అక్క శ్రుతి హాసన్‌ బాటలో చెల్లి అక్షర.. | Akshara Haasan Shares Her Latest Pictures On Social Media | Sakshi
Sakshi News home page

Shruti Haasan Sisiter Akshara Haasan: అక్క శ్రుతి హాసన్‌ బాటలో చెల్లి అక్షర..

Published Wed, Aug 17 2022 9:13 AM | Last Updated on Wed, Aug 17 2022 9:18 AM

Akshara Haasan Shares Her Latest Pictures On Social Media - Sakshi

సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపించే బ్యూటీ శృతి హాసన్‌. బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోలు, గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ అభిమానులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తుంటారు. ఆమె చెల్లెలు అక్షర హాసన్‌ కూడా అదే బాటలో పయనించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్‌ మాదిరిగానే ఈమె కూడా తొలుత బాలీవుడ్‌లో కథానాయకిగా పరిచయం అయ్యారు. అక్కడ చిత్రాలు చేశారు. ఆ తరువాత తమిళంలో అజిత్‌ కథానాయకుడుగా నటించిన వివేకం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక కీలక పాత్రను పోషించారు.

చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార దంపతులు

ఆ తరువాత తన తండ్రి కమలహాసన్‌ రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నటుడు విక్రమ్‌ హీరోగా నిర్మించిన గడారం కొండాన్‌ చిత్రంలో ఒక యువకుడికి ప్రేయసిగా ప్రేమ సన్నివేశాల్లోనూ, గర్భిణీగా అద్భుతమైన నటన ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఆ తరువాత అచ్చం మడం నాణెం పయిర్పు అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఇందులో ప్రముఖ గాయనీమణులు ఉషా ఊతప్, మాల్గుడి శుభ ముఖ్యపాత్రలు పోషించడం విశేషం. అమెజాన్‌ ప్రైమ్‌టైంలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అగ్ని చిరగుగల్‌ చిత్రంలో అక్షరహాసన్‌ గ్లామర్‌ విషయంలో తన అక్క శృతిహాసన్‌ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా దిగిన ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవికాస్తా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement