చీకటికి చురక | RP patnaik chit chat with blind children | Sakshi
Sakshi News home page

చీకటికి చురక

Published Sun, Aug 17 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

చీకటికి చురక

చీకటికి చురక

మెరిసే తారల రూపం.. కురిసే వెన్నెల దీపం.. ఆ కళ్లకు శూన్యం. చిరుదివ్వెల్లా వెలగాల్సిన ఆ కనులకు తిమిరంతో సమరం తప్ప మరొకటి తెలియుదు. ఊహల్లోనూ చీకటితో సావాసం చేసే సాహసగాళ్లు వాళ్లు. ఉదయించు భాను బింబాన్ని చూడలేకున్నా.. ఆ లేత కిరణాలు వారి హృదయూలను తాకుతాయి. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంతను చూడలేకపోయినా.. అందాలు అలుముకున్న అవని సొగసులకు ఆ మనసులు స్పందిస్తాయి.
 
 అంతేనా చుట్టుపక్కల చూడలేని ఈ చిన్నవాళ్లు.. సవూజంలో కొట్టే కుళ్లు కంపు పసిగడతారు. ఆ కుళ్లును కడిగేసే శక్తి వూకుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చీకటి ముసురుకున్న ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. వారి మనోనేత్రం మాత్రం బంగారు కలలు కంటున్నాయి. అంధకారం అలుముకున్న సమాజంలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. దేవుడిచ్చిన చీకట్లలో మగ్గిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటున్న చీకటి దివ్వెలను స్టార్ రిపోర్టర్‌గా సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పలకరించారు. వారి మనసులోని భావాలను మన ముందుంచారు..
 
ఆర్పీ పట్నాయక్: హలో.. హాయ్ ఐయామ్ ఆర్పీ పట్నాయక్
చిన్నారులు: హాయ్...సార్! థ్యాంక్స్ ఫర్ కమింగ్
ఆర్పీ: నేను వచ్చింది మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి మాత్రమే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి.
అవినాష్: వావ్.. థ్యాంక్యు వెరీ మచ్ సార్
ఆర్పీ: ఒకే.. మీకు స్కూల్లో ఏం నచ్చుతుంది?
చేతన: ఎడ్యుకేషన్
మల్లికార్జున్: కంప్యూటర్ ల్యాబ్
జయ: ఫ్రీడమ్.. ముఖ్యంగా మాకేసి జాలిగా చూడకుండా మామూలు పిల్లల్ని చూసినట్టే చూస్తారు.
ఆర్పీ: మీరు మామూలు పిల్లలు కాదని ఎవరన్నారు?
సరస్వతి: ఎవరూ అనరు సార్. ఇంటికెవరైనా బంధువులొస్తే ముందు మా గురించే అడుగుతారు? మమ్మల్నే పలకరిస్తారు. వాళ్లున్నంత సేపు టాపిక్ మేమే.
గాయత్రి: మా గురించి జాలిగా మాట్లాడుకోవడం.. లేదంటే తక్కువగా చూడ్డం వంటి సందర్భాల్లో చాలా బాధేస్తుంది.
ఆర్పీ: అంటే వారి ఉద్దేశం.. కళ్లున్నవారే జీవితంలో ఎదగడం, సెటిలవ్వడం కష్టమనుకునే రోజులు కదా. అంధులంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని!
శివారెడ్డి : అలాగనుకుంటే కళ్లు లేనివారి గురించి కాదు జాలి పడాల్సింది. ఆసరా లేనివారి గురించి. నిరుపేద పిల్లల గురించి ఆలోచించమనండి. చేతనైతే వారికి సాయం చేయమని చెప్పండి.
విష్ణు: సార్ పట్టుదల, ఆత్మవిశ్వాసం లేనివారి గురించి కూడా జాలి చూమమని చెప్పండి.
ఆర్పీ: మీరు చెప్పింది నిజం. సరే.. ఆ టాపిక్ వదిలేయండి. మీరన్నట్టు లక్ష్యం, పట్టుదల ఉన్నవాడికి అవయవలోపం చాలా చిన్న విషయం. నెక్ట్స్.. మీ చదువంతా బ్రెయిలీ లిపితోనేనా?
చేతన: దాంతోపాటు మాకు ‘స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్‌వేర్’ ఉంది. దాన్నే ఎక్కువగా వాడతాం.
ఆర్పీ:  ఓహ్.. కంప్యూటర్‌ని
 
