Liam Hemsworth
-
యోగా గురువు
యోగా టీచర్‌గా క్లాసులను కంప్లీట్ చేశారు ప్రియాంకా చోప్రా. ఆ క్లాసులు ఎలా జరిగాయి? అనేది ప్రేమికుల రోజున తెలుస్తుంది. ప్రియాంకా చోప్రా, లియమ్ హెమ్స్‌వర్త్, రెబెల్ విల్సన్, ఆడమ్ డివైన్ ముఖ్య తారలుగా రూపొందిన హాలీవుడ్ మూవీ ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్?’. టాడ్ స్ట్రాస్–గల్సన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యోగా అంబాసిడర్ ఇసాబెల్లా పాత్రలో నటించారు ప్రియాంకా చోప్రా. పాత్ర పరంగా కొన్ని సీన్స్‌లో యోగా క్లాసులను కండెక్ట్ చేస్తారట. ఈ సినిమాను వచ్చే నెల 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంకా లుక్‌ను కూడా రిలీజ్ చేశారు. గతేడాది డిసెంబర్లో ప్రియుడు నిక్ జోనస్‌తో ఏడడుగులు వేసిన ప్రియాంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో ప్రియాంకా చోప్రా ‘ది స్కై ఈజ్ పింక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సోనాలి బోస్ దర్శకురాలు. -
'నేను అప్పుడు ఒక బయటి వాడిని'
లాస్ ఎంజెల్స్: స్కూళ్లో చదువుకునే రోజుల్లో తానెప్పుడూ ఓ బయటివాడిలా భావించే వాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు లియాం హెమ్స్ వర్త్ అన్నాడు. ఇతరులతో పోలిస్తే తాను పూర్తిగా డిఫరెంట్ అని ఎందుకో అందరితో కలిసిపోలేకపోయేవాడినని చెప్పారు. ఏదైనా మాట్లాడాలని అనుకున్నా ఆ సాహసం చేసేవాడిని కాదని, అసలు తాను ఫిట్టే కాదని బాధపడేవాడినని చెప్పారు. 'నా చుట్టూ ఉన్నవారికి నేను పూర్తి విరుద్ధం అని ఎప్పుడు భావించే వాడిని. అలా అనుకోవడం మంచి అలవాటో చెడు అలవాటో అస్సలు అర్థం కాకపోయేది. నేను నమ్మే ఎన్నో విషయాలపై కూడా ఓ చిన్న అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చేవాడిని కాదు. ఏదేమైనా పాఠశాల రోజుల్లో నేనొక బయటి వ్యక్తిలా ఫీలయ్యేవాడిని. అప్పటి విషయాలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ముందు నువ్వు ఏది సరైనది అనుకుంటే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకో. భయంతో నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. సమాజం చాలా భయాల్లోకి నెట్టి వేస్తుంది. కానీ దానిని పట్టించుకునేముందు నిన్ను నువ్వు నమ్ముకో' అని లియాం చెప్పారు.