అమెరికన్ మీడియా పర్సనాలిటీ అలెక్స్ కోమెన్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిన నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ట్విటర్‌ను ఎలన్ మస్క్ సొంతం చేసుకోబోతుండటంపై చాలా మంది స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అలెక్స్ కోహెన్ ఓ ట్వీట్ చేశారు. అందులో బిల్‌గేట్స్, ఎలన్‌మస్క్, జెఫ్ బేజోస్ పేర్లను ప్రస్తావిస్తూ.. వీరంతా విడాకులు తీసుకుని ప్రపంచ కుబేరులుగా ఎదిగారని.. ఇకపై తాను విడాకులు తీసుకున్న లేదా విడాకులు తీసుకోబోతున్న ఫౌండర్లు ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడులు పెడతానంటూ ట్వీట్ చేశారు.
అలెక్స్ కోహెన్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. బిజినెస్ వరల్డ్‌లో వివాహ బంధంలో ఉన్న సామరస్యం లేదా విబేధాలకు ఇన్వెస్టర్లు, విశ్లేషకులను బాధ్యులను చేయాలని పేర్కొన్నారు. దీనిపై కొందరు భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి ప్రస్తావించగా ఎక్కువ మంది బిజినెస్ ప్రపంచంలో ఉన్న పనిని, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టమైన పనంటూ తమ అభిప్రాయం వ్యక్తపరిచారు.
We must now hold investors & analysts responsible for the state of matrimonial harmony—or disharmony—in the business world… https://t.co/mwhluHd1ne
— anand mahindra (@anandmahindra) April 26, 2022
చదవండి: చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్‌మస్క్ - నితిన్ గడ్కారీ
Comments
Please login to add a commentAdd a comment