బిర్యానీ తినేందుకు వెళ్తుండగా... | Two Died In Road Accident | Sakshi
Sakshi News home page

బిర్యానీ తినేందుకు వెళ్తుండగా...

May 28 2024 6:24 AM | Updated on May 28 2024 6:30 AM

Two Died In Road Accident

    బైకును ఢీకొన్న మినీ బస్సు 

    ఇద్దరి దుర్మరణం.. 

బన్సీలాల్‌పేట్‌: అర్ధరాత్రి బిర్యానీ తినేందుకు బైక్‌పై వెళ్తున్న బావబామ్మర్దులను మృత్యురూపంలో వచ్చిన మినీ బస్సు(స్వరాజ్‌ మజ్దా) కబళించింది. ఈ ప్రమాదంలో మరో యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలు సీఐ రాజు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సూరగాయని యజ్ఞ నారాయణ (25) బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు.

 వాషింగ్‌ మిషన్‌ మెకానిక్‌గా పనిచేస్తూ పద్మారావునగర్‌ గంగపుత్రకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా కెమెరామెన్‌గా పనిచేసే అతని బావమరిది కూరేటి సాయిపవన్‌ (32) గుంటూరు నుంచి అతన్ని కలిసేందుకు వచ్చాడు. ఆదివారం అర్ధరాత్రి అదే కాలనీలో ఉండే చీకటి సుబ్రమణ్యంతో కలిసి వీరు బిర్యానీ తినడానికి పల్సర్‌ బైక్‌పై ముషీరాబాద్‌కు వెళ్లారు. అక్కడ బిర్యానీ హోటల్‌ మూసివేసి ఉండడంతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న హోటల్‌కు వెళదామని బయలుదేరారు. 

కవాడిగూడ హోటల్‌ మారియెట్‌ చౌరస్తా వద్దకు రాగానే..అదే సమయంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి వేగంగా వచి్చన మినీ బస్సు సిగ్నల్‌ను దాటేసి ముందువెళ్తున్న వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో యజ్ఞ నారాయణ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన సాయిపవన్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్రమణ్యంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే మినీబస్సు డ్రైవర్‌ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. సుబ్రమణ్యం ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement