ప్రపంచంలో రహస్యాలతో కూడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటికి కొన్ని రహస్యమైనవే కాదు.. ప్రమాదభరితమైనవి కూడా. అలాంటి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. అది ఏమి ద్వీపమో ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంతో సంబంధం లేకుండా..
నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల సమూహంలోని ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిలో మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటినలీస్ తెగ వారు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. వారు ఇప్పటి వరకు వారు ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు. ఈ మనుషుల తక్కువ ఎత్తు కలిగివుంటారు. కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు..
నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు. ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, హత్య చేస్తారని చెబుతుంటారు. 2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు.
ఇది కూడా చదవండి: భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త!
Comments
Please login to add a commentAdd a comment