కాబూల్ : అఫ్గానిస్తాన్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. పోలీసు కమాండర్‌ను లక్ష్యంగా చేసుకొని తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఉగ్రవాది కరు బాంబర్‌తో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో పోలీసు కమాండర్‌తో సహా నలుగురు అధికారులు మృతి చెందినట్లు స్థానిక అధికారి పేర్కొన్నారు. మరోవైపు అఫ్గాన్ దక్షిణ భాగంలో ఉన్న ఖేవా జిల్లాలోని ఒక మార్కెట్ వద్ద జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మరో ముగ్గురు అధికారులు మరణించగా, 11 మంది గాయపడినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ప్రతినిధి అట్టాహుల్లా ఖోగ్యాని తెలిపారు. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనే దానిపై అధికారిక సమాచారం లేదు. గత కొన్ని రోజులుగా తాలిబన్ , ఇస్లామిక్ స్టేట్ గ్రూఫ్ ఆఫ్ఘన్‌లో వరుస దాడులకు పాల్పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment