Anand Mahindra Shared Few Men Were Seen Cutting Down A Tree Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Anand Mahindra: 'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే చూడండి.. ఆనంద్‌ మహీంద్రా వైరల్‌ వీడియో

Published Tue, Aug 23 2022 7:23 PM | Last Updated on Tue, Aug 23 2022 8:18 PM

Anand Mahindra Shared Few Men Were Seen Cutting Down A Tree Goes Viral On Social Media - Sakshi

ఒక ఫొటో వేయి పదాల అర్థాన్ని ఇస్తుంది. అలాంటి ఫొటోలు ఎన్నో జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే వీడియోలు సైతం ఆ అర్ధానికి తామేం తీసిపోమంటూ పోటీ పడుతున్నాయి. తాజాగా నెట్టింట్లో వైరల్‌ అవుతున్న వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా అండ్‌ మహీంద్రా ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. 

ఆ వీడియోలో నలుగురు ఓ భారీ పొడవైన చెట్టు నరికేస్తారు. అందులో ఓ వ్యక్తి నరికిన ఆ చెట్టును కింద పడేసే ప్రయత్నం చేయగా.. అది కాస్తా ఒరిగి చెట్టును నరికిన వ్యక్తిని పైకి ఎత్తి అవతల పడేస‍్తుంది. అదిగో ఆ వీడియోనే ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేశారు. 'మీరు చెట్టును నరికేస్తారేమో..కానీ వాటిని కింద పడేయలేరు' అంటూ క్యాప్షన్‌ను జత చేస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపతీరంగా ఆకట్టుకుటుంది.

ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొన్ని వీడియోల్ని రీట్వీట్‌ చేస్తున్నారు. ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందంటూ చిన్నాభిన్నమైన రోడ్ల వీడియోల్ని షేర్లు చేస్తున్నారు.

చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్‌ మహీంద్రా రీ ట్వీట్‌ వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement