సాక్షి, చెన్నై: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్‌ఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబేడులోని తమ ప్రధాన కార్యాలయంలో పుట్ ఆపరేటెడ్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ లిఫ్ట్‌లోకి ప్రవేశించిన తర్వాత చేతులతో లిఫ్ట్‌ను తాకకుండా పాదరక్షల సాయంతో ఆపరేట్ చేసే వీలుండటంతో.. తద్వారా వైరస్ సంక్రమించే అవకాశాన్ని కొద్దివరకు తగ్గించవచ్చని సీఎంఆర్‌ఎల్ భావిస్తోంది. సీఎంఆర్‌ఎల్ చొరవ తీసుకొని ఇటువంటి లిఫ్ట్‌ను ఏర్పాటు చేసిన మొదటి మెట్రో రైలుగా అవతరించింది. చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు
రాబోయే రోజుల్లో అన్ని మెట్రో స్టేషన్లలోని లిప్టులలో కూడా ఇలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. లాక్‌డౌన్ కాలంలో 25శాతం మంది సిబ్బందితో కొన్ని పనులను నిర్వహించడానికి స్టేషన్లను తెరచి ఉంచారు. కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 618 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 9 మంది మరణించారు. ఇక కోవిడ్-19 నుంచి కోలుకుని 11,313 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. పరీక్షల సంఖ్య పెరగడం, జనాభా సాంద్రత పెరగడం వంటి కారణాల వల్ల అధిక కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి: నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ
Chennai Metro's foot operated lift towards contactless operations to check the spread of virus. The agency plans to install this in Metro stations as well. @ndtv pic.twitter.com/tBCfwd7Jqp
— J Sam Daniel Stalin (@jsamdaniel) May 30, 2020
Comments
Please login to add a commentAdd a comment