జెఎన్‌యూలో కన్హయ్యపై దాడి! | Outsider Tries To Assault Student Leader Kanhaiya Kumar On JNU Campus | Sakshi
Sakshi News home page

జెఎన్‌యూలో కన్హయ్యపై దాడి!

Published Thu, Mar 10 2016 7:55 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

జెఎన్‌యూలో కన్హయ్యపై దాడి!

జెఎన్‌యూలో కన్హయ్యపై దాడి!

న్యూఢిల్లీ: జెఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్యకుమార్‌పై ఓ వ్యక్తి గురువారం సాయంత్రం దాడి చేయడానికి ప్రయత్నించాడు. దేశాన్ని తిడుతూ.. భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న కన్హయ్యకు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతోనే తాను అతనిపై దాడికి ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ) ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన వ్యక్తి క్యాంపస్ ఔట్‌ సైడర్‌ అని తేలింది. భద్రతా సిబ్బంది అతన్ని వెంటనే క్యాంపస్‌ నుంచి బయటకు తీసుకెళ్లారు.

దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన కన్హయ్యకుమార్ ఇటీవల బెయిల్‌ పై విడుదలైన సంగతి తెలిసిందే. జెఎన్‌యూలో జరిగిన ఓ కార్యక్రమంలో జాతి వ్యతిరేక నినాదాలు చేశాడనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. తీవ్రస్థాయిలో కొనసాగిన ఈ వివాదం కేంద్రప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement