
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 40మంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పూణె - ముంబయి జాతీయ రహదారిపై బోర్‌ఘాట్ వద్ద సోమవారం ఉదయం ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి గోతిలోకి దూసుకువెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని వెలికి తీశారు. మరోవైపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సును డ్రైవర్ అదుపు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment