Mini bus
-
విహార యాత్రలో విషాదం
-
బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...
బన్సీలాల్‌పేట్: అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు బైక్‌పై వెళ్తున్న బావబామ్మర్దులను మృత్యురూపంలో వచ్చిన మినీ బస్సు(స్వరాజ్ మజ్దా) కబళించింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు సీఐ రాజు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సూరగాయని యజ్ఞ నారాయణ (25) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. వాషింగ్ మిషన్ మెకానిక్‌గా పనిచేస్తూ పద్మారావునగర్ గంగపుత్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కెమెరామెన్‌గా పనిచేసే అతని బావమరిది కూరేటి సాయిపవన్ (32) గుంటూరు నుంచి అతన్ని కలిసేందుకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీలో ఉండే చీకటి సుబ్రమణ్యంతో కలిసి వీరు బిర్యానీ తినడానికి పల్సర్ బైక్‌పై ముషీరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ హోటల్ మూసివేసి ఉండడంతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న హోటల్‌కు వెళదామని బయలుదేరారు. కవాడిగూడ హోటల్ మారియెట్ చౌరస్తా వద్దకు రాగానే..అదే సమయంలో లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి వేగంగా వచి్చన మినీ బస్సు సిగ్నల్‌ను దాటేసి ముందువెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో యజ్ఞ నారాయణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సాయిపవన్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్రమణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీబస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. సుబ్రమణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
18 మందితో వెళ్తున్న మినీ బస్‌లో మంటలు.. క్షణాల్లో..!
లఖ్‌నవూ: 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సులో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు చెలరేగటాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యూపీలోని గ్రేటర్ నోయిడా నుంచి నోయిడాకు వస్తున్న క్రమంలో మినీ బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులోంచి మంటలు, నల్లటి పొగ వస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగటంతో నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. #Noida एक्सप्रेसवे पर एक मिनी बस में आग लग गई । हादसे के वक्त बस में 18 यात्री सवार थे जिन्होंने बस से कूद कर खुद की जान बचाई । थाना एक्सप्रेसवे के इलाके में पंचशील अंडर पास के नजदीक बस में आग लगी । बस ग्रेटर नोएडा से नोएडा की तरफ आ रही थी #Video pic.twitter.com/4AsqCp3RcP — Amit Choudhary (@amitchoudhar_y) November 6, 2022 ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం -
Poonch Accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం
శ్రీనగర్: ఘోర రోడ్డు ప్రమాదంతో జమ్ము కశ్మీర్ నెత్తురోడింది. బుధవారం ఉదయం పూంచ్ దగ్గర సావ్జియన్ ప్రాంతంలో ఓ మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అక్కడ భీతావాహ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలుకాగా.. పాతిక మందికి పైగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వాళ్లను మండీ ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు మండీ తహసీల్దార్ షెహ్జాద్ లతిఫ్ వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం మండీ నుంచి సౌజియాన్‌కు వెళ్లాల్సిన మినీబస్సు మార్గం మధ్యలో లోయలోకి దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులతో పాటు ఆర్మీ రంగంలో దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. ఘటన గురించి తెలియగానే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మరోవైపు కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. 11 die, 25 injured in minibus accident in J-K's Poonch Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident pic.twitter.com/15QBXiGwq8 — ANI Digital (@ani_digital) September 14, 2022 Jammu & Kashmir | A mini-bus accident occurred in the Sawjian area of Poonch. Army's rescue operation is underway; 9 deaths reported, many injured shifted to a hospital in Mandi. Further details awaited: Mandi Tehsildar Shehzad Latif pic.twitter.com/NMFhtuK5lj — ANI (@ANI) September 14, 2022 The loss of lives in a tragic road accident in Sawjian, Poonch is deeply distressing. My thoughts and prayers are with the bereaved families. I wish speedy recovery of the injured. — President of India (@rashtrapatibhvn) September 14, 2022 -
ప్రయాణికులకు ఊరట.. లష్కర్లో మినీ బస్సులు.. టికెట్ రూ.5
సాక్షి, హైదరాబాద్: నిత్యం జనసమ్మర్థం.. వాహనాల రద్దీతో పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులకు అతి పెద్ద ఊరట లభించనుంది. రైల్వేస్టేషన్‌కు నాలుగు వైపులా ఉన్న బస్టాపులను అనుసంధానం చేస్తూ మినీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేశారు. కేవలం రూ.5 టికెట్‌తో ప్రయాణికులు ఒక బస్టాపు నుంచి మరో బస్టాపు వరకు వెళ్లవచ్చు. అనుసంధానం ఇలా.. కేవలం రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ఆయా బస్టాపుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ప్రయాణికులు నడక దారిలో అవస్థల పాలవుతున్నారు. ఆటోల్లో వెళ్లాలంటే కొద్దిపాటి దూరానికే రూ.50 నుంచి రూ.100 వరకు చెల్లించుకోవాల్సి వస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న బస్టాపుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఘట్కేసర్, బోడుప్పల్ వైపు నుంచి వచ్చి చిలకలగూడ చౌరస్తాలో దిగి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వెళ్లే ప్రయాణికులకు వెసులుబాటు కలగనుంది. మల్కాజిగిరి, ఈసీఐఎల్ వైపు నుంచి వచ్చే బస్సులు బ్లూసీ హోటల్ ఎదురుగా ఉన్న బస్టాపులకే పరిమితం. అక్కడ దిగిన వాళ్లు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలన్నా, చిలకలగూడ క్రాస్‌రోడ్‌కు వెళ్లాలన్నా ఒకటిన్నర కిలోమీటర్ నడవాలి. అల్వాల్, బోయిన్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, పటాన్చెరు, తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు సికింద్రాబాద్ గురుద్వారాకే పరిమితం. ఇక్కడ దిగి అటు బ్లూసీ వైపు, ఇటు చిలకలగూడ వైపు వెళ్లేవారికి ఊరట లభిస్తుంది. చదవండి: హైదరాబాద్ మెట్రో: టికెట్ ధరలు పెంపునకు సంకేతాలు -
రోజూ 45 వేల మంది భక్తులు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ఉద్ఘాటన ఉత్సవాలు జరిగే సమయంలో రోజూ 45 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం 75 మినీ బస్సులను కొండపైకి నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోజూ తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బస్సులు సేవలందిస్తాయి. జేబీఎస్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి ప్రత్యేక బస్సులు సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి పికెట్ డిపోకు చెందిన ఆరు బస్సులను నేరుగా యాదాద్రి కొండపైకి నడపనున్నారు. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు మీదుగా ఏసీ వజ్ర బస్సుల్లో కూడా భక్తులను కొండపైకి చేర్చనున్నారు. ఇక యాదగిరిగుట్ట– భువనగిరి నుంచి నిరంతరం భక్తుల కోసం బస్సులు అందుబాటులో ఉంటాయి. కాగా, వివిధ ప్రాంతాలనుంచి వచ్చే ఇతర డిపోల బస్సులు పాత బస్టాండ్‌లో భక్తులను దించుతాయి. అక్కడనుంచి నేరుగా కొండపైకి వెళ్లేందుకు మినీ బస్సులు సిద్ధంగా ఉంటాయి. ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో కొండపైకి ఆటోలు, ప్రైవేట్ వాహనాలను బంద్ చేయనున్నారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు సైతం పాత గోశాల సమీపంలో తమ వాహనాలను పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. 34 అడుగుల ధ్వజస్తంభం కిలో 780 గ్రాములతో స్వర్ణతాపడం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయంలో ఏర్పాటు చేసిన బంగారు ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. సుమారు 34 అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజ స్తంభానికి కిలో 780 గ్రాముల బంగారంతో తయారు చేసిన కవచాలను బిగించారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా «బలిపీఠం, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. -
మినీ బస్సులను అంబులెన్స్‌లుగా..
-
80లక్షల మినీ బస్సు దగ్ధం
షాద్‌నగర్‌రూరల్ : షాద్‌నగర్ పట్టణంలో మహరాజా దాబా వెనుక ఉన్న ఓ మెకానిక్ గ్యారేజీలో సోమవారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు, స్థానికు ల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా మహరాజా దాబా వెను క ఉన్న షెడ్లో వాహనాల రిపేరింగ్ గ్యారేజీని నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గ్యారేజీకి తాళం వెసి వెంకటేష్ ఇంటికి వెళ్లాడు. సోమ వారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు ఎసిగిపడ్డాయి. ప్రమాదంలో మరమ్మతుల కోసం వచ్చిన ప్రైవేట్ మినీ బస్సు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదు పు చేశారు. పోలీసులు ఘటన స్ధలాన్ని సందర్శిం చి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్యారేజీలో వాహనాలకు సంబంధించిన విలువైన ఇంజన్లు, గేర్ బాక్సులు, ఆయిల్ పూర్తిగా కాలిపోయాయని, వాటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు. అత్యాధునిక మినీ బస్సు.. కొత్తూరులోని ప్యాపరస్ పోర్టు రిసార్టు నిర్వాహకులకు చెందిన మినీ బస్సును గత ఆరు నెలల క్రితం మరమ్మతుల కోసం గ్యారేజీకి తీసుకొచ్చినట్లు గ్యారేజీ నిర్వాహకుడు వెంకటేష్ తెలిపారు. మరమ్మతులు చేసినా బస్సు యజమానులు వాహనాన్ని తీసుకెళ్ల లేదని, దీంతో ఆరు నెలలుగా బస్సు గ్యారేజీలోనే ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని, బస్సు సుమారు రూ. 80లక్షల వరకు ఉండవచ్చని, బస్సుల్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. -
పార్క్ చేసిన మినీ బస్సులో మంటలు
-
సైబర్ షటిల్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల సురక్షిత ప్రయాణంతో పాటు కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఇన్నాళ్లు పోలీసులు ఐటీ మహిళా ఉద్యోగుల కోసం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో కలసి షీ షటిల్ సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పోలీసులు.. ఎస్సీఎస్సీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) సహకారంతో ‘సైబర్ షటిల్’పేరుతో ఐటీ ఉద్యోగులందరూ ఉచితంగా ప్రయాణం చేసేలా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మూడు మినీ బస్సులను నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని వైఎస్ఆర్ భవన్ వద్ద టీఎస్ఐఐసీ సైబరాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వినోద్‌కుమార్‌తో కలసి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్ మహిళా ఉద్యోగుల కోసం నడిపే షీ షటిల్ బస్సులను రాచకొండ పరిధిలోనే కాకుండా వైజాగ్‌లో కూడా ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఎస్సీఎస్సీ సహకారంతో మూడు మార్గాల్లో ఉచితంగా మినీ బస్సు సేవలను అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ సేవలను రాబోయే రెండేళ్లలో 15 నుంచి 30 వరకు పెంచుతామన్నారు. త్వరలో మరిన్ని బస్సులు ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణికుమార్ అరోల్ మాట్లాడుతూ షీ షటిల్ ద్వారా అయిదు బస్సులు మహిళల కోసం, టీఎస్ఐఐసీ ద్వారా కొత్తగా నాలుగు బస్సులను ఐటీ కారి డార్లో నడుపుతున్నామన్నారు. బస్సుల వినియోగానికి నెలకు రూ.1.25 లక్షలు అవుతోందని, స్పాన్సర్ల సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. టీఎస్ఐఐసీ సైబరాబాద్ జోన్ జోనల్ కమిషనర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కేవలం ఐటీ కారిడార్లోనే నడిపేందుకు సర్వీసులు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ జయరామ్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్సీఎస్సీ సభ్యులు కృష్ణారావు, టీఎస్ఐఐసీ అధికారులు, ఎస్సీఎస్సీ ప్రతినిధులు, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇవే మార్గాలు...(సేవ సమయాలు ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 9) రూట్ ఏ : మాదాపూర్ ఠాణా, ఇమేజ్ హాస్పిటల్, సైబర్ టవర్స్, మైండ్‌స్పేస్ జంక్షన్, వీ పార్క్, ఐలాబ్స్/ఇనార్బిట్, మాదాపూర్ ఠాణా రూట్ బీ: హైటెక్ ఎంఎంటీఎస్, సైబర్ టవర్స్, కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, ఐసీఐసీఐ, వేవ్‌రాక్ రూట్ సీ: హఫీజ్‌పేట ఎంఎంటీఎస్, కొత్తగూడ, ఎస్ఎల్ఎన్ టెర్మినస్, గచ్చిబౌలి, ఐఐఐటీ జంక్షన్, విప్రో, విర్టుస సీఏ, క్యూ సిటీ -
భీమవరంలో మినీ బస్సు బోల్తా
-
మీసాలతో మినీ బస్సులాగాడు..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిపిరాలకి చెందిన ఎర్రబోయిన కొమురెల్లి యాదవ్ సోమవారం తన మీసాలతో సుమారు 100 మీటర్ల దూరం వరకు మినీ బస్సును లాగాడు. తొర్రూరులో మెకానిక్. ఈయన గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో తన మీసాలను పెద్దవిగా పెం చుకోవడం ప్రారంభించాడు. ఈ మీసా లతో 2012లో గ్యాస్ సిలిండర్, 2013లో మారుతీకారు, 2014లో రెండు మారుతీ కార్లను లాగాడు. ఈసారి ఏకంగా మినీ బస్సును సుమారు 100 మీటర్ల వరకు లాగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. లారీ వంటి పెద్ద వాహనాన్ని లాగడమే తన లక్ష్యమని చెప్పాడు. -
రూ.350 కోట్లతో 1400 కొత్త బస్సులు
⇒ మరో 236 మినీ బస్సులు ⇒ ప్రతి జిల్లా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ⇒ రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరిగి: రాష్ట్రంలో రవాణా శాఖను పటిష్టం చేస్తామని ఆ శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో గురువారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలో రూ. 350 కోట్లతో 1,400 బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మరో 236 మినీ బస్సులు.. వీటిలో 100 ఏసీ బస్సులు కొనుగోలు చేసి డిపోలకు అందజేస్తామన్నారు. రూ. 17 కోట్లతో సిరిసిల్లలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రూ.30 కోట్లతో రాష్ట్రంలో ఆర్టీఏ సొంతభవనాలు నిర్మిస్తామని రవాణ శాఖ రాష్ట్ర కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో ట్రాక్‌లు ఉండేలా చూస్తామన్నారు. గతంలో ఎక్కువ శాతం ఆర్టీఏ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగగా ప్రస్తుతం ముమ్మరంగా కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. -
వరద ప్రభవంతో నాలుగు రోజులుగా బస్సులోనే...
-
కాబూల్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి
కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సెక్యురిటీ గార్డ్స్ ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారు. పూల్-ఏ-చర్కి రోడ్లో సంభవించిన ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు ఆఫ్గన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొంత మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారీ శబ్దంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మృతి చెందిన వారు నేపాల్ సెక్యురిటీ గార్డ్స్ గా భావిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. బాంబులు ధరించిన ఓ వ్యక్తి బస్సు సమీపంలోకి కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు. -
పంజాబ్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 9 మంది మృతి
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో గురువారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కార్మికులను ఎక్కించుకుని వస్తున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది దుర్మరణం చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అమృత్‌సర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీస్ అధికారి జాశ్‌దీప్ సింగ్ శైనీ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో ‘నిర్భయ’ ఘోరం
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో ‘నిర్భయ’ ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటే శివారులోని హసిగళలో ఉంటూ ఓ ప్రైవేటు క్లినిక్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతోంది. రోజు లాగానే గురువారం ఉదయం 7:30కు ఆమె ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లడానికి హసిగళ గ్రామంవద్ద మినీ బస్సు ఎక్కింది. ఆ సమయంలో మరో ఇద్దరు ప్రయాణికులు అందులో ఉన్నారు. కొద్దిదూరం వెళ్లాక ఆమె తప్ప మిగిలిన వారు దిగిపోయారు. ఆమెపై కన్నువేసిన డ్రైవర్ రవి.. క్లీనర్ మంజునాథ్‌కు డ్రైవింగ్ అప్పజెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాలని చెప్పాడు. అనంతరం కిటికీలను మూసేసి కదులుతున్న వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. గాయపడిన బాధితురాలిని లక్కొండహళ్లి బస్టాప్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆమె స్థానికుల సాయంతో తాను పనిచేస్తున్న నర్సింగ్‌హోంకు చేరుకుని సహచరులకు విషయం తెలిపింది. వారి ఫిర్యాదుపై.. పోలీసులు రవి, మంజునాథ్‌లను అరెస్టు చేశారు. ఐపీసీ-376(డీ) ప్రకారం నిర్భయ కేసు పెట్టారు. ప్రధాన నిందితుడైన రవి బెంగళూరులోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇటీవల మినీ బస్సును అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. బస్సు ఏపీలోని అనంతపురానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. -
అదుపుతప్పిన మినీబస్సు : ముగ్గురికి గాయాలు
-
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
9 మంది భారతీయులు సహా 13 మంది మృతి దుబాయ్: దుబాయ్‌లో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు సహా 13 మంది మృతి చెందారు. జబేల్ అలీ ప్రాంతంలోని పని ప్రదేశానికి 27 మంది కార్మికులను తరలిస్తున్న మినీ బస్సు శనివారం రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. మృతిచెందిన భారత కార్మికులందరూ బీహార్‌కు చెందిన వారని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. మృతు ల్లో మిగిలిన వారు బంగ్లాదేశీయులు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భారత, బంగ్లా కార్మికులను రషీద్, అల్ బరాహా ఆస్పత్రులకు తరలించారు. పోస్ట్‌మార్టం తర్వాత కార్మికుల మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నట్లు భారత్ దౌత్యాధికారులు తెలి పారు. ప్రమాదానికి గురైన బస్సు, ట్రక్కు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిద్దరూ పాక్‌కు చెందిన వారని ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది. -
అయిదేళ్లకే నూరేళ్లు
విద్యార్థి బస్సు దిగుతుండగా ముందుకు పోనిచ్చిన డ్రయివర్ చక్రాల కింద పడి దుర్మరణం పాఠశాల విడిచి పెట్టిన వేళైంది. చిన్న కొడుకు ఇంకా రాలేదు. గుండెకు హత్తుకోవాలనిపిస్తోంది. ఇంకా రాలేదు. వాడు చెప్పే కబుర్లు వినాలనిపిస్తోంది... ఇంకా రాలేదు. ఎప్పుడొస్తాడో అని ఎదురు చూసిన ఆ తల్లికి ఇక ఎప్పటికీ రాడని కబురు వచ్చింది. అయిదేళ్ల బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయన్న దుర్వార్త వచ్చింది. గుండెల్ని బద్దలు చేసింది. పాఠశాల మినీ బస్సు చక్రాల కింద చిన్నారి నలిగిపోయాడు. డ్రయివర్ నిర్లక్ష్యానికి అనంత లోకాలకు సాగిపోయాడు. అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: పాఠశాల మినీ బస్సును డ్రయివర్ నిర్లక్ష్యంగా నడపడంతో ఎల్కేజీ చదువుతున్న బాలుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి-సబ్బవరం రహదారిలోని పాత రేబాక కూడలి వద్ద శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసుల కథనమిది. పాత రేబాకకు చెందిన కంపర మహేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. మహేష్ వ్యాన్ డ్రయివర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీ వైష్ణవి స్కూలో పెద్ద కొడుకు మంజీత్ (8)ను ఒకటో తరగతిలో, చిన్న కొడుకు నిహాంత్ (5)ను ఎల్కేజీలో చేర్పించా డు. రోజూలాగే తరగతులు అయిపోయాక పాఠశాల బస్సులో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. రేబాకలోని నిహాంత్ ఇంటికి సమీపంలో డ్రయివర్ బస్సును ఆపాడు. క్లీనర్ లేకపోవడంతో పిల్లలందరూ దిగారనుకున్న డ్రయివర్ నిహాంత్‌ను గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో దిగుతున్న నిహాంత్ బస్సు కదలడంతో కింద పడిపోయాడు. అది గమనించని డ్రయివర్ బస్సును నడపడంతో చక్రాల కింద పడిన బాలుని తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. తోటి విద్యార్ధులు, సమీపంలోని కోడిగుడ్ల వ్యాన్ డ్రయివర్ గమనించి గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న తల్లి లక్ష్మి రోదిస్తూ కొడుకు మృతదేహం వద్దకు వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పాఠశాల వ్యాన్ డ్రయివర్‌పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు విలేకరులకు తెలిపారు.