Chennai city
-
డిమాండ్లు పరిష్కరించేంత వరకూ సమ్మె విరమించం
సాక్షి, చెన్నై: బోనస్, వేతన సవరణలపై ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ చెన్నై నగర ప్రభుత్వ రవాణా సంస్థ ఉద్యోగులు ఆకస్మిక సమ్మెకు దిగారు. రవాణా సంస్థ ఉద్యోగులు ఉదయం నుంచి సమ్మెకు పిలుపునివ్వటంతో నగరవ్యాప్తంగా తిరిగే 4000 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్యాలయాలు, వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్టాండులలో పడిగాపులు కాస్తూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే అదనుగా ఆటోవాలాలు అందినకాడికి దండుకుంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించమని రవాణా సంస్థ ఉద్యోగులు కరాఖండిగా చెప్పటంతో ప్రయణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కత్తులతో కాలేజీకి..
ఆరుగురు విద్యార్థుల అరెస్ట్ 70 మంది పచ్చపాస్ కాలేజీ విద్యార్థుల సస్పెన్షన్ చెన్నై: ఉన్నత విద్యావంతులై దేశాన్ని ఉద్దరించాల్సిన విద్యార్థులు కరుడుగట్టిన నేరస్తులుగా మారిపోతున్నారు. విద్యార్థులను మేధావులుగా మార్చే పాఠ్యపుస్తకాలు భద్రపరుచుకునే బ్యాగులు మారణాయుధాలను మోస్తున్నాయి. కక్షలు, కార్పణ్యాలతో దారితప్పిపోతున్న కాలేజీ విద్యార్థుల ఉదంతం చెన్నైలో గురువారం వెలుగుచూసింది. ప్రత్యర్థి విద్యార్థులను హతమార్చేందుకు కత్తులు, వేట కొడవళ్లతో పచ్చపాస్ కాలేజీకి వచ్చిన ఆరుగురు విద్యార్థులు కటకటాల పాలయ్యారు. ఇదే వివాదంలో 70 మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.చెన్నైలోని పలు కళాశాలల విద్యార్థుల మధ్య కొంతకాలంగా తరచూ ఘర్షణలు సాగుతున్నాయి. ఏదో ఒక వివాదాన్ని నెత్తుకుని నెత్తురు పారించడం పరిపాటిగా మారింది. పవిత్రమైన కళాశాలల్లోకి తరచూ పోలీసులు ప్రవేశించి విద్యార్థులను హెచ్చరించడం జరుగుతూనే ఉంది. విద్యార్థుల భవిష్యత్తును కాలరాయకూడదనే సదుదుద్దేశంతో పోలీసులు పెద్ద పెద్ద కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారు. పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న విద్యార్థులు ఇతర కాలేజీల విద్యార్థులతో కయ్యానికి కాళ్లు దువ్వుతూనే ఉన్నారు. ఇంటికి కాలేజీకి మధ్య సిటీ బస్సులో రాకపోకలు సాగించేటపుడు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తారసపడడం సహజం. అయితే తమ కాలేజీ మీదుగా లేదా ఇంటికి అనుకూలంగా బస్సులు నడపాలనే అంశంలో ఇటీవల కాలంలో విద్యార్థులు తరచూ ఘర్షణలు పడుతున్నారు. ఈ ఘర్షణల్లో పైచేయిగా మిగిలిన కాలేజీ విద్యార్థులను మరో కాలేజీ విద్యార్థులు టార్గెట్ చేయడం, కర్రలతో దాడికి పాల్పడటం గతంలో అనేక సార్లు జరిగింది. కొన్ని కళాశాలల విద్యార్థుల మధ్య వివాదం రావణకాష్టంలా మారింది. ఇదిలా ఉండగా, ఏ విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారో ఏమో గురువారం పచ్చపాస్ కాలేజీకి చెందిన ఆరుగురు విద్యార్థులు పాఠ్యపుస్తకాల మధ్య కత్తులు, వేట కొడవళ్లను దాచిఉంచి వీపుపై బ్యాగు వేసుకుని నింపాదిగా హాజరైనారు. ఈ సమాచారాన్ని అందుకుని హతాశులైన కాలేజీ ప్రిన్సిపాల్ కళిరాజ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విద్యార్థుల బ్యాగులకు జరిపిన తనిఖీలో పెద్ద ఎత్తున మారణాయుధాలు పట్టుబడ్డాయి. మారణాయుధాలు కలిగి ఉన్న బీకాం మొదటి సంవత్సరం విద్యార్థులు దినేష్, కార్తికేయన్, ఎల్ మణకంఠన్, బీకాం రెండో సంవత్సరం విద్యార్థులు చెల్లముత్తు, బీసీఏ మొదటి సంవత్సరం విద్యార్థి మణికంఠన్, రెండో సంవత్సరం విద్యార్థి అరుణ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజీలో అరాచకాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 70 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. -
ఆటోలో...అలా.. అలా...!
‘చల్లో.. చల్లో.. హవా మే గాడీ చల్లో. హమారే సాత్ చల్లో..’ అంటూ ‘బెంగాల్ టైగర్’లో రవితేజ, రాశీఖన్నా కారు, బైక్.. ఇలా పలు వాహనాల్లో వెళుతూ పాట పాడుకున్నారు. ఇప్పుడు రియల్‌గా శ్రుతీహాసన్, ఆమె చెల్లెలు అక్షరా హాసన్ కూడా ఈ పాటలో ఉన్నట్లే చేశారు. కాకపోతే ఆ జంట కారు, బైక్‌లో వెళితే ఈ అక్కాచెల్లెళ్లు ఆటోలో జర్నీ చేశారు. చెన్నై సిటీ అంతా మూడు చక్రాల వాహనంలో ఆనందంగా చక్కర్లు కొట్టేశారు. ఈ ఆనందం వెనక కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! గత వారం కమల్ కాలికి గాయమైనప్పుడు శ్రుతీహాసన్ నార్వేలో ఉన్నారు. నాగచైతన్య సరసన నటిస్తున్న ‘ప్రేమమ్’ పాటల చిత్రీకరణ నిమిత్తం అక్కడ ఉండాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు తండ్రికి ఎలా ఉందోనని ఫోన్ చేసి తెలుసుకుంటూనే ఉన్నారట. నార్వేలో షూటింగ్ పూర్తయిన వెంటనే చెన్నైకి వచ్చిన శ్రుతి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్లారు. హాస్పిటల్లో కమల్‌ను చూసిన తర్వాత గానీ శ్రుతి మనసు కుదుట పడలేదట. తండ్రి కోలుకోవడం చూసి రిలీఫ్ అయిపోయారు. ఆ తర్వాత చెల్లెలు అక్షరాహాసన్తో కలసి ఆటోలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోలో తిరగడం శ్రుతీకి అలవాటు. ఈ ఏడాది మార్చిలో స్నేహితులతో అర్ధరాత్రి ఆటోలో చక్కర్లు కొట్టారు. -
నగరంలో మరో 22 అమ్మ క్యాంటీన్లు
300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ బాధ్యతలేని సిబ్బందిపై చర్యలు ప్రజల అభిమానాన్ని చొరగొన్న అమ్మ క్యాంటీన్లు మరికొన్ని ప్రజల ముందుకు రానున్నాయి. చెన్నైలో 22 కొత్త క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 300 క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని త్వరలో ప్రవేశ పెట్టారు. చెన్నై: చెన్నై కార్పొరేషన్ నేతృత్వంలో మొత్తం 300 అమ్మ క్యాంటీన్లు సేవలు అందిస్తున్నాయి. అతి తక్కువ ధరకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ లు సరఫరా చేయడం ప్రజలను ఆకట్టుకుంది. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అ మ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం వల్ల రోగులతోపాటు వచ్చే బంధువులు సౌకర్యాన్ని పొందుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మరో 22 అమ్మ క్యాంటీన్లు నెలకొల్పాలని కార్పొరేషన్ నిర్ణయించింది. అమ్మ క్యాంటీన్ల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం శనివారం అన్వేషణ ప్రారంభమైంది. స్థలం ఎంపిక జరగ్గానే నిర్మాణ పనులను పూర్తిచేసి వీలయినంత త్వరలో అమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని కార్పొరేషన్ అధికారులు చెప్పారు. కంప్యూటర్ బిల్లింగ్: పేదల ప్రయోజనార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లపై కింది, మధ్యతరగతి ప్రజల అభిమానాన్ని సైతం చూరగొనడంతో అదనపు సౌకర్యాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అమ్మ క్యాంటీన్ల ద్వారా రోజూ వేలాది మంది ఆహారం తీసుకుంటుండగా లక్షల్లో ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సమయాల్లో అనేక వంటకాలు సిద్ధం చేయడం వల్ల నగదు స్వీకరణ, టోకన్ల జారీ అక్కడి సిబ్బందికి కష్టంగా మారింది. అంతేగాక అమ్మకాలపై నిర్దిష్టమైన లెక్కలు కొరవడినట్లు కార్పొరేషన్ గుర్తించింది. దీంతో ఇకపై ప్రతి అమ్మ క్యాంటీన్లలో కంప్యూటర్ బిల్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. 255 అమ్మ క్యాంటీన్లలో కొత్త కంప్యూటర్లను అమర్చగా, మిగిలిన 45 క్యాంటీన్లలో గతంలోని మిషిన్లను కొనసాగిస్తున్నారు. అమ్మ క్యాంటీన్ల నిర్వహణపై కార్పొరేషన్ ప్రజా ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సెంథిల్నాథన్ మాట్లాడుతూ అమ్మ క్యాంటీన్లకు అవసరమైన వస్తువుల కొనుగోలు, ఆహార పదార్థాల అమ్మకాలపై ఒక నిర్ధారణకు వచ్చేందుకు కంప్యూటర్ బిల్లింగ్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేగాక అమ్మ క్యాంటీన్లను ఎన్నిగంటలకు తెరుస్తున్నారు, మూస్తున్నారనే వివరాలు సైతం బిల్లులో నమోదు కావడం వల్ల సిబ్బందిలో క్రమశిక్షణ పెరుగుతుందని చెప్పారు. ఆహార పదార్థాల స్టాకు ఉన్నా ముందుగానే క్యాంటీన్లను మూసివేస్తే తాము తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలను తీసుకునేందుకు కంప్యూటర్ బిల్లింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు. -
ఎనిమిది మంది ప్రాణాలు తీసిన ‘కొత్త’ వేడుకలు
ఎనిమిది మంది మృతి చెన్నైలో 110 మందికి గాయాలు కొత్త సంవత్సరంలో అడుగిడుతున్నామన్న ఆనందం అనేక కుటుంబాల్లో అంతలోనే ఆవిరైపోయింది. వేడుకల ఉత్సాహం శ్రుతిమించడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై: శ్రీపెరంబుదూరులోని ఒక ప్రయివేటు నర్సింగ్ స్కూల్‌కు చెందిన టీ కలైయరసి (23), ఎస్.సరస్వతి (23), సుబ్బు (23), సవిత (23), మాలతి (21), ఎం.సరస్వతి (23) కలిసి కొత్త సంవత్సరం సందర్భంగా సమీపంలోని ఆలయాలకు నడిచి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొనడంతో రోడ్డుపై చల్లాచెదరుగా పడిపోయారు. అందర్నీ ఆస్పత్రికి తరలిస్తుండగా కలైయర సి, ఎస్.సరస్వతి, సుబ్బు మృతి చెందారు. తీవ్రగాయాలకు గురైన మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చెన్నై మెరీనాబీచ్, సాంతోమ్, ఎలియడ్స్ల వద్ద సుమారు 50 ప్రమాదాలు చోటుచేసుకోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రూపేన్ చక్రవరి (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి బైక్‌లో వెళుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మాధవరం మూలకడ వద్ద హ్యాపీ న్యూఇయర్ అంటూ కేకలు వేస్తూ బైక్‌లో వెళుతుండగా జారిపోవడంతో రత్నకుమార్ (20) ప్రాణాలు వదిలాడు. కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా తన ఇంటి ముందు మద్యం సేవిస్తూ ఇబ్బందులు సృష్టిస్తున్న యువతను ఇంటి యజమాని వెంకట్రామకృష్ణన్ వారిని నిలదీశాడు. ఇందుకు ఆగ్రహించిన యువకులు మద్యం బాటిల్‌తో పొడవడంతో వెంకట్రామకృష్ణన్ (54) మృతి చెందాడు. పాత చాకలి పేటకు చెందిన రూపేన్ చక్రవరి (22) మెరినీ బీచ్‌రోడ్డుకు వెళుతుండగా ట్రిప్లికేన్ వద్ద బైకు నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే పరంగిమలైకి చెందిన సౌందరరాజన్ (20) అనే ఇంజినీరింగ్ రెండో సంవత్సర విద్యార్థి నందంబాక్కం వద్ద ప్రమాదానికి గురైప్రాణాలు విడిచాడు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన కంటైనర్: 9 మంది మృతి