ఎక్కువగా ఉపయోగిస్తారా?
గాయత్రి: అవును సార్! మేం టైప్ చేస్తుంటే అది స్పెల్లింగ్ పలుకుతుంది. తరగతి గదిలో సౌండ్‌రీడింగ్ బుక్స్ ఉంటాయి.
ఉమాశంకర్: వియ్ హ్యావ్ ఐపాడ్స్. అందులో ప్రతి బుక్ నాలుగైదు వాల్యూమ్స్‌లో ఉంటుంది.
ఆర్పీ: ఇంతకీ మీరు ఎందుకు చదువుకుంటున్నారు?
అవినాష్: అదేం ప్రశ్న సార్.. ఓకే! సమాధానం చెప్పాలి కదా.. ఓ మంచి పౌరుడిగా తయారవ్వాలని.
గాయత్రి: జ్ఞానం సంపాదించడానికి కళ్లు అవసరం లేదు సార్. కానీ నలుగురిలో గొప్పగా బతకాలంటే తప్పనిసరిగా చదువు కావాలి కదా సార్. ఇక మా అందరికీ మా సీనియర్సే ఆదర్శం. వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. ముఖ్యంగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న రాజశేఖరన్నయ్యలాంటివారన్నమాట.
ఆర్పీ: వెరీ గుడ్..  ఇక మీ హాబీస్ ఏంటి?
ఉమాశంకర్: పాటలు వింటాం సార్. నేనొక్కడ్నే కాదు, మా అందరికీ పాటలు వినడం అంటే చాలా ఇష్టం.
ఆర్పీ: ఎలాంటి పాటల్ని ఇష్టపడతారు?
చేతన: మెలొడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
గాయిత్రి: ఎమోషనల్ సాంగ్స్.. ముఖ్యంగా రిలేషన్‌షిప్స్‌ని తెలిపే లిరిక్స్‌ని ఎక్కువగా ఇష్టడతాం.
ఆర్పీ: ఓ.. మీకు సినిమా నాలెడ్జ్ చాలా ఉంది. నచ్చిన సినిమా ఏంటి?
శివారెడ్డి: ప్రేమించు.. సినిమా సార్. చాలా సినిమాలు చూశాం. కానీ ఆ సినిమా మాటలు వింటుంటే.. అంధురాలిగా ఓ యువతి సాధించిన విజయం మా గుండెల్లో బోలెడంత బలాన్ని నింపింది.
జయ: మీరు ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలా అంధుడిగా నటించినపుడు మీ ఫీలింగ్ ఏంటి?
ఆర్పీ: మీ లైఫ్‌ని చాలా దగ్గరగా చూశాను. కళ్లు కనిపించకుండా అర నిమిషం కూడా ఉండలేని మామూలువారికి మీరు నిత్యం ఆదర్శవంతులే అనిపించింది.
శివారెడ్డి: ఆ సినిమాలోని వానా...వానా పాట మీ నోట వినాలనుంది సార్.
 ఆర్పీ(పాట పాడాక): బావుందా?
 చేతన: చాలా బాగుంది సార్. థాంక్యూ సో మచ్.
 ఆర్పీ: ఇంకా ఏమంటే మీకిష్టం.
నవనీత: నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం.
మల్లికార్జున్: అవును సార్. నాక్కూడా.. టూవీలర్‌పై షికారు కొట్టడం అంటే చాలా ఇష్టం.
ఆర్పీ: అవునా.. మరి యాక్సిడెంట్స్ అయిపోతాయి కదా!
మల్లికార్జున్: కళ్లున్నవారు మాత్రం వాటిని ఉపయోగిస్తున్నారా సార్. మొన్నీమధ్య మెదక్ జిల్లా వూసారుుపేటలో యాక్సిడెంట్ జరిగిన స్కూల్ బస్ డ్రైవర్‌కి కళ్లు ఉన్నట్టా! లేనట్టా!
ఉమాశంకర్: యస్.. అతను సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశారని పిల్లలు చెప్పారు. ఎంత అన్యాయం సార్. చాలామంది సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారని చెబుతున్నారు. వారంతా  ఆ క్షణాన అంధులతో సమానమే కదా సార్.
అవినాష్: అంధులకు డ్రైవింగ్ నేర్పడానికి విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సంస్థలున్నాయి. వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే మేం కూడా ధైర్యంగా బండి ఎక్కొచ్చు.
 ఆర్పీ: తప్పకుండా.. కొన్ని రకాల టెక్నాలజీలు కళ్లున్నవారిని అంధుల్ని చేస్తుంటే, మరికొన్ని మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంతకూ మీ ఇంట్లోవారు మిమ్మల్నెలా ట్రీట్ చేస్తారు?
శివారెడ్డి:  మా పేరెంట్స్ మాకు ఏ విషయంలోనూ తక్కువ చేయరు. దానికితోడు మా దేవ్‌నార్ స్కూల్ టీచర్ల గెడైన్స్ సాయంతో మమ్మల్ని అన్నిరంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు.
సుశాంత్: అవును సార్. మేం ఆటలు, పాటలతో పాటు అప్పుడప్పుడు నాటికలు వేస్తుంటాం. నాటకాలప్పుడు మా శివారెడ్డి పెద్ద పెద్ద డైలాగ్స్‌తో అదరగొట్టేస్తాడు.
ఆర్పీ: ఓకే లాస్ట్ క్వశ్చన్. మీ గోల్స్ ఏంటి?
ఉమాశంకర్: ఐఏఎస్ అవ్వాలని ఉంది
మల్లికార్జున్:  నాక్కూడా....
ఆర్పీ: ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా?
చేతన: సమాజం చాలా మారాలి సార్. వారికి అవసరమైతే అయ్యో.. అంధులంటూ జాలి చూపిస్తుంది. లేదంటే గుడ్డివాడికి కూడా.. అంటూ చిన్న చూపు చూస్తుంది. వేదికలెక్కి మా గురించి గొప్పగా మాట్లాడతారు. వీధుల్లోకి వస్తే రోడ్డు దాటించడానికి కూడా సాయపడరు.
ఆర్పీ: నా మాట కూడా అదేనమ్మా! అంధులపై జాలి చూపనక్కర్లేదు. మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు.. అద్భుతాలు చేసి చూపెట్టగలరు. చాలా విషయాల్లో మా ‘కళ్లు’ తెరిపించగలరు. విష్ యు ఆల్ ది బెస్ట్!
ఆర్పీ: మంచి పొజిషన్‌కు చేరాక ఏం చేస్తారు?
ఉమాశంకర్: అంధుల పట్ల, అనాథల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నవారి కళ్లు తెరిపిస్తాం.
ఆర్పీ: ఓ.. మీరు చెప్పేది కాకినాడలో జరిగిన సంఘటన గురించా.కొట్టినవారు కూడా అంధులే కదా
మల్లికార్జున్:  అందుకే మాకు కోపం వచ్చింది సార్. కళ్లున్నవాడు కొడితే.. అంధుడి బాధ వాడికేం తెలుస్తుందని క్షమించేస్తాం. అంధులు పడే బాధ తెలిసి కూడా పశువుల్లా ప్రవర్తించారు కదా సార్.
 
 ప్రెజెంటేషన్: భువనేశ్వరి
 ఫొటోలు: సృజన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement