మార్గం. దానికోసం మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫిట్‌గా ఉండండి వారంలో ఐదు రోజులు వ్యాయామం చేయండి ఎనిమిది గంటల ఉద్యోగంలో కూర్చునే పద్ధతిపై శ్రద్ధ పెట్టండి. ఒత్తిడి తగ్గడానికి ఉన్న అవకాశాలన్నీ పాటించండి. తయారవ్వండి కొత్త ట్రెండును పట్టించుకోండి. డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తూ ఉండండి జుట్టు, చర్మం, ఫ్యాట్... వీటి గురించి శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యంగా ఉండండి సరైన నిద్ర, సరైన నీరు, సరైన ఆహారం.. అందానికి నిజమైన కాస్మొటిక్స్. అసూయ ద్వేషాలు అదుపులో ఉండాలి. ఆలోచనలు హాయిగా సాగాలి. నవ్వుతూ సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి. స్త్రీల కోసం పాప్-అప్ జీన్స్! ఇంతవరకు బ్రాసరీలకే పరిమితమైన టెక్నాలజీనీ స్త్రీ వినియోదారుల మార్కెట్‌ను, వారి సమస్యలు దృష్టిలో ఉంచుకుని జీన్స్‌కు కూడా తీసుకొచ్చింది యూరప్‌కు చెందిన ఇటలీ కంపెనీ ‘గ్యాస్ జీన్స్’. శరీర సౌష్టవంలో లోపాలను సరిచేసి చూపడం ద్వారా ఇవి స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నది ఆ కంపెనీ ఉద్దేశం. బ్రాసరీలలో లాగే ఈ జీన్స్‌లో కూడా బ్యాక్ పాకెట్స్ లోపల స్పెషల్ కప్స్ ఏర్పాటుచేయడం వల్ల కోరుకున్న సౌష్టవాన్ని పొందవచ్చట. ఫ్యాంట్ నడుము సైజును బట్టి ఈ కప్స్ సైజు మారుతూ ఉంటుంది. వీటివల్ల ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోకుండా బాడీని అందంగా కనిపించేలా చేసుకోవచ్చన్నమాట. దీనికి ఫ్యాషన్ ప్రియులు ‘కర్వ్స్ ఆన్ బి-సైడ్ (curves on b-side) అని పిలుస్తున్నారు. ఇవి హైదరాబాదులో దొరుకుతాయి.