outsider
-
వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు!
ప్రపంచంలో రహస్యాలతో కూడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటికి కొన్ని రహస్యమైనవే కాదు.. ప్రమాదభరితమైనవి కూడా. అలాంటి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఒక ద్వీపం. అక్కడకు వెళ్లినవారెవరూ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. ఇది వినగానే అక్కడ భయంకర క్రూర జంతువులు ఉంటాయని అనుకుంటున్నారేమో.. కానీ అక్కడి మనుషులే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అంతమొందిస్తుంటారు. ఈ ప్రాంతంలో ఉండే మనుషులు ఇతరులకు భిన్నంగా ఉంటారు. అది ఏమి ద్వీపమో ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంతో సంబంధం లేకుండా.. నార్త్ సెంటినెల్ ద్వీపం అండమాన్ దీవుల సమూహంలోని ఒక ద్వీపం. ఇది దక్షిణ అండమాన్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అయితే ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ద్వీపాన్ని ఎవరూ కూడా సందర్శించకపోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచంతో సంబంధం లేని తెగలు ఇక్కడ ఉంటున్నాయి. నార్త్ సెంటినెల్ ద్వీపం 23 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. దీనిలో మనుషులు 60 వేల సంవత్సరాలుగా నివసిస్తున్నారు. అయితే వారు తీసుకునే ఆహారం, వారి జీవనం ప్రపంచానికి నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. ఈ ద్వీపం అండమాన్, నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెంటినలీస్ తెగ వారు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు. వారు ఇప్పటి వరకు వారు ఇతరుల నుంచి ఎటువంటి దాడిని ఎదుర్కోలేదు. ఈ మనుషుల తక్కువ ఎత్తు కలిగివుంటారు. కార్బన్ డేటింగ్ పరిశోధన ద్వారా ఈ తెగ రెండు వేల ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు.. నార్త్ సెంటినెల్ ద్వీపాన్ని బయటి వ్యక్తులు సందర్శించేందుకు అనుమతి లేదు. ఇక్కడి గిరిజనులను రక్షించేందుకు భారత ప్రభుత్వం అండమాన్,నికోబార్ దీవుల నియంత్రణ, 1956 చట్టాన్ని జారీ చేసింది. అడ్మినిస్ట్రేషన్ మినహా ఇతరుల ప్రవేశాన్ని ఇక్కడ నిషేధించారు. నార్త్ సెంటినెల్ ద్వీపంలో నివసించే గిరిజనులు బయటి ప్రపంచం నుండి ఎవరైనా తమ ప్రాంతానికి రావడాన్ని ఇష్టపడరు. ఇతర ప్రాంతాలవారు వస్తే అక్కడి గిరిజనులు వారిని హింసించి, హత్య చేస్తారని చెబుతుంటారు. 2006లో ఈ ద్వీపంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. 2018 నవంబరులో అమెరికాకు చెందిన జాన్ అలెన్ చౌ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా ఈ ద్వీపానికి వెళ్లి, అక్కడి గిరిజనుల చేతిలో హత్యకు గురయ్యాడని చెబుతారు. ఇది కూడా చదవండి: భార్యకు సన్‌ఫ్లవర్ అంటే ఇష్టమని.. దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన భర్త! -
జెఎన్యూలో కన్హయ్యపై దాడి!
న్యూఢిల్లీ: జెఎన్యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్పై ఓ వ్యక్తి గురువారం సాయంత్రం దాడి చేయడానికి ప్రయత్నించాడు. దేశాన్ని తిడుతూ.. భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న కన్హయ్యకు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే తాను అతనిపై దాడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్యూ) ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి క్యాంపస్ ఔట్ సైడర్ అని తేలింది. భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే క్యాంపస్ నుంచి బయటకు తీసుకెళ్లారు. దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన కన్హయ్యకుమార్ ఇటీవల బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. జెఎన్యూలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. తీవ్రస్థాయిలో కొనసాగిన ఈ వివాదం కేంద్రప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. -
నాకు గాడ్‌ఫాదర్ లేరు.. నేనో ఔట్‌సైడర్‌ని!
