
సాక్షి, చెన్నై : నగరంలోని కోయంబేడు బస్టాండ్‌లో శనివారం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేందుకు నిలిచి ఉన్న బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చేశారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో కోయంబేడులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
Comments
Please login to add a commentAdd a comment