చెల్లెలి కోసం శృతి రికమండేషన్ | Shruti Haasan recommends Akshara for Ajith Movie | Sakshi
Sakshi News home page

చెల్లెలి కోసం శృతి రికమండేషన్

Published Tue, Jul 19 2016 11:04 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

చెల్లెలి కోసం శృతి రికమండేషన్

చెల్లెలి కోసం శృతి రికమండేషన్

లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ కెరీర్ స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడినా తరువాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే అదే బాటలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అమితాబ్ లాంటి లెజెండరీ యాక్టర్తో షమితాబ్ సినిమాలో పరిచయం అయిన అక్షర తనని తాను ప్రూవ్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యింది.

తొలి సినిమాతో ఫెయిల్ అయిన ఈ బ్యూటికి తరువాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. దీంతో తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శభాష్ నాయుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోంది అక్షర. అయితే తాజాగా ఈ నీలికళ్ల సుందరికి ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చిందట. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అక్షరకు ఛాన్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో ఇదే కాంబినేషన్లో తెరకెక్కిన వేదలం సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇప్పుడు శృతి రికమండేషన్తోనే అక్షరకు ఛాన్స్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో అక్షర హాసన్ది హీరోయిన్ పాత్ర మాత్రం కాదట. అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా కావటంతో సపోర్టింగ్ రోల్కు కూడా ఒకే చెప్పేసింది ఈ స్టార్ వారసురాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement