cultural performances
-
పౌరులుగా గుర్తించండి
* నినదించిన హిజ్రాలు,ట్రాన్స్జెండర్లు * గోశాల నుంచి ఇందిరా పార్కు వరకూ ర్యాలీ * ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు కవాడిగూడ: ‘సమాజంలోని పౌరులలో మేమూ భాగమే. ఈ దేశంలోని పౌరులకు రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కుల్లో మాకూ వాటా కావాలి. మాపై పక్షపాతం, హింసా ధోరణి విడనాడాలి’అంటూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలు నినదించారు. తమ హక్కుల కోసం గళమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమానత్వం, చట్టపరమైన రక్షణ, స్వేచ్ఛ, వివక్షనుంచి రక్షణ, లింగ వ్యక్తీకరణకు స్వాతంత్య్రాన్ని కల్పించాలని కోరారు. విద్య, ఉద్యోగాలలో ప్రభుత్వం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లోయర్ ట్యాంక్‌బండ్ గోశాల నుంచి గాంధీనగర్, అశోక్‌నగర్ మీదుగా ఇందిరా పార్కు ధర్నా చౌక్ వరకూ ‘హైదరాబాద్ క్వీర్ స్వాభిమాన్ కవాతు’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైనసామాజిక వేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో వారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లు, హిజ్రాలను తోటి పురుషులు, స్త్రీలతో సమానంగా చూడాలన్నారు. హిజ్రాలకు సమాన హక్కులు లేవంటే అంబేద్కర్‌ను అవమానపర్చినట్లేనని అభిప్రాయపడ్డారు. వారి హక్కులను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైజయంతి, చంద్రముఖి మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ పౌరులకు సమానత్వం, చట్టపరమైన రక్షణ వంటి హక్కులు ఉంటాయని గతంలో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా ఆ తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ట్రాన్స్‌జెండర్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. భౌతిక, లైంగిక దాడుల నుంచి రక్షణ ఉండేలా సమగ్ర అత్యాచారాల వ్యతిరేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. హిజ్రాల జనాభాను ప్రభుత్వమే అధికారికంగా లెక్కించాలని కోరారు. ఓయూ విద్యార్థి సంఘ నేత శరత్ వారికి సంఘీభావం తెలిపారు. నవదీప్, రచన, గ్రీష్మ, మిస్కాన్, అఖిల, బిట్టు, తమన్నా, అరునాంగే తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజులు, బోనాలు, బతుకమ్మ తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ఉత్సవం.. ఉత్సాహం..
-
జెండా.. మదినిండా
-
స్టాన్లీ కళాశాల 6వ వార్షికోత్సవం
-
ఆత్మవిశ్వాసంతో లక్ష్యం సాధ్యం..
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆత్మవిశ్వాసంతోనే ల క్ష్యం సాధ్యమని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జిల్లా కేం ద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతి థిగా హాజరై స్వామి వివేకనందుడి చిత్రపటానికి పూలమాల లు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సుగమమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే వరకు నిర్వారామం గా కృషి చేయాలని అన్నారు. వివేకానందుని ఆశయాల సాధనకు పాటుడాలన్నారు. వందమంది యువకులతో దేశ రూ పులేఖలే మార్చవర్చన్న వివేకానందుడి మాటలను విస్మరిం చవద్దని కోరారు. యువత నిరాశ, నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం సరైందికాదన్నారు. ఉద్యోగమే జీవి తం కాదని, చదువు అన్ని రకాలుగా మేధస్సును పెంచుతుం దన్నారు. బతికేందుకు ఎన్నో మార్గాలున్నాయని పేర్కొన్నారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత అన్నింటిలోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మహనీయులు కలలుగన్న గ్రామస్వరాజ్యం యువ తతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ సీఈవో వెంకటేశ్వర్లు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు ఆరె భూమన్న, సామాజిక కార్యకర్త డాక్టర్ కళ్యాణ్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా ఇన్చార్జి కన్నం మోహన్‌బాబు, నలంద కళాశాల ప్రిన్సిపాల్ పున్నారావు, ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ రవిచరణ్దాస్, వేద పండితుడు చికిలి లక్ష్మీవేంకటేశ్వర శాస్త్రీ సిద్ధాంతి, యువజన సంఘాల నాయకుడు నర్సింగ్‌రావు, యూత్ కో ఆర్టినేటర్ మసూద్, న్యాయనిర్ణేతలు కభీర్దాస్, కవిత, సతీష్దేశ్పాండే, శైలజ దేశ్‌పాండే, మురళీధర్,రాజారాం తదితరుల పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం.. జిలా యువజనోత్సవాల్లో ప్రథమస్థానం సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన కళాకారులకు ఎమ్మెల్యే జోగురామన్న, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి బహుమతులు అందించారు. వన్యాక్ట్ ప్లేలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాల్లో ద్వితీయస్థానం సాధించిన నటరాజ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ కళాకారులకు ప్రశంసపత్రాలు, మెమొంటో అందజేశారు. మార్షల్ ఆర్ట్స్‌లో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైన ఉషాకిరణ్ బృందానికి, తబల పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానం సాధించిన సాయినాథ్కు, హార్మోనియంలో ప్రతిభ కనబర్చిన గౌతమ్‌కు, ఫోక్ గానంలో పవర్మోహన్నాయక్ బృందాలకు ప్రశంసపత్రాలు, మెమొం టోలు అందించారు. వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. న్యాయనిర్ణేతలకు వ్యవహరిం చిన వారికి బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ కళారూపాలతో కళాప్రదర్శనలు ఆహూతులను అలరించారు. నటరాజ్ డాన్స్ ఇన్సిస్టిట్యూట్ విద్యార్థు లు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళాకారులు శ్రీష్మ, రవమిరెడ్డి శాస్త్రీయ నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. భగత్రావు థింసా నృత్యం, తలమడుగు మందగూడకుచెం దిన శ్రీనివాస్ గుస్సాడి బృందం చేసిన ప్రదర్శనలు అలరించాయి. మిట్టురవి కళా బృందం గీతాలతో అలరించారు. -
మురిపించిన మలయప్ప
= మూడు వాహనాలపై స్వామివారి దివ్య కటాక్షం = పులకించిన అశేష భక్తజనం = అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన గురువారం ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్పస్వామి భక్తశిఖామణి హనుమంతుడిని వాహనంగా మలుచుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్భాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ వీధుల్లో విహరిస్తూ అశేష భక్తజనులకు కనువిందు చేశారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ హనుమంత వాహనం ద్వారా స్వామి భక్తకోటికి సందేశాన్ని ఇచ్చారు. వేకువజామున మలయప్పస్వామికి రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ చేసి, వాహన మండపంలో వేంచేపు చేశారు. బంగారు, వజ్ర, వైఢూర్య పుష్పాలతో మలయప్పకు విశేష అలంకరణ చేశారు. మంగళధ్వనులు, పండితుల వేదఘోష, దివ్య ప్రబంధం, జానపద సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం మధ్య ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 వరకు వేడుకగా సాగింది. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొ న్నారు. గురువారం రాత్రి గజ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ముగ్ధ మనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో భక్తులకు కనువిందు చేశారు. భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తను శరణు కోరే వారిని ఎల్లవేళలా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై ఊరేగారు. గజ వాహన రూఢుడైన కలియుగ వైకుంఠ వాసుడిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. అశేష భక్తజనుల గోవింద నామస్మరణ, కళాకారుల నృత్యాలు, వేద ప్రబంధ గోష్ఠి నడుమ వాహన సేవ వైభవంగా సాగింది.