20 మంది విద్యార్థులు సహా 23 మంది ఆహుతి
థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో ఘటన
బ్యాంకాక్: విహార యాత్రకు పాఠశాల విద్యార్థులు, టీచర్లతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ విషాద ఘటనలో 20 మంది విద్యార్థులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ శివారులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సెంట్రల్ ఉథ్థాయ్ థని ప్రావిన్స్‌కు చెందిన స్కూల్ విద్యార్థులు, టీచర్లు కలిపి మొత్తం 44 మందితో అయుథ్థయ, నొంతబురి ప్రావిన్స్‌ల్లో విహారయాత్రకు బస్సులో బయలుదేరారు.
నొంతబురి వైపు వెళ్తుండగా బస్సు ముందు టైరు పగిలి, అదుపుతప్పి రోడ్డుపక్క రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి, అందులోని 20 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు ఆహుతయ్యారు. గాయపడిన ముగ్గురు విద్యార్థులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై దర్యాప్తు ముగిశాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment