చెన్నైను మళ్లీ వణికిస్తున్న వర్షం
చెన్నై: చెన్నై నగరాన్ని మళ్లీ వర్షం వణికిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లుగానే శుక్రవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాయపేట, మౌంట్ రోడ్, తాంబరం, మైలాపూర్, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ వర్షం పడటంతో నగరవాసులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు.
చెన్నై మహానగరం ఇంకా ముంపు లోనే మగ్గుతోంది. మరోవైపు కోయంబేడు బ్రిడ్జ్ దగ్గర ప్రమాద స్థాయిని దాటి నీరు ప్రవహిస్తోంది. ఇక నిత్యావసరాల కోసం జనాలు రోడ్లపై బారులు తీరుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలు, మంచినీళ్లు దొరక్క జనాలు అవస్థలు పడుతున్నారు. అలాగే ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ...చెన్నైలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న 72,119 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.