న్యూఢిల్లీ/గ్రేటర్ నోయిడా: దేశంలోని యువత ఉద్యోగాల సృష్టికర్తలుగా మారాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత స్టార్టప్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గ్రేటర్ నోయిడాలోని గౌతమ బుద్ధ యూనివర్సిటీలో శుక్రవారం ప్రారంభమైన 22వ జాతీయ యువజనోత్సవంలో పాల్గొన్న యువతను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు. ‘ఏ ఆందోళనా వద్దు. ముందుకు వెళ్లండి. మొదటి అడుగు వేయండి.
మా ప్రభుత్వం మీతో ఉంటుంది’అని స్టార్టప్‌లను ప్రారంభించాలనుకుంటున్న యువతకు ఆయన సూచించారు. బ్యాంకు గ్యారంటీ, రుణాలు, భారీ పేపర్ వర్క్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఈ సహాయం ప్రభుత్వం తరఫున అందుతుందని హామీ ఇచ్చారు. చేయూతనిస్తామని, ఆ తర్వాత స్వశక్తితో తమంతట తామే వారు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. క్రీడలను కూడా జీవితంలో ఒక భాగంగా గుర్తించాలని ప్రధాని మోదీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment