3 కొత్త మార్గాల్లో మెట్రో రైలు
- తాజా ప్రతిపాదనలు
- కోయంబేడు నుంచి తొలిదశ
- మొత్తం 42 రైళ్ల సేవలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు మరో రెండు కొత్త మార్గాల్లో ఈ సేవలను మెట్రో రైలు నడపాలని పాలక యంత్రాంగం నిర్ణరుుంచింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మెట్రో రైలు నిర్మాణ తొలిదశ పనులు రూ.14,600 కోట్లతో సాగుతున్నాయి. ఇందుకు తోడుగా మరో మూడు కొత్త మార్గాలను ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేస్తున్నారు. చాకలిపేట నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, అన్నాశాలై మీదుగా మీనంబాకం విమానాశ్రయానికి ఒక మార్గం, సెంట్రల్ మీదుగా పూందమల్లి, కోయంబేడు మీదుగా ఆలందూరు వరకు మరో రైలు మార్గం పనులు చేపట్టనున్నారు. వీటి మొత్తం దూరం 45.1 కిలోమీటర్లుగా ఉంది.
ఈ రైలు మార్గంలోనే సొరంగం, బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రైలు మార్గాలను కలుపుకుని మొత్తం 42 రైళ్లు సేవలు అందించనున్నా రు. ఒక్కో రైలులో 4బోగీలు ఉంటాయి. బ్రెజిల్ నుంచి ఇప్పటికే 9 రైళ్లు చేరుకోగా, ఆంధ్రప్రదే శ్ సరిహద్దు తడలోని శ్రీసిటీ సెజ్ ద్వారా మరో ఐదు రైళ్లు తయారవుతున్నాయి. మొదటి దశగా కోయంబేడు నుంచి ఆలందూరు వరకు మెట్రోరైలును పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రెండో దశ పనులకు రూ.36 కోట్లను అంచనావేశారు. చెన్నై నగర విస్తీర్ణం 1189 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించగా 2016 నాటికి నగర జనాభా 1.25 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు పథకం అమలులో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మాధవరం నుంచి కలంగరైవిలక్కం (లైట్‌హౌస్) వరకు 17 కిలోమీటర్లు, కోయంబేడు నుంచి ఈజ్జంబాక్కం వరకు 27 కిలోమీటర్లు, మాధవరం నుంచి పెరుంబాక్కం వరకు 32 కిలోమీటర్ల దూరం వరకు మెట్రోరైలు సేవలకు సూత్రప్రాయంగా నిర్ణరుుంచారు. ఈ కొత్త మార్గాలకు సంబంధించి త్వరలో అధికారుల సర్వే ప్రారంభం కానుంది.
ప్రాథమికంగా నిర్ణయించిన మార్గంలో కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యమైనా కొత్త మార్గాల్లో మెట్రోరైలు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కోయంబేడు- పరంగిమలై మధ్యన మెట్రోరైలు సేవలు ఈ ఏడాది అక్టోబరు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ముఖ్యమంత్రి జయలలిత ట్రయల్న్‌క్రు పచ్చజెండా ఊపగా ఇప్పటికే అనేక సార్లు మెట్రోరైళ్లు ఇదే మార్గంలో పరుగులు పెట్టాయి. పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడగానే ఈ మార్గంలో మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.