చెన్నై: నగరంలోని ఈసీఆర్ రోడ్డులో మంగళవారం అతి వేగంతో కంటైనర్ వాహనం పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే దుర్మణం చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు పోలీసులు కాగా .. ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు చెప్పారు. కంటైనర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. -
చెన్నైలో మెట్రో రైలు పరుగులు
-
చెన్నైలో మెట్రో రైలు పరుగులు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో మైట్రో రైలు పరుగులు తీసింది. ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కోయంబేడు - ఆలందూరు మార్గంలో మెట్రో రైలును సోమవారం ప్రారంభించారు. మెట్రో రైలు ప్రారంభోత్సవ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. సచివాలయం నుంచే జెండా ఊపారు. కోయంబేడు, ఆరుంబాక్కం, వడపళని, అశోక్‌నగర్, ఈక్కాడుతాంగల్, ఆలందూరు రైల్వే స్టేషన్లను సీఎం ప్రారంభించారు. తొలి రోజు పట్టాలెక్కే రైళ్లు ప్రత్యేక ఆకర్షణగా కన్పించే రీతిలో పుష్పాలతో అలకరించేందుకు రూ.28 లక్షలు కేటాయించడం గమనార్హం. -
కోటీశ్వరులయ్యేందుకు చోరీలు
చెన్నై : కారును బైక్‌తో ఢీకొట్టి అందులోని పదికిలోల బంగారం అపహరణ యత్నం భగ్నమైంది. ఈ సంఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సినీఫక్కీలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై సౌకార్‌పేట తిరుపల్లివీధిలో జయ్మాతాజీ కొరియర్ సర్వీస్‌సెంటర్ ఉంది. ఈ కొరియర్ సర్వీసు ద్వారా 10 కిలోల బంగారాన్ని భద్రం చేసి ఉన్న ఒక పార్శిల్‌ను ముంబయికి విమానం ద్వారా పంపాల్సి ఉంది. ఈ కొరియర్ సెంటర్లో పనిచేసే వీరేంద్ర (27), రతన్ (22), సందీప్ (26) సదరు పార్శిల్‌ను తీసుకుని మంగళవారం రాత్రి 11 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరారు. వీరేంద్ర కారును నడుపుతుండగా, మిగిలిన ఇద్దరు వెనుక సీట్లో కూర్చున్నారు. అన్నాశాలై మీదుగా సైదాపేటను దాటుతున్న సమయంలో మూడు బైక్‌లలో ఆరుగురు వ్యక్తులు అతివేగంగా కారును వెంటపడి కొందరు ముందుభాగంలో మరికొందరు వెనుకభాగంలో బైక్‌లను నిలిపివేసి కారును ఆపివేశారు. వాళ్లు ... బిడ్డను కారుతో ఢీకొట్టి వెళ్లిపోతున్నావా అంటూ వీరేంద్రతో గొడవకు దిగి దాడిచేశారు. రోడ్డుపై వెళుతున్న స్థానికులు కారును చుట్టుమట్టారు. ఆగంతకుల మాటలు నమ్మిన జనం... వీరేంద్ర, తదితరులపై తీవ్రంగా దాడి చేశారు. సందట్లో సడేమియాగా బంగారం పార్శిల్‌ను ఓ ఆగంతకుడు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా గమనించిన రతన్ కేకలు పెట్టాడు. బైక్‌లో వచ్చిన ఐదుగురు, కారులోని సందీప్ పరారయ్యారు. చూలైమేడుకు చెందిన సెంథిల్‌కుమార్ (29) పట్టుపడ్డాడు. పోలీసులు అతన్ని విచారించగా, బంగారం అపహరణ కోసమే ఈ నాటకం ఆడినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు వెంటనే కంట్రోలు రూంకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కోటీశ్వరులయ్యేందుకు చోరీలు: సెంథిల్ వాంగ్మూలం ప్రకారం, వడపళినికి చెందిన సెల్వకుమార్ (21), చూలైమేడుకు చెందిన అశోక్‌కుమార్ (34), కోడంబాక్కం ప్రసాద్ (30), తాంబరం మణికంఠన్, డాక్లస్, ప్యారిస్ అహ్మద్ అలియాస్ కౌశిల్, నేను స్నేహితులం. దారినపోయేవారిని బెదిరించి డబ్బులాక్కోడం పరిపాటి. వక్రమార్గాల ద్వారా కోటీశ్వరులం కావాలని, కారులు, బంగ్లాలు కొనుగోలు చేయాలని భావించాం. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో దొంగతనాలకు దిగాం. కొరియర్ కంపెనీల పనిచేసే సందీప్‌తో పరిచయం కాగా బంగారు ఎగుమతుల విషయం అతని ద్వారా తెలిసింది. పథకం ప్రకారం మంగళవారం రాత్రి పదికిలోల బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకుని నాటకమాడాం. జనానికి నాపై సందేహం వచ్చి పట్టుకోగానే నాతోటి మిత్రులు పరారయ్యారని చెప్పాడు. సైదాపేట పోలీసులు కేసు నమోదు చేసి సెంథిల్‌కుమార్, సెల్వకుమార్, అశోక్‌కుమార్, ప్రసాద్, మణికంఠన్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
3 కొత్త మార్గాల్లో మెట్రో రైలు
- తాజా ప్రతిపాదనలు - కోయంబేడు నుంచి తొలిదశ - మొత్తం 42 రైళ్ల సేవలు చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు మరో రెండు కొత్త మార్గాల్లో ఈ సేవలను మెట్రో రైలు నడపాలని పాలక యంత్రాంగం నిర్ణరుుంచింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మెట్రో రైలు నిర్మాణ తొలిదశ పనులు రూ.14,600 కోట్లతో సాగుతున్నాయి. ఇందుకు తోడుగా మరో మూడు కొత్త మార్గాలను ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేస్తున్నారు. చాకలిపేట నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, అన్నాశాలై మీదుగా మీనంబాకం విమానాశ్రయానికి ఒక మార్గం, సెంట్రల్ మీదుగా పూందమల్లి, కోయంబేడు మీదుగా ఆలందూరు వరకు మరో రైలు మార్గం పనులు చేపట్టనున్నారు. వీటి మొత్తం దూరం 45.1 కిలోమీటర్లుగా ఉంది. ఈ రైలు మార్గంలోనే సొరంగం, బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రైలు మార్గాలను కలుపుకుని మొత్తం 42 రైళ్లు సేవలు అందించనున్నా రు. ఒక్కో రైలులో 4బోగీలు ఉంటాయి. బ్రెజిల్ నుంచి ఇప్పటికే 9 రైళ్లు చేరుకోగా, ఆంధ్రప్రదే శ్ సరిహద్దు తడలోని శ్రీసిటీ సెజ్ ద్వారా మరో ఐదు రైళ్లు తయారవుతున్నాయి. మొదటి దశగా కోయంబేడు నుంచి ఆలందూరు వరకు మెట్రోరైలును పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రెండో దశ పనులకు రూ.36 కోట్లను అంచనావేశారు. చెన్నై నగర విస్తీర్ణం 1189 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించగా 2016 నాటికి నగర జనాభా 1.25 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు పథకం అమలులో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మాధవరం నుంచి కలంగరైవిలక్కం (లైట్‌హౌస్) వరకు 17 కిలోమీటర్లు, కోయంబేడు నుంచి ఈజ్జంబాక్కం వరకు 27 కిలోమీటర్లు, మాధవరం నుంచి పెరుంబాక్కం వరకు 32 కిలోమీటర్ల దూరం వరకు మెట్రోరైలు సేవలకు సూత్రప్రాయంగా నిర్ణరుుంచారు. ఈ కొత్త మార్గాలకు సంబంధించి త్వరలో అధికారుల సర్వే ప్రారంభం కానుంది. ప్రాథమికంగా నిర్ణయించిన మార్గంలో కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యమైనా కొత్త మార్గాల్లో మెట్రోరైలు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కోయంబేడు- పరంగిమలై మధ్యన మెట్రోరైలు సేవలు ఈ ఏడాది అక్టోబరు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ముఖ్యమంత్రి జయలలిత ట్రయల్న్‌క్రు పచ్చజెండా ఊపగా ఇప్పటికే అనేక సార్లు మెట్రోరైళ్లు ఇదే మార్గంలో పరుగులు పెట్టాయి. పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడగానే ఈ మార్గంలో మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. -
తిరువళ్లూరులో మరో జలాశయం
కొరుక్కుపేట: చెన్నై నగరంలో ఓ వైపు విద్యుత్ కష్టాలు విలయతాండం చేస్తుంటే మరో వైపు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందుఆల ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చెన్నై నగర వాసుల తాగునీటి కొరతను తీర్చే విధంగా ప్రభుత్వం మరో కొత్త రిజర్వాయర్‌ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణను సైతం ప్రారంభించింది. చెన్నై నగరానికి సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఇప్పటికే పూండి రిజర్వాయర్ ఉండగా, దీని నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. తిరువళ్లూరు జిల్లా రిజర్వాయర్ నిర్మాణానికి అనువైనదిగా గుర్తిం చగా, 90 శాతం భూసేకరణ పనులను సైతం అధికారులు సిద్ధం చేశారు. *330 కోట్లతో వాటర్ రిసోర్సెస్ విభా గం ఈ పనులను చేపట్టనుంది. తిరువళ్లూరు జిల్లాలోని కన్నన్‌కోటై గ్రామం, తెరవైకండిగై ప్రాంతాల మధ్య ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 500 క్యూబిక్ ఫీట్ల నీటిని నిల్వ చేసి సామర్థ్యంతో ఈ రిజ ర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఇందు లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణానికి 1500 ఎకరాల భూమి అవసరం కాగా, 1350 ఎకరాల భూసేకరణ పనులను పూర్తి చేశారు. ఈ విషయంగా డబ్ల్యూఆర్చగ అధికారులు మాట్లాడుతూ చెన్నై మహానగర పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూండి జలాశయం సహా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయన్నారు. వీటితో పాటు అదనంగా ఐదో రిజర్వాయర్ అందుబాటులోకి వస్తే చెన్నై నగర ప్రజలు తాగునీటి కష్టాలు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ రిజర్వాయర్ 2015 ఏడాది మధ్య నాటికి అందుబాటులోకి రానుం దని వెల్లడించారు.