
లఖ్‌నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
#Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP
— Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022
ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
Comments
Please login to add a commentAdd a comment