Chennai Metro
-
నటి కస్తూరి తన సంపాదనను ఏం చేస్తుందో తెలుసా? బయటికొచ్చిన షాకింగ్ నిజాలు
నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్ ద్వారా తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సామాజం ఆమె ఎదుర్కొనే ఎదురుదెబ్బలు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఆమె సామాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుందనే విషయం తెలిసిందే. ఇటీవల నయనతార సరోగసిపై ట్వీట్ చేసి వివాదానికి తెరలేపింది. చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం అలా గతంలో ఆమె ఎన్నో అంశాలపై ఆమె ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా కస్తూరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల చెన్నై మెట్రోలో ప్రయాణించిన ఆమె తన ఫోన్ పొగొట్టుకుందట. దీంతో కస్తూరి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు ఆమె ఫోన్‌ను వెతికిపెట్టి ఇచ్చారట. దీంతో మెట్రో అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీసెంట్గా ఆమె ట్వీట్ చేసింది. ‘చెన్నై మెట్రో సిబ్బంది, అధికారులపై నాకు మరింత గౌరవం పెరిగింది. మెట్రో రైలులో పొగొట్టుకున్న నా ఫోన్‌ను వారు గంటల్లోనే వెతికిపెట్టి ఇచ్చారు. పని విషయంలో వారు చూపిస్తున్న నిబద్ధత, శ్రద్ధ, బాధ్యతలకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంది. ఇలా ఉంతోమంది ప్యాసింజర్ పొగొట్టుకున్న వస్తువులను వేతికి ఇస్తున్నారు. అందుకే చెన్నైమెట్రో అధికారులు, సిబ్బంది అంటే నాకు గౌరవం’ అంటూ ఆమె ట్వీట్లో రాసుకొచ్చింది. చదవండి: ‘బాహుబలి’తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే.. ఆకట్టుకుంటున్న ప్రొమో గ్లింప్స్ ఇక ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘మీకు సొంతంగా కార్లుంటాయి కదా? వాటిలో వెళ్లొచ్చు? ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి స్పందిస్తూ. ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఏవీ లేవు. నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని సమాధానం ఇచ్చింది. దీంతో మరో నెటిజన్ స్పందిస్తూ.. నువ్ సంపాదించిందంతా ఏం చేస్తావ్? అని అడిగేశాడు. ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్, చెల్డ్ క్యాన్సర్ పేషెంట్స్ కోసమే ఖర్చు పెడతాను’ అని తెలిపింది. దీంతో మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సెలబ్రెటీ అయి ఉండి ఆడంబరాలకు పోకుండ సాధారణ జీవితం గడుపుడుతూ ఉన్నంతో ఇతరులకు సాయం చేస్తున్న ఆమె పట్ల గౌరవం పెరిగిందంటూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా కస్తూరి నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే. OMG @cmrlofficial found my phone! No words to praise the dedication and integrity of CMRL staff. Many passengers have gotten back lost valuables. Special thanks to Mr Vijay Varadhan, joint GM . I already am a Chenno metro loyalist, now I have one more reason to love them! https://t.co/UGLpAYrFbR — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 I don't own a car. I don't have tv. I don't use Air conditioning. I practice a simpler lifestyle. https://t.co/bl4NJ6ecNt — Kasturi Shankar (@KasthuriShankar) December 13, 2022 -
ఆల్‌స్తోమ్‌కు చెన్నై మెట్రో ఆర్డర్
న్యూఢిల్లీ: రోలింగ్ స్టాక్ తయారీలో ఉన్న ఫ్రెంచ్ దిగ్గజం ఆల్‌స్తోమ్‌కు తాజాగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి ఓ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ రూ.798 కోట్లు. ఇందులో భాగంగా 78 అత్యాధునిక మెట్రో కోచ్‌లను చెన్నై మెట్రోకు ఆల్స్టమ్ సరఫరా చేయనుంది. వీటిలో 26 యూనిట్లు (త్రీ–కార్ కాన్ఫిగరేషన్) కూడా ఉన్నాయి. ఇవి గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ మెట్రో ట్రెయిన్స్ డ్రైవర్లు లేకుండానే పూర్తిగా సిగ్నల్స్ ఆధారంగా నడుస్తాయి. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఆల్స్టమ్ ప్లాంటులో మెట్రో కార్స్ తయారు కానున్నాయి. ఏటా 480 యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. చెన్నై మెట్రోకు ఇప్పటికే 208 మెట్రో కార్స్‌ను ఆల్స్టమ్ సరఫరా చేసింది. ఢిల్లీ, చెన్నై, లక్నో, కొచ్చి నగరాల్లో సంస్థ తయారీ మెట్రో ట్రెయిన్స్ పరుగెడుతున్నాయి. ముంబై మెట్రో లైన్–3, ఆగ్రా–కాన్పూర్ మెట్రో, ఇందోర్–భోపాల్ ప్రాజెక్టులకు కావాల్సిన మెట్రో కోచ్‌లు ప్రస్తుతం తయారీలో ఉన్నాయి. -
ఇకపై చెన్నై నగరాన్ని చుట్టివచ్చేందుకు రెండున్నర గంటలు చాలట!
దేశంలో ఎన్నో నగరాలున్నా చెన్నై మహానగరం అంటే ప్రజలకు, పర్యాటకులకు ఎంతో ప్రీతి. మరి ఈ మహానగరాన్ని చుట్టివచ్చేందుకు ఎంతో వ్యయ, ప్రయాసలొద్దు కేవలం రెండున్నర గంటలు చాలు అంటోంది మెట్రో యాజమాన్యం. చెన్నైలోని నలుదిశలను కలుపుతూ 118.9 కిలోమీటర్ల దూరానికి మెట్రో రైల్వే రింగ్ ట్రాక్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. 2026 నాటికి సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు మీడియాకు తెలిపారు. సాక్షి, చెన్నై: చెన్నై నగరంలో రెండు మార్గాల మెట్రో రైలు సేవలు సుమారు 55 కిలో మీటర్ల వరకు కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రెండో దశలో మూడవ ట్రాక్ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఏడాది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ పనులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. రూ.69 వేల కోట్ల అంచనాతో 128 రైల్వేస్టేషన్ల నిర్మాణానికి సంబంధించి తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. మూడు, నాలుగు, ఐదు ట్రాక్‌ల నిర్మాణానికి ప్రారంభ పనులు జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న ఈ మెట్రోరైలు సేవలు అందుబాటులోకి వస్తే 2.30 గంటల సమయంలో చెన్నై మహానగరం ఉత్తరం నుంచి దక్షిణం వరకు చుట్టి రావచ్చు. మాధవరం నుంచి షోళింగనల్లూరు వరకు, తూర్పు దిశలోని అడయారు మీదుగా చెన్నైలోని ఉత్తర భాగాన ఉన్న కోయంబేడు వరకు 81 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్‌లను నిర్మించనున్నారు. రింగ్ ట్రాక్ మార్గంలో మూడు, ఐదు ట్రాక్‌లైన్‌లను అనుసంధానం చేస్తూ సెంట్రల్ మెట్రో రైల్వేస్టేషన్‌ను కోయంబేడు మీదుగా చెన్నై మీనంబాక్కం ఎయిర్ పోర్టు రైల్వేస్టేషన్‌ను కలిపేలా ఒకటి, రెండు ట్రాక్‌లను అనుసంధానం చేస్తారు. 118.9 కిలోమీటర్ల ఈ రైలు మార్గం రెండో దశ పనులు 2026 నాటికి అందుబాటులోకి వస్తాయి అని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రింగ్ ట్రాక్ మాధవరంలో ప్రారంభమై కోయంబేడు, షోళింగనల్లూరు, అడయారు మీదుగా మళ్లీ మాధవరం వరకు చేరుకుంటుంది. గంటకు ఏడు రైళ్ల చొప్పున ప్రతి 8.5 నిమిషాలకు ఒక రైలు అందుబాటులోకి వస్తుంది. ఐదవ ట్రాక్‌లో పెరుంబాక్కం నుంచి మూడవ ట్రాక్‌లో ఉన్న పెరంబూరుకు లేదా మూడవ ట్రాక్‌లోని తరమనై నుంచి ఐదవ ట్రాక్‌లోకి మారి రింగ్ ట్రాక్‌లో ప్రయాణించవచ్చు. ఈ రింగ్ ట్రాక్‌లో ని రైళ్లు పోరూరు జంక్షన్ నుంచి పెరుంగుడి లేదా కారపాక్కం, ఓఎంఆర్ రోడ్డులోని రైల్వేస్టేషన్‌కు ఒకే రైల్లో ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. తద్వారా ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. రెండవ ట్రాక్‌లో విస్తరణ పనుల ప్రణాళిక ప్రకారం మూడో ట్రాక్ ద్వారా మాధవరం నుంచి మాధవరం బస్ టెర్మినల్ వరకు 5,171 మంది ప్రయాణికులు, మాధవరం బస్ టెర్మినల్ నుంచి ఐదవ ట్రాక్‌లోని షోళింగనల్లూరు వరకు 35,714 మంది ప్రయాణించగలరని అంచనావేశారు. కొత్తగా నిర్మించే మూడో మార్గంలో కూడా వేరు వేరుగా రైళ్లను నడుపుతారు. ఇందువల్ల 2055 నాటికి మాధవరం, షోళినంగనల్లూరు నుంచి 3.5 నిమిషాలకు ఒక రైలు నడపగల సామర్థ్యం సమకూరుతుంది. ఈ మార్గాల్లో సుమారు 3 బోగీలు గలిగిన 21 రైళ్లు, 2025 నాటికి 6 బోగీలు కలిగిన 15 రైళ్లు, అలాగే 6 బోగీలు కలిగిన 37 రైళ్లను నడపాలని తీర్మానించుకున్నట్టు అధికారులు తెలిపారు. -
కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. కోయంబేడులోని తమ ప్రధాన కార్యాలయంలో పుట్ ఆపరేటెడ్ లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ లిఫ్ట్‌లోకి ప్రవేశించిన తర్వాత చేతులతో లిఫ్ట్‌ను తాకకుండా పాదరక్షల సాయంతో ఆపరేట్ చేసే వీలుండటంతో.. తద్వారా వైరస్ సంక్రమించే అవకాశాన్ని కొద్దివరకు తగ్గించవచ్చని సీఎంఆర్ఎల్ భావిస్తోంది. సీఎంఆర్ఎల్ చొరవ తీసుకొని ఇటువంటి లిఫ్ట్‌ను ఏర్పాటు చేసిన మొదటి మెట్రో రైలుగా అవతరించింది. చదవండి: తొమ్మిదేళ్లుగా మెతుకు ముట్టడు రాబోయే రోజుల్లో అన్ని మెట్రో స్టేషన్లలోని లిప్టులలో కూడా ఇలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. లాక్డౌన్ కాలంలో 25శాతం మంది సిబ్బందితో కొన్ని పనులను నిర్వహించడానికి స్టేషన్లను తెరచి ఉంచారు. కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 618 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత 24 గంటల్లో మహమ్మారి బారినపడి 9 మంది మరణించారు. ఇక కోవిడ్-19 నుంచి కోలుకుని 11,313 మంది డిశ్చార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. పరీక్షల సంఖ్య పెరగడం, జనాభా సాంద్రత పెరగడం వంటి కారణాల వల్ల అధిక కేసులు నమోదవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి: నా సహ భారతీయుడా: ప్రధాని మోదీ Chennai Metro's foot operated lift towards contactless operations to check the spread of virus. The agency plans to install this in Metro stations as well. @ndtv pic.twitter.com/tBCfwd7Jqp — J Sam Daniel Stalin (@jsamdaniel) May 30, 2020 -
హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు
-
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్
-
మెట్రో ప్రయాణికుడిని చెంపదెబ్బ కొట్టిన స్టాలిన్
మెట్రో రైలులో తొలిసారి ప్రయాణం చేసిన డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్.. అక్కడ ఓ ప్రయాణికుడిపై చేయిచేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి మెట్రో రైలు ఎక్కిన స్టాలిన్.. అక్కడ ఉన్న ప్రయాణికులను అడ్డు జరగాలని అన్నారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడిని పక్కకు జరగాలని కాస్త గట్టిగా చెప్పగా, అతడు అందుకు తిరస్కరించాడు. దాంతో స్టాలిన్ అతడిని వెంటనే చెంపదెబ్బ కొట్టారు. స్టాలిన్ చేసిన ఈ నిర్వాకాన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. డీఎంకే నాయకుడి తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా, తాను ప్రయాణికులతో మాట్లాడానని, వాళ్లలో ఎక్కువ మంది మెట్రో చార్జీ తగ్గించాల్సిందిగా కోరారని స్టాలిన్ అన్నారు. మెట్రో రైళ్లు రావడం వల్ల రోడ్ల మీద వాహనాల రద్దీ తగ్గుతుందని, ప్రయాణ సమయం కూడా బాగా తగ్గుతుందని ఆయన చెప్పారు. -
మెట్రో రైలుకు మహిళా డ్రైవర్
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరానికి ప్రతిష్ఠాత్మక మెట్రోరైలును ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు జెండా ఊపి ప్రారంభిస్తే.. నగరానికి చెందిన ఓ నవయువతి ఈ మొట్టమొదటి రైలుకు మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా ఆవిష్కృతమయ్యారు. చెన్నై ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన ప్రీతి (28) రైలు డ్రైవర్ కావాలని కలలు కంది. దీని కోసం ఢిల్లీలో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురు యువతులు పోటీలో ఉండగా చివరకు ఈ అవకాశాన్ని ప్రీతి దక్కించుకుంది. అలందూర్ స్టేషన్ నుంచి కోయంబేడు వరకు ప్రీతి డ్రైవర్‌గా వ్యవహరించారు. దీనిపై ప్రీతి తండ్రి అన్బు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి కష్టపడి, చివరకు తన కలను సాకారం చేసుకుందంటూ మురిసిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతులుమీదుగా చెన్నై నగరానికి మొట్టమొదటి మెట్రో రైలు సోమవారం ఉదయం పట్టాలెక్కింది. తమిళనాడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పచ్చజెండా ఊపారు. మెట్రో సొబగులతో మెరిసిపోయిన ఆనందూర్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మొట్టమొదటి మెట్రో రైల్లో ప్రయాణం చాలా గొప్పగా ఉందన్నారు.