Bus fire accident
-
స్కూల్ బస్సుకు మంటలు..
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్‌కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్‌ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. -
తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం
-
మహారాష్ట్ర బస్సు ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు. Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi — PMO India (@PMOIndia) July 1, 2023 అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు. ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి.. -
ఆరెంజ్ ట్రావెల్స్: రెండు బస్సులు దగ్ధం
హైదరాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రైవేట్ బస్సులు షార్ట్ సర్య్కూట్ కారణంగా దగ్ధమైన సంఘటన శుకవ్రారం చోటు చేసుకుంది. బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైన సంఘటన కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారణంగా బాలానగర్ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మదీనాగూడ చౌరస్త్తాలో.. మియాపూర్: కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం మధ్యాహ్నం బీరంగూడ నుంచి కూకట్పల్లి వైపు వస్తుండగా మదీనాగూడ ప్రాంతంలో బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన స్థానికులు, వాహనదారులు బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో అతను బస్సును జాతీయ రహదారి పక్కన ఆపి ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. -
18 మందితో వెళ్తున్న మినీ బస్‌లో మంటలు.. క్షణాల్లో..!
లఖ్‌నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. #Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP — Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022 ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం -
మంటల్లో బస్సు.. వరద బాధితుల సజీవ దహనం
కరాచీ: పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి సమయంలో ఓ రన్నింగ్ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా వరద బాధితులుగా నిర్ధారణ అయ్యింది. సింధ్ ప్రావిన్స్ కరాచీ-హైదరాబాద్-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9 మోటర్‌వేపై ఈ ఘోరం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 17 మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో పది మంది కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు హెల్త్ సెక్రెటరీ సిరాజ్ ఖ్వాసిం వెల్లడించారు. దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులకు వేరే చోట తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో వాళ్లను తిరిగి స్వస్థలానికి ప్రైవేట్ బస్సులో తీసుకొస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
కాకినాడ ఇంద్ర ఏసీ బస్‌లో అనూహ్యంగా మంటలు ...
-
కాకినాడలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ నుంచి విజయవాడ వెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర ఏసీ బస్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. జిల్లా పరిషత్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్ ఇంజిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పి ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటల కారణంగా బస్సులో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో బస్సు సగం వరకు కాలిపోయింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు తరలించారు. -
రోడ్డు ప్రమాదం: బతుకు జీవుడా..!
రాయగడ: ప్రయాణికులతో వస్తున్న ఓ ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న వారంతా హాహాకారాలు చేస్తూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిందికి దిగి ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక హలువ గ్రామానికి సమీపంలో గల తరణి మందిరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సుమారు 1.30 గంటలకు ప్రయాణికులతో వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో అగ్నికీలలు చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ పూర్తిగా కాలిబూడిదైంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ నుంచి గంజాం జిల్లాలోని పొలసరకు వెళ్తున్న బొర్షా పేరుగల ప్రైవేట్ బస్సు 42 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కొశాగుమడలో బయలు దేరింది. రాయగడకు చేరేందుకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉండగా హలువా గ్రామానికి దగ్గర గల తరణి మందిరం వద్ద అర్ధరాత్రి 1.30 గంటలకు ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రయాణికులు హెచ్చరించినా.. కొశాగుముడ నుంచి బయలు దేరిన బస్సు రాయగడకు సుమారు 43 కిలోమీటర్ల దూరంలో గల కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ చేరేసరికి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పటికే బస్సు వెనుక నుంచి ఏదో కాలుతున్న వాసన వస్తోందని ప్రయాణికులు డ్రైవర్‌కు చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా బస్సును పోనిచ్చాడు. దీంతో తరణి మందిరం వద్దకు చేరేసరికరి బస్సు వెనుక టైరు పేలిపోయింది. అనంతరం మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణభయంతో బయటకు వచ్చేశారు. ఇంతలో బస్సులో మంటలు ఎక్కువ కావడంలో ప్రయాణికులు వారి లగేజీ తీయలేకపోయినా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బస్సు నుంచి బయట పడ్డారు. సంఘటన జరిగిన తరువాత డ్రైవర్ పరారయ్యాడు. చుట్టుపక్కల గల గ్రామస్తులు చేరుకుని విషయాన్ని ప్రమాద విషయమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అరగంట తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు అందులొ గల ప్రయాణీకుల సామాన్లు,లగేజీలు కాలిబూడిదయ్యాయి. అనంతరం పొలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో వాహనంలో రాయగడకు తరలించారు. పొలీసులు కేసు నమెదు చేశారు. -
బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. ఐజీ డాక్టర్ అఫ్తాబ్ పఠాన్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 13 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో ఐదుగురి పరస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాలిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని' పోలీసులు వెల్లడించారు. -
అగ్నికీలల్లో ఆర్తనాదాలు
సాక్షి, బళ్లారి: బస్సు బెంగళూరుకు పరుగులు తీస్తోంది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో బస్సులో అగ్నికీలలు. కొందరికి మెలకువ వచ్చి బస్సులో నుంచి దూకేశారు. డ్రైవర్ బస్సును నిలిపేసి పారిపోయాడు. డ్రైవర్ వెనుక సీట్లో ›కూర్చున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన కవిత(28), ఆమె అక్క శీలా (33), వారి ముగ్గురు పిల్లలు స్పర్శ (8), సమృద్ధి(5), నిశ్చిత(3)లు మంటల్లో చిక్కి సజీవ దహనమయ్యారు. ఈ హృదయవిదారక ఘటన చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా కేఆర్‌హళ్లి వద్ద జాతీయ రహదారిలో బుధవారం తెల్లవారుజామున 3–4 సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. విజయపుర(బీజాపూర్) నుంచి బెంగళూరుకు వెళ్తున్న కుక్కేశ్రీ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో చిక్కుకుంది. పై ఐదుగురి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. ఈ ఘటనలో మరో 27 మంది తీవ్రంగా గాయపడటంతో చిత్రదుర్గ, హిరియూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కవిత, ఎస్పీ రాధికలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిద్రలోకి జారుకొన్న వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు వీలుకాకపోగా ముగ్గురు చిన్నారులు కావడం వల్ల వారికి ఏం జరుగుతోందో తెలియక క్షణాల్లో కాలిబూడిదయ్యారు. బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం తాండవించింది. -
బతుకు జీవుడా..!
ఒక్కసారిగా పెద్ద కుదుపుతో బస్సు ఆగింది.. నిద్దట్లోనే ఒకరిపై ఒకరు పడ్డ ప్రయాణికులకు కాసేపు ఏమైందో అర్థం కాలేదు.. చుట్టూ అంధకారం.. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడివున్నాయి. ప్రమాదం జరిగిందని తెలుసుకొని బిలబిలమంటూ దిగిపోయారు.. ఆ షాక్ నుంచి తేరుకొని సామాన్లు తెచ్చుకొనేలోపే కళ్ల ముందే బస్సు దగ్ధమైంది. ఆకాశాన్నంటిన అగ్ని కీలలను చూసి వారెవరికీ నోట మాట రాలేదు. రణస్థలం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బస్సులోనివారంతా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వస్తున్న టూరిస్టులు. మార్గమధ్యంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. రణస్థలం: రోడ్డు ప్రమాదం ఒక షాక్.. మంటల్లో బస్సు దగ్ధం మరో షాక్.. అంతసేపు తాము ప్రయాణించిన వాహనమేనా ఇలా కాలి బూడిదైందని తలచుకుంటేనేఒళ్లు గగుర్పొడిచే సంఘటన అది.. అదృష్టం బాగుండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజలు వెంటనే సహాయ చర్యలందించడంతో