Alstom bags order worth Rs 798 crore to manufacture 78 coaches for Chennai Metro
Sakshi News home page

ఆల్‌స్తోమ్‌కు చెన్నై మెట్రో ఆర్డర్‌

Published Sat, Nov 12 2022 9:11 AM | Last Updated on Sat, Nov 12 2022 11:51 AM

Alstom Won A Contract Worth Rs 798 To Design, manufacture For Chennai Metro - Sakshi

న్యూఢిల్లీ: రోలింగ్‌ స్టాక్‌ తయారీలో ఉన్న ఫ్రెంచ్‌ దిగ్గజం ఆల్‌స్తోమ్‌కు తాజాగా చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ నుంచి ఓ కాంట్రాక్ట్‌ను చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ రూ.798 కోట్లు. ఇందులో భాగంగా 78 అత్యాధునిక మెట్రో కోచ్‌లను చెన్నై మెట్రోకు ఆల్‌స్టమ్‌ సరఫరా చేయనుంది. వీటిలో 26 యూనిట్లు (త్రీ–కార్‌ కాన్ఫిగరేషన్‌) కూడా ఉన్నాయి. ఇవి గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఈ మెట్రో ట్రెయిన్స్‌ డ్రైవర్లు లేకుండానే పూర్తిగా సిగ్నల్స్‌ ఆధారంగా నడుస్తాయి. ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఆల్‌స్టమ్‌ ప్లాంటులో మెట్రో కార్స్‌ తయారు కానున్నాయి. ఏటా 480 యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కేంద్రం ప్రత్యేకత. చెన్నై మెట్రోకు ఇప్పటికే 208 మెట్రో కార్స్‌ను ఆల్‌స్టమ్‌ సరఫరా చేసింది. ఢిల్లీ, చెన్నై, లక్నో, కొచ్చి నగరాల్లో సంస్థ తయారీ మెట్రో ట్రెయిన్స్‌ పరుగెడుతున్నాయి. ముంబై మెట్రో లైన్‌–3, ఆగ్రా–కాన్పూర్‌ మెట్రో, ఇందోర్‌–భోపాల్‌ ప్రాజెక్టులకు కావాల్సిన మెట్రో కోచ్‌లు ప్రస్తుతం తయారీలో ఉన్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement