ముంబై: శనివారం తెల్లవారు జామున సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద ఒక ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో మొతం 33 మంది ప్రయాణిస్తుండగా వారిలో 26 మంది మృతి చెందగా 7 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. హైవే మీద వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు బుల్దానా ఎస్పీ సునీల్ కందసానే. గాయపడిన వారిని బుల్దానాలోని సివిల్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యావత్మాల్ నుండి పూణే వెళ్తున్న బస్సు బుల్దానా జిల్లాలోకి ప్రవేశించగానే భారీ శబ్దం చేస్తూ బస్సు టైర్ ఒకటి పేలిపోయింది. దాంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది. వెంటనే డీజిల్ ట్యాంక్ నుండి అగ్నికీలలు ఎగసి క్షణాల్లో బస్సు మొత్తాన్ని ఆవహించేశాయి. ప్రయాణికులంతా గాఢమైన నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో వారికి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది.
బుల్దానాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుంటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులుబాధితులకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందన్నారు. ప్రమాదంలో మరణించవారి కుటుంబ సభ్యులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపారు.
Deeply saddened by the devastating bus mishap in Buldhana, Maharashtra. My thoughts and prayers are with the families of those who lost their lives. May the injured recover soon. The local administration is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2023
అయితే తెల్లవారుతూనే వెలుగులోకి వచ్చిన ఈ వార్త గురించి తెలియగానే రహదారి నిర్మాణంపైనా, భద్రత పైనా చర్చ లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలకు స్పందిస్తూ.. ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం నాణ్యత గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు. మృతుల కుటుంబాలను ఆదుకోవడమే తమ తక్షణ కర్తవ్యమని అన్నారు.
ఈ ప్రమాదంలో 26 మంది చనిపోయారు, ఏడుగురు గాయపడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, మృతుల వివరాలు తెలియకుంటే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. డెప్యూటీ సీఎం. ప్రమాదం మానవతప్పిదం వలన జరిగిందా? లేక సాంకేతిక లోపం వలన జరిగిందా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, వీలయితే స్మార్ట్ సిస్టమ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. కేంద్రం కూడా ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: రైల్వే పోలీసు అమానుషం.. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోసి..
Comments
Please login to add a commentAdd a comment