రైతులకు మనోధైర్యం కల్పించాలి
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్
పంథిని (వర్ధన్నపేట) : భారీ వర్షాలతో పంట నష్టపోయి రైతులకు పరిహారం చెల్లించి వారికి మనోధైర్యాన్ని కల్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంథిని గ్రామంలో నష్టపోయిన పత్తి, మొక్కజొన్న పంటలను వైఎస్సార్‌సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతికుమార్ మాట్లాడారు. భారీ వర్షాలకు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగిందన్నారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నప్పటికీ అధికార పార్టీ మం త్రులు, ఎమ్మెల్యేలు పంటనష్టాన్ని పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. స్వర్ణయుగం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు రైతులు గుర్తుచేస్తున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను తెలుసుకోవాలని పార్టీ నా యకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇ¯ŒSచార్జి పసునూరి ప్రభాకర్, మండలాధ్యక్షుడు దొంతి సురేందర్‌రెడ్డి, నాయకులు బూర సుమన్, నిమ్మనబోయిన రమేష్, తూళ్ల రాజేష్, సమ్మెట రాజు, బండారి సతీష్, తదితరులు పాల్గొన్నారు.
రైతులను పట్టించుకోవడం లేదు
పర్వతగిరి : అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు రైతులను పట్టించుకోవటం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన మొక్కజొన్నను పరిశీలించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారం రోజులుగా కురిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఎంపీలు, ఎమ్మెల్యేలు పరామర్శించకపోవడం దారుణమన్నారు. మం డల పార్టీ అధ్యక్షుడు దండంపల్లి సైదులు, జంగ మురళి, జంగ వీరమల్లు, ముడిదెన దేవేం దర్, వడ్లకొండ వీరభద్రయ్య, అక్కల అనిల్, సుధాకర్ ఉన్నారు.