లైంగిక వేధింపులు ,అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్‌పై కేసులో షాకింగ్ సంఖ్యలో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 421 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారని న్యాయవాద డీన్ ఆర్మ్‌స్ట్రాంగ్ వెల్లడించారు.
30 ఏళ్ల కాలంలో అల్ ఫయేద్ అఘాయిత్యాలను సంబంధించిన చిట్టా పెరుగుతూనే ఉందని ఆర్మ్‌స్ట్రాంగ్ లండన్‌లో ఒక మీడియా సమావేశంలో అన్నారు .మరో న్యాయవాది బ్రూస్ డ్రమ్మాండ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా బ్రిటన్‌కు చెందిన మహిళలతోపాటు, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా , ఇతర దేశాల మహిళలు తమ న్యాయవాద బృందాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ ఆరోపణలు తమకు విభ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. ‘వాడొక రాక్షసుడు’ అంటూ బాధితులకు క్షమాపణలు చెప్పారు.
బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు. తన లండన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ హారోడ్స్‌లో మహిళా సిబ్బందిపై లైంగికంగా వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. అంతేకాదు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తప్పవని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆరోపణలపై ఇటీవల బీబీసీ అల్ ఫాయిద్ అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది.
ఈ నేపథ్యంలోనే "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూపు" నుంచి చట్టపరమైన చర్యలు మొదలు కావడంతో తాజాగా మరింతమంది బాధితులు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితుల్లో బ్రిటన్‌లోని మాజీ యుఎస్ రాయబారి కుమార్తె , ప్రసిద్ధ సాకర్ క్రీడాకారిణి కుమార్తె కూడా ఉన్నారు. కాగా మహమ్మద్ అల్ ఫాయిద్ 94 ఏళ్ల వయసులో గత ఏడాది మరణించాడు. అల్ ఫయీద్ తన మరణానికి ముందు ఈ ఆరోపణలను ఖండించాడు.
Comments
Please login to add a commentAdd a comment