కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్‌అప్ | Kamal's daughter Akshara Haasan Love break up | Sakshi
Sakshi News home page

కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్‌అప్

Published Sun, Sep 21 2014 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్‌అప్ - Sakshi

కమలహాసన్ రెండవ కూతురు ప్రేమ బ్రేక్‌అప్

 ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికమనే చెప్పాలి.  తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ ఇలానే ముగిసింది. ప్రేమించుకోవడం ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోవడం ఈ తరం యువతలో సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితి లోకమంతా ఉన్నా సినిమా రంగంలో కాస్త అధికం అనే చెప్పాలి. శింబు, నయనతార, ప్రభుదేవ, నయనతార, శింబు, హన్సిక ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రేమ కథలు కంచికే చేరాయి.
 
 తాజాగా నటి శ్రుతిహాసన్ చెల్లెలు, కమలహాసన్ రెండవ కూతురు అక్షర ప్రేమ కథ సేమ్ తంతే. అక్షరకు మొదట్లో హీరోయిన్‌గా చాలా అవకాశాలు వచ్చినా ఆమె నిరాకరించి కెమెరావెనుక ఉండటానికి ఆసక్తి చూపారు. ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడివద్ద సహాయ దర్శకురాలిగా కూడా పనిచేశారు. ఆ సమయంలోనే నటుడు నసిరుద్దిన్‌షా కొడుకు వివాన్‌షాతో ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని వీరిద్దరూ ఖండించలేదు. అయితే అక్షర తల్లి సారిక మాత్రం వీళ్ల వ్యవహారాన్ని కనిపెట్టి ప్రేమ, దోమ అంటూ జులాయిగా తిరగకుండా పనిమీద దృష్టి సారించు అంటూ చీవాట్లు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి.
 
 ఏదేమైనా అప్పటి వరకు నటనకు దూరంగా ఉంటూ వచ్చిన అక్షర అక్క శ్రుతిహాసన్ సక్సెస్ జోరు చూసిన తరువాత తనూ హీరోయిన్‌గా నటించాలనే నిర్ణయానికి వచ్చారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ దర్శకుడు బాల్కి తెరకెక్కిస్తున్న షమితాబ్ చిత్రంలో నటుడు ధనుష్ సరసన నటించే అవకాశం కొట్టేశారు. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఒక ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. ఈ కథ అటుంచితే అక్షర, వివాన్‌షాల ప్రేమకు చిల్లులు పడ్డాయన్నది తాజా సమాచారం. ఇప్పటివరకు తమ ప్రేమ వ్యవహారం గురించి నోరు మెదపని వివాన్‌షా ఇప్పుడు పెదవి విప్పారు. అక్షరహాసన్‌తో తన రెండేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్ పడిందని ఇకపై తమ మధ్య ఎలాంటి బంధం లేదని మూడు ముక్కల్లో చెప్పేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement