
కాబూల్ : అఫ్ఘానిస్తాన్ రాజధాని మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. మంగళవారం సాయంత్రం కాబూల్‌లోని వివిధ దేశాల రాయబార కార్యాలయాలుండే ప్రాంతంలో ఆత్మాహుతి దాడిలో నలుగురు చనిపోయారని, 15మంది వరకు గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు.
మోటారు సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడిని మొదటి చెక్‌పోస్టును దాటి రెండో పోస్టు వద్దకు రాగానే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అతడు అక్కడికక్కడే పేల్చేసుకున్నాడు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దాడికి కారణమెవరనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment