'నేను అప్పుడు ఒక బయటి వాడిని'
లాస్ ఎంజెల్స్: స్కూళ్లో చదువుకునే రోజుల్లో తానెప్పుడూ ఓ బయటివాడిలా భావించే వాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు లియాం హెమ్స్ వర్త్ అన్నాడు. ఇతరులతో పోలిస్తే తాను పూర్తిగా డిఫరెంట్ అని ఎందుకో అందరితో కలిసిపోలేకపోయేవాడినని చెప్పారు. ఏదైనా మాట్లాడాలని అనుకున్నా ఆ సాహసం చేసేవాడిని కాదని, అసలు తాను ఫిట్టే కాదని బాధపడేవాడినని చెప్పారు.
'నా చుట్టూ ఉన్నవారికి నేను పూర్తి విరుద్ధం అని ఎప్పుడు భావించే వాడిని. అలా అనుకోవడం మంచి అలవాటో చెడు అలవాటో అస్సలు అర్థం కాకపోయేది. నేను నమ్మే ఎన్నో విషయాలపై కూడా ఓ చిన్న అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చేవాడిని కాదు. ఏదేమైనా పాఠశాల రోజుల్లో నేనొక బయటి వ్యక్తిలా ఫీలయ్యేవాడిని. అప్పటి విషయాలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ముందు నువ్వు ఏది సరైనది అనుకుంటే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకో. భయంతో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. సమాజం చాలా భయాల్లోకి నెట్టి వేస్తుంది. కానీ దానిని పట్టించుకునేముందు నిన్ను నువ్వు నమ్ముకో' అని లియాం చెప్పారు.