వారు కాస్తంత తేరుకున్నారు.. అయితే సామాన్లన్నీ కాలిబూడిద కావడంతో ఊరుకాని ఊరిలో కట్టుబట్టలతో మిగిలారు. ఉత్తరాఖండ్ వాసులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదివారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో దగ్ధమైంది. ముందు వెళుతున్న వరిశాం శ్యాం పిస్టన్స్ పరిశ్రమకు చెందిన బస్సు హఠాత్తుగా కుడివైపునకు మలుపు తిరగడంతో వెనుక వేగంగా వస్తున్న టూరిస్టు బస్సును గుద్ది అవతల రోడ్డులో ఉన్న అమ్మోనియం లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 45మంది ఉన్నారు. నిద్దట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడి లేచి బస్సు దిగిపోయారు. ఇంతలో షార్ట్‌సర్క్యూట్ అయి బస్సు వారి కళ్ల ముందే పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులంతా చకచకా బస్సు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడ్డ కొద్దిమంది పర్యాటకులు, శ్యాం పిస్టన్స్ ఉద్యోగులు, లారీ డ్రైవర్‌కు లావేరు, రణస్థలం నుంచి వచ్చిన 108 వాహనాల్లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అరబిందో పరిశ్రమ, ప్రభుత్వ అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేశాయి. హిందీలో ఆర్తనాదాలు ప్రమాదం జరిగిన వెంటనే హిందీలో ఆర్తనాదాలు వినిపించాయి. బస్సు యాక్సిడెంట్ యువా.. బస్సు జల్ గయ్... తూరంత్ బహార్ ఉతరో... ఉతరో (బస్సుకు ప్రమాదం జరిగింది. వెంటనే బయటకు దిగిపోండి) అంటూ హాహాకారాలతో ఉత్తరాఖండ్‌వాసులు బస్సు దిగిపోయారు. కొద్దికొద్దిగా మంటలు వ్యాపిస్తుండగా బస్సులో ఉన్న 45 మంది ఎమర్జన్సీ గేటు, ప్రధాన గేటు నుంచి బట్టలు, బ్యాగులు వదిలేసి హడావుడిగా దిగిపోయారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బస్సు ఏర్పాటు చేసి టూరిస్టులను విశాఖ పంపించింది. అక్కడి నుంచి వారు రైలు తదితర రవాణా సాధనాల ద్వారా స్వస్థలానికి వెళతారు. నెల రోజులపాటు కాశీ, పూరి, రామేశ్వరం, కన్యాకుమారి వంటి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులు రెండు బస్సుల్లో బయలుదేరారు. అందులో ఒక బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడినప్పటికీ డబ్బులు, ఏటీఎం కార్డులతో సహా సామాను దగ్ధం కావడంతో టూరిస్టులు కట్టుబట్టలతో మిగిలారు. అధికారులు, స్థానికుల చొరవకు ప్రశంసలు సంఘటన జరిగిన వెంటనే పోలీసు అధికారులు సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై అశోక్‌బాబు, ఫైర్ అధికారులు, ఆర్డీవో ఎం.వి.రమణ, తహసిల్దార్ ఎం.సుధారాణి స్పందించారు. స్థానిక మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్, గ్రామ పెద్దలు, అరబిందో యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానికులు టూరిస్టులకు సపర్యలు చేశారు. సకాలంలో స్పందించి భోజనాలు, తాగునీరు, టూరిస్టులు విశాఖపట్నం వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సమస్తం బూడిదైంది... నెల రోజులపాటు దైవ క్షేత్రాలు తిరిగేందుకు సుఖియాంచల్ ట్రావెల్స్ తో మాట్లాడుకున్నాం. పూరి చూసుకొని వస్తున్నాం. ప్రస్తుతం రామే శ్వరం వెళుతున్నాం. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దుస్తులు, నగదు, ఆధార్, పాన్‌కార్డులు, ఏటీఎం కార్డులు సమస్త కాలిపోయాయి. తిరిగి వెళ్లేందుకైనా డబ్బులు లేవు. – రావత్ బహుగుణ్, టూరిస్టు -
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. రెండు బస్సులు దగ్ధం
సాక్షి, చెన్నై : నగరంలోని కోయంబేడు బస్టాండ్‌లో శనివారం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివిధ రాష్ట్రాలకు, జిల్లాలకు వెళ్లేందుకు నిలిచి ఉన్న బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు వ్యాపించకుండా చేశారు. కానీ అప్పటికే రెండు బస్సులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. దీంతో కోయంబేడులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. -
నారాయణ కాలేజీ బస్సులో మంటలు
ఏలూరు టౌన్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటరులో నారాయణ విద్యా సంస్థల కళాశాల బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో బస్సులోని విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. విద్యార్థులను ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ కొద్ది దూరం వెళ్లగానే బస్సులో ఆకస్మాత్తుగా మంటలు రావడంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ బస్సును ఆపాలంటూ డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును నిలిపివేశారు. వెంటనే విద్యార్థులు కిందకు దూకి రోడ్డుపైకి పరుగులు తీశారు. కూతవేటు దూరంలోనే జిల్లా అగ్నిమాపక కార్యాలయం ఉండటంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సంఘటన జరిగిన బస్సులో 30 మంది కళాశాల విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది బస్సు వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై కళాశాల యాజమాన్యం, ఫిట్నెస్ లేకుండానే బస్సుకు అనుమతులిచ్చిన రవాణాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
మార్చురీ వద్దే పడిగాపులు
ఉస్మానియా ఆస్పత్రి వద్ద బస్సు దుర్ఘటన మృతుల బంధువుల నిరీక్షణ గుర్తించిన మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకోలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందినవారికి సంబంధించిన వివరాలుగానీ, మృతుల వస్తువులకు సంబంధించిగానీ ఏదైనా వివరాలు కావాలంటే హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో గానీ, ఉస్మానియా ఆస్పత్రిలోని పోలీస్ హెల్ప్‌లైన్ కేంద్రంలోగానీ సంప్రదించాలని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. మరోవైపు.. కొందరు మృతుల బంధువులు శుక్రవారం ఉస్మానియా మార్చురీ వద్దకు తరలివచ్చారు. దీంతో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం అయిన వారి దుఃఖంతో కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువులు కొందరు రెండు రోజుల నుంచీ మార్చురీ వద్దే నిరీక్షిస్తున్నారు. ఆభరణాలు, వస్తువులను బట్టి తమవారి మృతదేహాలను గుర్తించామని, వాటిని తమకు అప్పగించాలని విన్నవిస్తూనే ఉన్నారు. కాగా.. అఫ్జల్‌గంజ్ పీఎస్‌ను నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశామని, మృతదేహాలు ఆస్పత్రి మార్చురీలో ఉన్నా అవి పోలీసుల అధీనంలోనే ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో 42 మృతదేహాలున్నాయని, వాటిని కోడ్ నంబర్లతో భద్రపరిచామని పేర్కొన్నారు. మృతదేహాల శాంపిళ్లకు, బంధువుల డీఎన్ఏ నమూనాలు సరిపోలి.. పోలీసులు అనుమతించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామన్నారు. వైద్య విద్య డెరైక్టర్ ఈ మృతదేహాలకు సంబంధించిన నివేదికను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు. కాగా.. గురువారం 41 మంది మృతులకు సంబంధించిన బంధువులు వారి డీఎన్ఏ నమూనాలు ఇవ్వగా... మిగతా ఒక్క మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్లాస్ కాంట్రాక్టర్ అజయ్ చౌహాన్ సోదరుడు వినోద్ చౌహాన్ శుక్రవారం డీఎన్ఏ శాంపిల్ ఇచ్చారు. దీంతో డీఎన్ఏ నమూనాల సేకరణ ముగిసినట్లు మహబూబ్‌నగర్ ఓఎస్డీ ఆపరేషన్స్ బి.కమలాకర్‌రెడ్డి ప్రకటించారు. డీఎన్ఏ పరిశీలన నివేదిక రావడానికి వారం రోజులకు పైనే పడుతుందని, ఆ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ విజయకుమార్ రాజు పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించిన అనంతరం తామే బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇస్తామని, స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. వారం రోజులు ఎక్కడుండాలి..? బస్సు దుర్ఘటనలో మరణించిన అజయ్ చౌహాన్ మృతదేహం కోసం వచ్చిన ఆయన సోదరుడు వినోద్ చౌహాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన మృతదేహాన్ని ఇచ్చేవరకూ ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అజయ్ మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలిసింది. డీఎన్ఏ పరీక్షల కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాను. కూలి పనులు చేసుకుని జీవించే వాళ్లం. మృతదేహాన్ని ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. అంతవరకు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. ప్రభుత్వాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు’’ అని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. నిలకడగా క్షతగాత్రుల ఆరోగ్యం.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో యోగేష్ గౌడ ఆరోగ్యం మెరుగుపడినట్లు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సమి తెలిపారు. ఆయనకు అమర్చిన వెంటిలేటర్‌ను శుక్రవారం ఉదయం తొలగించామని, ఆయన స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. ఇక ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన జైసింగ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. క్లీనర్ అయాజ్పాషాతో పాటు క్షతగాత్రులు శ్రీకర్, రాజేష్, మజార్పాష ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.