ప్రముఖ బిజినెస్‌మేన్ ఆనంద్ మహీంద్రా, ఫ్యామిలీమ్యాన్ మనోజ్ బాజ్‌ల మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్డర్ చేసిన ముప్పై నిమిషాల్లో కోరుకున్న ఫుడ్ దొరుకుతుంది. కానీ అదే టెక్నాలజీ ఆహార ధాన్యాలు పండించే రైతులకు ఎందుకు అండగా ఉండలేకపోతుందనే ఆశ్చర్యపోయేవాడిని. కానీ కృషి ఫార్మింగ్ యాప్‌తో తిరిగి నా మూలాల్లోకి వెళ్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఈ యాప్‌తో రైతుల ఆదాయాలు పెరుగుతాయంటూ మనోజ్ బాజ్‌పాయ్ ట్విట్ చేశారు.
మనోజ్ బాజ్‌పాయ్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. సరిగ్గా చెప్పావ్ మనోజ్ బాజ్‌పాయ్. మనకు ఎవరైనే అన్నం పెడుతున్నారో వాళ్లను వృద్ధిలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఈ పనిలో కృషి ఫార్మింగ్ పని చేస్తోంది. ఇది చమత్కారం చేయదు ఆవిష్కారం చేస్తుందంటూ కామెంట్ చేశారాయన.
అగ్రిటెక్ బిజినెస్‌లో భాగంగా మహీంద్రా గ్రూపు కృషి యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తూ రైతులకు విలువైన సూచనలు చేస్తోంది కృషి యాప్. దీనికి ప్రచారకర్తగా మనోజ్‌బాజ్‌పాయ్ పని చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రైతుల శ్రేయస్సు లక్ష్యంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
Well said @BajpayeeManoj It’s time Tech empowered those who feed us. Enabling farmers to #Rise has been our obsession. Kudos to @KrisheFarming for showing that we walk the talk. #ChamatkarNahiYehHaiAvishkar https://t.co/qfuWRozpzN
— anand mahindra (@anandmahindra) March 26, 2022
Comments
Please login to add a commentAdd a comment