కాబూల్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి | Suicide bomber attacks bus in Kabul | Sakshi
Sakshi News home page

కాబూల్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

Published Mon, Jun 20 2016 9:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

కాబూల్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి - Sakshi

కాబూల్లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

కాబూల్: ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం సెక్యురిటీ గార్డ్స్ ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడి చేశారు. పూల్-ఏ-చర్కి రోడ్లో సంభవించిన ఈ ఘటనలో 14 మంది మృతి చెందినట్లు ఆఫ్గన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరికొంత మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భారీ శబ్దంలో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మృతి చెందిన వారు నేపాల్ సెక్యురిటీ గార్డ్స్ గా భావిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. బాంబులు ధరించిన ఓ వ్యక్తి బస్సు సమీపంలోకి  కాలినడకన వచ్చి తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement