ఫైల్ ఫోటో
కరాచీ: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. ఐజీ డాక్టర్ అఫ్తాబ్ పఠాన్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 13 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో ఐదుగురి పరస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాలిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. (ఘోర రోడ్డు ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి)
హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని' పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment