Koyambedu
-
‘లాక్ డౌన్’ దొరికాడు! 2 రోజుల తర్వాత బస్సులో ప్రత్యక్షం
సాక్షి, చెన్నై : అంబత్తూరులో అదృశ్యమైన చిన్నారి ‘లాక్డౌన్’ బుధవారం కోయంబేడు బస్టాండ్‌లోని ఓ బస్సులో ప్రత్యక్షం అయ్యాడు. ఈ బిడ్డను కిడ్నాప్ చేసి ఇక్కడ పడేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. చెన్నై అంబత్తూరు గాంధీనగర్‌లో ఓ భవనం నిర్మాణ పనుల్లో ఒడిశాకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కిషోర్, పుత్తిని దంపతులు కూడా ఉన్నారు. వీరికి ఆకాష్, లాక్డౌన్(ప్రకాష్) అనే చిన్నారులు కూడా ఉన్నారు. ఏడాదిన్నర వయస్సు కల్గిన ప్రకాష్ సరిగ్గా లాకౌడౌన్ సమయంలో జన్మించాడు. అందుకే ఆ బిడ్డకు లాక్డౌన్ అని నామకరణం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి తమతో పాటుగా గుడిసెలో నిద్రించిన బిడ్డ అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు అంబత్తూరు పోలీసుల్ని ఆశ్రయించారు. ఇన్స్పెక్టర్ రామస్వామి నేతృత్వంలో బృందం దర్యాప్తులో నిమగ్నమైంది. కాగా బుధవారం కోయంబేడు బస్టాండ్‌లో చెన్నై నుంచి సేలంకు వెళ్లే బస్సులో చిన్నారి లాక్డౌన్ ప్రత్యక్షం అయ్యాడు. డ్రైవర్ గుర్తించి కోయంబేడు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అన్ని పత్రికల్లో లాక్డౌన్ అదృశ్యం వార్త, ఫొటోలు రావడంతో ఆ బిడ్డను పోలీసులు గుర్తించారు. బస్సులో లాక్డౌన్ దొరికినట్టు అంబత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. -
కుదిపేస్తున్న కోయంబేడు
సాక్షి, విశాఖపట్నం : చెన్నైలోని కోయంబేడు మార్కెట్ విశాఖను కుదిపేస్తోంది. అక్కడ నుంచి మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు నగరాన్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా అప్పుఘర్, ఫిషర్మెన్ కాలనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దండుబజార్, అనకాపల్లి, మధురవాడ సాయిరాం కాలనీలను శాసిస్తోంది. కోయంబేడు వల్ల ఒక్క అప్పుఘర్ ప్రాంతంలోనే మొత్తం 57 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మొత్తంగా జిల్లాలో శనివారం 26 మందికి వైరస్ సోకింది. తాజా కేసులతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 408 కు చేరుకుంది. వీరిలో 199 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 207 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో జిల్లాలో మరొకరు మృతి చెందారు. జీవీఎంసీ 45వ వార్డు ఏకేసీ కాలనీ ప్రాంతానికి చెందిన మహిళ కరోనాతో మృతి చెందింది. కేసుల వివరాలు ఇలా.. జిల్లాలో శనివారం 26 కేసులు నమోదయ్యాయి. అందులో అప్పుఘర్, ఫిషర్మెన్ కాలనీలో పది, అనకాపల్లిలో 2, పెదజాలారిపేటలో ఒకటి, చింతపల్లిలో ఒకటి, పరవాడలో ఒకటి, ఐటీఐ జంక్షన్లో ఒకటి(కేజీహెచ్ వైద్యుడు), సీతమ్మధార నార్త్ ఎక్స్టెక్షన్లో ఒకటి, పెందుర్తి మండలం పోర్లుపాలెంలో ఒకటి, రామ్‌నగర్(ఫేకర్ లే అవుట్)లో ఒకటి, రంగిరీజు వీధిలో ఒకటి, ఎఎస్ఆర్ నగర్లో ఒకటి, ఆదర్శనగర్‌లో ఒకటి, రవీంద్రనగర్‌లో ఒకటి, ఆరిలోవలో రెండు, మధురవాడ(నగరంపాలెం రోడ్డు) ఒక కేసు నమోదయ్యాయి. కరోనాతో మరొకరి మృతి మల్కాపురం (విశాఖ పశ్చిమ): జిల్లాలో కరోనాతో మరొకరు మృతి చెందారు. జీవీఎంసీ 45వ వార్డు ఏకేసీ కాలనీ ప్రాంతానికి చెందిన మహిళ టీబీతో కొంతకాలంగా బాధపడుతోంది. ఈనెల 10న ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి పరీక్షల కోసం వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధాణైంది. అప్పటినుంచి అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మృతి చెందినట్టు జోన్–4 జెడ్సీ సింహాచలం ప్రకటించారు. కడసారి చూపుచూసేందుకు ఆస్పత్రికి వెళ్లిన కుమారులకు నిరాశ ఎదురైంది. దూరం నుంచి భౌతికదేహాన్ని చూపించి, ఆమెకు సంబంధించిన బంగారు వస్తువులను అక్కడ సిబ్బంది అందజేశారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. చదవండి: ‘ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించలేదు’ జవాన్‌కు పాజిటివ్ పరవాడకు చెందిన జవాన్‌కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కరోనా సోకిన గర్భిణీకి సిజేరియన్ దొండపర్తి(విశాఖ దక్షిణ): కరోనా సోకిన గర్భిణీకి విమ్స్ వైద్యులు విజయవంతంగా సిజేరియన్ చేయడంతో పండంటి పాపకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 ఏళ్ల గర్భిణీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను విమ్స్‌లో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. శనివారం ఆమెకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆమె పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సీజేరియన్ నిర్వహించిన వైద్యులకు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ అభినందనలు తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబేడులోని తమ ప్రధాన కార్యాలయంలో పుట్ ఆపరేటెడ్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ లిఫ్ట్‌లోకి ప్రవేశించిన తర్వాత చేతులతో లిఫ్ట్‌ను తాకకుండా పాదరక్షల సాయంతో ఆపరేట్ చేసే వీలుండటంతో.. తద్వారా వైరస్ సంక్రమించే అవకాశాన్ని కొద్దివరకు తగ్గించవచ్చని సీఎంఆర్ఎల్ భావిస్తోంది. సీఎంఆర్ఎల్ చొరవ తీసుకొని ఇటువంటి లిఫ్ట్‌ను ఏర్పాటు చేసిన మొదటి మెట్రో రైలుగా అవతరించింది. చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు రాబోయే రోజుల్లో అన్ని మెట్రో స్టేషన్లలోని లిప్టులలో కూడా ఇలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. లాక్డౌన్ కాలంలో 25శాతం మంది సిబ్బందితో కొన్ని పనులను నిర్వహించడానికి స్టేషన్లను తెరచి ఉంచారు. కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 618 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 9 మంది మరణించారు. ఇక కోవిడ్-19 నుంచి కోలుకుని 11,313 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. పరీక్షల సంఖ్య పెరగడం, జనాభా సాంద్రత పెరగడం వంటి కారణాల వల్ల అధిక కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి: నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ Chennai Metro's foot operated lift towards contactless operations to check the spread of virus. The agency plans to install this in Metro stations as well. @ndtv pic.twitter.com/tBCfwd7Jqp — J Sam Daniel Stalin (@jsamdaniel) May 30, 2020 -
రాష్ట్రంలో తాజాగా 41 మంది డిశ్చార్జి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 41 మంది డిశ్చార్జి కావడంతో సోమవారానికి కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,884కు చేరింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు మొత్తం 10,240 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 89 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఇందులో 45 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. కువైట్ నుంచి వచ్చిన 41 మంది, ఖతార్ నుంచి వచ్చిన ముగ్గురికి, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒకరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా తమిళనాడులోని కోయంబేడుకు వెళ్లి వచ్చిన మరో ఏడుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,886కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పాజిటివ్ కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 62 కేసులకు తోడు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సంబంధించి 153 కేసులు కూడా ఉన్నాయి. గడిచిన రెండు రోజులుగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 56గా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 946గా ఉంది. -
కారు ధ్వంసం చేశారని శ్రీరెడ్డి ఫిర్యాదు
పెరంబూరు : సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ప్రస్తుతం స్తానిక వలసరవాక్కం, అన్భునగర్‌లోని ఒక ప్లాట్‌లో నివసిస్తున్నారు. కాగా ఇటీవల తన ఫేస్బుక్ ఖాతాలో తాను ఉంటున్న ఇంటి సమీపంలో నటి తమన్న నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారనీ, ఆ యూనిట్ గోల పడలే కపోతున్నానని పేర్కొన్నారు. వారితో మాట్లాడి ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. కాగా, గత రెండు రోజుల క్రితం నటి శ్రీరెడ్డి స్థానిక కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో తాను ఉంటున్న ఇంటి సమీపంలో విశ్రాంతి పోలీస్ అధికారి బంగ్లా ఉందని, అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని చెప్పారు. తాను సోమవారం బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాగా తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో దాన్ని బయట పెట్టానని పేర్కొన్నారు. ఆ తరువాత కొంచెం సేపటికి వచ్చి చూస్తే తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేసి ఉండటం చూశానని తెలిపారు. షూటింగ్ చేస్తున్న చిత్ర కార్యనిర్వాహకుడు మనోజ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. సంఘటనపై విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో కేసును నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్స్పెక్టర్ మాదేశ్వరన్ విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతంలో నిఘా కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం
సాక్షి, చెన్నై : నగరంలోని కోయంబేడు బస్టాండ్‌లో శనివారం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేందుకు నిలిచి ఉన్న బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చేశారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో కోయంబేడులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. -
నటి శ్రీరెడ్డిపై దాడి
సాక్షి, చెన్నై: నటి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై చెన్నైలో ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నై వలసరవాక్కంలో నటి శ్రీరెడ్డి నివశిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి శ్రీరెడ్డి, ఆమె మేనేజర్ మోహన్‌పై దాడి చేశారు. దీనిపై ఆమె వెంటనే కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మద్యం మత్తులో గొడవ పడుతున్న ఫైనాన్షియర్, సినీ నిర్మాత సుబ్రమణి (40), అతని అక్క కుమారుడు గోపి (23)లను అరెస్ట్ చేశారు. దాడిలో స్వల్పంగా గాయపడిన శ్రీరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. శ్రీరెడ్డి ఫిర్యాదు మేరకు చెన్నై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు నిర్మాత సుబ్రమణి మూడునెలల క్రితం హైదరాబాద్‌లో శ్రీరెడ్డిని లైంగిక వేధింపులకు గురిచేయగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పోలీసులు సుబ్రమణిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన సుబ్రమణి తన అక్క కుమారుడు గోపీని వెంటబెట్టుకుని వచ్చి శ్రీరెడ్డిపై దాడికి దిగారు. ఈ సంఘటనపై పోలీసులు శ్రీరెడ్డిని విచారిస్తున్నారు. -
వయసులో చిన్నవాళ్లు.. మనసులో పెద్దవాళ్లు..
-
చెన్నైను మళ్లీ వణికిస్తున్న వర్షం
-
చెన్నైను మళ్లీ వణికిస్తున్న వర్షం
చెన్నై: చెన్నై నగరాన్ని మళ్లీ వర్షం వణికిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాయపేట, మౌంట్ రోడ్, తాంబరం, మైలాపూర్, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ వర్షం పడటంతో నగరవాసులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. చెన్నై మహానగరం ఇంకా ముంపు లోనే మగ్గుతోంది. మరోవైపు కోయంబేడు బ్రిడ్జ్ దగ్గర ప్రమాద స్థాయిని దాటి నీరు ప్రవహిస్తోంది. ఇక నిత్యావసరాల కోసం జనాలు రోడ్లపై బారులు తీరుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలు, మంచినీళ్లు దొరక్క జనాలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ...చెన్నైలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 72,119 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. -
బస్సుల పరుగు!
దీపావళి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం నుంచి ఆయా నగరాలు, జిల్లా కేంద్రాలకు పరుగులు తీశాయి. కోయంబేడులో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని క్రమ బద్ధీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. * రోడ్డెక్కిన ప్రత్యేక సర్వీసులు * కోయంబేడులో పార్కింగ్ ఏర్పాట్లు సాక్షి, చెన్నై: వెలుగుల పండుగ దీపావళిని ఇంటిల్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అవుతున్నారు. స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో, సోమ, మంగళ వారాలు సెలవులు పెట్టుకున్న ఉద్యోగులు తమ స్వగ్రామాలకు బయలు దేరారు. రైళ్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ కాగా, బస్సుల మీద దృష్టి పెట్టక తప్పలేదు. ఓ వైపు ఆమ్నీ బస్సులు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు చెన్నై నుంచి దక్షిణాదిలోని జిల్లాలకు పరుగులు తీయడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. చర్యలు: దీపావళిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకు పైగా ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కొంగు మండాలనికి, డెల్టా జిల్లాలకు 4 వేల బస్సులు పరుగులు తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. కోయంబేడులోని ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా శుక్రవారం నుంచి బస్సులు రోడ్డెక్కించారు. తొలి రోజు 500 బస్సులు నడిచాయి. శనివారం మరో 500, ఆదివారం 700, సోమవారం 2100, మంగళవారం 1652 బస్సుల్ని నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. అలాగే, కోయంబేడు మార్కెట్ పరిసరాల్ని ప్రత్యేక బస్సులకు పార్కింగ్ స్టాండ్‌గా నిర్ణయించారు. అలాగే, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల కోసం టెర్మినల్ ముందు భాగంలో 21 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు : కోయంబేడు టెర్మినల్‌లో తొమ్మిది అతి పెద్ద ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్ ఫాంలో 50కు పైగా బస్సుల్ని నిలబెట్టేందుకు వీలుంది. ఈ ఫ్లాట్ ఫారాలను దీపావళిని పురస్కరించుకుని విభజించారు. ఒకటి, రెండు ఫ్లాట్ ఫారాలను అన్ రిజర్వుడ్‌తో నడిచే బస్సుల కోసం సిద్ధం చేశారు. ఇక్కడ 200 కి. మీ దూరంలోపు ప్రయాణించే బస్సులు, వేలూరు, కాంచీపురం, విల్లుపురం వరకు నడిచే బస్సులు ఉంటాయని బోర్డుల్ని ఏర్పాటు చేశారు. 3, 4, 5, 6 ఫ్లాట్ ఫారాల్లో మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర దక్షిణాది జిల్లాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. 7, 8, 9ఫ్లాట్ ఫారాల్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే అన్‌రిజర్వుడ్ బస్సులకు కేటాయించారు. అలాగే, మహిళలు, పిల్లలతో వెళ్లే వారి కోసం ఈ ఫ్లాట్ ఫారాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో సీట్లు సులభంగా చిక్కుతాయి. -
బస్టాండ్ లో 10వేల నీలిచిత్రాల సీడీలు స్వాధీనం
చెన్నై : కోయంబేడు బస్టాండులో 10వేల నీలిచిత్రాల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోయంబేడు బస్టాండులో 5వీ నంబర్ ప్లాట్‌ఫాంపై శుక్రవారం ఉదయం రెండు పెద్ద సూట్‌కేసులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీని గురించి సమాచారం అందుకున్న కోయంబేడు డెప్యూటీ కమిషనర్ మోహన్‌రాజ్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని సూట్‌కేసులను తెరచి చూశారు. వాటిల్లో కవర్లు లేకుండా అధిక మొత్తంలో సీడీలు కనిపించాయి. వీటిని పోలీసులు వేసి చూడగా ఇవన్నీ నీలిచిత్రాల సీడీలని తెలిసింది. సుమారు 10వేల సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆంధ్రా నుంచి ఇక్కడికి తీసుకువచ్చినట్లు కనుగొన్నారు. కోయంబేడు బస్టాండు నుంచి వస్తువులు తరలించడం అడ్డుకునేందుకు బస్టాండులో పోలీసులు నిఘా చేపడుతున్నారు. అందువల్ల పోలీసులకు భయపడి ఈ సూట్‌కేసులను విడిచి వెళ్లి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. -
3 కొత్త మార్గాల్లో మెట్రో రైలు
- తాజా ప్రతిపాదనలు - కోయంబేడు నుంచి తొలిదశ - మొత్తం 42 రైళ్ల సేవలు చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరంలో మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు మరో రెండు కొత్త మార్గాల్లో ఈ సేవలను మెట్రో రైలు నడపాలని పాలక యంత్రాంగం నిర్ణరుుంచింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రారంభించిన మెట్రో రైలు నిర్మాణ తొలిదశ పనులు రూ.14,600 కోట్లతో సాగుతున్నాయి. ఇందుకు తోడుగా మరో మూడు కొత్త మార్గాలను ప్రయాణికుల వినియోగానికి సిద్ధం చేస్తున్నారు. చాకలిపేట నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, అన్నాశాలై మీదుగా మీనంబాకం విమానాశ్రయానికి ఒక మార్గం, సెంట్రల్ మీదుగా పూందమల్లి, కోయంబేడు మీదుగా ఆలందూరు వరకు మరో రైలు మార్గం పనులు చేపట్టనున్నారు. వీటి మొత్తం దూరం 45.1 కిలోమీటర్లుగా ఉంది. ఈ రైలు మార్గంలోనే సొరంగం, బ్రిడ్జి నిర్మించనున్నారు. ఈ రైలు మార్గాలను కలుపుకుని మొత్తం 42 రైళ్లు సేవలు అందించనున్నా రు. ఒక్కో రైలులో 4బోగీలు ఉంటాయి. బ్రెజిల్ నుంచి ఇప్పటికే 9 రైళ్లు చేరుకోగా, ఆంధ్రప్రదే శ్ సరిహద్దు తడలోని శ్రీసిటీ సెజ్ ద్వారా మరో ఐదు రైళ్లు తయారవుతున్నాయి. మొదటి దశగా కోయంబేడు నుంచి ఆలందూరు వరకు మెట్రోరైలును పరుగులు పెట్టించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. రెండో దశ పనులకు రూ.36 కోట్లను అంచనావేశారు. చెన్నై నగర విస్తీర్ణం 1189 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించగా 2016 నాటికి నగర జనాభా 1.25 కోట్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు పథకం అమలులో మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మాధవరం నుంచి కలంగరైవిలక్కం (లైట్‌హౌస్) వరకు 17 కిలోమీటర్లు, కోయంబేడు నుంచి ఈజ్జంబాక్కం వరకు 27 కిలోమీటర్లు, మాధవరం నుంచి పెరుంబాక్కం వరకు 32 కిలోమీటర్ల దూరం వరకు మెట్రోరైలు సేవలకు సూత్రప్రాయంగా నిర్ణరుుంచారు. ఈ కొత్త మార్గాలకు సంబంధించి త్వరలో అధికారుల సర్వే ప్రారంభం కానుంది. ప్రాథమికంగా నిర్ణయించిన మార్గంలో కొన్ని మార్పులు, చేర్పులు అనివార్యమైనా కొత్త మార్గాల్లో మెట్రోరైలు పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కోయంబేడు- పరంగిమలై మధ్యన మెట్రోరైలు సేవలు ఈ ఏడాది అక్టోబరు నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ముఖ్యమంత్రి జయలలిత ట్రయల్న్‌క్రు పచ్చజెండా ఊపగా ఇప్పటికే అనేక సార్లు మెట్రోరైళ్లు ఇదే మార్గంలో పరుగులు పెట్టాయి. పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడగానే ఈ మార్గంలో మెట్రోరైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి. -
మెట్రో పరుగు
సాక్షి, చెన్నై:చెన్నై నగరంలో ఆదివారం మెట్రో రైళ్లు పరుగులు తీశాయి. ఒకే సమయంలో కోయంబేడు - ఆలందూరు మధ్య రెండు మార్గాల్లో రెండు రైళ్లు దూసుకెళ్లాయి. ఉదయం ఓ మారు, సాయంత్రం మరో మారు రైళ్లు దూసుకెళ్లడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మెట్రో రైలు పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తిరువొత్తియూరు విమ్కో నగర్ నుంచి జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు 32.1 కి.మీ దూరం ఓ మార్గంలో, సెంట్రల్ నుంచి కోయంబేడు మీదుగా సెయింట్ థామస్ మౌంట్ వరకు 22 కి.మీల దూరంలో మరో మార్గంలో ఈ పనులు సాగుతున్నాయి. సెంట్రల్ - కోయంబేడు - మౌంట్ మార్గంలో వంతెనల నిర్మాణం పూర్తి అయింది. ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేసి ఉన్నారు. కోయంబేడు నుంచి ఆలందూరు వరకు 11 కి.మీ దూరం ట్రాక్, విద్యుద్దీకరణ పనులు ముగిశాయి. ఈ మార్గంలో ఒక రైలుతో అప్పుడప్పుడు ట్రయల్ రన్ నిర్వహిస్తూ వస్తున్నారు. నెమ్మదిగా ఈ రైలు కదులుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆదివారం మెట్రో రైలు వేగాన్ని పెంచారు. ఒకేసారి రెండు రైళ్లు : కోయంబేడు నుంచి ఆలందరూ వరకు 11 కీ. మీద దూరంలో రాను, పోను రెండు మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాల్లో సిగ్నలింగ్, విద్యుత్ సరఫరా, ట్రాక్ పరిశీలన పూర్తి అయింది. దీంతో ఈ మార్గంలో ఆదివారం ఉదయాన్నే ఏక కాలంలో రెండు రైళ్లను నడిపారు. ఇది వరకు మాదిరిగా ఆ రైలు నెమ్మదిగా కదల్లేదు. మెట్రో రైలు వేగం అంటే ఇలా ఉంటుందని నగరవాసులకు చాటే విధంగా ఒకే సమయంలో రెండు ట్రాక్‌లపై రెండు రైళ్లు దూసుకెళ్లాయి. అత్యంత వేగంతో ఈ రైళ్లు దూసుకెళ్తాండటాన్ని అటు వైపుగా వెళ్లే వారు చూడ్డానికి ఎగ బడ్డారు. సిగ్నలింగ్, విద్యుత్ పూర్తి స్థాయిలో లభిస్తుండటంతో ఇక ఈ మార్గంలో రైళ్లను నిర్భయంగా నడిపేందుకు వీలుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మార్గంలో కోయంబేడు, వడపళని, అశోక్ పిల్లర్, గిండి, ఆలందూర్ వద్ద రైల్వే స్టేషన్ల పనులు ముగియాల్సి ఉంది. ఈ పనులు త్వరితగతిన పూర్తై పక్షంలో మరి కొన్ని నెలల్లో ఈ మార్గంలో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లు పరుగులు తీయడం ఖాయం.