ముంబై: బాలీవుడ్లో తానో ఔట్సైడర్ననే భావన కలుగుతున్నదని 'వజీర్' హీరోయిన్ అదితిరావు హైదరి పేర్కొంది. ఇప్పటివరకు 'ఢిల్లీ 6', 'యే సాలి హై జిందగి', 'రాక్‌స్టార్' వంటి సినిమాల్లో నటించిన అతిది రావు తాను హిందీ చిత్రసీమలో చాలా విషయాల్లో ఇమడలేకపోతున్నానని తెలిపింది. 'కొన్ని విషయాల్లో నేను ఔట్సైడర్నేమోనన్న భావన కలుగుతోంది. ఉదాహరణకు సోషల్ మీడియాలో చాలామంది మద్దతు వ్యవస్థ ఉంది. కానీ నాకు లేదు. నేను ఏదైనా సోషల్ మీడియాలో పెడితే కొందరే మద్దతు తెలుపుతారు. అది సహజంగా వచ్చింది కాబట్టి నాకు ఆనందం కలిగిస్తుంది. కానీ చాలామందికి వాళ్ల స్నేహితులు, కజిన్స్, ఆంకుళ్లు, ఆంటీలు ఇలా అందరూ ముందుకొస్తుంటారు. అంతేకాకుండా వాళ్లు తమకు తెలిసినవాళ్లకు మెసేజ్‌లు పెట్టి మరీ కామెంట్లు, మద్దతు సంపాదించుకుంటారు. కానీ నేను అవన్ని పట్టించుకోను. ఇలాంటి విషయాలు గొప్పవేం కాకపోయిన ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇమేజ్ కోసం అలా చేయడం ముఖ్యమని చాలామంది భావిస్తున్నారు' అని అదితి వివరించింది. తనకు సినిమా పరిశ్రమలో మద్దతుగా గాడ్ఫాదర్లు ఎవరూ లేరని ఆమె పేర్కొంది. 'నాకు మద్దతుగా పెద్ద నిర్మాణ సంస్థగానీ, దర్శకుడుగానీ, హీరోగానీ లేరు. నేను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అడుగులు వేస్తున్నాను. బయటి ప్రపంచం నుంచి వచ్చిన నాకు చిత్రపరిశ్రమలో ఎవరూ తెలిసిన వారు లేరు. ఇతరుల కంటే నేను ముందు అని చెప్పుకోవాలని గానీ, ఇతరులకు వెన్నుపోటు పొడవాలనిగానీ నాకు ఎలాంటి ఆలోచన లేదు. ప్రతిరోజూ సంఘర్షణే నాకు. నా నచ్చిన సినిమాలు చేయడానికి ఈ రోజువరకు నేను పోరాడుతూనే ఉన్నాను' అని అదితి తెలిపింది. -
'నేను అప్పుడు ఒక బయటి వాడిని'
లాస్ ఎంజెల్స్: స్కూళ్లో చదువుకునే రోజుల్లో తానెప్పుడూ ఓ బయటివాడిలా భావించే వాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు లియాం హెమ్స్ వర్త్ అన్నాడు. ఇతరులతో పోలిస్తే తాను పూర్తిగా డిఫరెంట్ అని ఎందుకో అందరితో కలిసిపోలేకపోయేవాడినని చెప్పారు. ఏదైనా మాట్లాడాలని అనుకున్నా ఆ సాహసం చేసేవాడిని కాదని, అసలు తాను ఫిట్టే కాదని బాధపడేవాడినని చెప్పారు. 'నా చుట్టూ ఉన్నవారికి నేను పూర్తి విరుద్ధం అని ఎప్పుడు భావించే వాడిని. అలా అనుకోవడం మంచి అలవాటో చెడు అలవాటో అస్సలు అర్థం కాకపోయేది. నేను నమ్మే ఎన్నో విషయాలపై కూడా ఓ చిన్న అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చేవాడిని కాదు. ఏదేమైనా పాఠశాల రోజుల్లో నేనొక బయటి వ్యక్తిలా ఫీలయ్యేవాడిని. అప్పటి విషయాలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ముందు నువ్వు ఏది సరైనది అనుకుంటే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకో. భయంతో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. సమాజం చాలా భయాల్లోకి నెట్టి వేస్తుంది. కానీ దానిని పట్టించుకునేముందు నిన్ను నువ్వు నమ్ముకో' అని లియాం చెప్పారు. -
'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా'
హైదరాబాద్: తాను భారతీయురాలినేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటానని తెలిపింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయడం తనను బాధించిందని పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది. తనను భారతీయురాలు కాదంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. తనపై బయటివ్యక్తి(అవుట్‌సైడర్) ముద్ర వేయడాన్ని సానియా ఖండించింది. తన కుటుంబం శతాబ్దకాలంగా హైదరాబాద్ లో నివసిస్తోందని తెలిపింది. అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని సూచించింది. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల బీజేపీ అభ్యంతరం చేసింది. పాకిస్థాన్ కోడలిని అంబాసిడర్ గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.