సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పౌర సమాజంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా. అనేక అంశాలపై ప్రజలతో చర్చిస్తుంటారు. తాజాగా జాతీయ యువజన దినోత్సం సందర్భంగా ఆయన చేసిన పోస్ట్.. క్లాస్‌రూమ్ బాతఖానికి వేదికైంది.
స్వామి వివేకనంద జయంతి రోజైన జనవరి 12న క్లాస్‌రూమ్‌లో వెనుక బెంచిలో కూర్చుని ఉన్న ఫోటోను ఆనంద్‌మహీంద్రా షేర్ చేశారు. ఎప్పుడైన తనకు ఎనర్జీ లెవల్స్ తగ్గినప్పుడు రీఛార్జ్ కోసం క్లాస్‌రూమ్‌కి వెళ్తుంటానంటూ ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. క్లాస్‌రూమ్‌లో ఆనంద్ మహీంద్రాని చూసిన నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
Backbenchers always have the widest possible view of the class—and the Universe! 😊 https://t.co/u7uPBbwi38
— anand mahindra (@anandmahindra) January 12, 2022
క్లాస్‌లో మీరు బ్యాక్‌బెంచీ స్టూడెంటా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా బ్యాక్ బెంచీలో కూర్చుంటే క్లాస్‌రూమ్ మొత్తాన్ని చూసే వీలుంటుంది. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా అంటూ చమత్కారంగా బదులిచ్చారు ఆనంద్‌మహీంద్రా. హిస్టరీ తనకు ఇష్టమైన సబ్జెక్టని పాత అనుభవాల నుంచే కొత్తగా అడుగులు వేయోచ్చంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.
History. And for those who will retort that they don’t like living in the past, I say that you can’t invent the future without learning lessons from the past… https://t.co/NJ1gvAzama
— anand mahindra (@anandmahindra) January 12, 2022
Comments
Please login to add a commentAdd a comment