
సాక్షి,ఢిల్లీ: దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరాదిన భానుడు భగభగలాడుతుండగా దక్షిణాదిన వర్షాలు పడుతూ వాతావరణం చల్లగా మారింది. ఉత్తరాదిలో ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో హీట్‌వేవ్ జూన్ 14వరకు కొనసాగుతుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.
గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటవచ్చని తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండల ధాటికి ఢిల్లీలో జనం బయటికి రావాలంటేనే జడుస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.