
సాక్షి, చెన్నై: సీనియర్‌నటుడు, విలక్షణ హీరో కమల్‌హాసన్ రాజకీయ పార్టీ ప్రకటనపై ఆయన కుమార్తెలు, సినీహీరోయిన్లు శృతి, అక్షర స్పందించారు. రాజకీయ నాయకుడిగా ఆయన తన కొత్త ప్రయాణంలో విజయం సాధించాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రపంచంలో మార్పును కోరుకుంటే.. ఆ మార్పు నువ్వే కావాలన్న కమల్ కు ఇష్టమైన గాంధీ సూక్తిని కోట్ చేసింది.
మక్కళ్ నీది మయ్యమ్ పార్టీని ప్రకటించినందుకు గర్వంగా ఉందంటూ కుట్టి హాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ''పురోగతి అనేది వ్యక్తిగత ప్రయాణం.. కానీ ప్రజల ఐక్యతతో సమాజం భవిష్యత్తు కోసం బాధ్యత వహించే ప్రయాణం మాత్రం గొప్ప పురోగతిని సాధిస్తుంది. లవ్ యూ బాపూజీ'' అంటూ ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment