సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్‌గా స్పందించే పారిశ్రామికవేత్తలలో హర్ష్‌గోయోంకా ఒకరు. సామాజిక అంశాల నుంచి కరోనా, ఆర్థికం, క్రీడలు ఇలా అన్నింటి మీద అయన ట్వీట్లు చేస్తుంటారు. కానీ, 2021 డిసెంబరు 11 శనివారం సాయంత్రం ఆయన పోస్టు చేసిన ట్వీట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే ఆయన ట్వీట్ అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందో మీరు చూడండి.
తాజా ట్వీట్‌లో ఇండియా ఎలా ఉందంటూ ఓ అమెరికన్ తనను అడిగాడని.. దానికి సమాధానం ఇది అంటూ కింద ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో పరవశంలో ఉన్న ఓ నెమలి పురివిప్పుతున్న నెమలి కనిపిస్తుంది.
An American friend asked me “What does India look like?”
— Harsh Goenka (@hvgoenka) December 11, 2021
I sent him this video.pic.twitter.com/opCOxP9f44
దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నెమలి ఫించం నిదర్శనమంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఇండియా ఎంత వైబ్రంట్‌గా ఉందో చక్కగా చూపించారంటూ హర్ష్‌గోయెంకాని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment