దేశ వ్యాప్తంగా డిజిటల్ ఇండియా నినాదం మారు మ్రోగుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పచారీ కొట్టునుంచి కిల్లీ కొట్టు దాకా ఎటు చూసినా గూగుల్ పే, ఫోన్ పే ఈ క్యూ ఆర్ కోడ్‌లే కనిపిస్తున్నాయి. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెల్లింపులు పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ఉదహరిస్తూ గతంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్‌లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు.
There was a time money was showered in our weddings. Now in digital India……. pic.twitter.com/g4BApTbPLw
— Harsh Goenka (@hvgoenka) August 24, 2022
తాజాగా డిజిటల్ ఇండియాపై ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లికి వచ్చిన అతిధుల‍్లో ఉత్సాహం నింపిందేకు బరాత్‌లో డప్పు వాయిస్తున్నారు. వారిలో ఓ అతిధి డప్పు చప్పుళ్లకు ఫిదా అయ్యాడు. అంతే డబ్బు వాయిస్తున్న వారి వద్దకు వెళ్లి డప్పుకున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రూ.50 చెల్లించారు. ఆ వీడియోకు...'ఒకప్పుడు మన పెళ్లిళ్లలో డబ్బుల వర్షం కురిపించేవారు. ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియా అంటూ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment